BASH/C3/Recursive-function/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:04, 18 October 2017 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Recursive function పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:10 what is a Recursive ఫంక్షన్ ను
00:12 కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
00:15 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:20 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి, ఇది చూపబడింది.

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial

00:27 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:29 Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం
00:33 మరియు GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
00:37 దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లను అభ్యాసానికి ఉపయోగించండి.
00:44 మనం recursive function అంటే ఏమిటో చూద్దాం.
00:48 recursive function అనేది దానంతట అదే పిలుచుకోబడేది.
00:52 Recursion అనేది క్లిష్టమైన algorithm లను సరళీకృతం చేసే ఒక ఉపయోగకరమైన సాంకేతికత.
00:59 నన్ను factorial.sh పేరుగల ఫైల్ ను తెరవనివ్వండి.
01:04 నేను దీనిలో code ని టైప్ చేశాను.
01:07 ఇది shebang line.
01:10 factorial() అనేది function పేరు.
01:12 దీని లోపల, మనం “Inside factorial function” అనే సందేశాన్ని ముద్రిద్దాం.
01:19 ఈ స్టేట్మెంట్ యూజర్ ఇన్పుట్ ను చదువుతుంది మరియు value ని వేరియబుల్ n లో నిల్వ చేస్తుంది.
01:26 ఇక్కడ, మనము if-else condition ను కలిగి ఉన్నాము.
01:30 If కండిషన్ n యొక్క విలువ సున్నాకి సమానమా అని తనిఖీ చేస్తుంది.
01:36 ఒకవేళా True అయితే, ఇది "factorial value of n is 1" అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
01:42 ఇక్కడ else అనేది if స్టేట్మెంట్ యొక్క భాగం.
01:46 ఇది factorial function ను పిలుస్తుంది.
01:50 మరియు fi అనేది if-else స్టేట్మెంట్ ముగింపు.


01:55 మనం "factorial.sh" ని run చేద్దాం.
01:59 terminal ను CTRL+ALT మరియు T కీలను ఒకేసారి మీ కీబోర్డులో ఉపయోగించి తెరవండి.
02:07 chmod space plus x space factorial dot sh అని టైప్ చేసి
02:15 Enter నొక్కండి.
02:17 dot slash factorial.sh అని టైప్ చేసి
02:21 Enter నొక్కండి.
02:24 మనం "Enter the number:" ను చూడవచ్చు.
02:26 నేను సున్నాని ఎంటర్ చేస్తాను.
02:29 ఈ విధంగా output ప్రదర్సింపబడుతుంది:
02:31 "factorial value of 0 is 1" .
02:35 ఇప్పుడు up-arrow కీ ని నొక్కండి. మునుపటి command ని గుర్తుకుతెచ్చుకోండి.
02:40 Enter నొక్కండి.
02:42 ఈ సారి నేను ఐదుని ఎంటర్ చేస్తాను.
02:45 ఇప్పుడు output ఈ విధంగా కనిపిస్తుంది:
02:47 "Inside factorial function".
02:51 మనం factorial function కు మరికొంత లాజిక్ ని జోడిద్దాం.
02:56 మనం సంఖ్య యొక్క factorial ను లెక్కిద్దాం.
03:01 మన code కి వెళ్ళండి.
03:03 ఇప్పుడు, మనం echo స్టేట్మెంట్ ను "Inside the factorial function" code block తో భర్తీ చేద్దాము.
03:10 Save పై క్లిక్ చేయండి.
03:13 temp అనేది మరియు యూజర్ ద్వారా ఎంటర్ చేయబడిన value ని నిల్వ చేసే ఒక variable .
03:19 కండిషన్ If వేరియబుల్ యొక్క విలువ ఒకటికి సమానమా అని తనిఖీ చేస్తుంది.
03:25 ఒకవేళా True అయితే, ఇది 1" ని ముద్రిస్తుంది.
03:29 ఈ else అనేది if స్టేట్మెంట్ యొక్క భాగం.
03:33 ఇది temp వేరియబుల్ విలువ నుండి ఒకటిని తగ్గిస్తుంది
03:37 మరియు విలువని వేరియబుల్ f లో నిల్వ చేస్తుంది.
03:42 వేరియబుల్ f factorial function యొక్క output ని నిల్వ చేస్తుంది.
03:46 ఇది ఒక recursive call.
03:50 వేరియబుల్ f మరియు temp విలువలు గుణించబడతాయి మరియు f లో నిల్వ చేయబడతాయి.
03:57 తరువాత మనం f విలువని print చేస్తాం.
04:00 if-else స్టేట్మెంట్ మరియు function లు ముగిసాయి.
04:05 ఇప్పుడు మన slides కు వెళ్ళండి.
04:08 మనం ప్రోగ్రామ్ ప్రవాహాన్ని అర్థం చేసుకుందాం.
04:12 n విలువ యూజర్ నుండి అంటే n తీసుకోబడింది.
04:17 ఒక వేళా ఎంటర్ చేసిన విలువ సున్నాకి సమానమైతే అప్పుడు ఇది ఒక సందేశాన్ని ముద్రిస్తుంది
04:24 లేదంటే ఇది function factorial కు వెళుతుంది.
04:29 ఇక్కడ, ఒక వేళా విలువ equal to one అయితే అది విలువను one గా ముద్రిస్తుంది.
04:36 లేకపోతే, విలువ ఒకటికి సమానం అయ్యే వరకు ఇది recursive call చేస్తుంది.
04:44 అప్పుడు, అన్ని విలువలు గుణించబడతాయి మరియు ప్రదర్శించబడతాయి.
04:49 ఇప్పుడు మన terminal కు వెళ్ళండి.
04:52 up-arrow కీ ని నొక్కండి.
04:54 మునుపటి కమాండ్ ./factorial.sh ని గుర్తుకుతెచ్చుకోండి
04:58 Enter నొక్కండి.
05:00 ఇప్పుడు నేను 5 ను input value గా ఎంటర్ చేస్తాను.
05:05 మనం సంఖ్య 5 యొక్క factorial ను పొందుతాము
05:08 అదే 120.
05:11 మనం terminal పై ప్రోగ్రాం ప్రవాహాన్ని చూడవచ్చు. ప్రోగ్రామ్ ప్రవాహాన్ని విశ్లేషించండి మరియు గుర్తించండి.
05:18 మన slides కు వెళ్ళండి.
05:20 సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో మనం,
05:23 Recursive ఫంక్షన్ ను
05:25 కొన్ని ఉదాహారణల సహాయంతో నేర్చుకున్నాం.
05:28 ఒక అసైన్మెంట్ గా, N సంఖ్యల యొక్క మొత్తాన్ని recursive function ఎక్కడ లెక్కింస్తుందో ప్రోగ్రామ్ వ్రాయండి.
05:36 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
05:39 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
05:43 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
05:47 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
05:53 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
05:58 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
06:06 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
06:10 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
06:18 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
06:24 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
06:29 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య.
06:33 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india