BASH/C2/Nested-and-multilevel-if-elsif-statements/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 11:00, 18 October 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:00 | ప్రియమైన స్నేహితులారా, BASH లోని Nested and multilevel if statement పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:09 | ఈ ట్యుటోరియల్ లో మనం |
00:12 | Nested if-else మరియు |
00:14 | Multilevel if-else statement గురించి నేర్చుకుంటాము. |
00:17 | దీనిని మనం కొన్ని ఉదాహారణలతో చేస్తాము. |
00:22 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:28 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:35 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
00:38 | Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టమ్ మరియు |
00:42 | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను. |
00:46 | GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పైవి అభ్యాసానికి సిఫార్సు చేయబడినది. |
00:52 | మనం Nested if-else statement యొక్క executiion ఫ్లోను అర్ధం చేసుకుందాం. |
00:57 | ఇక్కడ, ఒకవేళ condition 1 True అయితే అప్పుడు condition 2 ముల్యాంకం అవుతుంది, |
01:04 | ఒకవేళ condition2 True అయితే అప్పుడు statement 1 అమలు అవుతుంది. |
01:10 | దాని అర్ధం, conditions 1 మరియు 2 లు True అయినప్పుడు మాత్రమే statement 1 అమలు అవుతుంది. |
01:19 | ఒకవేళ condition1 False, అయితే అప్పుడు statement 3 అమలు అవుతుంది. |
01:25 | ఒకవేళ condition 2 False అయితే అప్పుడు statement 2 అమలు అవుతుంది. |
01:31 | ఒక ఉదాహరణను చూద్దాం. |
01:33 | నేను కోడ్ ను ఫైల్ nestedifelse.sh లో వ్రాశాను. |
01:38 | నేను దానిని తెరుస్తాను. |
01:40 | ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి. |
01:43 | ఇది shebang line. |
01:45 | వేరియబుల్ NAME కు విలువ anusha ను కేటాయించాము. |
01:50 | వేరియబుల్ PASSWORD కు విలువ abc123 ను కేటాయించబడింది. |
01:56 | read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది. |
02:02 | - (hyphen) p flag prompt ను ప్రదర్శిస్తుంది. |
02:05 | - (హైఫన్) p తరువాత, string “Enter name:” terminal పై ప్రదర్శించబడుతుంది. |
02:11 | myname, యూజర్ చే ఎంటర్ చేయబడు టెక్స్ట్, అంటే యూజర్ ఇన్ పుట్ ను నిల్వ చేసే వేరియబుల్. |
02:18 | మొదటి if స్టేట్మెంట్ రెండు వేరియబుల్స్ myname మరియు NAME అంటే, |
02:24 | యూజర్ ఇన్ పుట్ మరియు Name వేరియబుల్ లో నిల్వ చేయబడిన విలువ అనగా Anusha లను పోల్చుతుంది |
02:31 | ఒకవేళ రెండు విలువలు సమానమైతే అప్పుడు, if స్టేట్మెంట్ లోని మిగిలిన కోడ్ విశ్లేషించబడుతుంది. |
02:38 | read కమాండ్, ఎంటర్ చేసిన పాస్ వర్డ్ ను చదివి, వేరియబుల్ mypassword లో నిల్వ చేస్తుంది. |
02:46 | ఇక్కడ, - (hyphen) s flag silent mode కోసం, |
02:49 | అంటే, యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ terminal పై ప్రదర్శిపబడకుండా చేస్తుంది. |
02:56 | ఇక్కడ, మనకు కొన్ని if-else statements ఉన్నాయి. |
02:59 | ఈ if-else statements మొదటి if లో వ్రాయబడ్డాయి. |
03:05 | రెండవ if స్టేట్మెంట్, mypassword మరియు PASSWORD వేరియబుల్స్ లను పోల్చుతుంది. |
03:12 | echo , if condition True అయినపుడు terminal పై “Welcome” అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
03:18 | అంటే passwords మ్యాచ్ అయినవి. |
03:21 | -e backslash escape యొక్క interpretation ను enable చేస్తుంది. |
03:27 | \n అంటే new line అని అర్ధం, అంటే స్ట్రింగ్ Welcome కొత్త లైన్ పై ముద్రించబడుతుంది. |
03:35 | if కండిషన్ True కానప్పుడు else కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది |
03:42 | అంటే పాస్ వర్డ్ మ్యాచ్ కానప్పుడు else కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. |
03:48 | ఈ సందర్భంలో echo “Wrong password” ను ప్రదర్శిస్తుంది. |
03:53 | fi లోపలి if-else స్టేట్మెంట్ ను ముగిస్తుంది. |
03:57 | మన మొదటి if-else statement కు రండి. |
04:01 | ఒకవేళ myname మరియు NAME లోని విలువలు ఒకేలా ఉంటే, అప్పుడు ఈ else స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. |
04:09 | ఇది terminal పై “Wrong Name” అనే సందేశం ను echo చేస్తుంది. |
04:14 | fi బయటి if-else స్టేట్మెంట్ ను ముగిస్తుంది. |
04:18 | ఇప్పుడు, మీ కీబోర్డ్ లో ctrl+alt మరియు T కీ లను ఏకకాలంలో నొక్కి, terminal window ని తెరవండి. |
04:27 | ఫైల్ ని executable చేయండి. |
04:29 | chmod space plus x space nestedifelse.sh అని టైప్ చేయండి. |
04:38 | dot slash nestedifelse.sh అని టైప్ చేయండి. |
04:43 | అది terminal పై ఎగ్జిక్యూట్ చేయబడినప్పుడు. |
04:46 | ప్రోగ్రామ్ రెండు కండిషన్ లను |
04:48 | అంటే, Name మరియు Password లను వెరిఫై చేస్తుంది |
04:52 | ఇక్కడ prompt Enter Name ను ప్రదర్శిస్తుంది |
04:55 | anusha అని టైప్ చేద్దాం. |
04:57 | ఈ condition True కాబట్టి, తరువాత if కండిషన్ అమలు చేయబడుతుంది. |
05:02 | ఇప్పుడు prompt Password అని ప్రదర్శిస్తుంది. |
05:05 | నేను పాస్ వర్డ్ abc123 ను టైప్ చేస్తాను. |
05:10 | పాస్ వర్డ్ వేరియబుల్ PASSWORD లోని విలువతో సరిపోతుంది. |
05:15 | కాబట్టి ప్రాంప్ట్ Welcome సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
05:19 | ఇప్పుడు script ను మళ్ళీ అమలు చేద్దాం. |
05:21 | up-arrow కీ ను నొక్కండి. |
05:24 | dot slash nestedifelse.sh కు వెళ్ళండి. |
05:29 | Enter నొక్కండి. |
05:31 | ఈ సారి, మనము అదే పేరును, వేరే పాస్వర్డ్ తో ఎంటర్ చేద్దాము. |
05:37 | కాబట్టి నేను anusha ను పేరు గా మరియు 123 ని పాస్ వర్డ్ గా ఎంటర్ చేస్తాను. |
05:44 | name విలువలు సరిపోలతాయి కానీ password విలువలు సరిపోలవు. |
05:49 | కాబట్టి, Wrong password అనే సందేశం ప్రదర్శించబడుతుంది. |
05:53 | మొదటి if statement లోని nested else statement అమలు అయిందని ఇది రుజువు చేస్తుంది. |
06:01 | మళ్ళీ ఒకసారి script ని execute చేద్దాం. |
06:04 | ఈ సారి మనము swati ను పేరుగా ఇస్తాము. |
06:08 | Wrong name అనే సందేశo ప్రదర్శించబడుతుంది. |
06:12 | ఇది ఎందుకంటే swati పేరు, గతంలో డిక్లేర్ చేసిన విలువ anusha తో సరిపోయేలా లేదు. |
06:19 | control మొదటి if స్టేట్మెంట్ బయటకు వచ్చి, else స్టేట్మెంట్ ను అమలు చేస్తుంది. |
06:25 | ఇది Wrong name అనే సందేశాన్ని ముద్రిస్తుంది. |
06:29 | ఇప్పుడు మనం multilevel if-else statement ను చూద్దాం. |
06:34 | ఒకవేళ condition 1 True అయితే అప్పుడు statement1 అమలు అవుతుంది, |
06:40 | ఒకవేళ condition1 False అయితే అప్పుడు condition 2 ముల్యాంకం అవుతుంది. |
06:46 | ఒకవేళ condition2 True అయితే అప్పుడు statement 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. |
06:52 | ఒకవేళ condition 2 False అయితే అప్పుడు condition N ముల్యాంకం అవుతుంది. |
06:58 | ఒకవేళ condition N True అయితే అప్పుడు statement N అమలు అవుతుంది. |
07:03 | ఒకవేళ condition N false అయితే అప్పుడు statement X అమలు అవుతుంది. |
07:10 | ఒక ఉదాహరణని చూద్దాం. |
07:12 | నా దగ్గర పనిచేస్తున్న ఒక ఉదాహరణ ఉంది. |
07:14 | నేను దానిని తెరుస్తాను. మన ఫైల్ పేరు multilevel hyphen ifelse dot sh అని గమనించండి. |
07:23 | కోడ్ ను చూద్దాం. |
07:25 | ఇది shebang line. |
07:27 | mystring అనేది యూజర్ ద్వారా ఇచ్చిన ఇన్పుట్ లను నిల్వ చేసే ఒక వేరియబుల్. |
07:34 | if కండిషన్, ఇన్ ఫుట్ స్ట్రింగ్ null అవునా కాదా అని తనిఖీ చేస్తుంది. |
07:39 | - (hyphen) z string యొక్క పొడవు zero అవునా కాదా అని తనిఖీ చేస్తుంది. |
07:44 | terminal పై man test అని టైప్ చేయండి. వివిధ string పోలికలను అన్వేషించండి. |
07:51 | ఒకవేళ ఏమీ ఎంటర్ చేయకపోతే, ఈ echo స్టేట్మెంట్ ముద్రించబడుతుంది. |
07:56 | మొదటి elif కండిషన్ input string raj ను కలిగి ఉందో లేదో తనిఖీ చేస్తుంది. |
08:03 | కలిగి ఉంటే అప్పుడు ఈ echo స్టేట్మెంట్ లో ప్రింట్ చేయబడుతుంది. |
08:08 | wildcard character ఇన్పుట్ లో raj తో ఏదైనా పదం ఉంటే గుర్తించబడుతుంది. |
08:15 | తరువాత elif కండిషన్ input string jit ను కలిగి ఉందో లేదో తనిఖీ చేస్తుంది. |
08:22 | కలిగి ఉంటే అప్పుడు ఈ echo స్టేట్మెంట్ ప్రింట్ చేయబడుతుంది. |
08:27 | పైన అన్ని కండిషన్ లు విఫలం అయినప్పుడు else కండిషన్ అమలు అవుతుంది. |
08:33 | ఇది Sorry! Input does not contain either raj or jit అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
08:41 | fi, multilevel if-else స్టేట్మెంట్ యొక్క ముగింపును సూచిస్తుంది. |
08:46 | ప్రోగ్రామ్ ను execute చేద్దాం. |
08:48 | తిరిగి మన terminal కు రండి. |
08:51 | chmod space plus x space multilevel hyphen ifelse dot sh అనిటైప్ చేయండి. |
09:00 | dot slash multilevel hyphen ifelse dot sh అనిటైప్ చేయండి. |
09:06 | ఇన్ ఫుట్ కొరకు మనం ప్రాంప్ట్ చేయబడతాం. |
09:09 | వేర్వేరు ఇన్ ఫుట్ లను ఇచ్చి, ప్రతి సారి ఏమి జరుగుతుందో చూద్దాం. |
09:14 | ముందుగా నేను ఏది టైప్ చేయకుండానే Enter నొక్కుతాను. |
09:19 | Nothing was Entered అనే సందేశం ప్రదర్శించబడింది. |
09:22 | control, multilevel if-else statement నుంచి బయటకు వస్తుంది. |
09:28 | నేను prompt ను క్లియర్ చేస్తాను. |
09:30 | వేరొక ఇన్ ఫుట్ తో స్క్రిప్ట్ ను అమలు చేయడానికి ప్రయత్నిద్దాం. |
09:34 | up-arrow కీ ని నొక్కండి. |
09:36 | dot slash multilevel hyphen ifelse dot sh కు వెళ్ళండి. |
09:41 | Enter నొక్కండి. |
09:43 | ప్రాంప్ట్ , Enter a Word అని ప్రదర్శిస్తుంది. |
09:45 | నేను abhijit అని టైప్ చేస్తాను. |
09:48 | ప్రదర్శించబడిన అవుట్పుట్: “abhijit jit అనే పదాన్ని కలిగి ఉంది. |
09:53 | ఇది మన కోడ్ లో control, మూడవ condition కు వెళ్ళిందని చూపిస్తుంది. |
09:59 | మొదటి రెండు కండిషన్ లు నిజం కాలేదు. |
10:03 | ఇదే లాజిక్ అన్ని కండిషన్ లకు వర్తిస్తుంది. |
10:07 | వేర్వేరు ఇన్పుట్లతో ప్రోగ్రామ్ ను అమలు చేసి, ఫలితాలను తనిఖీ చేయండి. |
10:13 | సారాంశం ను చూద్దాం. |
10:15 | ఈ ట్యుటోరియల్ లో మనం |
10:18 | Nested if-else : Name మరియు Password లను వెరిఫై చేయడం గురించి మరియు |
10:23 | Multilevel if-else: String comparison ప్రోగ్రామ్ ల ఉపయోగం గురించి నేర్చుకున్నాం. |
10:28 | ఒక అసైన్మెంట్ గా, సంఖ్య యొక్క వేర్వేరు విలువకు వేర్వేరు సందేశాలను అనగా |
10:34 | 3 కంటే ఎక్కువ, 3 కంటే తక్కువ |
10:37 | లేదా 3 కు సమానం |
10:39 | లేదా యూజర్ ఇన్ ఫుట్ ఖాళీగా ఉన్నప్పుడు అవుట్ ఫుట్ ను ప్రదర్శించడానికి ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి. |
10:42 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
10:45 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ఇస్తుంది. |
10:48 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
10:53 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం |
10:55 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
10:58 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
11:02 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
11:09 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
11:13 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
11:20 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
11:26 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
11:31 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మీకు ధన్యవాదాలు. |