BASH/C2/Nested-and-multilevel-if-elsif-statements/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 17:08, 17 October 2017 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:00 ప్రియమైన స్నేహితులారా, BASH లోని Nested and multilevel if statement పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ లో మనం:
00:12 Nested if-else మరియు
00:14 Multilevel if-else statement గురించి నేర్చుకుంటాము.
00:17 దీనిని మనం కొన్ని ఉదాహారణలతో చేస్తాము.
00:22 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
00:28 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:35 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:38 Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టమ్ మరియు
00:42 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:46 దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పైవి అభ్యాసానికి ఉపయోగించండి.
00:52 మనం Nested if-else statement యొక్క ప్రవాహాన్ని అర్ధం చేసుకుందాం.
00:57 ఇక్కడ, ఒకవేళ condition 1 True అయితే అప్పుడు condition 2 ముల్యాంకం అవుతుంది,
01:04 ఒకవేళ condition2 True అయితే అప్పుడు statement 1 అమలు అవుతుంది.
01:10 దాని అర్ధం, conditions 1 మరియు 2 లు True అయినప్పుడు మాత్రమే statement 1 అమలు అవుతుంది.
01:19 ఒకవేళా condition1 False, అయితే అప్పుడు statement 3 అమలు అవుతుంది.
01:25 మరియు, ఒకవేళ condition 2 False అయితే అప్పుడు statement 2 అమలు అవుతుంది.
01:31 ఒక ఉదాహరణను చూద్దాం.
01:33 నేను కోడ్ ను ఫైల్ nestedifelse.sh లో రాసాను.
01:38 నేను దానిని తెరుస్తాను.
01:40 ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
01:43 ఇది shebang line.
01:45 వేరియబుల్ NAME విలువ anusha ను కేటాయిస్తుంది.
01:50 వేరియబుల్ PASSWORD విలువ abc123 ను కేటాయిస్తుంది.
01:56 read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
02:02 - (hyphen) p flag prompt ను ప్రదర్శిస్తుంది.
02:05 - (హైఫన్) p తరువాత string ,“Enter name:” terminal పై ప్రదర్శించబడుతుంది.
02:11 myname యూజర్ ద్వారా ఎంటర్ చేస్తున్న టెక్స్ట్ ను నిల్వ చేసే వేరియబుల్ అంటే యూజర్ ఇన్ పుట్.
02:18 మొదటి if స్టేట్మెంట్ రెండు వేరియబుల్స్ myname మరియు NAME ను పోల్చుతుంది
02:24 యూజర్ ఇన్ పుట్ మరియు వేరియబుల్ Name లో నిల్వ చేయబడిన విలువ అనగా Anusha .
02:31 ఒకవేళ రెండు విలువలు సమానమైతే అప్పుడు ఈ b if స్టేట్మెంట్ లోని కోడ్ విశ్లేషించబడుతుంది.
02:38 read కమాండ్ వేరియబుల్ mypassword లో ఎంటర్ చేసిన పాస్ వర్డ్ ను చదువుతుంది మరియు నిల్వ చేస్తుంది.
02:46 ఇక్కడ, - (hyphen) s flag silent mode కోసం.
02:49 దీని అర్థం, యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ terminal పై ప్రదర్శించబడదు.
02:56 ఇక్కడ, మనకు మరొక if-else statements ల సముదాయం ఉంది.
02:59 ఈ if-else statements యొక్క సముదాయం మొదటి if లో ఉంది.
03:05 రెండవ if స్టేట్మెంట్ వేరియబుల్స్ mypassword మరియు PASSWORD లను పోల్చుతుంది.
03:12 if condition True అయినపుడు terminal పైన “Welcome” అనే సందేశాన్ని echo ప్రదర్శిస్తుంది.
03:18 అంటే పాస్ వర్డ్ మ్యాచ్ అయింది.
03:21 -e backslash escape యొక్క వ్యాఖ్యానాన్ని ఇస్తుంది.
03:27 \n అంటే new line అని అర్ధం అంటే స్ట్రింగ్ Welcome” కొత్త లైన్ పై ముద్రించబడుతుంది.
03:35 ఎప్పుడు అయితే if కండిషన్ True కాదో అప్పుడు else కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది
03:42 అంటే పాస్ వర్డ్ మ్యాచ్ కానప్పుడు else కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
03:48 ఈ కేసు లో echo “Wrong password” ను ప్రదర్శిస్తుంది.
03:53 fi లోపలి if-else స్టేట్మెంట్ ను ముగిస్తుంది.
03:57 మన మొదటి if-else statement- కు వెళ్ళండి
04:01 ఒకవేళ myname మరియు NAME లోని విలువలు సరిపోలేక పోతే అప్పుడు ఈ else స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
04:09 terminal పై ఈ echo సందేశం “Wrong Name” అవుతుంది.
04:14 fi బయటి if-else స్టేట్మెంట్ ను ముగిస్తుంది.
04:18 ఇప్పుడు, మీ కీబోర్డ్ లో ctrl+alt మరియు t కీ లను ఏకకాలంలో నొక్కడం ద్వారా terminal window ని తెరవవచ్చు.
04:27 అమలు చేయడానికి ఫైల్ ని చేయండి.
04:29 chmod space plus x space nestedifelse.sh అని టైప్ చేయండి
04:38 dot slash nestedifelse.sh అని టైప్ చేయండి.
04:43 ప్రోగ్రామ్ రెండు కండిషన్ లను వెరిఫై చేస్తుంది
04:46 అవి Name మరియు Password
04:48 అది terminal పై ఎగ్జిక్యూట్ చేయబడినప్పుడు.
04:52 ఇక్కడ prompt Enter Name ను ప్రదర్శిస్తుంది
04:55 anusha అని టైప్ చేద్దాం.
04:57 ఈ condition True అవగానే, తరువాతి if కండిషన్ అమలుచేయబడుతుంది.
05:02 ఇప్పుడు prompt Password అని చేప్తుంది.
05:05 నేను పాస్ వర్డ్ abc123 ను టైప్ చేస్తాను.
05:10 వేరియబుల్ PASSWORD లోని విలువతో పాస్ వర్డ్ సరిపోతుంది.
05:15 కాబట్టి ప్రాంప్ట్ Welcome సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:19 ఇప్పుడు script ని మళ్ళి అమలు చేద్దాం.
05:21 up-arrow కీ ను నొక్కండి.
05:24 dot slash nestedifelse.sh కు వెళ్ళండి
05:29 Enter నొక్కండి.
05:31 ఈ సమయంలో, మేము అదే పేరును వేరే పాస్వర్డ్ తో ఎంటర్ చేస్తాము.
05:37 కాబట్టి నేను anusha ను పేరు గా మరియు 123 ని పాస్ వర్డ్ గా ఎంటర్ చేస్తాను.
05:44 name విలువలు సరిపోలతాయి కానీ password విలువలు సరిపోలవు.
05:49 కాబట్టి, సందేశo Wrong password ప్రదర్శించబడుతుంది.
05:53 మొదటి if statement లోని nested else statement అమలు అయిందని ఇది రుజువు చేస్తుంది.
06:01 మళ్ళి ఒకసారి script ని execute చేద్దాం.
06:04 ఈ సారి మేము swati ను పేరుగా ఇస్తాము.
06:08 సందేశo “ Wrong name” గా ప్రదర్శించబడుతుంది.
06:12 ఇది ఎందుకంటే swati పేరు గతంలో ప్రకటించిన విలువ anusha తో సరిపోయేలా లేదు.
06:19 మొదటి if స్టేట్మెంట్ యొక్క control బయటకు వస్తుంది మరియు else స్టేట్మెంట్ ను అమలు చేస్తుంది.
06:25 ఇది Wrong name అనే సందేశాన్ని ముద్రిస్తుంది.
06:29 ఇప్పుడు మనం multilevel if-else statement ను చుద్ద్దాం.
06:34 ఒకవేళ condition 1 True అయితే అప్పుడు statement1 అమలు అవుతుంది,
06:40 ఒకవేళ condition1 False అయితే అప్పుడు condition 2 ముల్యాంకం అవుతుంది.
06:46 ఒకవేళ condition2 True అయితే అప్పుడు statement 2 ఎగ్జిక్యూట్ అవుతుంది.
06:52 మరియు ఒకవేళ condition 2 False అయితే అప్పుడు condition N ముల్యాంకం అవుతుంది.
06:58 ఒకవేళ condition N True అయితే అప్పుడు statement N అమలు అవుతుంది.
07:03 మరియు ఒకవేళ condition N false అయితే అప్పుడు statement X అమలు అవుతుంది.
07:10 ఒక ఉదాహరణని చూద్దాం.
07:12 నా దగ్గర ఒక ఉదాహరణ ఉంది.
07:14 నేను దానిని తెరుస్తాను. గమనిక multilevel hyphen ifelse dot sh మన ఫైల్ పేరు.
07:23 కోడ్ ద్వారా వెళ్లదామ్.
07:25 ఇది shebang line.
07:27 mystring అనేది ఒక వేరియబుల్ ఇది అమలుచేసే సమయంలో వర్డ్, యూజర్ ద్వారా ఇచ్చిన ఇన్పుట్ లను నిల్వ చేస్తుంది.
07:34 ఇన్ ఫుట్ స్ట్రింగ్ null అవునా కాదా అని if కండిషన్ తనిఖీ చేస్తుంది.
07:39 - (hyphen) z string యొక్క పొడవు zero అవునా కాదా అని తనిఖీ చేస్తుంది.
07:44 terminal పై man test అని టైప్ చేయండి మరియు వివిధ string పోలికలను అన్వేషించండి.
07:51 ఒకవేళ ఏమీ ఎంటర్ చేయకపోతే ఈ echo స్టేట్మెంట్ ముద్రించబడుతుంది.
07:56 మొదటి elif కండిషన్ input string raj ను కలిగి ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
08:03 అది ఉంటే అప్పుడు ఈ echo స్టేట్మెంట్ లో ప్రింట్ చేయబడుతుంది.
08:08 wildcard character దానిలో raj తో ఏదైనా పదం గుర్తించబడుతుందని అని నిర్ధారిస్తుంది.
08:15 తరువాతి elif కండిషన్ input string jit ను కలిగి ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
08:22 అది ఉంటే అప్పుడు ఈ echo ను స్టేట్మెంట్ ప్రింట్ చేయబడుతుంది.
08:27 పైన అన్ని కండిషన్ లు విఫలం అయినప్పుడు else కండిషన్ అమలు అవుతుంది.
08:33 మరియు ఇది ఈ సందేశాన్ని ప్రదర్శిస్తుంది Sorry! Input does not contain either raj or jit .
08:41 fi multilevel if-else స్టేట్మెంట్ యొక్క ముగింపును సూచిస్తుంది.
08:46 ప్రోగ్రామ్ ని execute చేద్దాం.
08:48 తిరిగి మన terminal కు వెళ్ళండి.
08:51 chmod space plus x space multilevel hyphen ifelse dot sh అనిటైప్ చేయండి
09:00 dot slash multilevel hyphen ifelse dot sh అనిటైప్ చేయండి
09:06 ఇన్ ఫుట్ కొరకు మనం ప్రాంప్ట్ ని చేద్దాం.
09:09 వేర్వేరు ఇన్ ఫుట్ లను ఇవ్వండి మరియు ప్రతి సారి ఏమి జరుగుతుందో చూద్దాం.
09:14 మొదట ఏది టైప్ చేయకుండానే Enter నొక్కండి.
09:19 సందేశం Nothing was Entered ప్రదర్శించబడింది.
09:22 మరియు control multilevel if-else statement నుంచి వస్తుంది.
09:28 నన్ను prompt ని క్లియర్ చేయనివ్వండి.
09:30 మనం వేరొక ఇన్ ఫుట్ తో స్క్రిప్ట్ ను అమలు చేయడానికి ప్రయత్నిద్దాం.
09:34 up-arrow కీ ని నొక్కండి.
09:36 dot slash multilevel hyphen ifelse dot sh కు వెళ్ళండి.
09:41 Enter నొక్కండి.
09:43 ప్రాంప్ట్ Enter a Word ను ప్రదర్శిస్తుంది.
09:45 నేను abhijit అని టైప్ చేస్తాను.
09:48 ప్రదర్శించబడిన అవుట్పుట్: “abhijit jit అనే పదాన్ని కలిగి ఉంది.
09:53 ఇది మన కోడ్ లో control మూడవ condition కు ప్రవహించిందని చూపిస్తుంది.
09:59 మొదటి రెండు కండిషన్ లు సరిపోయేలా లేదు.
10:03 ఇదే లాజిక్ అన్ని కండిషన్ లకు వర్తిస్తుంది.
10:07 వేర్వేరు ఇన్పుట్లతో ప్రోగ్రామ్ ను అమలు చేసి, ఫలితాలను తనిఖీ చేయండి.
10:13 సారాంశం చేద్దాం.
10:15 ఈ ట్యుటోరియల్ లో మనం
10:18 Nested if-else  : Name మరియు Password తో వెరిఫై చేయడం మరియు
10:23 Multilevel if-else: String comparison ప్రోగ్రామ్ ల ఉపయోగం గురించి నేర్చుకున్నాం.
10:28 ఒక అసైన్మెంట్ గా, సంఖ్య ఇలా ఉన్నప్పుడు వేర్వేరు సందేశాలను అవుట్ ఫుట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి.
10:34 3 కంటే ఎక్కువ 3 కంటే తక్కువ
10:37 లేదా 3 కు సమానం
10:39 లేదా యూజర్ ఇన్ ఫుట్ ఖాళీగా ఉన్నప్పుడు.
10:42 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:45 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సంక్షిప్తీకరిస్తుంది.
10:48 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:53 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
10:55 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
10:58 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
11:02 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
11:09 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
11:13 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
11:20 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
11:26 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
11:31 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india