BASH/C2/Globbing-and-Export-statement/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 11:50, 16 October 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:01 | Globbing and Export command పై spoken tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము: |
00:08 | Globbing , export command గురించి నేర్చుకుంటాము. |
00:11 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు “‘Linux Operating System” గురించి అవగాహన ఉండాలి. |
00:18 | ఒక వేళా లేకపోతె ,సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:24 | ఈ ట్యుటోరియల్ కొరకు నేను: |
00:27 | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు
|
00:31 | GNU Bash version 4.1.10 ఉపయోగిస్తున్నాను |
00:35 | దయచేసి ,"GNU Bash" వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ఈ ట్యుటోరియల్ ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి. |
00:43 | మనం globbing ను పరిచయం తో ప్రారంభిద్దాము. |
00:46 | BASH ద్వారా Filename లేదా pathname కు జరిగే విస్తరణే Globbing గా పిలవబడుతుంది. |
00:52 | "Globbing" ’’wildcards’’ ను గుర్తిస్తుంది మరియు విస్తరిస్తుంది. |
00:57 | ఇది ప్రామాణిక wildcard అక్షరాలను కూడా అనువదిస్తుంది అనగా- |
01:02 | *(asterisk) మరియు ? (Question mark). |
01:05 | మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధంచేసుకుందాం.
|
01:09 | "terminal window"ను " Ctrl+Alt" మరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి నొక్కడం ద్వారా తెరవండి. |
01:18 | ’’Terminal పైన, ls space asterisk dot sh అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:27 | ఇది ప్రస్తుత డైరెక్టరీలో ఉన్న అన్ని ".sh" extension ఫైళ్ళను మ్యాచ్ చేస్తుంది. |
01:34 | ఇక్కడ, మనము అన్ని sh ఫైళ్ళు లిస్ట్ అవడాన్ని చూడవచ్చు. |
01:40 | నన్ను prompt ’ ను క్లియర్ చేయనివ్వండి. ఇప్పుడు ls space s asterisk dot sh అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:51 | s asterisk dot sh S అక్షరంతో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళను మ్యాచ్ చేయడాన్ని మరియు sh పొడిగింపుగా ఉండటాన్ని మనము చూడవచ్చు. |
02:02 | ముందుకు వెళ్దాం... |
02:04 | ఇప్పుడు, ls space opening square bracket a hyphen c closing square bracket asterisk dot sh అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:19 | ఇది a లేదా b లేదా c అక్షరంతో ప్రారంభమయ్యే ఫైళ్లను సరిపోల్చి ప్రదర్శిస్తుంది. |
02:26 | output ను గమనించండి. |
02:28 | మనము a లేదా b లేదా c అక్షరంతో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళ యొక్క జాబితాను చూస్తాము. |
02:35 | మరియు ఈ ఫైళ్లు "sh" extension ను కలిగి ఉంటాయి. |
02:39 | ఇప్పుడు ముందుకు వెళ్లి ls space opening square bracket caret-sign a hyphen c closing square bracket asterisk dot sh అని టైప్ చేసి Enter నొక్కండి |
02:55 | ఇది అన్ని ఫైళ్ల పేర్లను extension "sh" తో మ్యాచ్ చేస్తుంది . |
03:00 | కానీ a లేదా b లేదా c గా అక్షరాలతో మొదలయ్యే వాటిని వదిలేస్తుంది. |
03:07 | అవుట్ పుట్ ను గమనించండి. ఫైల్ పేర్లు a , b లేదా c అక్షరాలతో ప్రారంభమవలేదని మీరు గమనిస్తారు. |
03:16 | నన్ను ‘’’prompt’’’ ను క్లియర్ చేయనివ్వండి. |
03:19 | ఇప్పుడు ls space opening square bracket capital A small a closing square bracket asterisk-sign dot sh అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి. |
03:34 | ఇది A అక్షరం యొక్క ఎగువ మరియు దిగువ కేసుతో ప్రారంభమయ్యే ఫైళ్ల పేర్లను మ్యాచ్ చేస్తుంది. |
03:40 | అవుట్ పుట్ ను చుడండి. A ఎగువ మరియు దిగువ కేసు మరియు పొడిగింపు "sh" తో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ల పేర్లు లిస్ట్ అవుతాయి. |
03:49 | ఇప్పుడు ‘’’BASH’’ లోని ‘’’Export command’’’ను చూద్దాము.
|
03:53 | మన “‘slides’’ కు మారండి. |
03:55 | Bash లో, వేరియబుల్స్ వాటి స్వంత shell కు “‘local’’’ గా ఉంటాయి. |
04:00 | ‘ ’Local variables ను అదే Shell ద్వారా లేదా ప్రస్తుత shell ద్వారా ఉపయోగించవచ్చు. |
04:06 | " Export command - "variable లేదా function ను "environment యొక్క అన్ని child processes కు ఎగుమతి చేస్తుంది. |
04:15 | ‘’’local’’’ వేరియబుల్ ను “‘global’’’ వేరియబుల్ గా కూడా మార్చవచ్చు. |
04:20 | మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకోడానికి ప్రయత్నిద్దాం. |
04:24 | Terminal కు మారండి, myvar equal to sign lion అని టైప్ చేసి Enter’ నొక్కండి. |
04:34 | ఇప్పుడు echo space dollar-sign myvar అని టైప్ చేసి Enter నొక్కండి. |
04:41 | ‘’’lion’’’ అనేది ముద్రించబడింది. |
04:44 | ఇది variable myvar”’కు కేటాయించిన విలువ. |
04:48 | ఇప్పుడు, ఒక కొత్త Shell ’ కు నావిగేట్ చేద్దాం. |
04:51 | ఒక కొత్త Shell కు వెళ్లడానికి, మనం ఒక క్రొత్త Terminal ను తెరవవచ్చు లేదా ‘’’slash bin slash bash’’’అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:03 | ఇప్పుడు, వేరియబుల్ myvar లో విలువను తనిఖీ చేద్దాం. |
05:07 | echo space dollar-sign myvar అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:15 | ఒక ఖాళీ లైన్ అనేది ముద్రించబడింది. |
05:17 | దీని అర్ధం variable myvar కు కేటాయించిన విలువ ఈ Shell కు బదిలీకాలేదు. |
05:24 | అలాగే, వేరియబుల్ myvar అనేది ముందు Shell ’ కు మాత్రమే local ప్రస్తుత shell కు కాదు. |
05:32 | మనం exit ను మునుపటి ‘’’Shell’’’ తిరిగి పొందడానికి టైప్ చేస్తాము. |
05:36 | కాబట్టి, వేరియబుల్స్ ను "global" గా డిక్లేర్ చేయుటకు, మనము export command’’’ ను ఉపయోగించాలి. |
05:43 | ఎలాగో తెలుసుకుందాము. |
05:46 | export space myvar equal to sign lion అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి. |
05:55 | ఇప్పుడు echo space dollar sign myvar అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.
|
06:02 | lion’ అనేది ప్రదర్శింపబడింది. |
06:05 | మరొక Shell ’ కు నావిగేట్ అవుదాం. slash bin slash bash అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి. |
06:13 | నన్ను‘’’prompt’’’ ను క్లియర్ చేయనివ్వండి. |
06:15 | ఇప్పుడు echo space dollar-sign myvar అని టైప్ చేయండి. |
06:22 | lion’ అనేది ప్రదర్శింపబడింది. |
06:25 | ఇది ఎందుకంటే మనము వేరియబుల్ myvar ను గ్లోబల్ గా export command ఉపయోగించి డిక్లేర్ చేసాము. |
06:33 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము . |
06:36 | సారాంశం చూద్దాం. మన slides కు వెళ్ళండి. |
06:39 | ఈ ట్యుటోరియల్ లో మనము: |
06:41 | Globbing , Export command నేర్చుకున్నాము. |
06:44 | ఒక అసైన్మెంట్ గా, globbing లో చర్చించిన అన్ని కార్యకలాపాలను చేయడానికి ఒక Bash script ను వ్రాయండి. |
06:51 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
06:54 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
06:57 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:02 | Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం: |
07:05 | స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
07:08 | online పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
07:12 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
07:20 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a teacher ప్రాజెక్ట్ లో భాగం. |
07:24 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
07:31 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
07:37 | FOSSEE మరియు Spoken-Tutorial బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడ్డాయి. |
07:42 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మీకు ధన్యవాదాలు. |
07:47 | మీకు ధన్యవాదాలు. |