BASH/C2/Case-statement/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 17:55, 12 October 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, BASH లో Case statement పై spoken tutorial కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం, case statement యొక్క ప్రాముఖ్యత, case statement యొక్క సింటాక్స్ ను ఒక ఉదాహరణతో నేర్చుకుంటాం. |
00:17 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:23 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:29 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, Ubuntu Linux 12.04 Operating System మరియు GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను. |
00:39 | GNU Bash వెర్షన్ 4 లేదా దానికంటే, పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి. |
00:47 | Bash shell లో రెండు రకాలైన conditional statements ఉన్నాయి if statement మరియు case statement |
00:56 | Case స్టేట్మెంట్ ను if-else స్టేట్మెంట్ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. |
01:03 | ఎంచుకోవడానికి అనేక అంశాలు ఉన్నప్పుడు, case స్టేట్మెంట్ కు ప్రాధాన్యత ఇస్తాం. |
01:09 | ఇది సాధారణంగా స్క్రిప్ట్ లో menu లను అమలు చేయడానికి ఉపయోగించబడుతుంది. |
01:14 | ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. case space $(dollar) VARIABLE space in match_1 close round-bracket space commands మరియు రెండు సెమికోలన్ లు |
01:27 | match_n close round-bracket space commands రెండు సెమికోలన్ లు asterisk close round=bracket space command_to_execute_by_default మరియు రెండు సెమికోలన్ లు esac. |
01:45 | VARIABLE అనేది match_1 తో పోల్చబడుతుంది. |
01:48 | ఒకవేళ ఇది సరిపోలేకపోతే, ఇది తరువాత కేస్ match_n కు వెళ్తుంది. |
01:54 | ఇది వీటిలోని ఏఒక్క strings అయినా VARIABLE తో మ్యాచ్ అవుతుందా అని తనిఖీ చేస్తుంది. |
02:01 | ఒకవేళ yes అయితే డబల్ సెమికోలన్ వరకు గల అన్ని commands ఎగ్జిక్యూట్ అవుతాయి. |
02:07 | ఒకవేళ VARIABLE తో ఏదీ మ్యాచ్ కాకపొతే, asterisk తో ఉన్న కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. |
02:14 | ఇది డిఫాల్ట్ case కండిషన్, ఎందుకంటే, asterisk అన్ని స్ట్రింగ్స్ ను మ్యాచ్ చేస్తుంది. |
02:21 | esac అనేది case block ముగింపును సూచిస్తుంది. |
02:26 | మనం case statement ను ఉదాహరణతో అర్ధం చేసుకుందాం. |
02:32 | నేను ఇప్పటికే ప్రోగ్రాం ను టైప్ చేశాను. కాబట్టి, నేను case.sh ఫైల్ ను తెరుస్తాను. |
02:38 | డిస్క్ స్పేస్ కొంత పరిమితికి చేరుకున్నప్పుడు, ప్రోగ్రాం హెచ్చరిక సందేశాన్ని ముద్రిస్తుంది. |
02:45 | ఇది shebang line . |
02:47 | bash యొక్క స్థానం ఇతర Linux లలో అంటే CentOS, RedHat మొదలైన వాటిలో కంటే భిన్నంగా ఉంటుంది. |
02:55 | గతంలో ఉపయోగించిన /bin/bash నేరుగా binary file ను పాయింట్ చేస్తుంది. |
03:01 | ఇక్కడ ఉపయోగించిన env, bash యొక్క నిజమైన స్థానమును abstract చేస్తుంది. |
03:07 | ఈ shebang line, ఏ GNU/Linux సిస్టం పైనైనా సరిపోవు విధంగా స్క్రిప్ట్ యొక్క పోర్టబిలిటిని మెరుగుపరుస్తుంది. |
03:16 | df -(hyphen)h అనేది disk space వాడుకను మానవులు చదువదగిన రూపంలో ప్రదర్శిస్తుంది. |
03:22 | దీని output sort -rk5 కు పైప్ చేయబడింది, ఇది ఐదవ కాలమ్ ను రివర్స్ ఆర్డర్లో అమరుస్తుంది. |
03:31 | తరువాత వచ్చిన అవుట్పుట్ awk FNR == 2 {print $5} కు పంపబడుతుంది |
03:38 | ఇది రెండవ లైన్ యొక్క ఐదవ field ను బయటకు తెస్తుంది. |
03:43 | చివరికి, అవుట్పుట్ నుండి % గుర్తును తీసివేయుటకు cut -(hyphen)d “% -(hyphen)f1” కు పంపబడుతుంది. |
03:55 | ఇది case statement యొక్క మొదటి లైన్. |
03:59 | ఇక్కడ మనం space ను 0 మరియు 69 లమధ్య పోల్చుతాము. |
04:04 | ఒకవేళ మ్యాచ్ అయితే, ఇది "Everything is OK” ను ముద్రిస్తుంది |
04:08 | తరువాత, ఇది space ను 70 మరియు 89 లేదా 91 నుండి 98 కు మధ్య పోల్చుతుంది. |
04:17 | ఒకవేళ మ్యాచ్ అయితే, అది “Clean out. There s a partition that is $(dollar)space % full” ను ముద్రిస్తుంది. |
04:27 | ఇక్కడ, ఇది space ను 99 తో పోల్చుతుంది. |
04:30 | ఒకవేళ మ్యాచ్ అయితే, అది “Hurry. There s a partition at $(Dollar) space %!” ను ముద్రిస్తుంది |
04:39 | ఇది డిఫాల్ట్ case కండిషన్ ఎందుకంటే asterisk అన్ని strings కు మ్యాచ్ అగును. |
04:45 | ఇది case statement ముగింపు. |
04:48 | ఇప్పుడు, ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చేయడానికి terminal కు వెళ్ళండి. |
04:52 | chmod plus x case dot sh అని టైప్ చేయండి |
04:57 | dot slash case dot sh అని టైప్ చేయండి |
05:02 | "Everything is OK". అవుట్పుట్ మీ సిస్టమ్ డిస్క్ స్పేస్ పై ఆధారపడి మారుతూ ఉంటుంది అని గమనించండి. |
05:10 | నా మెషిన్ లో, 0 మరియు 69 మధ్య మ్యాచ్ అయింది కనుక, ఇది "Everything is OK” ను ముద్రించింది. |
05:18 | మీ మెషిన్ పై ముద్రించబడిన సందేశాన్ని తనిఖీ చేయండి. |
05:20 | ఏ case స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో మీరు అర్ధంచేసుకోగలగాలి. |
05:27 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం. సారాంశం చూద్దాం. |
05:31 | ఈ ట్యుటోరియల్ లో మనం, case statement యొక్క ప్రాముఖ్యతను, case statement యొక్క సింటాక్స్ ను disc-space ఉదాహరణతో నేర్చుకుంటాం. |
05:41 | ఒక అసైన్మెంట్ గా ఒక మెనూ డ్రైవెన్ ప్రోగ్రాం ను గణిత గణన కోసం వ్రాయండి- |
05:47 | అది ఇన్పుట్ యూజర్స్ గా a మరియు b ను తీసుకోవాలి: |
05:51 | ఇది మాథెమటికల్ ఆపరేటర్ కోసం (plus +, minus -, division / and multiplication *) అడుగుతుంది. గణన చేయండి మరియు అవుట్ పుట్ ను ముద్రించండి. |
06:02 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
06:06 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశం ను ఇస్తుంది. |
06:08 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
06:14 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం |
06:16 | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
06:23 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
06:31 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
06:35 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro. |
06:48 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
06:53 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.మీకు ధన్యవాదాలు. |