BASH/C2/Case-statement/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 17:14, 12 October 2017 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, BASH లో Case statement పై spoken tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం, case statement యొక్క ప్రాముఖ్యతను, case statement యొక్క సింటాక్స్ ను ఒక ఉదాహరణతో నేర్చుకుంటాం.


00:17 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:23 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:29 ఈ ట్యుటోరియల్ కోసం నేను, Ubuntu Linux 12.04 Operating System మరియు GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:39 GNU Bash వెర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:47 Bash shell కు రెండు conditional statements రూపాలు ఉన్నాయి- if statement మరియు case statement
00:56 Case స్టేట్మెంట్ ను if-else స్టేట్మెంట్ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
01:03 ఎంచుకోవడానికి అనేక అంశాలు ఉన్నప్పుడు case స్టేట్మెంట్ కు ప్రాధాన్యత ఇస్తాం.
01:09 ఇది సాధారణంగా menu లను స్క్రిప్ట్ లో అమలు చేయడానికి ఉపయోగించబడుతుంది.
01:14 ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. case space $(dollar) VARIABLE space in match_1 close round-bracket space commands మరియు రెండు సార్లు సెమికోలన్


01:27 match_n close round-bracket space commands రెండు సార్లు సెమికోలన్ asterisk close round=bracket space command_to_execute_by_default మరియు రెండు సార్లు సెమికోలన్ esac .
01:45 VARIABLE అనేది match_1 కు పోల్చబడుతుంది.
01:48 ఒకవేళ ఇది సరిపోలేకపోతే, ఇది match_n అనే తరువాత కేస్ కు వెళ్తుంది.
01:54 ఇది వీటిలోని ఏఒక్క strings అయినా VARIABLE తో మ్యాచ్ అవుతుందా అని తనిఖీ చేస్తుంది.
02:01 ఒకవేళ yes అయితే అన్ని commands డబల్ సెమికోలన్ వరకు ఎగ్జిక్యూట్ అవుతాయి.
02:07 ఒకవేళ VARIABLE తో ఏదీ మ్యాచ్ కాకపొతే, asterisk తో ఉన్న కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి.
02:14 ఇది డిఫాల్ట్ case కండిషన్ ఎందుకంటే asterisk అన్ని స్ట్రింగ్స్ ను మ్యాచ్ చేస్తుంది.
02:21 esac అనేది case block ముగింపును సూచిస్తుంది.
02:26 మనం case statement ను ఉదాహరణతో అర్ధం చేసుకుందాం.
02:32 నేను ఇప్పటికే ప్రోగ్రాం ను టైప్ చేశాను. కాబట్టి, నేను case.sh ఫైల్ ను తెరుస్తాను.
02:38 డిస్క్ స్పేస్ కొంత పరిమితికి చేరుకున్నప్పుడు ప్రోగ్రాం హెచ్చరిక సందేశాన్ని ముద్రిస్తుంది.
02:45 ఇది shebang line .
02:47 bash యొక్క స్థానం ఇతర Linux లలో అంటే CentOS, RedHat మొదలైన వాటిలో వేరుగా ఉంటుంది.
02:55 గతంలో ఉపయోగించిన /bin/bash పాయింట్లు నేరుగా binary file కు చేరుతాయి.
03:01 env అనేది ఇక్కడ bash ఉన్నటువంటి నిజమైన స్థానమును తీసివేయటానికి ఉపయోగించబడింది,
03:07 ఈ shebang line స్క్రిప్ట్ యొక్క పోర్టబిలిటిని ఏ GNU/Linux సిస్టం పైనైనా మెరుగుపరుస్తుంది.
03:16 df -(hyphen)h అనేది disk space వాడుకను మానవులు చదువదగిన రూపంలో ప్రదర్శిస్తుంది.
03:22 output sort -rk5 కు పైప్ చేయబడింది, ఇది రివర్స్ ఆర్డర్లో ఐదవ కాలమ్ ను క్రమబద్దీకరిస్తుంది.
03:31 తరువాత అవుట్పుట్ awk FNR == 2 {print $5} కు పంపబడుతుంది
03:38 ఇది రెండవ లైన్ యొక్క ఐదవ field ను తీసేస్తుంది.
03:43 చివరికి, అవుట్పుట్ cut -(hyphen)d “% -(hyphen)f1” to strip out  % కు పంపబడుతుంది.
03:55 ఇది case statement యొక్క మొదటి లైన్.
03:59 ఇక్కడ మనం space ను 0 మరియు 69 మధ్య పోల్చుతాము.
04:04 ఒకవేళ మ్యాచ్ అయితే, ఇది "Everything is OK” ను ముద్రిస్తుంది
04:08 తరువాత, ఇది space ను 70 మరియు 89 లేదా 91 నుండి 98 కు మధ్య పోల్చుతుంది.
04:17 ఒకవేళ మ్యాచ్ అయితే, అది “Clean out. There s a partition that is $(dollar)space % full” ను ముద్రిస్తుంది.
04:27 ఇక్కడ, ఇది space ను 99 తో పోల్చుతుంది.
04:30 ఒకవేళ మ్యాచ్ అయితే, అది “Hurry. There s a partition at $(Dollar) space %!” ను ముద్రిస్తుంది
04:39 ఇది డిఫాల్ట్ case కండిషన్ ఎందుకంటే asterisk అన్ని strings ను మ్యాచ్ చేస్తుంది.
04:45 మరియు ఇది case statement ముగింపు.
04:48 ఇప్పుడు, ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి terminal కు వెళ్ళండి.
04:52 chmod plus x case dot sh అని టైప్ చేయండి
04:57 dot slash case dot sh అని టైప్ చేయండి
05:02 "Everything is OK". గమనిక అవుట్పుట్ మీ సిస్టమ్ డిస్క్ స్పేస్ పై ఆధారపడి మారుతూ ఉంటుంది.
05:10 నా మెషిన్ లో, 0 మరియు 69 మధ్య మ్యాచ్ అయింది కనుక, ఇది "Everything is OK” ను ముద్రించింది.
05:18 మీ మెషిన్ పై ముద్రించబడిన సందేశాన్ని తనిఖీ చేయండి.
05:20 ఏ case స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో మీరు అర్ధంచేసుకోగలరు.
05:27 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం. సారాంశం చూద్దాం.
05:31 ఈ ట్యుటోరియల్ లో మనం, case statement యొక్క ప్రాముఖ్యతను, case statement యొక్క సింటాక్స్ ను disc-space ఉదాహరణతో నేర్చుకుంటాం.
05:41 ఒక అసైన్మెంట్ గా: ఒక మెనూ డ్రైవెన్ ప్రోగ్రాం ను గణిత గణన కోసం వ్రాయండి-
05:47 అది ఇన్పుట్ యూజర్స్ గా a మరియు b ను తీసుకోవాలి:
05:51 ఇది మాథెమటికల్ ఆపరేటర్ కోసం (plus +, minus -, division / and multiplication *) అడుగుతుంది. గణన చేయండి మరియు అవుట్ పుట్ ను ముద్రించండి.
06:02 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:06 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
06:08 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
06:14 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
06:16 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది; ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
06:23 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
06:31 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
06:35 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro.
06:48 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
06:53 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india