BASH/C2/Basics-of-Shell-Scripting/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 18:16, 11 October 2017 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 Basics of Shell Scripting పై spoken tutorial కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో మనం
00:09 System variables,
00:11 User defined variables మరియు
00:13 యూజర్ ఇన్ పుట్ ను కీబోర్డ్ ద్వారా అంగీకరించడం గురించి నేర్చుకుంటాము.
00:16 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
00:23 ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:29 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:32 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు
00:35 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.


00:40 GNU Bash వర్షన్ 4 లేదా దాని పై వర్షన్ లు ప్రాక్టీస్ కు సిఫార్సు చేయబడినవని గమనించండి.
00:46 మనం variables పరిచయం తో మొదలుపెడదాం.
00:49 Bash variables సమాచారం కోసం తాత్కాలిక నిల్వను అందిస్తాయి.
00:55 ఈ variables ను ప్రోగ్రామ్ యొక్క జీవితకాలంలో ఉపయోగించవచ్చు.
01:01 ఇక్కడ రెండు రకాల వేరియబుల్స్ ఉన్నాయి: System variables , User defined variables .
01:07 System variables  : ఇవి Linux Bash Shell చే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి.
01:14 ఇవి capital letters చే సూచింపబడతాయి.
01:17 సాధారణంగా ఉపయోగించే system variables -
01:20 BASH_VERSION . HOSTNAME
01:23 HOME etc.
01:25 మనం terminal ను Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి మీ కీబోర్డు పై నొక్కడం ద్వారా తెరుద్దాం.
01:33 ఇప్పుడు set అని టైప్ చేసి, Enter నొక్కండి.
01:38 ఇది అన్ని system variables ను ప్రదర్శిస్తుంది.
01:42 ప్రత్యామ్నాయంగా, మీరు env లేదా printenv అని టైప్ చేసి, అన్ని system variables ను చూడవచ్చు.
01:53 నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి.
01:55 ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOSTNAME అని టైప్ చేసి,
02:01 Enter నొక్కండి.
02:04 system యొక్క hostname ప్రదర్శించబడుతుంది.
02:07 ఇప్పుడు home డైరెక్టరీ యొక్క పూర్తి path ను కనుక్కుందాం.
02:11 echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOME (in capital) అని టైప్ చేసి,
02:18 Enter నొక్కండి.
02:21 యూజర్ ల home డైరెక్టరీ యొక్క పూర్తి path ప్రదర్శించబడుతుంది.
02:26 ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో HOME (in capital)అని టైప్ చేసి,
02:32 Enter నొక్కండి.
02:34 ఇది "HOME" ను మాత్రమే చూపుతుంది, HOME వేరియబుల్ విలువను కాదు.
02:39 కాబట్టి, దాని విలువను ప్రదర్శించడానికి, ప్రతి వేరియబుల్ ప్రారంభంలో డాలర్ గుర్తు ($) ను ఉపయోగించడం అవసరం.
02:48 మనము తిరిగి మన slides కు వెళ్దాం.
02:51 User Defined Variables  :
02:53 ఈ variables యూజర్ లచే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి.
02:57 user defined variables పేర్లకు uppercase ను తొలగించడం అనేది ఎల్లప్పుడూ ఒక మంచి ఆలోచన.
03:05 ఇది user defined మరియు system variables మధ్య తేడాను సులభం చేస్తుంది.
03:12 మన terminal కు తిరిగి మారండి.
03:14 username ఈక్వల్స్ టూ sunita అని టైప్ చేయండి.
03:20 username ,ఈక్వల్స్ టూ గుర్తు మరియు sunita ల మధ్య ఖాళీ స్థలం ఉండకూడదని గమనించండి.
03:29 ఇప్పుడు, Enter నొక్కండి. variable username యొక్క value ను ప్రదర్శించడానికి,
03:33 echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేసి,
03:40 Enter నొక్కండి.
03:42 ఇది sunita ను మీ terminal పై ప్రదర్శిస్తుంది.
03:46 variable యొక్క విలువ అన్-సెట్ చేయబడును.
03:50 తిరిగి మనము మన slides కు వెళ్దాం.
03:52 unset - వేరియబుల్ యొక్క విలువ unset command ఉపయోగించడం ద్వారా అన్-సెట్ చేయబడును.
03:59 దీనికి సింటాక్స్- unset variablename
04:03 username ను వేరియబుల్ గా ఉపయోగించిన మన మునుపటి ఉదాహరణను ఉపయోగిద్దాం.
04:08 terminal కు మారి, ఇప్పుడు unset space username అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:18 తనిఖీ చేద్దాం. echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:28 terminal పై ఏమీ ప్రదర్శించబడదు.
04:30 దీని అర్థం variable username యొక్క ఆ విలువ తీసివేయబడింది.
04:36 ఇప్పుడు మన slides కు తిరిగి వెళ్దాం.
04:39 Global మరియు local variables:
04:42 Shell script లో, user defined variables ను global గా లేదా local గా డిక్లేర్ చేయవచ్చు.
04:49 అప్రమేయంగా, అన్ని variables global.
04:52 దీని అర్ధం, వాటి విలువలు function లోపల మరియు వెలుపల కూడా అదే విధంగా ఉంటాయి.
04:59 variables ను global గా మరియు local గా డిక్లేర్ చేయడం నేర్చుకుందాం.
05:04 terminal కు మారి,
05:07 gedit space g_(underscore)variable.sh space & (ampersand sign) అని టైప్ చేయండి.
05:16 gedit అనేది text editor g_ (underscore) variable.sh అనేది మన ఫైల్ పేరు
05:23 మరియు అంపెర్సన్డ్ prompt ను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాము.
05:28 Enter నొక్కండి.
05:30 ఇక్కడ చూపించిన code ను మీ ఫైల్ "g_(underscore)variable.sh" లో టైప్ చేయండి.
05:35 ఇప్పుడు నన్ను code ను వివరించనివ్వండి.
05:38 హాష్ మరియు ఆశ్చర్యార్థకం గుర్తుతో ఉన్న మొదటి లైన్ shebang లేదా bang లైన్.
05:44 username=sunita అనేది userdefined variable మరియు ఇది global గా డిక్లేర్ చేయబడింది.
05:51 echo "outside function:" అను stringను ప్రదర్శిస్తుంది.
05:55 డాలర్ username వేరియబుల్ username విలువను print చేస్తుంది.
06:00 ఈ విధంగా మనం BASH script లో function ను నిర్వచిస్తాము.
06:04 మనం functions గురించి వివరంగా, తరువాత ట్యుటోరియల్లో చర్చిద్దాము.
06:09 ఇది function యొక్క (BODY) ఆకృతి.
06:12 ఇక్కడ, మరొక సందేశం "inside function" username విలువతోపాటు ప్రదర్శింపబడుతుంది.
06:19 ఇక్కడ మనం function ను పిలుస్తాం.
06:21 ఇదే మన కోడ్. ఇప్పుడు దీన్ని execute చేద్దాం.
06:23 మన Terminal కు వెళ్ళండి.
06:26 నన్ను ప్రాంప్ట్ ను క్లియర్ చేయనివ్వండి.
06:28 మొదటగా మనం మన ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం.
06:31 chmod space plus x space g_(underscore)variable.sh అని టైప్ చేసి Enter నొక్కండి.
06:39 ఇప్పుడు dot slash g_(Underscore)variable.sh అని టైప్ చేయండి
06:45 Enter నొక్కండి.
06:47 output ను గమనించండి. ఫంక్షన్ వెలుపల sunita విలువను username తీసుకుంటుంది.
06:53 ఫంక్షన్ లోపల కూడా, sunita అదేవిలువను username తీసుకుంటుంది.
06:59 ఇది ఎందుకంటే username ఫంక్షన్ వెలుపల global గా ప్రకటించబడింది.
07:04 తరువాత, మనము variable ని local గా ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం.
07:09 gedit space l_(Underscore)variable.sh space & (ampersand sign) అని టైప్ చేయండి.
07:18 Enter నొక్కండి.
07:20 ఇక్కడ చూపించిన విధంగా code ను, మీ ఫైల్ "l_(underscore)variable.sh" లో టైప్ చేయండి.
07:25 నన్ను code ని వివరించనివ్వండి.
07:28 ఫంక్షన్ లోపల కోడ్ యొక్క అదనపు లైన్ తప్ప కోడ్ మునుపటివలె అలానే ఉంది.
07:36 function బ్లాక్ లోపల, మనకు local space username equals to jack అనే లైన్ ఉంది.
07:41 ఇది కొత్త value ని వేరియబుల్ username కొరకు స్థానికంగా కేటాయిస్తుంది.
07:48 ఇప్పుడు Terminal కు వెళ్ళండి.
07:50 ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేద్దాం
07:52 chmod space plus x space l_variable.sh టైప్ చేసి
08:00 Enter నొక్కండి.
08:02 dot slash l_variable.sh అని టైప్ చేసి
08:07 Enter నొక్కండి. output ప్రదర్శింపబడుతుంది.
08:10 function వెలుపల, username sunita విలువను తీసుకుంటుంది.
08:15 అదేవిధంగా function లోపల, username jack విలువను తీసుకుంటుంది.
08:20 ఇలా ఎందుకంటే username ఈ విలువను ఫంక్షన్ లోపల localగా కేటాయించింది.
08:26 ఇప్పుడు త్వరగా user input ను కీబోర్డ్ ద్వారా ఎలా పొందాలో చూద్దాం.
08:31 read command ను కీబోర్డ్ నుండి input ను అంగీకరించడానికి ఉపయోగిస్తారు.
08:36 ఇది input value ను user defined variable కు కూడా కేటాయించటానికి ఉపయోగించవచ్చు.
08:41 read కమాండ్ యొక్క సింటాక్స్-
08:44 read space hyphen p space within double quotes PROMPT
08:50 PROMPT అనేది యూజర్ ఇన్ పుట్ కోసం వేచి ఉన్నఒక string అని గమనించండి.
08:55 మీరు దానిని మీ స్వంత string తో భర్తీ చేయవచ్చు.
08:58 ఇప్పుడు terminal కు మారండి.
09:00 gedit space read.sh space & అని టైప్ చేయండి
09:08 Enter నొక్కండి. ఇక్కడ చూపించిన విధంగా కోడ్ ను మీ ఫైల్ "read.sh" లో టైప్ చేయండి.
09:14 నన్ను కోడ్ ని వివరించనివ్వండి.
09:16 ఈ ఉదాహరణలో, input కీబోర్డు నుండి యూజర్ ద్వారా ఇవ్వబడింది.
09:21 ఇది bang లైన్.
09:23 ఇక్కడ -p ప్రాంప్ట్ ను క్రొత్త లైన్ లేకుండా ప్రదర్శిస్తుంది మరియు ఇన్పుట్ ను కీబోర్డ్ నుండి తీసుకుంటుంది.
09:31 యూజర్ ఇన్ పుట్ వేరియబుల్ username లో నిల్వ చేయబడుతుంది.
09:36 echo కమాండ్ సందేశాన్ని ప్రదర్శిస్తుంది
09:38 Hello మరియు కీబోర్డు ద్వారా యూజర్ చేత ఎంటర్ చేయబడిన పేరు.
09:43 కాబట్టి ప్రోగ్రాం ని ఎగ్జిక్యూట్ చేద్దాం.
09:45 terminal కు వెళ్ళండి.
09:49 chmod space plus x space read.sh అని టైప్ చేసి
09:55 Enter నొక్కండి.
09:56 dot slash read.sh అని టైప్ చేసి Enter నొక్కండి.
10:01 ఇక్కడ ఇది Enter username ను ప్రదర్శిస్తుంది.
10:04 నేను ashwini అని టైప్ చేస్తాను, Enter నొక్కండి.
10:08 Hello ashwini సందేశం ప్రదర్శించబడుతుంది.
10:13 ashwini అనేది input value గా user defined వేరియబుల్ username కు కేటాయించబడింది.
10:20 మన slides కు వెళ్దాం మరియు సారాంశం చుద్దాం.
10:23 ఈ ట్యుటోరియల్ లో మనం:
10:26 System variables , User defined variables మరియు
10:29 కీబోర్డ్ ద్వారా యూజర్ ఇన్ పుట్ ను అంగీకరించడం గురించి నేర్చుకుంటాము.
10:33 ఒక అసైన్మెంట్ గా- ఒక సాధారణ Bash ప్రోగ్రాం ను క్రింది system variables పొందడానికి రాయండి.
10:38 pwd మరియు * logname .
10:41 ఒక సాధారణ Bash ప్రొగ్రామ్ వ్రాయండి
10:43 username ను user నుండి అడగడానికి
10:46 ఒక వేళా యూజర్ ఏదైనా 10 సెకన్ల లోపల నమోదు చేయకపోతే ప్రోగ్రాం ఎగ్జిట్ అవడానికి.
10:51 {సూచన: read -(Hyphen)t 10 -(Hyphen)p }
10:56 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:59 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
11:02 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
11:07 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
11:16 మరింత సమాచారం కోసం దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
11:23 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
11:27 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
11:34 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro
11:40 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
11:44 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india