PERL/C3/Special-Variables-in-PERL/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 16:33, 9 October 2017 by Yogananda.india (Talk | contribs)
|
| |
00:01 | Perl లోని Special variables పై Spoken Tutorial కు స్వాగతం. | |
00:04 | ఈ ట్యుటోరియల్ లో మనం Global special variables, Special command line variables, Global special constants గురుంచి నేర్చుకుంటాము. | |
00:13 | ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను . మీరు మీకు నచ్చిన ఏ text editor ను అయినా ఉపయోగించుకోవచ్చు. | |
00:27 | ముందుగానే, మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన కలిగి ఉండాలి . | |
00:32 | లేకపోతే,సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స కోసం spoken tutorial వెబ్ సైట్లో చూడండి. | |
00:38 | special variables అంటే ఏమిటి? | |
00:41 | Special variables ముందే నిర్వచించిన వేరియబుల్స ఇవి Perl లో ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి. | |
00:46 | వీటికి ఉపయోగించక ముందు ప్రారంభవిలువ ఇవ్వవలసిన అవసరం లేదు. | |
00:50 | వీటిని సెర్చ్ ఫలితాలను, environment variables మరియు debugging నియంత్రించడానికి ఉపయోగించే flagsలను నిర్వహించడానికి ఉపయోగిస్తారు. | |
00:58 | ముందుగా మనము Global special variables గురించి నేర్చుకుందాము. | |
01:02 | $ _ :(Dollar Underscore). ఇది విస్తృతంగా ఉపయోగించే special variable. | |
01:06 | $_ Dollar Underscore, చాలా functionలు మరియు పాటర్న్ సెర్చ్ స్ట్రింగ్స్ కు default parameter. | |
01:14 | నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి $ _ (Dollar Underscore) వేరియబుల్ యొక్క ఉపయోగాన్ని అర్థం చేసుకుందాము. | |
01:20 | నేను ఇప్పటికే సృష్టించిన, special dot pl fileను తెరుస్తాను. | |
01:26 | terminal కు మారి, gedit special dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి. | |
01:32 | gedit లో ఇప్పుడు special dot pl ఫైలు తెరవబడింది. స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి .ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి. | |
01:42 | ఇక్కడ రెండు foreach లూప్స్ ఉన్నాయి. ఈ రెండూ foreach లూప్ ఒకే ఫలితాన్నిఇస్తాయి. | |
01:49 | లూప్ యొక్క ప్రతి iteration లో ప్రస్తుత స్ట్రింగ్ $_ లో ఉంచబడుతుంది. | |
01:54 | ఇది డిఫాల్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్ చే ఉపయోగించబడుతుంది. $_ (Dollar Underscore) అదనపు వేరియబుల్ అయిన $color ను ఉపయోగించవలసిన అవసరం లేకుండా చేస్తుంది. | |
02:03 | ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. | |
02:06 | terminal కు మారి, perl special dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేసి, Enter నొక్కండి. | |
02:13 | ఇక్కడ రెండు , foreach లూప్స్ ఒకే అవుట్ ఫుట్ ను ఇస్తాయి. | |
02:18 | ఇప్పుడు, $_ (Dollar Underscore) వేరియబుల్ యొక్క ఉపయోగంను మనం మరొక ఉదాహరణ చూద్దాం. special dot pl file కు తిరిగి వెళ్ళండి. | |
02:27 | స్క్రీన్ పై చూపబడిన కోడ్ ను టైప్ చేయండి. | |
02:30 | ఈ ప్రోగ్రాం DATA ఫైల్, first.txt టెక్స్ట్ ఫైల్ నుండి అన్ని లైన్ లు చదవడం పూర్తియ్యేంత వరకు ఒక్కొక్క లైన్ ను చదువుతుంది. | |
02:40 | print $_ వేరియబుల్, first.txt ఫైల్ నుండి ప్రస్తుత లైన్ కంటెంట్ ను ముద్రిస్తుంది. while లూప్ లో $_ ను మనం తెలపకపోయినను ఉపయోగించినట్లే. | |
02:51 | మనం దీని గురుంచి తరువాత ట్యుటోరియల్స్ మరింత నేర్చుకుంటాము. | |
02:55 | At the rate underscore అనేది subroutine parameters ను నిల్వ చేయడానికి ఉపయోగపడు ఒక special variable. | |
03:01 | subroutine యొక్క Arguments, ఈ array వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి. | |
03:06 | pop/shift లాంటి Array operation ను మనం సాధారణ అర్రే లో చేసిన మాదిరిగా ఈ వేరియబుల్ పై కూడా చేయవచ్చు. | |
03:13 | దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను.మళ్ళి మనం ఒకసారి special dot pl file కు మారుదాం. | |
03:19 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. | |
03:22 | ఈ ప్రోగ్రామ్ రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను తిరిగి ఇస్తుంది. @_ (At the rate underscore) అనేది రెండు డాలర్ a కామ డాలర్ b ఆర్గుమెంటలను నిల్వ చేసే ఒక local అర్రే. | |
03:35 | అంటే ఇది dollar underscore index of zero మరియు dollar underscore index of one వద్ద నిల్వ చేయబడును. | |
03:43 | print స్టేట్మెంట్ ఇవ్వబడిన, రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను ముద్రిస్తుంది. | |
03:47 | ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి. | |
03:51 | terminal కు మారి, perl special dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేసి, Enter నొక్కండి. | |
03:58 | గరిష్ట విలువ అవుట్పుట్ గా ప్రదర్శించబడుతుంది. ముందుకు కొనసాగుదాం . | |
04:02 | Environment variables క్యాపిటల్ ENV తో అనుసరింపబడే percentage (%) చే సూచింపబడును. | |
04:10 | Environment variables ప్రస్తుత environment variables యొక్క, కాపీ లను క్రింది విధంగా కలిగి ఉంటాయి . | |
04:17 | మనం నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి , % ENV వేరియబుల్ ను అర్థం చేసుకుందాం. | |
04:23 | మనం తిరిగి special dot pl file కు మారుదాం. | |
04:26 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. | |
04:30 | ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S నొక్కండి . టెర్మినల్ కు మారి, Perl స్క్రిప్ట్ ను అమలు చేయండి. | |
04:37 | perl special dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. | |
04:42 | PWD (present working directory) , యూసర్ నేమ్ , లాంగ్వేజ్ మొదలైనవి ప్రస్తుత ఎన్విరాన్మెంట్ వివరాలను మనము చూడవచ్చు. | |
04:51 | తరువాత మనము మరొక special variable dollar zero గురించి చూద్దాం. | |
04:55 | special variable dollar zero ( $ 0 ) అమలు చేయబడుతున్న ప్రస్తుత Perl ప్రోగ్రాం పేరును కలిగి ఉంటుంది. | |
05:02 | ఇది సాధారణంగా లాగింగ్ ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుంది. | |
05:05 | ఉదాహరణకు: ఇక్కడ చూపిన విధంగా నావద్ద $0 వేరియబుల్ ను ఉపయోగిస్తున్న First.pl అనే ఫైల్ ఉంది. | |
05:14 | అమలు చేసినప్పుడు, ఇది ఫైల్ పేరు First dot pl అని ముద్రిస్తుంది. | |
05:19 | Perl నందు array ను క్రమబద్దీకరించుటకు, sort అని పిలువబడే built-in function ఉంది. | |
05:24 | ఒక comparison function , numerical comparison operator ను ఉపయోగించి దాని పారామీటర్స్ ను పోలుస్తుంది. | |
05:30 | ఇక్కడ చూపిన విధంగా, ఈ ఆపరేటర్లు lesser than equal to greater than గుర్తుల ద్వారా సూచించబడతాయి. | |
05:38 | దీని కోసం ఒక ఉదాహరణ చూద్దాము. | |
05:40 | terminal ను తెరచి, gedit sort.pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి. | |
05:47 | ఇప్పుడు Sort.pl ఫైల్ gedit Text Editor లో తెరుచుకుంటుంది .స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. | |
05:56 | నన్ను కోడ్ ను వివరించనివ్వండి. మొదటి లైన్ సంఖ్యల యొక్క అర్రే ను డిక్లేర్ చేస్తుంది. | |
06:02 | numerical comparison operator రెండు సంఖ్యల విలువలను పోలుస్తుంది. | |
06:08 | Dollar a మరియు dollar b లు పోల్చవలసిన విలువలను కలిగి ఉండే special package local variables. | |
06:16 | ఈ sort ఫంక్షన్, సంఖ్యలను ఆరోహణ క్రమంలో క్రమబద్ధీకరిస్తుంది. | |
06:21 | ఇప్పుడు మనం ప్రోగ్రాం ను save చేసి, execute చేద్దాం . | |
06:25 | తిరిగి టెర్మినల్ కు వెళ్ళి, perl sort.pl అని టైప్ చేసి, Enter నొక్కండి. | |
06:31 | సంఖ్యలు ఆరోహణ క్రమంలో క్రమబద్దీకరింపబడుట మనం చూడవచ్చు. | |
06:35 | మరొక ప్రత్యేక వేరియబుల్ dollar exclamationను చూద్దాం. | |
06:39 | dollar exclamation ను ఒకవేళ string కంటెంట్ లో ఉపయోగించినట్లైతే, system error string రిటర్న్ అవుతుంది. | |
06:48 | ఒకవేళ hello.txt ఫైల్ ఉనికిలో లేనట్లయితే, ఇది Cannot open file for reading : No such file or directory అనే ఎర్రర్ సందేశాన్ని ముద్రిస్తుంది. | |
06:59 | ఇప్పుడు dollar at the rate అనే పేరుగల మరొక special variable ను చూద్దాం. | |
07:04 | ఇది విస్తృతంగా ఉపయోగించబడే మరొక వేరియబుల్. ఇది eval లేదా require కమాండ్ నుండి error సందేశాన్ని రిటర్న్ చేస్తుంది. | |
07:12 | ఈ ఉదాహరణ ముద్రింపబడుతుంది : could not divide Illegal division by zero . | |
07:17 | dollar dollar అనేది మరొక special variable. ఇది ఈ స్క్రిప్ట్ ను అమలు చేస్తున్న Perl interpreter యొక్క process ID ను కలిగి ఉంటుంది. | |
07:26 | diamond operator అనేది command line పై పేర్కొన్న ఫైల్స్ నుండి ప్రతి లైన్ ను చదవడానికి ఉపయోగించబడుతుంది. | |
07:32 | దీని కోసం ఒక ఉదాహరణ చూద్దాము. | |
07:35 | టెర్మినల్ ను తెరచి, gedit commandline.pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి. | |
07:42 | Commandline.pl ఫైలు ఇప్పుడు geditలో తెరవబడింది. | |
07:46 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. | |
07:49 | ఫైల్ ను Save చేయండి. | |
07:51 | నేను, sample dot txt అనే పేరుగల ఫైల్ లో కలిగి ఉన్న టెక్స్ట్ ను మీకు చూపిస్తున్నాను. | |
07:56 | ఇప్పుడు, command line పై perl commandline dot pl space sample dot txt ను టైప్ చేసి, Enter నొక్కి, ప్రోగ్రాం ను run చేయండి. | |
08:07 | ఇది sample dot txt ఫైల్ లో మనం కలిగి ఉన్న టెక్స్ట్. | |
08:11 | ఏ ఫైళ్ళూ పేర్కొనకపోతే, ఇది standard input, అంటే, కీ బోర్డు నుండి ఇన్పుట్ ను స్వీకరిస్తుంది. | |
08:17 | Perl నందు at the rate capital A R G V అనే ఒక ప్రత్యేక అర్రే వేరియబుల్ ఉంది. ఇది command line నుండి అన్ని విలువలను కలిగి ఉంటుంది. | |
08:27 | అర్రే at the rate capital A R G V ఉపయోగిస్తున్నప్పుడు, వేరియబుల్స్ ను డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు. | |
08:33 | కమాండ్ లైన్ నుండి విలువలు ఈ వేరియబుల్లో స్వయంచాలకంగా ఉంచబడతాయి. | |
08:37 | ఇప్పుడు Global Special Constantsకు వెళదాం. | |
08:41 | underscore underscore E N D (all in capital ) underscore underscore ప్రోగ్రాం యొక్క తార్కిక ముగింపును సూచిస్తుంది. | |
08:50 | ఈ special variable ను అనుసరిస్తున్న ఏ వేరియబుల్ అయినా ఈ స్టేట్మెంట్ తరువాత వదిలివేయబడును. | |
08:55 | ఉపయోగించబడిన పాయింట్ వద్ద అది ప్రోగ్రాం యొక్క ఫైల్ పేరు ను సూచిస్తుంది. | |
09:06 | underscore underscore LINE (in capital letters) underscore underscore ప్రస్తుత లైన్ సంఖ్యను సూచిస్తుంది. | |
09:13 | underscore underscore PACKAGE (in capital letters) underscore underscore కంపైల్ సమయం వద్ద ప్రస్తుత ప్యాకేజీ ను లేదా ప్రస్తుత ప్యాకేజీ లేనిచో ఏ ప్యాకేజి నిర్వచించబడలేదు అని సూచిస్తుంది. | |
09:25 | Global Special Constants లను ఎలా ఉపయోగించాలో మనం నమూనా ప్రోగ్రాం తో చూద్దాం. | |
09:30 | టెర్మినల్ ను తెరచి, gedit specialconstant dot pl ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి. | |
09:39 | ఇప్పుడు specialconstant dot pl ఫైలు geditలో తెరవబడింది. | |
09:44 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. నన్ను కోడ్ ను వివరించనివ్వండి. | |
09:50 | ప్రత్యేక పదాలైన PACKAGE, FILE, LINE అనేవి ప్రోగ్రాం లో ప్యాకేజీ పేరు , ప్రస్తుత ఫైల్ పేరు మరియు లైన్ సంఖ్యను సూచిస్తాయి . | |
10:00 | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. | |
10:02 | తిరిగి టెర్మినల్ కు వెళ్ళి, perl specialconstant.pl అని టైప్ చేసి, Enter నొక్కండి. | |
10:09 | మనం ప్రస్తుత ప్యాకేజీ పేరు, ఫైల్ పేరు మరియు మన ప్రోగ్రాంలో లైన్ సంఖ్యను చూడవచ్చు. | |
10:15 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. సారాంశం చూద్దాం . | |
10:19 | ఈ ట్యుటోరియల్ లో మనం Perlలో సాధారణంగా ఉపయోగించే కొన్ని special variables గురించి నేర్చుకున్నాం. | |
10:25 | ఒక అసైన్మెంట్- క్రింది దానిని చేయండి. క్రింది అర్రే సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో sort చేయడానికి Perl స్క్రిప్ట్ ను వ్రాయండి. | |
10:34 | గమనిక: అవరోహణ క్రమం కొరకు క్రింది కోడ్ ను సరిపోల్చడానికి ఉపయోగించండి. | |
10:39 | while లూప్ మరియు special variable $_ (Dollar Underscore)ను ఉపయోగించి క్రమబద్ధీకరించిన ఫలితాన్ని ముద్రించండి. | |
10:45 | ప్రోగ్రాం ను Save చేసి, execute చేయండి. | |
10:47 | ఇప్పుడు ఫలితాన్ని తనిఖీ చేయండి. | |
10:49 | కింది లింక్ వద్ద గల వీడియోస్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని చేసి చూడండి. | |
10:56 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | |
11:03 | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. | |
11:06 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నిధులు సమకూరుస్తుంది. | |
11:13 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది. | |
11:17 | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. ధన్యవాదాలు. |