PERL/C3/Perl-and-HTML/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 17:22, 5 October 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration | |
00:01 | Perl and HTML పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. | |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం html pages మరియు CGI module ను ఎలా సృష్టించాలో నేర్చుకుంటాము. | |
00:14 | ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 Firefox Web Browser Apache HTTP server మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను. | |
00:31 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. | |
00:35 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన ఉండాలి. | |
00:40 | లేకపోతే, spoken tutorial వెబ్ సైట్లో సంబంధిత Perl స్పోకన్ ట్యుటోరియల్స్ ను చూడండి. | |
00:47 | web లో ఉపయోగించిన పెర్ల్ ప్రోగ్రామ్లను Perl CGI అని అంటారు. | |
00:52 | CGI అంటే Common Gateway Interface అని అర్ధం. | |
00:56 | ఇది client-server వెబ్ కమ్యూనికేషన్ లో ఒక ఇంటర్-పేస్ గా పనిచేస్తుంది. | |
01:01 | CGI.pm అనేది Perl ఇన్స్టాలేషన్ తో అందుబాటులో ఉండి, కమ్యూనికేషన్ ను అందిచే, ఒక Perl మాడ్యూల్. | |
01:10 | Perl CGI అప్లికేషన్లను రాయడానికి CGI.pm లో డెవలపర్ల సహాయం కోసం, ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న functions అందుబాటులో ఉంటాయి. | |
01:19 | బ్రౌసర్ నుండి ఒక డైరెక్టరీ లోని ఒక ఫైల్ రిక్వెస్ట్ చేయబడితే HTTP server లా కాకుండా Perl CGI స్క్రిప్ట్ అమలయి, ప్రదర్శించడానికి అవుట్పుట్ ను తిరిగి బ్రౌజర్ కు పంపుతుంది. | |
01:33 | ఈ ఫంక్షన్ ను CGI అని , ఈ ప్రోగ్రామ్ లను CGI scripts అని అంటారు. | |
01:40 | CGI ప్రోగ్రామ్లు Perl script, Shell Script, C లేదా C++ program కావచ్చు. | |
01:47 | ఇప్పుడు, మనం ఒక నమూనా Perl ప్రోగ్రామ్ ను చూద్దాం. | |
01:50 | terminal కు మారండి. | |
01:53 | నేను ఇప్పటికే సేవ్ చేసిన cgiexample.pl ఫైల్ ను gedit లో తెరవనివ్వండి. | |
02:01 | Cgiexample dot pl ఫైలులో, స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా ఈ కోడ్ ను టైప్ చేయండి. | |
02:08 | ఇప్పుడు మనం కోడ్ ను అర్థం చేసుకుందాం. | |
02:11 | use CGI స్టేట్మెంట్ మనము CGI.pm మాడ్యూల్ మన ప్రోగ్రామ్ లో ఉపయోగించాలనుకుంటున్నాం అని Perl కు చెబుతుంది. | |
02:19 | ఇది మాడ్యూల్ ను లోడ్ చేసి, మన కోడ్ కోసం CGI functions సెట్ ను అందుబాటులో ఉంచును. | |
02:26 | HTML ను ప్రారంభించడానికి, మనము start_html () మెథడ్ ను ఉపయోగిస్తాము. | |
02:33 | My Home Page అనేది వెబ్ పేజ్ కు ఇవ్వబడిన page టైటిల్. | |
02:38 | మనం CGI module ను ఉపయోగించి ఏ HTML ట్యాగ్ ను అయినా ముద్రించవచ్చు. | |
02:43 | శీర్షిక ట్యాగ్లు h1, h2 లచే సూచింపబడతాయి. | |
02:49 | End_html మెథడ్ BODY మరియు HTML ట్యాగ్లను తిరిగి పంపుతుంది. | |
02:55 | ఇప్పుడు ఫైల్ ను save చెయ్యండి. | |
02:57 | మనం web server ద్వారా స్క్రిప్ట్ ను run చేయడానికి ప్రయత్నించే ముందు, దానిని command line నుంచి అమలు చేయటానికి ప్రయత్నిద్దాం. | |
03:04 | తిరిగి terminalకు మారి, perl cgiexample.pl అని టైప్ చేసి, Enter నొక్కండి. | |
03:12 | అవుట్పుట్ HTML వలే కనిపిస్తుంది. | |
03:15 | తరువాత, మనం అదే స్క్రిప్ట్ ను web server ద్వారా పరిక్షిద్దాం. | |
03:20 | ముందుగా, మనం వెబ్ సర్వర్ పనిచేస్తుందో లేదో తనిఖీ చేద్దాం. | |
03:25 | మీ web browser ను తెరిచి, మెషిన్ IP address ను ఎంటర్ చేసి, Enter నొక్కండి. | |
03:31 | లేకపోతే, మీరు "localhost" గా టైప్ చేయవచ్చు. | |
03:35 | ఒకవేళ ప్రతిదీ అనుకూలంగా జరుగుతున్నట్లైతే మీరు బ్రౌజర్ లో ఇటు వంటిది ఏదో చూస్తారు. | |
03:40 | ఒక వేళ మీరు ఏదైనా ఎర్రర్ పొందితే, అప్పుడు web service ఇన్స్టాల్ చేయబడలేదు లేదా అది ON స్థితిలో లేదు అని అర్ధం. | |
03:48 | నా మెషిన్ లో Apache HTTP server ఇన్స్టాల్ చేయబడినది. | |
03:52 | ఒక వేళ అది ఇన్స్టాల్ చేయకపోతే, టెర్మినల్ పై క్రింది command ను execute చేయండి. | |
03:58 | లేకపోతే, దయచేసి సర్వర్ ఆకృతీకరణ కోసం మీ సిస్టమ్ నిర్వాహకుడిని అడగండి. | |
04:04 | ఇప్పుడు, మనం అదే స్క్రిప్ట్ ను వెబ్ సర్వర్ ద్వారా పరీక్షిద్దాం. | |
04:09 | దీని కోసం, మనం కొన్ని సోఫానాలను అనుసరించాలి. | |
04:13 | ముందుగా, cgi-bin డైరెక్టరీలో మన ప్రోగ్రాం ను ఉంచండి. దీనిని వెబ్ సర్వర్ CGI స్క్రిప్ట్ గా గుర్తిస్తుంది. | |
04:22 | ప్రోగ్రామ్ ఫైల్ పేరు తప్పనిసరిగా dot pl లేదా dot cgi పొడిగింపుతో ముగుస్తుంది. | |
04:29 | server పై అమలు చేయడానికి ఫైల్ కోసం అనుమతిని సెట్ చెయ్యండి. | |
04:33 | స్క్రిప్ట్ ను Run చేయండి. | |
04:35 | ఈ ప్రోగ్రామ్ కోసం URL slide లో చూపిన విధంగా ఉంటుంది. | |
04:40 | టెర్మినల్ కు మారండి. | |
04:42 | ఇప్పుడు, మనం, ఫైల్ ను cgi-bin డైరెక్టరీకి కాపీ చేద్దాం. | |
04:47 | దీని కోసం, కమాండ్: sudo space cp space cgiexample.pl /usr/lib/cgi-bin/ ను టైప్ చేయండి. | |
05:03 | అవసరమైతే పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి. | |
05:06 | తరువాత, మనం ఫైల్ పై వెబ్-సర్వర్ యూజర్ కు read మరియు execute permission ను ఇవ్వాలి. | |
05:13 | దీని కోసం, sudo space chmod space 755 space /usr/lib/cgi-bin/cgiexample.pl ను టైప్ చెయ్యండి. | |
05:31 | ఇప్పుడు, cgi-bin డైరెక్టరీలో ఉంచిన మన ఫైల్ అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. | |
05:38 | వెబ్ బ్రౌజర్ కు వెళ్ళండి. | |
05:41 | localhost/cgi-bin/cgiexample.pl టైప్ చేసి, Enter నొక్కండి. | |
05:50 | వెబ్ బ్రౌజర్ పై అమలు చేయబడిన అవుట్పుట్ ను మనం చూడవచ్చు. | |
05:55 | ఇప్పుడు, మనం మరొక ప్రోగ్రాం ను చూద్దాం. ఈ ప్రోగ్రాం form కు field ను జోడించి, ఎంటర్ చేసిన విలువలను మన వెబ్ పేజికి తిరిగి ఇస్తుంది. | |
06:06 | ముందుగా సృష్టించిన cgi-bin directoryలో నేను form.cgi ఫైల్ ను సేవ్ చేసాను. నేను ఈ ఫైలు ను gedit లో తెరుస్తాను. | |
06:17 | ఇప్పుడు, క్రింద లైన్ ల ను చేర్చండి. ఈ ప్రోగ్రాం feedback form ను సృష్టిస్తుంది. | |
06:24 | యూజర్ first name, last name, gender మరియు feedback details లాంటి వివరాలను ఎంటర్ చేయాలి. | |
06:31 | form ను ప్రారంభించడానికి, మనం start_form () మెథడ్ ను ఉపయోగిస్తున్నాము. | |
06:36 | Form field మి మెథడ్స్ ప్రామాణిక html ట్యాగ్ పద్ధతులకు సమానంగా ఉంటాయి. | |
06:42 | ఫారం లో టెక్స్ట్ బాక్స్ ను సృష్టిచడానికి, Textfield() m మెథడ్ ను అనేక పారామితులతో ఉపయోగించబడుతుంది. | |
06:49 | ఇక్కడ "fname", "lname" అనేవి యూజర్ నుండి ఇన్పుట్ గా పొందే, టెక్స్ట్ బాక్స్ యొక్క పేర్లు. | |
06:57 | radio underscore group అనునది "Male" మరియు "Female" అను రెండు ఎంపికలతో రేడియో బటన్ ను నిర్దేశిస్తుంది. | |
07:05 | ఇది hyphen values పారామితి ద్వారా సూచిపంబడుతుంది. | |
07:09 | hyphen default పారామితి రేడియో బటన్ యొక్క డిఫాల్ట్ ఎంపికను సూచిస్తుంది. | |
07:15 | popup underscore menu listbox ఎంపికను నిర్దేశిస్తుంది. | |
07:20 | Submit బటన్ URL ప్రొవైడర్ కు ఎంటర్ చేసిన డేటాను సమర్పించడానికి ఉపయోగించబడుతుంది. | |
07:26 | Clear బటన్ form ను క్లియర్ చేయడానికి ఉపయోగించబడుతుంది. | |
07:30 | మనం ఫారం లో ఎంటర్ చేసిన విలువలను Displayform ఫంక్షన్ తిరిగి పొందుతుంది. | |
07:36 | Param () ఫంక్షన్, ఫారం ఫీల్డ్ యొక్క పేరును పారామితిగా తీసుకుని, దాని విలువను ఇస్తుంది. | |
07:42 | ఇక్కడ "fname" అనేది "First Name" టెక్స్ట్ బాక్స్ కు ఇవ్వబడిన పేరు. | |
07:47 | పొందిన విలువ dollar name1 వేరియబుల్ లో నిల్వ చేయబడింది. | |
07:53 | ఇపుడు మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. | |
07:56 | వెబ్ బ్రౌజర్ కు వెళ్ళండి. | |
07:58 | localhost/cgi-bin/form.cgi అని టైప్ చేసి, Enter నొక్కండి. | |
08:06 | feedback form ప్రదర్శించబడుతుంది. | |
08:09 | ఇక్కడ చూపిన విధంగా నేను ఈ form లో డేటాను ఎంటర్ చేస్తాను. | |
08:15 | అప్పుడు, ఫారం నుండి తిరిగి పొందబడిన అవుట్పుట్ ను చూడటానికి Submit బటన్ ను నొక్కండి. | |
08:21 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి చేరుస్తుంది. సారాంశం చూద్దాం | |
08:26 | ఈ ట్యుటోరియల్ లో మనము CGI మాడ్యూల్ ను ఉపయోగించి html pages ను ఎలా సృష్టించాలో నేర్చుకున్నాము. | |
08:33 | అసైన్మెంట్- ప్రోగ్రాం form.cgi లో, Java, C/C++ మరియు Perl భాషల కొరకు checkbox ను జోడించండి. | |
08:44 | యూజర్ అభిప్రాయాన్ని పొందడానికి textarea ఎంపికను జోడించండి. | |
08:48 | యూజర్ ఎంటర్ చేసిన సమాచారాన్ని వెబ్ పేజీ పై ముద్రించండి. | |
08:52 | కింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. | |
08:59 | Spoken Tutorial Project బృందం స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | |
09:08 | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. | |
09:11 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుతాయి. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. | |
09:23 | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. ధన్యవాదాలు. |