Git/C2/Merging-and-Deleting-branches/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Merging and deleting branches పై spoken tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనం Merging గురించి, |
00:10 | Merging తీసివేయుట, మరియు branches తొలగించడం గురించి నేర్చుకుంటాము. |
00:14 | ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 14.04 ఉపయోగిస్తున్నాను. |
00:20 | అలాగే, Git 2.3.2 మరియు gedit Text Editor. |
00:26 | మీరు మీకు నచ్చిన editorను ఉపయోగించవచ్చు. |
00:29 | ఈ ట్యుటోరియల్ని అనుసరించడానికి, మీకు Git commands మరియు Git లో branching గురించి అవగాహన ఉండాలి. |
00:37 | లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:42 | ముందు సిరీస్ లో మనం, branches ను సృష్టించే విధానం నేర్చుకున్నాము. |
00:47 | ఇప్పుడు మనము రెండు branches ని ఎలా విలీనం చేయాలో నేర్చుకుందాం. |
00:51 | ఈ రేఖాచిత్రం new-module branch master branch తో ఎలా విలీనం అవుతుందో చూద్దాం. |
00:58 | ఇది C9 commit లో జరుగుతుంది. |
01:01 | విలీనం తర్వాత, new-module యొక్క commits master branch కు జోడించబడతాయి. |
01:06 | ఇది ఎలా పనిచేస్తుందో వివరిస్తాను. |
01:09 | మొదట, మనము ముందుగా సృష్టించిన Git repository mywebpage ను తెరుస్తాము. |
01:16 | Terminal తెరవడానికి Ctrl + Alt + Tకీస్ లను కలిపి నొక్కండి. |
01:20 | మన Git repository లోకి వెళ్ళడానికి, cd space mywebpage అని టైప్ చేసి, Enter నొక్కండి. |
01:29 | నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళను ఉపయోగించడం కొనసాగిస్తాను. |
01:33 | మీరు వేరే ఫైల్ టైప్ ని ఉపయోగించవచ్చు. |
01:38 | ఇక్కడ నుంచి, Terminal పై ప్రతి commandను టైప్ చేసిన తర్వాత Enter key ని నొక్కండి. |
01:45 | మనం Git branch లిస్ట్ న git space branch టైప్ చేసి తనిఖీ చేద్దాం. |
01:51 | మనం, master and new-chapter అను రెండు బ్రాంచెస్ ని చూడవచ్చు |
01:57 | new-chapter branch ఈ శ్రేణిలో ముందుగా సృష్టించబడింది మరియు master అనేది డిఫాల్ట్ branch. |
02:05 | ప్రస్తుతం, మనము master శాఖలో ఉన్నాము. |
02:08 | మనం Git space log space hyphen hyphen oneline టైప్ చేయడం ద్వారా Git log ను తనిఖీ చేస్తాము. |
02:17 | new-chapter branch కు వెళ్ళి, Git log తనిఖీ చేద్దాం. |
02:21 | git space checkout space new-chapter అని టైప్ చేయండి. |
02:27 | git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి. |
02:33 | ఇప్పుడు, మనము master మరియు new-chapter branches యొక్క commits పోల్చుదాము. |
02:38 | ఈ నాలుగు commits రెండు branches కు ఉమ్మడి బ్రాంచెస్. |
02:42 | Added story.html in new-chapter branch అనేది new-chapter బ్రాంచ్ లోనిది. |
02:48 | మరియు Added chapter two in history.html, master బ్రాంచ్ లోనిది. |
02:54 | మెర్జింగ్ చేసిన తరువాత, Added story.html in new-chapter branch commit master branch జోడించబడుతుంది. |
03:02 | ఇప్పుడు నేను merge ఎలా చేస్తారో వివరిస్తాను. |
03:05 | git space merge space master అని టైప్ చేయండి. |
03:09 | Commit message స్వీకరించడానికి, gedit స్వయంచాలకంగా ఓపెన్ అవుతుంది. |
03:14 | geditను Git యొక్క core editor గా ఆకృతీకరించామని గుర్తుకుతెచ్చుకొనండి. |
03:20 | మీరు మరొక editor ను ఆకృతీకరించి ఉంటే ఆ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. |
03:26 | మీరు 1.9 కంటే తక్కువ Git వర్షన్ ను వాడుతుంటే, editor ఓపెన్ కాకపోవచ్చు. |
03:33 | కాబట్టి, మీరు తదుపరి దశను వదిలి వేయవచ్చు. |
03:36 | నేను డిఫాల్ట్ commit messageని అలాగే ఉపయోగిస్తాను. |
03:40 | మీరు, merging కు సంబంధించిన ఏదైనా ఇతర సందేశమును ఇవ్వాలనుకుంటే, వాటిని ఇక్కడ టైప్ చేయండి. |
03:46 | ఇప్పుడు, editorని save చేసి close చేయండి. |
03:50 | Git log ని మళ్ళీ తనిఖీ చేద్దాము. |
03:54 | మీరు Master branch లోని commits, new-chapter branch కి merge అయ్యిందని చూడవచ్చు. |
04:00 | మీరు merging కి సంబంధించిన commit సందేశం కూడా చూడవచ్చు. |
04:04 | తరువాత master branchకి వెళ్ళి commits తనిఖీ చేద్దాము. |
04:09 | git space checkout space master అని టైప్ చేయండి. |
04:14 | Git logను తనిఖీ చేద్దాం. |
04:17 | ఇక్కడ new-chapter commits తో పాటు master branch commits ని చూస్తాము. |
04:22 | కానీ, Git log master branch commits మాత్రమే చూపిస్తుంది. |
04:27 | నిజంగా చెప్పాలంటే, master branch కు new-chapter branch ను merge చేయాలి. |
04:32 | కానీ మనం మరొక విధంగా merge చేసాం. |
04:36 | అందువల్ల మనము Master branch లో merging commit ని చూడలేము. |
04:41 | ఈ merging ని తిరిగి ఎలా తీసివేయగలము? |
04:45 | దీని కోసం, new-chapter బ్రాంచికి తిరిగి వెళ్ళాలి. |
04:50 | git space checkout space new-chapter అని టైప్ చేయండి. |
04:54 | git space reset space hyphen hyphen hard space HEAD tilde టైప్ చేసి merge చేసినవి ని తిరిగి పొందవచ్చు. |
05:04 | లేటెస్ట్ రివిషన్ ను HEAD గాను మరియు లేటెస్ట్ minus 1 రివిషన్ HEAD tilde గాను పిలుస్తామని గుర్తుకు తెచుకొనండి. |
05:12 | కాబట్టి, మనం merging యొక్క మునుపటి రివిషన్ పొందడానికి, HEAD tilde ని ఉపయోగించాము. |
05:18 | మళ్ళీ ఒకసారి, Git log తనిఖీ చేద్దాం. |
05:22 | merging విస్మరించడం మనం చూడవచ్చు. |
05:26 | ఇప్పుడు మనము new-chapter branch ను master branch కు merge చేద్దాము. |
05:31 | మనము git space checkout space master అని టైప్ చేసి మొదటి master branch కి వెళ్ళుదాము. |
05:38 | మరల Git logని తనిఖీ చేద్దాం. |
05:42 | merge చేయడానికి, git space merge space new-chapter అని టైప్ చేద్దాము. |
05:48 | gedit లో మీ merging commit message ఇవ్వండి. |
05:52 | తరువాత ఎడిటర్ ని save చేసి close చేయండి. |
05:55 | మరల Git log ని తనిఖీ చేయండి. |
05:58 | master బ్రాంచ్ తో new-chapter బ్రాంచ్ విజయవంతముగా merge అవ్వడం చూడవచ్చు. |
06:05 | మళ్ళీ merge చేయడానికి ప్రయత్నించుదాం. |
06:08 | git space merge space new-chapter అని టైప్ చేయండి. |
06:13 | ఇప్పుడు, మనం Already up-to-date అనే సందేశాన్ని చూడవచ్చు. |
06:17 | Merge అయినది లేనిది ధృవీకరించడానికి ఇది మంచి మార్గం. |
06:22 | merging తరువాత, new-chapter శాఖను Git repository నుండి తొలగించవచ్చు. |
06:28 | git space branch space hyphen d space new-chapter టైప్ చేసి శాఖ ని తొలగించవచ్చు. |
06:36 | ఇప్పుడు, git space branch టైప్ చేసి branch list ని తనిఖీ చేద్దాం. |
06:43 | new-chapter బ్రాంచ్ ను తొలగించినందున మనం దానిని చూడలేము. |
06:48 | Merging చేయకుండా గా బ్రాంచ్ ని తొలగించేందుకు hyphen d చిన్న అక్షరాలకు బదులు hyphen D క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేయండి. |
06:56 | దీనితో ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
07:00 | ట్యుటోరియల్ సారాంశం. |
07:02 | ఈ ట్యుటోరియల్ లో, merging, merging తీసివేయటం మరియు branches తొలగించడం గురించి మనము తెలుసుకున్నాము. |
07:09 | ఒక అసైన్మెంట్ గా, మునుపటి కార్యక్రమంలో మనం సృష్టించిన branch chapter-two యొక్క commits తనిఖీ చేయండి. |
07:16 | దానిని, master branch తో merge చేసి, chapter-2 శాఖను తొలగించండి. |
07:22 | ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. |
07:27 | దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
07:30 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
07:38 | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
07:41 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
07:48 | ఈ మిషన్ కి సంబంధించి మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
07:53 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్-వలి. మీకు ధన్యవాదాలు. |