PERL/C3/Exception-and-error-handling-in-PERL/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 16:30, 3 October 2017 by Yogananda.india (Talk | contribs)
|
|
00:01 | PERL లో Exception and error handling పై Spoken Tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము: Catch ఎర్రర్స్ మరియు exceptions నిర్వహణ గురించి నేర్చుకుంటాము. |
00:12 | ఈ ట్యుటోరియల్ కొరకు నేను: Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను. |
00:23 | మీరు మీకు నచ్చిన ఏ text editor ను అయిన ఉపయోగించవచ్చు. |
00:27 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు Perl ప్రోగ్రామింగ్ పై కొంత అవగాహన ఉండాలి. |
00:32 | ఒక వేళా లేకపోతే, సంభందిత Perl స్పోకన్ ట్యుటోరియల్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:39 | error సంభవించినప్పుడు, Exception handling సాధారణ అమలు మార్గము నుండి ఒక ప్రోగ్రాం అమలును విడదీస్తుంది. |
00:47 | Error handling application ని రద్దు చేయకుండా, ప్రోగ్రాం ను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. |
00:53 | మనము ఎన్నో విధాలుగా ఒక లోపాన్ని గుర్తించి, ట్రాప్ చేయవచ్చు. మనము Perl లో సాధారణంగా ఉపయోగించే కొన్ని పద్ధతులను చూద్దాం. |
01:01 | warn ఫంక్షన్ తరువాతి చర్య తీసుకోకుండా ఒక హెచ్చరిక సందేశాన్ని మాత్రమే ఇస్తుంది. |
01:07 | die ఫంక్షన్ తక్షణమే అమలును రద్దు చేస్తుంది మరియు error message ని ప్రదర్శిస్తుంది |
01:13 | నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి మనం die ఫంక్షన్ ను అర్థం చేసుకుందాం. |
01:20 | terminal కు వెళ్ళండి మరియు gedit die dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:29 | ఇది die.pl ఫైల్ లోని కోడ్. ఇప్పుడు మనం కోడ్ ను అర్ధం చేసుకుందాం |
01:35 | ఇక్కడ, మేము divide ఫంక్షన్ ను నిర్వచించాము ఇది రెండు ఆర్గ్యుమెంట్స్ ను తీసుకుంటుంది అనగా dollar numerator మరియు dollar denominator . |
01:46 | At the rate underscore (@_) అనే special variable parameter list ను ఫంక్షన్ కు పంపడానికి ఉపయోగిస్తారు. |
01:53 | ఒక వేళ denominator సున్నా అయితే, die ఫంక్షన్ స్క్రిప్ట్ ను వదిలివేస్తుంది. |
01:57 | ఇది యూజర్ చదవడానికి error message ను కూడా ప్రదర్శిస్తుంది. లేదా, ఇది అవుట్పుట్ ముద్రిస్తుంది. |
02:05 | ఇవి function call స్టేట్మెంట్ లు. |
02:08 | మొదటి రెండు సార్లు, ఫంక్షన్ అమలు అవుతుంది ఎందుకంటే రెండవ పరామితి సున్నా కాదు. |
02:15 | మూడోసారి, denominator విలువ సున్నా అవుతుంది. కాబట్టి, die ఫంక్షన్ అమలు అవుతుంది. |
02:23 | die ఫంక్షన్ స్క్రిప్ట్ ను విడిచిపెట్టినందున చివరి divide ఫంక్షన్ అమలుకాబడదు. |
02:29 | ప్రోగ్రాం ను save చేయడానికి Ctrl + S నొక్కండి. |
02:32 | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
02:35 | తిరిగి టెర్మినల్ కు మారండి మరియు perl die dot pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:43 | ఇక్కడ చూపిన విధంగా అవుట్పుట్ ప్రదర్శింపబడుతుంది.
Can t divide by zero! |
02:49 | ఇది మనం ప్రోగ్రాం లో, die స్టేట్మెంట్ లో ఇచ్చిన ఎర్రర్ సందేశం. |
02:54 | తరువాత, ఎర్రర్ నిర్వహణలో eval ఫంక్షన్ ను ఎలా ఉపయోగించాలో చూద్దాం. |
03:00 | eval ఫంక్షన్ ను run-time error లు లేదా exception లను నిర్వహించడానికి ఉపయోగిస్తారు. |
03:06 | ఉదాహరణకు, built-in error లు అంటే out of memory, divide by zero లేదా యూజర్ నిర్వచించిన ఎర్రర్ లు. |
03:14 | eval ఫంక్షన్ కు సాధారణ సింటాక్స్ ఇక్కడ చూపించబడింది. |
03:19 | dollar exclamation ($!) special variable ఏదైనా ఉంటే ఎర్రర్ సందేశాన్ని కలిగి ఉంటుంది. |
03:25 | లేకపోతే, dollar exclamation( $!) ఖాళి string ను కలిగి ఉంటుంది. అంటే అది false అని అర్ధం. |
03:33 | మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి eval ఫంక్షన్ ను అర్ధం చేసుకుందాం.
terminal కు వెళ్ళండి. |
03:40 | gedit eval dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. |
03:47 | eval dot pl ఫైల్ లో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.
ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి. |
03:54 | ఇక్కడ మన ఉదాహరణలో, ఒకవేళ open FILE “test.dat” ఫైల్ ను తెరవడంలో ఇబ్బంది పడుతుంటే ఇది die స్టేట్మెంట్ ను ప్రేరేపిస్తుంది. |
04:05 | Perl eval చివరి బ్లాక్ నుండి dollar exclamation( $!) వేరియబుల్ కు system error message ను ఇస్తుంది. |
04:13 | ఫైల్ save చేయడానికి Ctrl + S నొక్కండి. |
04:17 | తిరిగి టెర్మినల్ కు మారండి మరియు perl eval dot pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
04:25 | ఇక్కడ చుపడిన విధంగా సిస్టం ఎర్రర్ సందేశం ప్రదర్శింపబడుతుంది. |
04:30 | మనం మరొక ఉదాహరణను చూద్దాం.ఈ సారి మనం $@ ( dollar at the rate )ను ఉపయోగించి eval ఫంక్షన్ నుండి ఎర్రర్ సందేశం తిరిగి రావడాన్ని చూద్దాం. |
04:40 | మనం తిరిగి eval dot pl ఫైల్ కు మారుదాం. |
04:44 | స్క్రీన్ పై చూపబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. |
04:48 | మనం average ఫంక్షన్ కు $total , $count ను ఇన్పుట్ పారామితులుగా పంపుదాం. |
04:56 | count సున్నా అయితే మనం error ను పొందే అవకాశం ఉంటుంది. |
05:00 | ఇక్కడ, అది die స్టేట్మెంట్ తో నిర్వహించబడుతుంది. |
05:04 | eval నుండి రిటర్న్ అయిన ఎర్రర్ సందేశం $@ ( dollar at the rate) ఉపయోగించి ప్రదర్శించబడుతుంది. |
05:11 | లేదా, ఇది Average విలువను ముద్రిస్తుంది. |
05:15 | ఫైల్ ను save చేయడానికి Ctrl +S నొక్కండి. మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
05:22 | తిరిగి టెర్మినల్ కు మారండి మరియు perl eval.pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:31 | ఇక్కడ చూపబడిన విధంగా అవుట్పుట్ ఉంటుంది. |
05:35 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది.మనం సారాంశం చూద్దాం. |
05:41 | ఈ ట్యుటోరియల్ లో మనం ను ఎలా:
Catch errorsను మరియు exceptions ను నిర్వహించాలో నేర్చుకున్నాము. |
05:47 | అసైన్మెంట్ గా క్రింది వాటిని చేయండి.
మీ Linux మెషిన్ పై, 5 employee పేర్లతో emp.txt ఫైల్ ను సృష్టించండి. |
05:57 | Emp.txt అనుమతిని READ only కు మార్చండి. |
06:02 | గమనిక:సంబంధిత Linux స్పోకన్ ట్యుటోరియల్స్ change permission ఎంపిక కొరకు spoken tutorial పై వెబ్ సైట్ కు వెళ్ళండి. |
06:10 | emp.txt ఫైల్ ను WRITE మోడ్ లో తెరుచుటకు మరియు కొన్ని ఎంప్లాయ్ పేర్లను అందులో జోడించుటకు ఒక Perl ప్రోగ్రాం ను వ్రాయండి. |
06:19 | ఒకవేళ open/write కార్యకలాపాలు విఫలమైతే eval ను ఉపయోగించి సరైన ఎర్రర్ సందేశాన్ని ముద్రించండి. |
06:26 | క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి. |
06:33 | Spoken Tutorial ప్రాజెక్టు బృందం:
స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. |
06:42 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
06:46 | NMEICT,MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తున్నాయి. |
06:53 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది. |
06:58 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. |