Blender/C2/Types-of-Windows-Outliner/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:20, 19 September 2017 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:03 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్, Blender 2.59 లో Outliner window గురించి వివరిస్తుంది.
00:16 ఈ లిపి స్నేహ Deorukhkar మరియు Bhanu Prakash చే అందించబడి మరియు మోనిషా బెనర్జీ చే సవరించబడింది.
00:28 ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత మనము,
00:33 Outliner window గురించి,
00:36 Outliner window లో Eye, arrow మరియు camera icons గురించి మరియు
00:43 Outliner window లో display menu గురించి నేర్చుకుంటాము.
00:49 Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని నేను అనుకుంటాను.
00:54 లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Basic Description of the Blender Interface ను చూడండి.
01:03 Outliner అనేది బ్లెండర్లో data యొక్క ఒక flowchart జాబితా.
01:09 డిఫాల్ట్ గా, ఇది Blender Interface యొక్క ఎగువ కుడి మూలలో ఉంది.
01:15 అవుట్ లైనర్ విండో ను resize చేద్దాం.
01:20 దిగువ అంచుపై లెఫ్ట్ క్లిక్ చేసి, దాన్ని క్రిందికి లాగండి.
01:26 ఎడమఅంచున కూడా లెఫ్ట్ క్లిక్ చేసి ఎడమ వైపుకు లాగండి.
01:36 ఇప్పుడు Outliner windowలో ఉన్న ఎంపికలను మనం మరింత స్పష్టంగా చూడవచ్చు.
01:41 బ్లెండర్ విండోస్ ఎలా పునఃపరిమాణం చెయ్యాలో తెలుసుకోవడానికి , మన ట్యుటోరియల్-
01:47 How to Change Window Types in Blender ను చూడండి.
01:59 View పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
02:03 ఇక్కడ వివిధ ఎంపికలు ఉన్నాయి - అవి
02:06 Show Restriction Columns ,
02:09 Show Active ,
02:11 Show or Hide One level ,
02:14 Show Hierarchy ,
02:17 Duplicate area into New window మరియు Toggle full screen.
02:25 Show Restriction Columns ఎంపికను డియాక్టివేట్ చేయండి.
02:30 ఇది outliner విండో యొక్క కుడి మూలలో ఉన్న అన్ని వీక్షించదగిన, ఎంచుకోదగిన మరియు renderable ఎంపికలను దాచివేస్తుంది.
02:42 మళ్ళీ, View పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
02:46 వీక్షించదగిన, ఎంచుకోదగిన మరియు రెండర్ చేయదగిన ఎంపికలని చూచుటకు Show Restriction Columns ఎంపికను యాక్టివేట్ చేయండి.
02:56 Outliner windowలో Cube కు ఎడమ వైపున గల plus గుర్తు ను లెఫ్ట్ క్లిక్ చేయండి.
03:03 ఒక cascade జాబితా కనిపిస్తుంది.
03:05 ఇది ఎంచుకున్న object యొక్క లక్షణాల జాబితాను చూపుతుంది.
03:11 మనం వీటిని తరువాత ట్యుటోరియల్ లో వివరాలు చర్చించుకుంటాం.
03:16 Eye మీ ఆబ్జెక్ట్ ని 3D view లో చూపించవచ్చు లేదా దాచవచ్చు.
03:24 ఉదాహరణకు, cube యొక్క eye గుర్తు పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
03:29 cube ఇకపై 3D view లో కనిపించదు.
03:35 మళ్ళీ cube యొక్క eye గుర్తు పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
03:41 ఇప్పుడు, క్యూబ్ ను 3D- వ్యూలో చూడవచ్చు.
03:48 Arrow మీ objectను 3D- వ్యూలో ఎంచుకోదగినదిగా లేదా ఎంచుకోలేనిదిగా చేస్తుంది.
03:56 ఉదాహరణకు, cube యొక్క arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:02 3D-view లో cube రైట్ క్లిక్ చేయండి. ఇక క్యూబ్ ఎంచుకోబడదు.
04:10 మళ్ళీ, Outliner విండోలో క్యూబ్ యొక్క arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:17 3D-view లో cube పై రైట్ క్లిక్ చేయండి.
04:21 క్యూబ్ ఇప్పుడు ఎంపిక చేయబడుతుంది.
04:28 Camera మీ వస్తువును రెండర్ లేదా నాన్-రెండర్ చేయగలదు.
04:34 క్యూబ్ యొక్క Cameraపై లెఫ్ట్ క్లిక్ చేయండి.
04:38 దృశ్యాన్ని ప్రదర్శించడానికి మీ కీబోర్డ్ పై f12 ను నొక్కండి .
04:46 cube రెండర్లో కనిపించదు.
04:51 3D-view కు తిరిగి వెళ్ళడానికి మీ కీబోర్డ్ పై Esc కీ నొక్కండి.
04:56 మళ్ళీ, Outliner విండోలో క్యూబ్ యొక్క Camera పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
05:03 దృశ్యాన్ని ప్రదర్శించడానికి f12ను నొక్కండి.
05:09 ఇప్పుడు క్యూబ్ ను రెండర్ లో చూడవచ్చు.
05:15 3D-view కు తిరిగి వెళ్ళడానికి Esc నొక్కండి.
05:21 Outliner window లో Search bar పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
05:28 ఒకవేళ మీ scene బహుళ ఆబ్జెక్ట్ లు కలిగి ఉంటే, ఈ శోధన సాధనం scene లో ఒకేవిధమైన ఆబ్జెక్ట్ సమూహాలను లేదా ఒక నిర్దిష్ట ఆబ్జెక్ట్ ను ఫిల్టర్ చేయడానికి సహాయపడుతుంది.
05:40 Outliner window యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్నScene, మీ Blender scene నందు గల అబ్జక్ట్స్ మరియు వాటి సంబంధిత అంశాలలోని అన్ని మూలకాలను జాబితా గా చేస్తుంది.
05:51 All Scenes పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
05:55 ఈ డ్రాప్-డౌన్ జాబితా ఒక display menu .
05:59 ఇది Outliner panel కోసం ప్రదర్శన ఎంపికలను కలిగి ఉంటుంది.
06:04 Current Scene పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:08 మీరు Outliner windowలో జాబితా చేయబడిన ప్రస్తుత scene లో ఉన్న అన్ని వస్తువులను చూడవచ్చు.
06:18 ప్రదర్శన మెనుని తెరవడానికి Current Scene ను లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:26 Visible Layers పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:30 active లేయర్ లేదా లేయర్లలో ఉన్న అన్ని వస్తువులు Outliner window లో జాబితాగా చేయబడ్డాయి.
06:38 తరువాత ట్యుటోరియల్లో Layers గురించి మరింత వివరంగా తెలుసుకుంటాం.
06:44 డిస్ప్లే మెనూను తెరవడానికి Visible Layersపై లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:52 Selected పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
06:55 Outliner 3D-వ్యూలో ఎంపిక చేయబడిన ఆ వస్తువును మాత్రమే జాబితా చేస్తుంది.
07:04 ప్రదర్శన మెనుని తెరవడానికి Selected పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
07:09 Active పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
07:12 Outliner, 3D-view లో కేవలం, ఇటీవల ఎంచుకున్న వస్తువును మాత్రమే జాబితాగా చేస్తుంది.
07:22 display menuను తెరవడానికి Active పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
07:28 Same Types పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
07:31 పేరు సూచించినట్లుగా, Same Type ఎంపిక ఒకే వర్గానికి చెందిన అన్ని ఆబ్జక్టు లను Outliner window లో జాబితాగా చేస్తుంది.
07:41 ఉదాహరణకు, cube డిఫాల్ట్ గా 3D- వ్యూలో ఎంపిక చేయబడింది.
07:47 కాబట్టి Outliner, scene లో అన్ని mesh objectsను జాబితాగా చేస్తుంది.
07:51 ఈ సందర్భంలో, క్యూబ్ అనేది sceneలో ఒక mesh object మాత్రమే.
07:58 mesh objects గురించి మరింత వివరంగా బ్లెండర్ యొక్క ఆధునిక ట్యుటోరియల్, Animation లో గురించి తెలుసుకుందాం.
08:08 display menu ను తెరవడానికి Same Types పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
08:14 Groups, scene లోని అన్ని సమూహ వస్తువులను జాబితాగా చేస్తుంది.
08:20 ఇక్కడ కొన్ని ఇతర ఎంపికలు ఉన్నాయి, ఇవి మనం తరువాతి ట్యుటోరియల్స్ లో కవర్ చేస్తాము.
08:27 కాబట్టి, ఇది outliner window యొక్క విచ్ఛేదం.
08:32 బహుళ వస్తువులను కలిగి ఉన్న ఒక పెద్ద సీన్ తో పని చేస్తున్నప్పుడు, సీన్లో ఉన్న ప్రతి వస్తువును ట్రాక్ చేయడానికి Outliner విండో సాధనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
08:45 ఇప్పుడు, కొత్త ఫైలును సృష్టించి, Outliner లో ఎంపిక చేయబడిన వాటిని జాబితా గా చేసి, క్యూబ్ ని అన్ రెండబుల్ చేయండి.
08:58 ఈ ట్యుటోరియల్ Project Oscar ద్వారా సృష్టించబడింది మరియు NMEICT ద్వారా మద్దత్తు చేయబడింది.
09:07 దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది
09:12 oscar.iitb.ac.in and spoken-tutorial.org/NMEICT-Intro.
09:28 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్:
09:30 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
09:34 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది.
09:38 మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org
09:45 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india