Blender/C2/Installation-Process-for-Windows/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:59, 18 September 2017 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:04 Blender ట్యుటోరియల్స్ సిరీస్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ blender 2.59 ను Windows Operating System పై ఎలా ఇన్స్టాల్ మరియు run చేయాలి అనే దాని గురించి ఉంటుంది.
00:21 ఈ ట్యుటోరియల్ కోసం, నేను Windows XP operating system ను ఉపయోగించుచున్నాను.
00:28 ఈ లిపిChirag Raman అందించారు మరియు Monisha Banerjee చే సవరించబడింది.
00:37 మీ ఇంటర్నెట్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి. నేను Firefox 3.09 ఉపయోగిస్తున్నాను. address bar లో www.blender.org అని టైప్ చేసి, Enter key ను నొక్కండి.
00:54 ఇది మిమ్మల్ని అధికారిక Blender వెబ్ సైట్ లోనికి తీసుకెళ్తుంది.
01:01 Blender అనేది ఉచితం మరియు open source .
01:05 installer లేదా source code ను బ్లెండర్ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి.
01:10 ఇక్కడ Download బ్లెండర్ link, page లో header కు కుడి వైపున క్రిందన ఉంటుంది.
01:15 మనం ఈ లింకుపై క్లిక్ చేసి, డౌన్ లోడ్ page కు తీసుకు వెళ్ళుతుంది.
01:22 మీరు గమనిస్తే, ఇది బ్లెండర్ యొక్క తాజా స్థిరమైన వెర్షన్.
01:28 ఇక్కడ మీకు రెండు ఎంపికలు ఉన్నాయి - 32 bit లేదా 64 bit installer .
01:39 మీరు మీ కంప్యూటర్ కి వర్తించే దానిపై ఆధారపడి, ఏదైనా ఒక దానిని డౌన్లోడ్ చేసుకొనవచ్చు.
01:44 32-BITమరియు 64-BIT సిస్టంల గురించి అర్థం చేసుకోవడానికి, మా ట్యుటోరియల్ Blender Hardware Requirements ను చూడండి.
01:56 వెబ్ సైట్ జిప్ గల బ్లెండర్ ప్రోగ్రామ్ ఫైళ్ళ ను కూడా అందిస్తుంది.
02:01 ఈ ఆర్కైవ్ బ్లెండర్ ను run చేయడానికి అవసరమైన అన్ని ఫైళ్ళను కలిగి ఉంటుంది.
02:06 మీరు మీ ఎంపిక యొక్క ఫోల్డర్ కు ఫైళ్ళను unzi మరియు extract చేసి, బ్లెండర్ ఎక్జిక్యూటబుల్ కు అమలు చేయండి.
02:15 నన్ను ప్రదర్శించనివ్వండి.
02:17 installer మరియు archive కు మధ్య ప్రధాన తేడా ఏమిటంటే,
02:22 installer Blender application files ను C DRIVE > Program Files లో ఉంచుతుంది మరియు start మెను లో ఐకాన్ ను సెట్ అప్ చేస్తుంది,
02:31 డెస్క్ టాప్ పై ఉన్న icon , .blend ఫైళ్ళను అప్రమేయంగా blender తో తెరుస్తుంది.
02:40 zip archive అన్ని application files కలిగి ఉంటుంది మరియు ఎగ్జిక్యూటబుల్ కావలసిన బ్లెండర్ ఫైళ్ళను ఒక్క ఫోల్డర్ లో ఉంచుతుంది
02:48 ఇది కంప్యూటర్ లో ఏదైనా drive కు కాపీ చేయబడుతుంది.
02:53 ఇప్పుడు, నేను నా మెషిన్ కోసం archiveను ఉపయోగించాలనుకుంటే, నాకు 32-Bit archive అవసరం.
03:02 32-Bit ఆర్కైవ్ కోసం download link పై లెఫ్ట్ క్లిక్ చేయండి మరియు డౌన్ లోడ్ మొదలవుతుంది.
03:09 నేను ముందు చెప్పినట్లుగా, నా ఇంటర్నెట్ బ్రౌజర్ Firefox 3.09.
03:16 ఇక్కడ చూపిన డౌన్లోడ్ దశలు అన్ని ఇతర ఇంటర్నెట్ బ్రౌజర్లలోనూ అలాగే ఉంటాయి.
03:23 మీరు ఇక్కడ download పురోగతి ను చూడవచ్చు.
03:26 నిలువు ఆకుపచ్చ స్ట్రిప్స్ తో ఉన్న ఈ సమాంతర డౌన్లోడ్ బార్ డౌన్ లోడ్ ఎంత జరిగింది అనేదాన్ని చూపుతుంది.
03:44 డౌన్ లోడ్ వేగం మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఫై ఆధారపడి ఉంటుంది.
03:48 దయచేసి ఇది పూర్తి అయ్యే వరకు వేచి ఉండండి.
04:02 archive ను extract చేయుటకు, మొదటగా download పై రైట్ క్లిక్ చేయండి.


04:08 Open containing folder పై లెఫ్ట్ క్లిక్ చేయండి. zip పై లెఫ్ట్ డబుల్ క్లిక్ చేయండి.
04:16 ఇది విండోస్ లో డిఫాల్ట్ ఆ వ్యవస్థాపించబడిన Winzip లాంటి archiver తో తెరుచుకుంటుంది
04:24 Extract పై లెఫ్ట్ క్లిక్ చేయండి. జాబితా నుండి మీ గమ్యపు ఫోల్డర్ ను ఎంచుకోండి.
04:32 నేను My Documents కు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. లెఫ్ట్ క్లిక్ తరువాత Extract .
04:40 ఈ ఆకుపచ్చ స్ట్రిప్స్ తో ఉన్న పురోగతి బార్ ఎంత వరకు ఎక్స్ట్రాక్ట్ జరిగిందో చూపిస్తుంది.
04:56 ఇప్పుడు, మీరు మీ screen పై ఎక్స్ట్రాక్ట్ అయిన ఫోల్డర్ ను చూడవచ్చు.
05:00 ఫోల్డర్ ను తెరవడానికి డబుల్ లెఫ్ట్ క్లిక్ చేయండి. Blender executable ను డబుల్ లెఫ్ట్ క్లిక్ చేయండి.
05:08 Windows ఒక security warning - The publisher could not be verified ను చూపిస్తుంది.
05:14 దీని గురించి ఆందోళన ఏమీ లేదు. Run బటన్ పై క్లిక్ చేయండి. మీరు మంచిగా వెళ్ళవచ్చు.
05:27 ఇప్పుడు, మీరు installer ఉపయోగించాలనుకుంటే, బ్లెండర్ వెబ్ సైట్ కు తిరిగి వెళ్దాం.
05:35 పేజీకి ఎగువన ఉన్న Download పై క్లిక్ చేయండి. ఇది మనల్నిడౌన్ లోడ్ పేజీకి తిరిగి తీసుకెళ్తుంది.
05:44 నా మెషిన్ కు,నాకు 32-Bit installer అవసరం.
05:48 కాబట్టి, నేను 32-Bit Installer కోసం డౌన్ లోడ్ లింక్ పై డబల్ క్లిక్ చేస్తాను. డౌన్ లోడ్ మొదలవుతుంది.
06:03 ప్రదర్శన సౌలభ్యం కోసం, నేను ఇప్పటికే బ్లెండర్ వెబ్ సైట్ నుండి నా మెషిన్ లోకి installer ను డౌన్లోడ్ చేసాను.
06:11 ఇప్పుడు నేను మీకు ఇన్స్టాలేషన్ దశలను చూపిస్తాను. Left double click చేసి, installer పై క్లిక్ చేయండి.
06:22 Windows ఒక security warning - The publisher could not be verified ను చూపిస్తుంది.
06:29 దీని గురించి ఆందోళన ఏమీ లేదు. Run బటన్ పై క్లిక్ చేయండి.
06:35 కాబట్టి, ఇది Blender Setup Wizard కనిపించే విధానం.
06:39 ఇక్కడ, మీరు ఇన్స్టాలేషన్ ప్రక్రియ లో తదుపరి దశకు వెళ్ళడానికి, Next పై క్లిక్ చేయండి.
06:48 చాలా సాఫ్ట్ వేర్ ల మాదిరిగా, ఇన్స్టాలర్ ఒక License Agreement ను చూపిస్తుంది.
06:53 మిగిలిన agreement ను చూడడానికి Page Down ను నొక్కండి.
07:07 నేనైతే మీకు దీనిని క్షుణ్ణంగా చదవమని సలహా ఇస్తాను.
07:11 బ్లెండర్ ఉచితం మరియు open source అని గుర్తుంచుకోండి.
07:14 మీరు బ్లెండర్ ను ఇన్స్టాల్ చేయడానికి ఈ License Agreement అంగీకరించాలి.
07:21 ఇప్పుడు, కొనసాగడానికి I agree బటన్ పై క్లిక్ చేయండి .
07:27 ఈ తదుపరి దశ ఇన్స్టాల్ చేయుటకు, భాగాల ఎంపికకు మీకు అనుమతినిస్తుంది.
07:32 నేనైతే డిఫాల్ట్ గా ఎంచుకున్న భాగాలు ఇంస్టాల్ చేసుకోమని సలహా ఇస్తాను మరియు ఇన్స్టలేషన్ కొనసాగించడానికి Next బటన్ పై క్లిక్ చేయండి.
07:41 కాబట్టి, ఇక్కడ మీకు ఇన్స్టాల్ బ్లెండర్ కోసం స్థానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది.
07:48 అప్రమేయంగా, Program Files ఫోల్డర్ ఎంచుకోబడింది
07:51 బ్లెండర్ ను ఇన్స్టాల్ చేయడానికి ఇది మంచి ప్రదేశం. కాబట్టి, ముందుకు వెళ్లి Install బటన్ ను నొక్కండి.
08:04 ఆకుపచ్చ స్ట్రిప్స తో ఉన్న ఈ పురోగతి పట్టీ ఎంతవరకు ఇన్స్టాల్ పూర్తయిందో చూపిస్తుంది.
08:10 సాధారణంగా ఇది పూర్తి కావడానికి ఒక నిమిషం కన్నా తక్కువ సమయం పడుతుంది.
08:33 ఇది Blender Setup ను పూర్తి చేస్తుంది.
08:36 బ్లెండర్ మీ మెషిన్ పై ఇన్స్టాల్ చేయబడింది.
08:39 Run Blender చెక్-బాక్స్ ఎంపిక చేసుకోండి.
08:42 Finish బటన్ నొక్కండి.
08:45 బ్లెండర్ ఆటోమేటిక్ గా రన్ చేయడాన్ని ప్రారంభించాలి
08:52 అందించిన Blender binary అసలు సంగ్రహిత డైరెక్టరీలో ఉంది.
08:57 బ్లెండర్ అదనపు ఆధారాల లేకుండా నేరుగా బాక్స్ నుండి run అవుతుంది.
09:03 ఏ system library లేదా system preferences మార్చబడలేదు.
09:10 కాబట్టి, ఈ ట్యుటోరియల్ లో, Blender ను Windows operating system పై ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకున్నాము.
09:19 ఇప్పుడు, బ్లెండర్ వెబ్ సైట్ నుండి బ్లెండర్ ను డౌన్ లోడ్ చేసేందుకు ప్రయత్నించండి మరియు మీ మెషీన్లో బ్లెండర్ ను ఇన్స్టాల్ చేయండి.
09:28 ఈ ట్యుటోరియల్ Project Oscar చే,నమె ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది.
09:37 దీని గురించి మరింత సమాచారం కింది లింకు వద్ద లభిస్తుంది.
09:45 Oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro .
09:55 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది;
10:01 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను కూడా అందిస్తుంది.
10:06 మరిన్ని వివరాల కోసం దయచేసి సంప్రదించండి: contact@spoken-tutorial.org .
10:13 మాకు సహకరించినందుకు ధన్యవాదాలు
10:16 మరియు ఇది నాగూర్ వలి, signing off.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india