BASH/C2/Nested-and-multilevel-if-elsif-statements/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 11:57, 14 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Time | Narration |
00:00 | ప్రియమైన స్నేహితులారా, BASH లోని Nested and multilevel if statement పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:09 | ఈ ట్యుటోరియల్ లో మనం: |
00:12 | Nested if-else మరియు |
00:14 | Multilevel if-else statement గురించి నేర్చుకుంటాము. |
00:17 | దీనిని మనం కొన్ని ఉదాహారణలతో చేస్తాము. |
00:22 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:28 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:35 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
00:38 | Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టమ్ మరియు |
00:42 | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను. |
00:46 | దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పైవి అభ్యాసానికి ఉపయోగించండి. |
00:52 | మనం Nested if-else statementయొక్క ప్రవాహాన్ని అర్ధం చేసుకుందాం. |
00:57 | ఇక్కడ, ఒకవేళ condition 1 True అయితే అప్పుడు condition 2 ముల్యాంకం అవుతుంది, |
01:04 | ఒకవేళ condition2 True అయితే అప్పుడు statement 1 అమలు అవుతుంది. |
01:10 | దాని అర్ధం, conditions 1 మరియు 2 లు True అయినప్పుడు మాత్రమే statement 1 అమలు అవుతుంది. |
01:19 | ఒకవేళా condition1 False, అయితే అప్పుడు statement 3 అమలు అవుతుంది. |
01:25 | మరియు, ఒకవేళ condition 2 False అయితే అప్పుడు statement 2 అమలు అవుతుంది. |
01:31 | ఒక ఉదాహరణను చూద్దాం. |
01:33 | నేను కోడ్ ను ఫైల్ nestedifelse.sh లో రాసాను. |
01:38 | నేను దానిని తెరుస్తాను. |
01:40 | ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి. |
01:43 | ఇది shebang line. |
01:45 | వేరియబుల్ NAME విలువ anushaను కేటాయిస్తుంది. |
01:50 | వేరియబుల్ PASSWORD విలువ "abc123" ను కేటాయిస్తుంది. |
01:56 | ' read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది. |
02:02 | '- (hyphen) p' flag prompt ను ప్రదర్శిస్తుంది. |
02:05 | - (హైఫన్) p తరువాత string,“Enter name:” terminal పై ప్రదర్శించబడుతుంది. |
02:11 | myname యూజర్ ద్వారా ఎంటర్ చేస్తున్న టెక్స్ట్ ను నిల్వ చేసే వేరియబుల్ అంటే యూజర్ ఇన్ పుట్. |
02:18 | మొదటి if స్టేట్మెంట్ రెండు వేరియబుల్స్ myname మరియు NAME ను పోల్చుతుంది |
02:24 | యూజర్ ఇన్ పుట్ మరియు వేరియబుల్ Name ' లో నిల్వ చేయబడిన విలువ అనగా "Anusha". |
02:31 | ఒకవేళ రెండు విలువలు సమానమైతే అప్పుడు ఈ bif స్టేట్మెంట్ లోని కోడ్ విశ్లేషించబడుతుంది. |
02:38 | read కమాండ్ వేరియబుల్ mypassword లో ఎంటర్ చేసిన పాస్ వర్డ్ ను చదువుతుంది మరియు నిల్వ చేస్తుంది. |
02:46 | ఇక్కడ, '- (hyphen) s' flag silent mode కోసం. |
02:49 | దీని అర్థం, యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ terminal పై ప్రదర్శించబడదు. |
02:56 | ఇక్కడ, మనకు మరొక if-else statements ల సముదాయం ఉంది. |
02:59 | ఈ if-else statements యొక్క సముదాయం మొదటి if లో ఉంది. |
03:05 | రెండవ if స్టేట్మెంట్ వేరియబుల్స్ mypassword మరియు PASSWORDలను పోల్చుతుంది. |
03:12 | if condition True అయినపుడు terminal పైన “Welcome” అనే సందేశాన్ని echo ప్రదర్శిస్తుంది. |
03:18 | అంటే పాస్ వర్డ్ మ్యాచ్ అయింది. |
03:21 | '-e' backslash escape యొక్క వ్యాఖ్యానాన్ని ఇస్తుంది. |
03:27 | '\n' అంటే new line అని అర్ధం అంటే స్ట్రింగ్ Welcome” కొత్త లైన్ పై ముద్రించబడుతుంది. |
03:35 | ఎప్పుడు అయితే if కండిషన్ True కాదో అప్పుడు else కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది |
03:42 | అంటే పాస్ వర్డ్ మ్యాచ్ కానప్పుడు else కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. |
03:48 | ఈ కేసు లో echo “Wrong password” ను ప్రదర్శిస్తుంది. |
03:53 | fi లోపలి if-else స్టేట్మెంట్ ను ముగిస్తుంది. |
03:57 | మన మొదటి if-else statement- కు వెళ్ళండి |
04:01 | ఒకవేళ myname మరియుNAME లోని విలువలు సరిపోలేక పోతే అప్పుడు ఈelse 'స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. |
04:09 | terminal పై ఈ echo సందేశం “Wrong Name” అవుతుంది. |
04:14 | fi బయటి if-else స్టేట్మెంట్ ను ముగిస్తుంది. |
04:18 | ఇప్పుడు, మీ కీబోర్డ్ లో ctrl+alt' మరియు t కీ లను ఏకకాలంలో నొక్కడం ద్వారాterminal window ని తెరవవచ్చు. |
04:27 | అమలు చేయడానికి ఫైల్ ని చేయండి. |
04:29 | chmod space plus x space nestedifelse.sh అని టైప్ చేయండి |
04:38 | dot slash nestedifelse.sh అని టైప్ చేయండి. |
04:43 | ప్రోగ్రామ్ రెండు కండిషన్ లను వెరిఫై చేస్తుంది |
04:46 | అవి Name మరియు Password |
04:48 | అది terminal పై ఎగ్జిక్యూట్ చేయబడినప్పుడు. |
04:52 | ఇక్కడ prompt Enter Name ను ప్రదర్శిస్తుంది |
04:55 | "anusha" అని టైప్ చేద్దాం. |
04:57 | ఈ condition True అవగానే, తరువాతి if కండిషన్ అమలుచేయబడుతుంది. |
05:02 | ఇప్పుడు prompt Password అని చేప్తుంది. |
05:05 | నేను పాస్ వర్డ్ "abc123" ను టైప్ చేస్తాను. |
05:10 | వేరియబుల్ PASSWORD లోని విలువతో పాస్ వర్డ్ సరిపోతుంది. |
05:15 | కాబట్టి ప్రాంప్ట్ Welcome సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
05:19 | ఇప్పుడు script ని మళ్ళి అమలు చేద్దాం. |
05:21 | 'up-arrow' కీ ను నొక్కండి. |
05:24 | dot slash nestedifelse.sh కు వెళ్ళండి |
05:29 | Enter నొక్కండి. |
05:31 | ఈ సమయంలో, మేము అదే పేరును వేరే పాస్వర్డ్ తో ఎంటర్ చేస్తాము. |
05:37 | కాబట్టి నేను "anusha" ను పేరు గా మరియు "123" ని పాస్ వర్డ్ గా ఎంటర్ చేస్తాను. |
05:44 | name విలువలు సరిపోలతాయి కానీ password విలువలు సరిపోలవు. |
05:49 | కాబట్టి, సందేశo Wrong password ప్రదర్శించబడుతుంది. |
05:53 | మొదటి if statement లోని nested else statement అమలు అయిందని ఇది రుజువు చేస్తుంది. |
06:01 | మళ్ళి ఒకసారి script ని execute చేద్దాం. |
06:04 | ఈ సారి మేము "swati" ను పేరుగా ఇస్తాము. |
06:08 | సందేశo “Wrong name” గా 'ప్రదర్శించబడుతుంది. |
06:12 | ఇది ఎందుకంటే "swati" పేరు గతంలో ప్రకటించిన విలువ "anusha" తో సరిపోయేలా లేదు. |
06:19 | మొదటి if స్టేట్మెంట్ యొక్క control బయటకు వస్తుంది మరియు else స్టేట్మెంట్ ను అమలు చేస్తుంది. |
06:25 | ఇది Wrong name అనే సందేశాన్ని ముద్రిస్తుంది. |
06:29 | ఇప్పుడు మనం multilevel if-else statement ను చుద్ద్దాం. |
06:34 | ఒకవేళ condition 1 True అయితే అప్పుడు statement1 అమలు అవుతుంది, |
06:40 | ఒకవేళ condition1 False అయితే అప్పుడు condition 2 ముల్యాంకం అవుతుంది. |
06:46 | ఒకవేళ condition2 True అయితే అప్పుడు statement 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. |
06:52 | మరియు ఒకవేళ condition 2 False అయితే అప్పుడు condition N ముల్యాంకం అవుతుంది. |
06:58 | ఒకవేళ condition N True అయితే అప్పుడు statement N అమలు అవుతుంది. |
07:03 | మరియు ఒకవేళ condition N false అయితే అప్పుడు statement X అమలు అవుతుంది. |
07:10 | ఒక ఉదాహరణని చూద్దాం. |
07:12 | నా దగ్గర ఒక ఉదాహరణ ఉంది. |
07:14 | నేను దానిని తెరుస్తాను. గమనిక multilevel hyphen ifelse dot sh మన ఫైల్ పేరు. |
07:23 | కోడ్ ద్వారా వెళ్లదామ్. |
07:25 | ఇది shebang line. |
07:27 | mystring అనేది ఒక వేరియబుల్ ఇది అమలుచేసే సమయంలో వర్డ్, యూజర్ ద్వారా ఇచ్చిన ఇన్పుట్ లను నిల్వ చేస్తుంది. |
07:34 | ఇన్ ఫుట్ స్ట్రింగ్ null అవునా కాదా అని if కండిషన్ తనిఖీ చేస్తుంది. |
07:39 | '- (hyphen) z' string యొక్క పొడవు zero అవునా కాదా అని తనిఖీ చేస్తుంది. |
07:44 | terminal పై man test అని టైప్ చేయండి మరియు వివిధ string పోలికలను అన్వేషించండి. |
07:51 | ఒకవేళ ఏమీ ఎంటర్ చేయకపోతే ఈ echo స్టేట్మెంట్ ముద్రించబడుతుంది. |
07:56 | మొదటి elif' కండిషన్ input string "raj"ను కలిగి ఉందో లేదో తనిఖీ చేస్తుంది. |
08:03 | అది ఉంటే అప్పుడు ఈ echo స్టేట్మెంట్ లో ప్రింట్ చేయబడుతుంది. |
08:08 | wildcard character దానిలో "raj" తో ఏదైనా పదం గుర్తించబడుతుందని అని నిర్ధారిస్తుంది. |
08:15 | తరువాతి elif' కండిషన్ input string "jit" ను కలిగి ఉందో లేదో తనిఖీ చేస్తుంది. |
08:22 | అది ఉంటే అప్పుడు ఈ echo ను స్టేట్మెంట్ ప్రింట్ చేయబడుతుంది. |
08:27 | పైన అన్ని కండిషన్ లు విఫలం అయినప్పుడు else కండిషన్ అమలు అవుతుంది. |
08:33 | మరియు ఇది ఈ సందేశాన్ని ప్రదర్శిస్తుంది Sorry! Input does not contain either 'raj' or 'jit'. |
08:41 | fi multilevel if-else స్టేట్మెంట్ యొక్క ముగింపును సూచిస్తుంది. |
08:46 | ప్రోగ్రామ్ ని execute చేద్దాం. |
08:48 | తిరిగి మన terminalకు వెళ్ళండి. |
08:51 | chmod space plus x space multilevel hyphen ifelse dot sh అనిటైప్ చేయండి |
09:00 | dot slash multilevel hyphen ifelse dot sh అనిటైప్ చేయండి |
09:06 | ఇన్ ఫుట్ కొరకు మనం ప్రాంప్ట్ ని చేద్దాం. |
09:09 | వేర్వేరు ఇన్ ఫుట్ లను ఇవ్వండి మరియు ప్రతి సారి ఏమి జరుగుతుందో చూద్దాం. |
09:14 | మొదట ఏది టైప్ చేయకుండానే 'Enter' నొక్కండి. |
09:19 | సందేశం Nothing was Entered ప్రదర్శించబడింది. |
09:22 | మరియు control multilevel if-else statement నుంచి వస్తుంది. |
09:28 | నన్నుprompt ని క్లియర్ చేయనివ్వండి. |
09:30 | మనం వేరొక ఇన్ ఫుట్ తో స్క్రిప్ట్ ను అమలు చేయడానికి ప్రయత్నిద్దాం. |
09:34 | 'up-arrow' కీ ని నొక్కండి. |
09:36 | dot slash multilevel hyphen ifelse dot sh కు వెళ్ళండి. |
09:41 | Enter నొక్కండి. |
09:43 | ప్రాంప్ట్ "Enter a Word" ను ప్రదర్శిస్తుంది. |
09:45 | నేను "abhijit" అని టైప్ చేస్తాను. |
09:48 | ప్రదర్శించబడిన అవుట్పుట్: “abhijit" 'jit'' అనే పదాన్ని కలిగి ఉంది. |
09:53 | ఇది మన కోడ్ లో control మూడవ condition కు ప్రవహించిందని చూపిస్తుంది. |
09:59 | మొదటి రెండు కండిషన్ లు సరిపోయేలా లేదు. |
10:03 | ఇదే లాజిక్ అన్ని కండిషన్ లకు వర్తిస్తుంది. |
10:07 | వేర్వేరు ఇన్పుట్లతో ప్రోగ్రామ్ ను అమలు చేసి, ఫలితాలను తనిఖీ చేయండి. |
10:13 | సారాంశం చేద్దాం. |
10:15 | ఈ ట్యుటోరియల్ లో మనం |
10:18 | Nested if-else : Name మరియు Password తో వెరిఫై చేయడం మరియు |
10:23 | Multilevel if-else: String comparison ప్రోగ్రామ్ ల ఉపయోగం గురించి నేర్చుకున్నాం. |
10:28 | ఒక అసైన్మెంట్ గా, సంఖ్య ఇలా ఉన్నప్పుడు వేర్వేరు సందేశాలను అవుట్ ఫుట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి. |
10:34 | 3 కంటే ఎక్కువ 3 కంటే తక్కువ |
10:37 | లేదా 3 కు సమానం |
10:39 | లేదా యూజర్ ఇన్ ఫుట్ ఖాళీగా ఉన్నప్పుడు. |
10:42 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
10:45 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సంక్షిప్తీకరిస్తుంది. |
10:48 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
10:53 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: |
10:55 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
10:58 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
11:02 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
11:09 | Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacherప్రాజెక్ట్ లో భాగం. |
11:13 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
11:20 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
11:26 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
11:31 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మీకు ధన్యవాదాలు. |