Blender/C2/Camera-View-Settings/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 11:04, 14 September 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:07 | Blender tutorials సిరీస్ కు స్వాగతం. |
00:11 | ఈ ట్యుటోరియల్ లో Navigation-Camera view గురించి నేర్చుకుందాము. |
00:16 | Blender 2.59 లో కెమెరా ను ఎలా నావిగేట్ చేయాలో నేర్చుకుందాం. |
00:21 | ఈ లిపిని Chirag Raman అందించారు మరియు Monisha Banerjee చే సవరించబడింది. |
00:30 | ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, |
00:32 | కొత్త camera view ను పొందడానికి కెమెరా యొక్క స్థానాన్ని మార్చడం ఎలాగో నేర్చుకుంటాము. |
00:38 | camera view ను roll,pan,dolly మరియు track చేయడం ఎలాగో నేర్చుకుంటాము. |
00:43 | fly మోడ్ ఉపయోగించి ఒక కొత్త కెమెరా వ్యూను ఎలా ఎంచుకోవాలో కూడా నేర్చుకుంటాము. |
00:50 | మీ కంప్యూటరులో బ్లెండర్ ను ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు తెలిసుంటుందని నేను భావిస్తున్నాను. |
00:54 | ఒకవేళ తెలియకపోతే, దయచేసి Installing Blender ట్యుటోరియల్ ను రిఫర్ చేయండి. |
01:02 | డిఫాల్ట్ గా బ్లెండర్ తెరుచుకున్నపుడు 3D view అనునది User Perspective view లో ఉంటుంది. |
01:11 | ఇప్పుడు కెమెరా వ్యూ కు వెళ్దాము. |
01:15 | 3D panel దిగువ ఎడమ మూలలో ఉన్న View tab కు వెళ్ళండి. |
01:21 | menu నుండి Camera పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
01:25 | కీ బోర్డు shortcut కోసం numpad 0 ను నొక్కండి. |
01:29 | ఒక వేళ మీరు లాప్ టాప్ ను ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా రూపాంతరం చేసి అనుకరించాలి. |
01:36 | numpad ను ఏ విధంగా రూపాంతరంచేసి అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి. |
01:45 | ఇది Camera View. |
01:49 | ఆక్టివ్ కెమెరా వ్యూ ను డాటెడ్ బాక్స్ ఫీల్డ్ లో చూపుతాము. |
01:55 | ఈ డాటెడ్ బాక్స్ లో ని అన్ని ఆబ్జెక్ట్ లు అన్వయించబడతాయి. |
02:01 | తరువాత ట్యుటోరియల్ లో రెండర్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుంటాము. |
02:05 | బ్లెండర్ ఆక్టివ్ కెమెరా యొక్క స్థానాన్ని మరియు ఓరియంట్ ను, మీ ప్రస్తుత view point కు మ్యాచ్ చేసే అవకాశం ను ఇస్తుంది. |
02:11 | దీనిని ఎలా చేయాలో తెలుసుకుందాము. |
02:15 | perspective view కు తిరిగి వెళ్ళడానికి Numpad నుండి జీరో ను నొక్కండి. |
02:20 | కెమెరా వ్యూ నుండి మరియు స్విచ్ అవడానికి షార్ట్ కట్ numpad జీరో అనునది toggle గా మీరు చూడవచ్చు. |
02:26 | mouse wheel లేదా MMB (middle mouse button) ను పట్టుకొని ఉంచండి మరియు కెమెరా ను ఉంచాలనుకునే స్థలం కు మౌస్ ని కదిపి తిప్పండి. |
02:36 | నేను, ఈ లొకేషన్ ను ఎంచుకున్నాను. |
02:40 | Control, Alt & Num-Pad zero ను నొక్కండి. |
02:46 | కెమెరా కొత్త స్థానానికి కదులుతుంది |
02:49 | అదే సమయంలో 3D view camera view కు మారుతుంది. |
02:54 | కెమెరా లో rolling,panning,tracking మొదలగు సంచార చర్యలు నిర్వహించడానికి కూడా బ్లెండర్ మీకు అనుమతిస్తుంది. |
03:03 | ఇప్పుడు మనం వీటిని చూద్దాం. |
03:05 | కెమెరా ను ఎంచుకోవడానికి డాటెడ్ బాక్స్ పైన రైట్-క్లిక్ చేయండి. |
03:10 | ఇప్పటి నుండి మీరు ఇతర object ల ను మార్చువిధంగా కెమెరా ను కూడా manipulate చేయవచ్చు. |
03:17 | ఈ చర్యలు నిర్వహించడానికి మీరు camera view లో ఉండాల్సిన అవసరం ఉంటుందని గమనించండి. |
03:22 | మొదటి చర్యగా మనం కెమెరా వీక్షణ ను roll చేయడం చూస్తాము. |
03:26 | object rotation mode కు ప్రవేశించడానికి మీ కీ బోర్డ్ పై R ను నొక్కండి. |
03:32 | ఇప్పుడు, మీ mouse ను ఎడమ నుండి కుడికి మరియు పై నుండి కిందికి కదపండి. |
03:42 | డిఫాల్ట్ గా ఇది కెమెరాను దాని స్థానిక z- అక్షంలో,అనగా కెమెరా వ్యూ లోనికి వెళ్ళే లేదా బయటకు వచ్చే అక్షం చుట్టూ తిప్పుతుంది. |
03:53 | చర్యను రద్దు చేయడానికి స్క్రీన్ పై రైట్ క్లిక్ చేయండి లేదా కీ బోర్డ్ పై Esc ను నొక్కండి. |
03:58 | ఇది మిమ్మల్ని మీ మునుపటి కెమెరా వ్యూ కు తీసుకెళ్తుంది. |
04:04 | ఇప్పుడు, మనము చూసే తదుపరి చర్య panning కెమెరా వీక్షణ. |
04:09 | Panning 2 దిశలలో ఉంటుంది - ఎడమ నుండి కుడికి లేదా పైకి నుండి క్రిందికి. |
04:15 | Rను నొక్కి object rotation mode కు ప్రవేశించండి. తరువాత X ను రెండుసార్లు నొక్కండి. |
04:22 | మొదటి X, rotation ను global X-axis కు లాక్ చేస్తుంది. |
04:26 | రెండవ X భ్రమణాన్ని local X-axis కు లాక్ చేస్తుంది. |
04:31 | global మరియు local ట్రాన్స్‌ఫార్మ్ యాక్సిస్ వివరాల గురించి తదుపరి ట్యుటోరియల్స్ చర్చించుకుందాం.</p> |
04:38 | ఇప్పుడు mouse ను పైకి మరియు క్రిందికి కదిలించండి. |
04:42 | Camera view పైకి మరియు క్రిందికి కదులుతుంది. |
04:47 | ఇప్పుడు, Y ను రెండుసార్లు నొక్కండి. |
04:51 | మొదటి Y రొటేషన్ ని global y axis కు లాక్ చేస్తుంది. |
04:56 | రెండవ y రొటేషన్ ని local y axis కు లాక్ చేస్తుంది. |
05:00 | ఇప్పుడు, mouse ను ఎడమ నుండి కుడికి కదిలించండి. |
05:05 | Camera view ఎడమ నుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకి కదులుతుంది. |
05:12 | కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి రైట్-క్లిక్ చేయండి. |
05:16 | తరువాత, మనం కెమెరా వీక్షణను dolly చేద్దాం. దీనిని చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. |
05:21 | మొదటది, కెమెరాను పట్టుకోడానికి G ని నొక్కండి. |
05:25 | Mouse wheel లేదా MMB పట్టుకొని ఉంచి, mouse ను పైకి క్రిందికి కదిలించండి. |
05:43 | రెండవ మార్గం, మీరు కెమెరాను దాని local z axis పాటు తరలించవచ్చు. G ను నొక్కండి. |
05:53 | తరువాత local z axis కు కెమెరాను లాక్ చేయడానికి రెండుసార్లు Z ను నొక్కండి. |
05:59 | ఇప్పుడు, mouse ను పైకి మరియు క్రిందికి కదిలిస్తే అదే ప్రభావాన్ని ఇస్తుంది. |
06:11 | కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి రైట్-క్లిక్ చేయండి. |
06:15 | కుడి నుండి ఎడమకు లేదా పైకి క్రిందికి కెమెరా వ్యూను ట్రాకింగ్ చేయడం ద్వారా అది లోకల్ X లేదా Y అక్షాలతో పాటు కదులుతుంది. |
06:24 | G ను నొక్కండి, ప్రెస్ X ను రెండుసార్లు నొక్కి, mouse ను ఎడమ నుండి కుడికి తరలించండి. |
06:35 | Camera view ఎడమ నుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకు tracks చేస్తుంది. |
06:42 | ఇప్పుడు Y ను రెండుసార్లు నొక్కి, mouse ను పైకి క్రిందికి కదిలించండి. |
06:48 | కెమెరా వ్యూను పైకి మరియు క్రిందికి ట్రాక్ చేస్తుంది. |
06:53 | కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి రైట్-క్లిక్ చేయండి. |
06:59 | బ్లెండర్ కెమెరా ను fly mode లో కూడా అందిస్తుంది. |
07:05 | fly mode కు ప్రవేశించడానికి Shift +F ను నొక్కండి. |
07:10 | ఇప్పుడు, మీరు కెమెరా వ్యూను మూడు మార్గాలలో తరలించవచ్చు. |
07:14 | మొదటిది కీబోర్డ్ నందు shortcut key లను ఉపయోగించడం. |
07:19 | zoom-in అవుటకు కీబోర్డులో W ను నొక్కండి |
07:30 | zoom-out అవుటకు S ను నొక్కండి |
07:40 | ఎడమవైపుకి తరలించడానికి A ను నొక్కండి. |
07:51 | కుడివైపుకి తరలించడానికి D ను నొక్కండి. |
08:02 | కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి రైట్-క్లిక్ చేయండి. |
08:05 | fly mode లో కెమెరా వ్యూను zoom in మరియు out చేయడానికి, mouse wheel లేదా scroll ను ఉపయోగించడం రెండవ పద్ధతి. |
08:13 | fly మోడ్‌లోకి ప్రవేశించడానికి Shift, F నొక్కండి. |
08:18 | zoom-in చేయడానికి mouse wheel ను పైకి స్క్రోల్ చేయండి. |
08:25 | సత్వరమార్గం కోసం, numpad + ను నొక్కండి. |
08:30 | జూమ్ అవుట్ చేయడానికి mouse wheel ను క్రిందికి స్క్రోల్ చేయండి. |
08:38 | సత్వరమార్గం కోసం numpad '-' (మైనస్ ) నొక్కండి. |
08:43 | కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి రైట్ క్లిక్ చేయండి. |
08:49 | చివరి పద్దతి- fly mode లో కెమెరా వ్యూను కుడి నుండి ఎడమకు మరియు ఎడమ నుండి కుడికి తరలించడానికి mouse wheel లేదా scroll ను ఉపయోగించడం. |
08:59 | fly మోడ్ కు ప్రవేశించటానికి Shift+ F నొక్కండి. |
09:04 | D ను నొక్కి, mouse wheel ను పైకి క్రిందికి స్క్రోల్ చేయండి. |
09:13 | కెమెరావ్యూ ఎడమనుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకు కదులుతుంది. |
09:28 | screen పై కెమెరా వ్యూను lock చేయడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి. |
09:33 | ఇప్పుడు, ఇది మీ కొత్త కెమెరా వ్యూ. |
09:38 | దీనితో Navigation - Camera View పై మన ట్యుటోరియల్ ముగుస్తుంది. |
09:43 | ఇప్పుడు, కొత్త ఫైలులో, |
09:45 | కెమెరా మరియు కెమెరా వ్యూ యొక్క స్థానాన్ని మార్చండి. మీ కెమెరా వ్యూను Roll, pan, dolly మరియు track చేయండి. |
09:54 | కొత్త కెమెరా వీక్షణను ఎంచుకోవడానికి fly మోడ్ ను ఉపయోగించండి. |
10:00 | ఈ ట్యుటోరియల్ Project Oscar చే మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క సహకారంతో సృష్టించబడింది. |
10:08 | దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది- oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
10:27 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- |
10:30 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది. |
10:33 | ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
10:38 | మరిన్ని వివరాల కోసం, మాకు వ్రాయండి contact @ spoken spoken tutorial.org |
10:45 | మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. |
10:47 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారు నాగూర్ వలి. |