BASH/C2/Case-statement/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 15:52, 12 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, BASH లో Case statement పై spoken tutorial కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం, case statement యొక్క ప్రాముఖ్యతను, case statementయొక్క సింటాక్స్ ను ఒక ఉదాహరణతో నేర్చుకుంటాం.
|
00:17 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:23 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:29 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, Ubuntu Linux 12.04 Operating System మరియు GNU BASHవర్షన్ 4.1.10ను ఉపయోగిస్తున్నాను. |
00:39 | GNU Bash వెర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి. |
00:47 | 'Bash shell కు రెండు conditional statements రూపాలు ఉన్నాయి- 'if' statementమరియు 'case' statement |
00:56 | Case స్టేట్మెంట్ ను if-else స్టేట్మెంట్ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. |
01:03 | ఎంచుకోవడానికి అనేక అంశాలు ఉన్నప్పుడు case స్టేట్మెంట్ కు ప్రాధాన్యత ఇస్తాం. |
01:09 | ఇది సాధారణంగా menu లను స్క్రిప్ట్ లో అమలు చేయడానికి ఉపయోగించబడుతుంది. |
01:14 | ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. 'case space $(dollar) VARIABLE space in match_1 close round-bracket space commandsమరియు రెండు సార్లు సెమికోలన్
|
01:27 | match_n close round-bracket space commands రెండు సార్లు సెమికోలన్ asterisk close round=bracket space command_to_execute_by_default మరియు రెండు సార్లు సెమికోలన్ esac. |
01:45 | VARIABLE అనేది match_1 కు పోల్చబడుతుంది. |
01:48 | ఒకవేళ ఇది సరిపోలేకపోతే, ఇది match_nఅనే తరువాత కేస్ కు వెళ్తుంది. |
01:54 | ఇది వీటిలోని ఏఒక్క strings అయినా VARIABLE తో మ్యాచ్ అవుతుందా అని తనిఖీ చేస్తుంది. |
02:01 | ఒకవేళ 'yes' అయితే అన్నిcommands డబల్ సెమికోలన్ వరకు ఎగ్జిక్యూట్ అవుతాయి. |
02:07 | ఒకవేళ VARIABLE తో ఏదీ మ్యాచ్ కాకపొతే, asterisk తో ఉన్న కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. |
02:14 | ఇది డిఫాల్ట్ case కండిషన్ ఎందుకంటే asterisk అన్ని స్ట్రింగ్స్ ను మ్యాచ్ చేస్తుంది. |
02:21 | esac అనేది case block ముగింపును సూచిస్తుంది. |
02:26 | మనం case statement ను ఉదాహరణతో అర్ధం చేసుకుందాం. |
02:32 | నేను ఇప్పటికే ప్రోగ్రాం ను టైప్ చేశాను. కాబట్టి, నేను case.sh ఫైల్ ను తెరుస్తాను. |
02:38 | డిస్క్ స్పేస్ కొంత పరిమితికి చేరుకున్నప్పుడు ప్రోగ్రాం హెచ్చరిక సందేశాన్ని ముద్రిస్తుంది. |
02:45 | ఇది shebang line. |
02:47 | bash యొక్క స్థానం ఇతర Linux లలో అంటే CentOS, RedHat మొదలైన వాటిలో వేరుగా ఉంటుంది. |
02:55 | గతంలో ఉపయోగించిన /bin/bash పాయింట్లు నేరుగా binary file కు చేరుతాయి. |
03:01 | env అనేది ఇక్కడ bash ఉన్నటువంటి నిజమైన స్థానమును తీసివేయటానికి ఉపయోగించబడింది, |
03:07 | ఈ shebang line స్క్రిప్ట్ యొక్క పోర్టబిలిటిని ఏ GNU/Linuxసిస్టం పైనైనా మెరుగుపరుస్తుంది. |
03:16 | df -(hyphen)h అనేది disk space వాడుకను మానవులు చదువదగిన రూపంలో ప్రదర్శిస్తుంది. |
03:22 | output sort -rk5 కు పైప్ చేయబడింది, ఇది రివర్స్ ఆర్డర్లో ఐదవ కాలమ్ ను క్రమబద్దీకరిస్తుంది. |
03:31 | తరువాత అవుట్పుట్ awk 'FNR == 2 {print $5}' కు పంపబడుతుంది |
03:38 | ఇది రెండవ లైన్ యొక్క ఐదవ field ను తీసేస్తుంది. |
03:43 | చివరికి, అవుట్పుట్ cut -(hyphen)d “% -(hyphen)f1” to strip out % కు పంపబడుతుంది. |
03:55 | ఇది case statementయొక్క మొదటి లైన్. |
03:59 | ఇక్కడ మనం space ను 0 మరియు 69 మధ్య పోల్చుతాము. |
04:04 | ఒకవేళ మ్యాచ్ అయితే, ఇది "Everything is OK” ను ముద్రిస్తుంది |
04:08 | తరువాత, ఇది space ను 70 మరియు 89 లేదా 91 నుండి 98 కు మధ్య పోల్చుతుంది. |
04:17 | ఒకవేళ మ్యాచ్ అయితే, అది “Clean out. There's a partition that is $(dollar)space % full” ను ముద్రిస్తుంది. |
04:27 | ఇక్కడ, ఇది space ను 99 తో పోల్చుతుంది. |
04:30 | ఒకవేళ మ్యాచ్ అయితే, అది “Hurry. There's a partition at $(Dollar) space %!” ను ముద్రిస్తుంది |
04:39 | ఇది డిఫాల్ట్ case కండిషన్ ఎందుకంటే asterisk అన్నిstringsను మ్యాచ్ చేస్తుంది. |
04:45 | మరియు ఇది case statement ముగింపు. |
04:48 | ఇప్పుడు, ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి terminal కు వెళ్ళండి. |
04:52 | chmod plus x case dot sh అని టైప్ చేయండి |
04:57 | dot slash case dot sh అని టైప్ చేయండి |
05:02 | "Everything is OK". గమనిక అవుట్పుట్ మీ సిస్టమ్ డిస్క్ స్పేస్ పై ఆధారపడి మారుతూ ఉంటుంది. |
05:10 | నా మెషిన్ లో, 0 మరియు 69 మధ్య మ్యాచ్ అయింది కనుక, ఇది "Everything is OK” ను ముద్రించింది. |
05:18 | మీ మెషిన్ పై ముద్రించబడిన సందేశాన్ని తనిఖీ చేయండి. |
05:20 | ఏ case స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో మీరు అర్ధంచేసుకోగలరు. |
05:27 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం. సారాంశం చూద్దాం. |
05:31 | ఈ ట్యుటోరియల్ లో మనం, case statement యొక్క ప్రాముఖ్యతను, case statementయొక్క సింటాక్స్ ను disc-space ఉదాహరణతో నేర్చుకుంటాం. |
05:41 | ఒక అసైన్మెంట్ గా: ఒక మెనూ డ్రైవెన్ ప్రోగ్రాం ను గణిత గణన కోసం వ్రాయండి- |
05:47 | అది ఇన్పుట్ యూజర్స్ గా 'a' మరియు 'b' ను తీసుకోవాలి: |
05:51 | ఇది మాథెమటికల్ ఆపరేటర్ కోసం (plus +, minus -, division / and multiplication *) అడుగుతుంది. గణన చేయండి మరియు అవుట్ పుట్ ను ముద్రించండి. |
06:02 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
06:06 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
06:08 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
06:14 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: |
06:16 | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది; ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
06:23 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
06:31 | Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
06:35 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro. |
06:48 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. |
06:53 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.మీకు ధన్యవాదాలు. |