BASH/C3/Advance-topics-in-a-function/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 15:28, 12 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, Advance topics in a function పై spoken tutorial కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్‌లో మనము |
00:11 | source కమాండ్, ఒక ఫంక్షన్ ను background లో ఉంచడం |
00:14 | కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము. |
00:18 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:24 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి చూపబడిన మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:30 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
00:32 | Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం మరియు |
00:36 | GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను. |
00:40 | GNU Bash వర్షన్ 4 లేదా వాటి కన్నా పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫార్సు చేబడినవని గమనించండి. |
00:46 | source command ను ఫైల్ ని Shell script లో load చేయడానికి ఉపయోగిస్తారు. |
00:53 | ఇది ఆ ఫైల్ నుండి కమాండ్స్ ను చదువుతుంది మరియు అమలు చేస్తుంది. |
00:58 | ఇది script లోకి code ను కూడా దిగుమతి చేస్తుంది. |
01:01 | బహుళ స్క్రిప్ట్ లు సాధారణ డేటాను లేదా function library ని ఉపయోగించినప్పుడు ఇది ఉపయోగకరంగాఉండును. |
01:09 | source కమాండ్ కొరకు సింటాక్స్ ఈవిధంగా ఉంటుంది- |
01:12 | source filename'
|
01:15 | source Path_to_file |
01:18 | souce filename arguments. |
01:22 | నేను 'function dot sh' ఫైల్ ను తెరుస్తున్నాను.
|
01:26 | ఇది shebang line. |
01:29 | ఈ source detail dot sh కమాండ్ detail dot sh ఫైల్ ను function dot shలోకి లోడ్ చేస్తుంది. |
01:37 | నేను detail dot sh ఫైల్ ను తెరుస్తున్నాను. |
01:41 | ఇక్కడ machine అనే ఒక function ఉంది. |
01:44 | ఇప్పుడు, ఫంక్షన్ లోపల - |
01:47 | echo "function machine is called in function dot sh file" అని టైప్ చేయండి. |
01:52 | Save పై క్లిక్ చేయండి. |
01:54 | ఇప్పుడు మనము function dot sh ఫైల్ కు తిరిగి వెళ్దాము. |
01:59 | ఇక్కడ, echo “Beginning of program” అని టైప్ చేయండి. |
02:04 | Save పైన క్లిక్ చేయండి. |
02:06 | తరువాత machine echo “End of program” అని టైప్ చేయండి. |
02:12 | ఇది “Beginning of program” అనే సందేశాన్ని ముద్రిస్తుంది. |
02:16 | machine అనేది ఒకfunction call. |
02:19 | ఇది End of program అనే సందేశాన్ని ముద్రిస్తుంది.. |
02:23 | machine అనేది మనం detail dot sh ఫైలులో సృష్టించిన functionఅని గమనించండి.
|
02:29 | మనము ఇక్కడ, function ను, function dot sh ఫైలు లో పిలుస్తాము. |
02:34 | ఇప్పుడు Save పై క్లిక్ చేయండి. |
02:36 | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
02:41 | అందుకు, terminal పై chmod space plus (+) x space function dot sh అని టైప్ చేయండి. |
02:51 | Enter నొక్కండి. |
02:53 | dot slash function dot sh అని టైప్ చేయండి. |
02:56 | Enter నొక్కండి. |
02:59 | output ప్రదర్శించబడుతుంది. |
03:02 | ఇప్పుడు background function కు వెళ్దాము.
|
03:06 | బ్యాక్ గ్రౌండ్ లో process ను run చేయడానికి, మనము function call చివర్లో & (ampersand) ను ఉపయోగిస్తాము. |
03:13 | shell fork అనేది command ను run చేసే ఒక child process. |
03:19 | forked process job number మరియు PID (Process Identifier) ను కలిగి ఉంటుంది. |
03:27 | ఒక ఉదాహరణ సహాయంతో దీనిని అర్థం చేసుకుందాం. నేనుbackground dot sh ఫైల్ ను తెరుస్తాను. |
03:35 | ఇది shebang line. |
03:38 | bg underscore function function ప్రారంభాన్ని తెలుపుతుంది. |
03:44 | ఇక్కడ echo స్టేట్మెంట్ "Inside bg_function” అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
03:50 | తరువాత, మనం అన్ని డాట్ mp3 ఫైళ్ళను కనుగొనడానికి find కమాండ్ ను ఉపయోగిస్తాం. |
03:57 | ఈ స్టేట్మెంట్ dot mp3 పొడిగింపుతో ఉన్న అన్ని ఫైళ్ళను కనుగొంటుంది. |
04:03 | ఇది ప్రస్తుత working directory లో అలా చేస్తుంది. |
04:07 | Hyphen iname కేసుని వదిలేయడానికి ఉపయోగించబడుతుంది. |
04:11 | ఫలితం myplaylist.txt లో నిల్వ చేయబడుతుంది. |
04:16 | ఇప్పుడు bg underscore function అంపర్సెన్డ్ (&) అని టైప్ చేయండి. ఇది function call. '&'(Ampersand) 'bg_function' ను బ్యాక్ గ్రౌండ్ లో ఉంచుతుంది. |
04:28 | ఇప్పుడు Save పైన క్లిక్ చేయండి. |
04:31 | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
04:34 | terminalకు తిరిగి రండి. |
04:37 | chmod space plus x space background dot sh అని టైప్ చేయండి. |
04:45 | Enter నొక్కండి. ఇప్పుడు dot slash background dot sh అని టైప్ చేయండి. |
04:51 | Enter నొక్కండి. |
04:53 | ఖాళీ అవుట్‌పుట్ dot mp3 ఫైల్ ప్రస్తుత డైరెక్టరీలో లేదు అని సూచిస్తుంది. |
05:02 | ఇప్పుడు, మన ప్రోగ్రాం కు తిరిగి రండి. |
05:05 | echo (hyphen) -e "Process running in background are: backslash n" మరియు jobs space hyphen l అని టైప్ చేయండి. |
05:19 | Save పై క్లిక్ చేయండి. |
05:21 | ఈ echo స్టేట్మెంట్ “Process running in background are ” అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
05:28 | jobs space hyphen l అనేది అన్నిbackground jobs ల స్థితి ని జాబితా చేస్తుంది. |
05:34 | ఇప్పుడు మనterminalకు తిరిగి రండి. |
05:38 | ఇప్పుడు, dot slash background.sh అని టైప్ చేయండి. |
05:42 | Enter నొక్కండి. |
05:44 | output ప్రదర్శించబడుతుంది. |
05:48 | ఇక్కడ, చదరపు బ్రాకెట్ లలో ఉన్న one job number. ను తెలుపును. |
05:53 | 3962 అనేది PID. |
05:57 | PID అనుగుణంగా మారుతుంది. |
06:01 | ఒకవేళ functionఅమలుకావడానికి సమయం తీసుకుంటే, అది బ్యాక్ గ్రౌండ్ లో ప్రక్రియ ను అమలుచేస్తుంది |
06:06 | మనం స్టేటస్ ను "Running" గా చూస్తాము. |
06:11 | ఒకవేళ function స్క్రిప్ట్ కంటే ముందు అమలు చేయబడితే, మనం స్టేటస్ ను "Done" గా చూస్తాము. |
06:20 | output మెషిన్ నుండి మెషిన్ కి మారుతుంది. |
06:23 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం. |
06:28 | ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మనము, |
06:32 | Source కమాండ్ |
06:34 | ఒక ఫంక్షన్ ను background లో ఉంచడాన్ని |
06:36 | కొన్ని ఉదాహరణలు సహాయంతో నేర్చుకున్నాం. |
06:39 | ఒక అసైన్మెంట్ గా: రెండు అంకెలను జత చేయడానికి మరియు ఫంక్షన్ ను మరొక ఫైల్ లో పిలవడానికి add అనే ఫంక్షన్ ను రాయండి. |
06:47 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి
http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
|
06:51 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
06:55 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:00 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది.
ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
07:10 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి |
07:18 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
07:22 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
07:30 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
07:36 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. |
07:42 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. |