PERL/C3/Referencing-and-Dereferencing/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:19, 12 September 2017 by Ahalyafoundation (Talk | contribs)

Jump to: navigation, search
Time
Narration
00:01 Referencing and Dereferencing in Perl పై Spoken Tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము:

Scalar References Array References Hash References Dereferences మరియు array/hash references యొక్క elements లను జోడించడం, తొలగించడం, పొందడం ఎలానో నేర్చుకుంటాము.

00:22 ఈ ట్యుటోరియల్ కొరకు నేను:

Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.

00:33 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు.
00:37 మీకు

Perl ప్రోగ్రామింగ్ Array functions మరియు Hash functions గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.

00:43 ఒకవేళ లేకపోతే, సంబంధిత Perl ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్ సైట్ కు వెళ్ళండి.
00:49 Reference అంటే ఏమిటి?
00:51 reference అనేది variable, array, hash లేదా subroutine కు pointer లేదా address.
00:58 ఇది నేరుగా డేటాను కలిగి ఉండదు.
01:01 Reference అనేది ఒక సులభమైన, కాంపాక్ట్ scalar విలువ.
01:05 పెద్ద డేటా నిర్మాణాలను పంపినప్పుడు లేదా తిరిగి పొందినప్పుడు Reference Perl కోడ్ ను అభివృద్ధి చేస్తుంది.
01:12 ఇది subroutine కు విలువను పంపకుండా reference ను పంపి మెమొరీని ఆదా చేస్తుంది
01:18 సంక్లిష్టమైన Perl డేటా నిర్మాణాలను నిర్వహించడం సులభం.
01:22 మనం reference ను ఎలా సృష్టించాలో చూద్దాం.
01:25 మనము backslash (\) ను ఏదైనా variable, subroutine లేదా value ముందు ఉంచడం ద్వారా reference సృష్టించవచ్చు.
01:33 ఇక్కడ చూపిన విధంగా బాక్ స్లాష్ మరియు డాలర్ గుర్తు ద్వారా scalar variable reference చేయబడుతుంది.
01:39 array variable బాక్ స్లాష్ మరియు at the rate(@) గుర్తు ద్వారా reference చేయబడుతుంది.
01:45 ఇక్కడ ఉదాహరణలో చూపిన విధంగా hash variable బాక్ స్లాష్ మరియు percentage(%) గుర్తు ద్వారా reference చేయబడుతుంది.
01:53 dereference అంటే ఏమిటి?
01:55 reference అనేది dereference అయినప్పుడు అసలు విలువ రిటర్న్ అవుతుంది.
02:00 Dereference అనేది కర్లీ బ్రాకెట్లలో reference వేరియబుల్ ను జతపరచడం ద్వారా జరుగుతుంది
02:06 మరియు ఎడమ కర్లీ బ్రాకెట్ ముందు ఉన్న క్యారెక్టర్ reference రకాన్ని సూచిస్తుంది.
02:12 మనం dereference వేరియబుల్స్ ఎలా చేయాలో చూద్దాము.
02:16 డాలర్ గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ద్వారా ' scalar వేరియబుల్ dereference చేయబడుతుంది.
02:21 ' array వేరియబుల్ at the rate(@) గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ద్వారా dereference చేయబడుతుంది.
02:27 ' hash వేరియబుల్ percentage(%)గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ద్వారా dereference చేయబడుతుంది.
02:33 మనం Scalar reference మరియు dereference కోసం ఒక సాధారణ ప్రోగ్రాం ను చూద్దాము.
02:38 నన్ను 'gedit' Text editor లో నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి.
02:43 terminal ను తెరవండి మరియు gedit scalarRef dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
02:50 స్క్రీన్ పై ప్రదర్శింపబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
02:55 నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
02:57 మొదటి లైన్ scalar variable '$a' ను డిక్లేర్ చేస్తుంది మరియు 10 కి ఇనిష్యలైజ్ చేస్తుంది
03:03 ముందు చెప్పినట్లుగా, బాక్ స్లాష్ మరియు డాలర్ గుర్తు ద్వారా స్కేలార్ వేరియబుల్ reference చేయబడుతుంది.
03:10 ఈ లైన్ reference గా సృష్టించబడిన వేరియబుల్ యొక్క memory address ను ప్రింట్ చేస్తుంది.
03:16 వాస్తవ విలువను ప్రింట్ చేయడానికి, variable '$కు ముందు కర్లీ బ్రాకెట్ల ద్వారా dereference చేయబడుతుంది.
03:23 ఇక్కడ ref()' ఫంక్షన్ reference రకాన్ని scalar లేదా array లేదా hash గా రిటర్న్ చేస్తుంది.
03:30 ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి.
03:34 మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
03:36 terminal కు మారండి మరియు perl scalarRef dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
03:43 చూపబడిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
03:46 మొదటి లైన్ విలువ 10 నిల్వ చేసిన చోట memory address ను చూపిస్తుంది
03:51 రెండవ లైన్ వాస్తవ విలువ 10 ని రిటర్న్ చేస్తుంది.
03:55 Ref() ఫంక్షన్ "SCALAR" ను అవుట్ పుట్ గా రిటర్న్ చేస్తుంది.
03:59 తరువాత, మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి reference మరియు de reference లను ఎలా సృష్టించాలో అర్ధం చేసుకుందాం.
04:07 నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను . నన్ను దానిని 'gedit' టెక్స్ట్ ఎడిటర్ లో తెరవనివ్వండి.
04:13 terminal లో gedit arrayRef dot pl ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
04:20 క్రింది కోడ్ ను స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా arrayRef dot pl ఫైల్ లో టైప్ చేయండి
04:26 ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
04:28 ఇక్కడ మొదటి లైన్ లో నేను @color ను డిక్లేర్ చేసిన array ను కలిగి ఉన్నాను మరియు దానిని మూడు విలువలతో ప్రారంభించాను.
04:35 ఇది array పేరు గల backslash @color తో reference చేయబడింది మరియు $colorRef కు కేటాయించబడింది.
04:42 print స్టేట్మెంట్ ల reference విలువను మరియు dereference విలువను ముద్రిస్తుంది.
04:47 ఇప్పుడు, ఫైల్ సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి.
04:51 మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
04:53 తిరిగి terminal కు మారండి మరియు perl arrayRef dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
05:00 ఇక్కడ చూపిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
05:04 మొదటి లైన్ reference గా సృష్టించబడిన వేరియబుల్ అవుట్ పుట్ యొక్క memory address ను చూపిస్తుంది .
05:10 రెండవ లైన్ వాస్తవ విలువను అంటే dereferenced ను చూపిస్తుంది.
05:16 తరువాత, మనం array కొరకు direct reference ను ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాము.
05:21 తిరిగి మన ప్రోగ్రాం కు వద్దాం.
05:24 array కోసం direct reference ను చూపించటానికి నేను ఇప్పటికే ఉన్న ప్రోగ్రాం ను మార్చాను.
05:29 మీరు చూపిన విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ [] ను ఉపయోగించి array కొరకు direct reference సృష్టించవచ్చు.
05:35 dereference కు arrow operator (→) ను ఉపయోగించండి.
05:39 print స్టేట్మెంట్ "Green" ను అవుట్ పుట్ గా ప్రదర్శిస్తుంది.
05:43 ఇక్కడ, print స్టేట్మెంట్ ఇండెక్స్ [1] విలువను తీసుకుంటుంది అంటే మన ప్రోగ్రాం లో 'Green' అని అర్ధం.
05:50 ఫైల్ ని సేవ్ చేయడానికి Ctrl+S ను నొక్కండి.
05:54 తిరిగి terminal కు మారండి మరియు ఎగ్జిక్యూట్ చేయడానికి perl arrayRef dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
06:03 అదే కోడ్ ఫైల్ లో direct hash reference ను ఎలా ఉపయోగించాలో నేను ఉదాహరణను చూపిస్తాను.

కాబట్టి gedit కు మారండి.

06:11 ఇక్కడ చూపిన విధంగా కర్లీ బ్రాకెట్స్ ను ఉపయోగించి మీరు హాష్ కొరకు direct reference ను సృష్టించవచ్చు.
06:18 దీనిని dereference చేయడానికి arrow operator (→) ని ఉపయోగించండి. “Name” అనేదిhash key.
06:24 ఈ బ్లాక్ కోడ్ అమలులో,రెండూ print స్టేట్మెంట్ లు "Sunil" ను అవుట్ పుట్ గా ముద్రిస్తాయి.
06:31 తరువాత మనం array reference కు elements ను జోడించడం, తొలగించడం, పొందడం ఎలానో నమూనా ప్రోగ్రాం తో చూద్దాం .
06:39 నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను నన్ను దానిని gedit టెక్స్ట్ ఎడిటర్ లో తెరవనివ్వండి.
06:45 terminal ను తెరవండి మరియు gedit arrayRefadd dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
06:54 'arrayRefadd.pl' ఫైల్ ఇప్పుడు gedit. లో తెరుచుకుంటుంది. ఇక్కడ చూపించిన విధంగా కోడ్ ను మీ ఫైల్ లో టైప్ చేయండి.
07:02 మొదటి లైన్ array ను ప్రారంభిస్తుంది.
07:06 మేము reference చేసిన array ను backslash @numarrayతో కలిగి ఉన్నాము మరియు దానిని $refకు కేటాయించాము.
07:13 ఇప్పుడు , మనం array reference.నుండి ఒక ప్రత్యేక element ను ఎలా పొందాలో చూద్దాం.
07:19 మనం ప్రత్యేక విలువను మరియు arrow operator (“->”)' ను పొందడానికి దానిని dereference చేయడానికి array index ను ఉపయోగించాలి.
07:28 print స్టేట్మెంట్ ఇండెక్స్ [0] యొక్క విలువను ముద్రిస్తుంది.
07:32 push() ఫంక్షన్ elementsను array reference.యొక్క చివరి స్థానం వద్ద జోడిస్తుంది.
మన కేసు లో 5, 6, 7 లు array 1, 2, 3, 4 యొక్క చివరి స్తానం వద్ద జోడించబడతాయి. 
07:47 array reference. కు జోడించిన తరువాత print స్టేట్మెంట్ అవుట్ పుట్ ను చూపిస్తుంది.
07:53 pop() ఫంక్షన్ elementను array reference యొక్క చివరి స్థానం నుండి తొలగిస్తుంది.
07:58 మన ఉదాహరణలో, ఉన్న array reference నుండి 7 తొలగించబడుతుంది.
08:03 array reference నుండి తొలగించిన తరువాత print స్టేట్మెంట్ అవుట్ పుట్ ను చూపిస్తుంది.
08:08 ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S నొక్కండి.
08:11 మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
08:14 తిరిగి terminal కు మారండి perl arrayRefadd dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
08:22 ఇక్కడ చూపిన విధంగా అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది.
08:26 ఇప్పుడు మనం hash reference యొక్క elements ను జోడించడానికి, తొలగించడానికి, మరియు పొందడానికి మరొక నమూనా ప్రోగ్రాం ను చూద్దాం.
08:34 'terminal పై, gedit hashRefadd dot pl ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
08:42 ఇది ఫైల్ 'hashRefadd.pl' ను gedit' లో తెరుస్తుంది.
08:47 నన్ను నమూనా ప్రోగ్రాం ను వివరించనివ్వండి.
08:50 నేను scalar వేరియబుల్ $weektemp. ను నిల్వ చేయగల direct hash reference ను డిక్లేర్ చేసాను.
08:57 నేను hash reference ను సూచించడానికి కర్లీ బ్రాకెట్స్ ను మరియు dereference ను సూచించడానికి arrow operator ను ఉపయోగిస్తాను.
09:04 ఈ కోడ్ సోమవారం నుండి శుక్రవారం వరకు ఉష్ణోగ్రత విలువలను నిల్వ చేస్తుంది.
09:09 నేను హాష్ కీస్ ద్వారా “keys” built-in function ను లూప్ కు ఉపయోగిస్తారు.
09:15 print స్టేట్మెంట్ హాష్ యొక్క ప్రతి ఎలిమెంట్ ను ముద్రిస్తుంది.
09:19 ఇక్కడ చూపించిన విధంగా మనం element యొక్క ప్రత్యేక విలువను పొందవచ్చు.
09:25 print స్టేట్మెంట్ సోమవారం ఉష్ణోగ్రతను ముద్రిస్తుంది.
09:29 ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయండి
09:32 కు మారండి మరియు అవుట్ పుట్ చూడడానికి perl hashRefadd dot pl' అని టైప్ చేసి Enter నొక్కండి.
09:41 'hash keys మరియు hash values యాదృచ్చిక క్రమంలో నిల్వ చేయబడతాయి.
09:46 ప్రదర్శించబడిన అవుట్పుట్ అవి జోడించిన క్రమానికి సంబంధించినవి కావు.
09:52 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. మనం సారాంశం చూద్దాం.
09:57 ఈ ట్యుటోరియల్ లో మనము:

Scalar References Array References Hash References Dereferences మరియు array/hash references యొక్క elements లను జోడించడం, తొలగించడం, పొందడం ఎలానో నేర్చుకుంటాము.

10:14 ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. మన hashRefadd dot pl fileలో హాష్ weektempలో కొత్త కీ “Saturday” మరియు “Sunday” లను జోడించండి.
10:24 చివరికి “Saturday” కీ ని డిలీట్ చేయండి.
10:27 హాష్ weektemp. ను ముద్రించండి.
10:30 ప్రోగ్రాం ను Save మరియు execute చేయండి. ఇప్పుడు ఫలితాన్ని పరీక్షించండి.
10:35 క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ను సారాంశం చేస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి.
10:42 మేము వర్క్ షాప్ లను నిర్వహిస్తాము మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తాము.

మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు రాయండి.

10:51 NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.

ఈ మెషిన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.

11:02 ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్.

మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india