PERL/C2/Array-functions/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 14:28, 8 September 2017 by Ahalyafoundation (Talk | contribs)
Time | Narration | |
00:01 | PERL లో Array Functions పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. | |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనము PERL లో ని array functions గురించి నేర్చుకుంటాము అంటే: | |
00:11 | push , pop, shift | |
00:14 | unshift , split | |
00:16 | splice మరియు join | |
00:18 | sort, qw. | |
00:20 | నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను. | |
00:28 | నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను. | |
00:32 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగించవచ్చు. | |
00:36 | మీకు PERL లో variables, data Structures మరియుarrays గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి. | |
00:43 | comments, loops మరియు conditional statements గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం. | |
00:48 | దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. | |
00:54 | Perl కొన్ని అంతర్నిర్మిత functions ను అందిస్తుంది. | |
00:57 | ఈ ఫంక్షన్ లు array పై వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయి. | |
01:02 | మొదట మనం array యొక్క చివరి స్థానం నుండి ఎలిమెంట్ లను ఎలా జోడించాలో మరియు తీసివేయాలో నేర్చుకుందాం. | |
01:08 | దీనిని మనం ఈ క్రింది వాటిని ఉపయోగించి చేయవచ్చు | |
01:10 | push' ఫంక్షన్ ఇది ఎలిమెంట్ ను array యొక్క చివరి స్థానంలో జోడిస్తుంది | |
01:15 | మరియు pop ఫంక్షన్ ఇది ఎలిమెంట్ ను array యొక్క చివరి స్థానం నుండి తొలగిస్తుంది. | |
01:21 | ఒక నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి మనం push మరియు pop ఫంక్షన్ లను అర్ధం చేసుకుందాం. | |
01:26 | టెర్మినల్ ను తెరవండి మరియు gedit perlArray dot pl space ampersand అని టైప్ చేయండి. | |
01:33 | మరియు Enter నొక్కండి. | |
01:36 | ఇది 'perlArray dot pl' ఫైల్ నుgedit లో తెరుస్తుంది. | |
01:41 | స్క్రీన్ పై చూపించిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. | |
01:45 | ఇక్కడ, మనము పొడవు 3 గల array ను డిక్లేర్ చేస్తాము. | |
01:50 | push ఫంక్షన్ ఈ array యొక్క చివరి స్థానంలో అనగా 3 తరువాత ఒక ఎలిమెంట్ ను చేర్చుతుంది. | |
01:57 | అలానే pop ఫంక్షన్ array చివరి స్థానం నుండి ఎలిమెంట్ ను తీసివేస్తుంది. | |
02:04 | మన కేసు లో, array నుండి 4 తొలగించబడుతుంది. | |
02:08 | ఫైల్ ను save చేయడానికి Ctrl + S ను నొక్కండి. | |
02:11 | push ఫంక్షన్ 2 arguments ను తీసుకుంటుంది- | |
02:14 | push ఫంక్షన్ కు array అనేది మొదటి ఆర్గ్యుమెంట్ ఇందులో element జోడించబడుతుంది. | |
02:20 | element అనేది 2 వ ఆర్గ్యుమెంట్, ఇది array లోకి పంపబడుతుంది. | |
02:25 | pop ఫంక్షన్ కు సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది: | |
02:29 | pop ఫంక్షన్ ఒక్క argumentను మాత్రమే తీసుకుంటుంది. | |
02:32 | ఇది array, ఇందులో నుండే element ను తొలగించాల్సిన అవసరం ఉంది. | |
02:36 | గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు array యొక్క చివరి స్థానంలో పని చేస్తాయి. | |
02:41 | popఫంక్షన్ ద్వారా తొలగించబడిన element ను వేరొక వేరియబుల్లోకి తీసుకోవచ్చు. | |
02:46 | దీనికి సింటాక్స్ $variable space = space pop open bracket @myArray close bracket . | |
02:57 | ఇప్పుడు టెర్మినల్ కు మారండి మరియు Perl scriptను అమలు చేయండి. | |
03:01 | perl perlArray dot pl అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. | |
03:07 | టెర్మినల్ పై అవుట్పుట్ చూపించబడింది. | |
03:11 | ఇప్పుడు, array యొక్క మొదటి స్థానం నుండి element ను ఎలా జోడించాలో/ తొలగించాలో చూద్దాం. | |
03:18 | దీనిని ఈ క్రింది దానిని ఉపయోగించి సాధించవచ్చు- | |
03:20 | unshift ఫంక్షన్ element ను array కు 1 వ స్థానం వద్ద జతచేస్తుంది. | |
03:25 | shift ఫంక్షన్ array నుండి మొదటి element ను తొలగిస్తుంది. | |
03:31 | మనం దీనిని నమూనా ప్రోగ్రామ్ ఉపయోగించి అర్థం చేసుకుందాం. | |
03:35 | నేను ముందుగా సృష్టించిన perlArray dot pl ఫైల్ ను తెరుస్తాను. | |
03:39 | స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ యొక్క క్రింది భాగాన్ని టైప్ చేయండి. | |
03:43 | unshift ఫంక్షన్ మొదటి స్థానం వద్ద అంటే 1 కి ముందు element ను చేర్చుతుంది. | |
03:52 | shift ఫంక్షన్ మొదటి స్థానం నుండి element ను తొలగిస్తుంది. | |
03:57 | మన కేసు లో, zero తీసివేయబడుతుంది. | |
04:00 | ఫైల్ ను save చేయడానికి Ctrl + S నొక్కండి. | |
04:03 | unshift ఫంక్షన్ 2 arguments ను తీసుకుంటుంది- | |
04:06 | 1st ఆర్గ్యుమెంట్ array ఇందులో element జోడించబడుతుంది, | |
04:10 | 2nd ఆర్గ్యుమెంట్ element ఇది array లో జోడించబడుతుంది. | |
04:15 | shift ఫంక్షన్ ఒక argument ను మాత్రమే తీసుకుంటుంది- | |
04:18 | ఇది array,ఇందులో నుండి element ను తొలగించాల్సిన అవసరం ఉంది. | |
04:22 | గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు array యొక్క మొదటి స్థానంలో పని చేస్తాయి. | |
04:27 | shift ఫంక్షన్ ద్వారా తొలగించబడిన element ను మనం వేరొక వేరియబుల్ లోకి తీసుకోవచ్చు. | |
04:33 | దీనికి సింటాక్స్: $variable space = space shift open bracket @myArray close bracket. | |
04:44 | తరువాత టెర్మినల్ కు మారండి మరియుPerl scriptను అమలు చేయండి. | |
04:48 | perl perlArray dot pl అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. | |
04:54 | అవుట్పుట్ హైలైట్ అయ్యే విధంగా టెర్మినల్ పై ప్రదర్శించబడినది. | |
04:59 | ఇప్పుడు, మనం array యొక్క నిర్దిష్ట స్థానం నుండి element ను ఎలా తీసివేయవచ్చో చూద్దాం. | |
05:05 | splice ఫంక్షన్ array యొక్క నిర్దిష్ట స్థానం నుండి element ను తొలగిస్తుంది. | |
05:11 | ఈ ఫంక్షన్ యొక్క return value అనేది తొలగించబడిన elements యొక్క array. | |
05:17 | నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి మనం దీన్ని అర్థం చేసుకుందాం. | |
05:21 | ముందుగా సృష్టించ perlArray dot pl ఫైల్ కు వెళ్ళండి. | |
05:26 | స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ భాగాన్ని టైప్ చేయండి. | |
05:30 | మనము ఎలిమెంట్ లను తొలగించాలనుకుంటున్న చోటు నుండి index ను అందించాలి మరియు | |
05:35 | ఏ ఎలిమెంట్స్ ను తొలగించాలనుకుంటున్నామో అంతవరకూ offset ను అందించాలి. | |
05:39 | మన కేసు లో 5 మరియు 6 ఎలిమెంట్ లు తొలగించబడతాయి. | |
05:44 | తరువాత టెర్మినల్ కు మారండి మరియు క్రింది దానిని టైప్ చేయడం ద్వారా Perl scriptను చేయండి: | |
05:49 | perl perlArray dot pl మరియు Enter నొక్కండి. | |
05:55 | అవుట్ పుట్ టెర్మినల్ పై చూపబడిన విధంగా ఉంటుంది. | |
05:59 | ఇప్పుడు, మనంarraysయొక్క కొన్ని ఇతర inbuilt functions ను చూద్దాము. | |
06:04 | ఒక నిర్దిష్ట delimiter వద్ద stringను విభజించడానికి splitఫంక్షన్ ను ఉపయోగిస్తారు. | |
06:10 | array అనేది ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ విలువ. | |
06:14 | ఈ array యొక్క elements అనేవి stringయొక్క విభజించిన భాగాలు. | |
06:19 | join ఫంక్షన్ array యొక్క elements ను నిర్దిష్ట delimiter ఉపయోగించి చేర్చుతుంది. | |
06:25 | ఇది చేర్చబడిన elements యొక్క string ను తిరిగి ఇస్తుంది. | |
06:28 | sort ఫంక్షన్ array ను అక్షర / సంఖ్యా క్రమంలో క్రమబద్దీకరిస్తుంది. | |
06:34 | qw ఫంక్షన్ తెలుపుspace ద్వారా వేరుచేయబడిన యొక్క array పదాలను తిరిగి ఇస్తుంది. | |
06:40 | ఇప్పుడు ,మనం ఈ అన్ని ఫంక్షన్ లను ఒక నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అర్ధం చేసుకుందాం. | |
06:45 | టెర్మినల్ కు మారండి మరియు: | |
06:48 | gedit arrayFunctions dot pl space ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. | |
06:55 | స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ యొక్క ఈ క్రింది భాగాన్ని టైప్ చేయండి. | |
07:00 | ఈ సందర్భంలో, వేరియబుల్ string యొక్క ప్రతి పదం array యొక్క element అవుతుంది. | |
07:07 | ఇక్కడ, newArray యొక్క ప్రతి'element comma ద్వారా చేర్చబడుతుంది. | |
07:12 | sort ఫంక్షన్ array యొక్క elements ను అక్షర క్రమంలో క్రమబద్దీకరిస్తుంది. | |
07:19 | qw ఫంక్షన్ ఖాళీ ద్వారా వేరుచేయబడిన array యొక్క పదాలను సృష్టిస్తుంది. | |
07:25 | మనం ప్రతి ఫంక్షన్ ను అర్ధం చేసుకుందాం. | |
07:28 | split ఫంక్షన్ రెండు arguments ను తీసుకుంటుంది. | |
07:31 | మొదటి ఆర్గ్యుమెంట్ delimiter, దీని ద్వారా string విడగొట్టబడాలి, | |
07:36 | 2nd string ఇది విడగొట్టబడాలి. | |
07:39 | Delimiters ను ముందు స్లాష్, సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు. | |
07:45 | join ఫంక్షన్ 2 arguments ను తీసుకుంటుంది. | |
07:48 | మొదటిది delimiter, దీని ద్వారా array elements చేర్చబడాలి. | |
07:53 | 2 వది array | |
07:55 | Delimiters ను సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు. | |
07:58 | sort ఫంక్షన్ ఒక్క argument ను తీసుకుంటుంది అదే array ఇది క్రమబద్దీకరించబడాలి. | |
08:05 | qw ఫంక్షన్ space ద్వారా వేరుచేయబడిన array యొక్క పదాలను తిరిగి ఇస్తుంది. | |
08:11 | qwఉపయోగించి వ్రాయబడి ఉంటే పదాన్ని quotes లో పేర్కొనవలసిన అవసరం లేదు. | |
08:17 | తరువాత టెర్మినల్ కు మారండి మరియు టైప్ చేయడం ద్వారా Perl script అమలు చేయండి: | |
08:23 | perl arrayFunctions dot pl | |
08:26 | మరియు Enterనొక్కండి. | |
08:29 | క్రింది అవుట్పుట్ స్క్రీన్ పై ప్రదర్శించబడుతుంది. | |
08:33 | మనం సారాంశం చూద్దాం . ఈ ట్యుటోరియల్ లో మనము: | |
08:36 | ఒక array నుండి elements ను జోడించడం /తొలగించడం | |
08:40 | నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి array పై పనిచేసే ప్రాధమిక ఫంక్షన్ ల గురించి నేర్చుకున్నాం. | |
08:46 | ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్- | |
08:48 | 'script.spoken-tutorial.org/index.php/Perl' | |
08:54 | Split the above string at '/ ' (forward slash) delimiter. | '/ ' (forward slash) delimiter వద్ద పై string ను విడగొట్టండి. |
08:59 | కొత్తగా సృష్టించిన array యొక్క ప్రారంభంలో https:// ను జోడించండి. | |
09:06 | element “Perl” ను array నుండి తొలగించండి. | |
09:09 | సంఖ్య ని డిక్లేర్ చేయండి మరియు దానిని క్రమబద్దీకరించండి. | |
09:12 | క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చుడండి. | |
09:15 | It summarizes the "Spoken Tutorial" project. | ఇది "Spoken Tutorial" ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది. |
09:19 | If you do not have good bandwidth, you can download and watch it. | ఒక వేళా మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:24 | "Spoken Tutorial" ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. | |
09:30 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. | |
09:34 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. | |
09:40 | "Spoken Tutorial" ప్రాజెక్ట్ "Talk to a Teacher" ప్రాజెక్ట్ లో ఒక భాగం. | |
09:44 | ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. | |
09:51 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. | |
10:02 | మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. | |
10:04 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. | |
10:06 | మీకు ధన్యవాదాలు. |