PERL/C3/Access-Modifiers-in-PERL/Telugu
|
|
00:01 | Access Modifiers in PERL పై Spoken Tutorial కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము:
వేరియబుల్స్ పరిధి, Private వేరియబుల్స్, Dynamically scoped వేరియబుల్స్, Global వేరియబుల్స్ గురించి నేర్చుకుంటాము. |
00:19 | ఈ ట్యుటోరియల్ కొరకు నేను
Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం ను Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను. |
00:32 | మీకు నచ్చిన ఏ text editor ను అయినా మీరు ఉపయోగించవచ్చు |
00:36 | మీకు Perl ప్రోగ్రామింగ్ గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి |
00:40 | ఒకవేళ లేకపోతే, సంబంధిత Perl ట్యుటోరియల్ కోసంspoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:47 | మనం వేరియబుల్స్ పరిధిని పరిచయం చేయదం తో ప్రారంభిద్దాం |
00:51 | వేరియబుల్ యొక్క scope అనేది ఆ వేరియబుల్ ను ప్రాప్తి చేయగల కోడ్ యొక్క ప్రాంతం. |
00:58 | మరోలా చెప్పాలంటే, ఇది వేరియబుల్స్ యొక్క ప్రత్యక్షతను సూచిస్తుంది. |
01:03 | మొదటగా, మనం Perlలో my, local మరియు our modifiers ల గురించి చర్చిద్దాం. |
01:10 | my అంటే Private variables అని అర్ధం, |
01:13 | 'local అంటే Dynamically scoped variables అని అర్ధం, |
01:17 | our అంటే Global variables అని అర్ధం. |
01:20 | my కీవర్డ్ తో డిక్లేర్ చేసిన వేరియబుల్స్block వెలుపల పరిధిని కోల్పోతాయి. |
01:28 | మీరు వేరియబుల్ కు విలువను ఇవ్వకుండా ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు:
my $fvalue semicolon |
01:37 | మీరు వేరియబుల్ కు విలువను కేటాయిస్తూ కూడా ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు: |
01:43 | my $fValue = 1 semicolon |
01:48 | my $fname = డబుల్ కోట్స్ లోపల Rahul semicolon |
01:55 | వివిధ వేరియబుల్స్ ను ఇదే my స్టేట్మెంట్ తో డిక్లేర్ చేయుటకు సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది: |
02:02 | my ఓపెన్ బ్రాకెట్ $fname comma $lname comma $age క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్ |
02:12 | నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి private వేరియబుల్స్ ను అర్థం చేసుకుందాం. |
02:17 | నేను ఇప్పటికే నమూనా ప్రోగ్రాం ను కలిగి ఉన్నాను. నేను దీనిని 'gedit' Text editor లో తెరుస్తాను. |
02:24 | terminal ను తెరవండి మరియు gedit scope hyphen my dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:34 | ఇప్పుడు Scope-my dot pl ఫైల్ geditలో తెరుచుకుంటుంది. |
02:39 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నేను కోడ్ ను వివరిస్తాను. |
02:46 | ఇక్కడ, నేను 'my' కీ వర్డ్ తో privateవేరియబుల్ $fname ను డిక్లేర్ చేసాను |
02:52 | మరియు దీనికి "Raghu"అనే విలువను కేటాయించాను. |
02:56 | ఈ బ్లాక్ లోపల, print స్టేట్మెంట్ విలువను అనగా "Raghu" ను fname వేరియబుల్ లో ముద్రిస్తుంది. |
03:04 | తరువాత బ్లాక్ లో, నేను "Other" విలువను ఇదే private వేరియబుల్ $fname కు కేటాయించాను. |
03:11 | కాబట్టి print statement "Other" ను ఈ ప్రత్యేక బ్లాక్ లోపల ముద్రిస్తుంది. |
03:17 | ఈ ప్రోగ్రాం లోని చివరి print statement ఏ అవుట్ పుట్ ను ముద్రించదు. |
03:23 | ఎందుకంటే, ఇంతకుముందు నిర్వచించిన బ్లాకుల పరిధికి వెలుపల, fname ఏ విలువను దీనికి కేటాయించ లేదు. |
03:32 | ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేయుటకు Ctrl+S ను నొక్కండి |
03:37 | ఇప్పుడు మనం ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం. |
03:40 | తిరిగి terminal కు మారండి మరియు perl scope hyphen my dot pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
03:49 | అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శించబడుతుంది:
"Block 1: Raghu" "Block 2: Other" "Outside Block: " there is no output. |
03:59 | అందువల్ల 'my' variable యొక్క పరిధి ప్రత్యేక బ్లాక్ లోపల మాత్రమే ప్రాప్తి చెందుతుంది. |
04:06 | ఇప్పుడు, మనం ఇప్పటికే ఉన్న ప్రోగ్రాం ను కొద్దిగా మారుద్దాం. |
04:10 | మనం చివరి print స్టేట్మెంట్ కు ముందు బ్లాక్స్ వెలుపల my $fname = within double quotes John semicolonను జోడిద్దాం.
మార్పులను సేవ్ చేయండి. |
04:23 | తిరిగి terminal కు మారండి మరియు మునుపటివలె ఎగ్జిక్యూట్ చేయండి. |
04:28 | ప్రదర్శించబడిన అవుట్ పుట్ ను విశ్లేషించండి. |
04:32 | బ్లాక్ లోపల మరియు బ్లాక్ వెలుపల 'my' వేరియబుల్ని ఉపయోగిస్తున్న పరిధి మీకు అర్థమైందని భావిస్తున్నాము. |
04:41 | తరువాత మనంPerl లో dynamically scoped variable గురించి చూద్దాం. |
04:47 | Local కీవర్డ్ global వేరియబుల్ కు తాత్కాలిక పరిధిని ఇస్తుంది. |
04:52 | అసలు బ్లాక్ నుండి పిలిచే ఏ function కు అయినా వేరియబుల్ కనిపిస్తుంది. |
04:58 | మీరు వేరియబుల్ ను ఈ విధంగా డిక్లేర్ చేయవచ్చు:
local $fValue = 100 semicolon local $fname = within double quotes "Rakesh" semicolon |
05:13 | మనం దీనిని ఒక నమూనా ప్రోగ్రామ్ ఉపయోగించి అర్ధం చేసుకుందాం |
05:17 | terminal ను తెరవండి మరియు gedit scope hyphen local dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:27 | ఇది scope hyphen local dot pl ఫైల్ ను gedit' లో తెరుస్తుంది. |
05:33 | స్క్రీన్ పై ప్రదర్శించిన విధంగా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి. |
05:40 | ఇక్కడ, మనం మొదటి లైన్ లో $fname వేరియబుల్ ను డిక్లేర్ చేసాం దానిని ఇనిష్యలైజ్ చేద్దాం. |
05:47 | ఫంక్షన్ Welcome() లోపల, మనం local వేరియబుల్ ను అదే పేరు గల $fname తో డిక్లేర్ చేస్తాం. |
05:54 | వేరియబుల్ పేరు ముందు కీ వర్డ్ ను గమనించండి |
05:59 | మరియు మేము ఈ వేరియబుల్ కు "Rakesh"విలువను కేటాయించాము. |
06:03 | కాబట్టి, ప్రధానంగా, ఫంక్షన్ Welcome() లోపల, $fname తాత్కాలిక క్రొత్తlocal వేరియబుల్ గా మార్చబడింది. తరువాత, ఫంక్షన్ Hello() call చేయబడుతుంది. |
06:15 | ఇది ఫంక్షన్ Hello() యొక్క నిర్వచనం. |
06:18 | ప్రోగ్రాం చివరిలో, మనం రెండు ఫంక్షన్స్ Welcome() మరియు Hello() లను పిలుస్తాము. |
06:25 | ఇప్పుడు ప్రోగ్రాం ను సేవ్ చేయుటకు Ctrl + S ను నొక్కండి |
06:29 | మనం ప్రోగ్రామ్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం |
06:31 | తిరిగి terminal కు మారండి మరియు perl scope hyphen local.pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:41 | అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శింపడుతుంది:
"Hello, Rakesh"! "Hello, Welcome to Spoken tutorials!" |
06:48 | మనం అవుట్ పుట్ ను అర్ధం చేసుకుందాం |
06:51 | ఫంక్షన్ Welcome() ను పిలిచినప్పుడు Hello() ఫంక్షన్ లోపల local వేరియబుల్ ప్రాప్తి చెందుతుంది. |
06:59 | Welcome() లోపల $fname "Rakesh" విలువను కలిగి ఉంటుంది. |
07:04 | దీని తరువాత ఫంక్షన్ Hello() మళ్ళి ఒకసారి $fname ను ప్రాప్తి చేస్తుంది. |
07:11 | కానీ ఈ సారి, ఇది "Welcome to spoken tutorials" కు ఇనిష్యలైజ్ చేయబడిబడిన $fname వేరియబుల్. |
07:19 | ఇది స్థానిక వేరియబుల్ $fname ను Welcome() ఫంక్షన్ లోపల ప్రాప్తి చేయదు. |
07:25 | అంటే దీని అర్ధం,Welcome() బ్లాక్ ను వదిలేసిన తరువాత స్థానిక వేరియబుల్ scopeను తిరిగి నిల్వ చేస్తుంది. |
07:32 | తరువాత మనం Perl లో global వేరియబుల్స్ గురించి చూద్దాం. |
07:38 | global variable అనేది ప్రోగ్రామ్ లో ఎక్కడైనా ప్రాప్తి చేయగలదు. |
07:43 | Global variables కీ వర్డ్ 'our' తో డిక్లేర్ చేయబడతాయి. |
07:47 | ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి:
our $fvalue = 100 semicolon </nowiki> our $fname =within double quotes Priya semicolon |
08:01 | ఇప్పుడు మనం global వేరియబుల్స్ యొక్క పని చేయు ఉదాహరణను చూద్దాం |
08:06 | తిరిగి terminal కు మారండి మరియు gedit scope hyphen our dot pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి |
08:16 | ఇది scope hyphen our.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది. |
08:22 | నేను రాసిన నమూనా ప్రోగ్రాం ను వివరించనివ్వండి. |
08:27 | నేను 'package main ను మరియు our $i ను గ్లోబల్ వేరియబుల్ గా డిక్లేర్ చేసాను మరియు దానిని 100 కు ఇనిష్యలైజ్ చేస్తాను. |
08:37 | package First డిక్లరేషన్ ను గమనించండి. |
08:40 | ఒక package అనేది సొంత namespace ను కలిగివున్న కోడ్ యొక్క సేకరణ. |
08:46 | Namespace packages మధ్య variable name collisions ను నిరోధిస్తుంది. |
08:51 | భవిష్యత్ ట్యుటోరియల్లో package మరియుnamespace గురించి మరింత చూస్తాము. |
08:56 | package First లో, గ్లోబల్ వేరియబుల్ "I" విలువ 10 అవుతుంది. |
09:02 | package Second లో,గ్లోబల్ వేరియబుల్ "I" విలువ 20 ను కేటాయిస్తుంది. |
09:08 | 'main package package First variable మరియు package Second variable రెండింటిని ఉపయోగిస్తుంది. |
09:15 | నా ప్రోగ్రాం లో, నేను అన్నిpackages లో అదే వేరియబుల్ "i" ను డిక్లేర్ చేసాను. |
09:21 | package variable package name colon colon variable name ద్వారా ప్రస్తావించబడింది. |
09:29 | మన ఉందాహరణలో, ఇది $First colon colon i, $Second colon colon i. |
09:39 | మనకు ఒక ఫైలులో బహుళ packages ను కలిగివుంటాయి మరియు గ్లోబల్ వేరియబుల్ అన్ని packages ద్వారా ప్రాప్తి చేయబడుతుంది. |
09:47 | ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేసి ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేయండి. |
09:51 | అందుకు తిరిగి terminal కు మారండి మరియు perl scope hyphen our dot pl టైప్ చేసి Enter నొక్కండి. |
09:59 | terminal పై అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. |
10:03 | variable i కు ఎలా అప్పగించినదో అర్థం చేసుకోవడానికి అవుట్పుట్ను విశ్లేషించండి. |
10:11 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది. మనం సారాంశం చూద్దాం. |
10:16 | ఈ ట్యుటోరియల్ లో మనము:
వేరియబుల్స్ పరిధిని Private variables Dynamically scoped variables మరియు global variables ల డిక్లరేషన్లను ఉదాహరణతో నేర్చున్నాము. |
10:29 | కంపైలేషన్ వేగంగా ఉన్నప్పుడు local కంటే 'my' ను ఉపయోగించడం మంచిది. |
10:35 | ఇక్కడ మీకొక అసైన్మెంట్. |
10:37 | క్రింద అస్సైన్మెంట్ కు కోడ్ ను రాయండి మరియు దానిని ఎగ్జిక్యూట్ చేయండి. |
10:42 | 'package ను FirstModule గా డిక్లేర్ చేయండి. |
10:46 | వేరియబుల్ $age ను our గా డిక్లేర్ చేయండి మరియు విలువను కేటాయించండి. |
10:52 | మరొక ప్యాకేజీ ని SecondModule గా డిక్లేర్ చేయండి. |
10:56 | వేరియబుల్ $age ను our గా డిక్లేర్ చేయండి మరియు డబుల్ కోట్స్ లోపల "Forty-Two"విలువను కేటాయించండి. |
11:05 | subroutine First() ను డిక్లేర్ చేయండి. |
11:08 | subroutine లోపల, local' మరియు my కీ వర్డ్ ల తో క్రింది రెండు వేరియబుల్స్ ను డిక్లేర్ చేయండి: |
11:16 | local $age = 52 సెమికోలన్ |
11:20 | my $ageword = డబుల్ కోట్స్ లోపల Fifty-two semicolon |
11:27 | Result() గా మరొక subroutine ను పిలవండి. |
11:31 | ఫంక్షన్ లోపల $age మరియు $ageword విలువలను ముద్రించండి. |
11:37 | Subroutine ను ముగించండి. |
11:39 | subroutine Result() ను డిక్లేర్ చేయండి. |
11:42 | మళ్ళి $age మరియు $ageword విలువలను ముద్రించండి. |
11:47 | Subroutine ను ముగించండి. |
11:49 | ఫంక్షన్ First() ను పిలవండి. |
11:51 | క్రింది విధంగా Package First మరియు Package Second లను ముద్రించండి: |
11:57 | క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ను సారాంశం చేస్తుంది.
దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి. |
12:05 | Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది.
మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు రాయండి. |
12:18 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
దీని పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది |
12:31 | ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్.
మీకు ధన్యవాదాలు. |