Git/C2/Basic-commands-of-Git/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 12:55, 7 September 2017 by Yogananda.india (Talk | contribs)
Time | NARRATION |
00:01 | Basic commands of Git పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్లో మనము Git repository మరియు Git యొక్క కొన్ని ప్రాథమిక కమాండ్ ల గురించి నేర్చుకుందాము. |
00:13 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, ఉబుంటు లినక్స్ 14.04 Git 2.3.2. మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను. |
00:23 | మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
00:27 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Terminal ఫై పని చేసే లినక్స్ కమాండ్ల గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:34 | లేకపోతే, సంబంధిత లినక్స్ ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ని సందర్శించండి. |
00:40 | ఇప్పుడు, Git repository అంటే ఏమిటో చూద్దాము. |
00:44 | Git రిపోజిటరీ అనేది, మన ప్రాజెక్ట్ యొక్క మొత్తం సమాచారాన్ని నిల్వ చేయగల ఫోల్డర్. |
00:50 | అది ఒక స్థానిక మెషిన్ లేదా రిమోట్ మెషిన్ పై పొందుపరిచి ఉంచవచ్చు. |
00:55 | సాధారణ ఫోల్డర్ మరియు git repository కి మధ్య తేడా ఏమిటి అంటే- |
01:00 | సాధారణ ఫోల్డర్ ఫైళ్ళు మరియు డైరెక్టరీలను మాత్రమే కలిగి ఉంటుంది. |
01:04 | కానీ Git repository, ఫైళ్ళు మరియు డైరెక్టరీల తో పాటు వాటి పూర్తి చరిత్ర ని కూడా కలిగి ఉంటుంది. |
01:11 | ఇప్పుడు Git repository ని మన లోకల్ మెషిన్ లో ఎలా సృష్టించాలో నేర్చుకుందాము. |
01:17 | టెర్మినల్ ని తెరవడానికి Ctrl+Alt+T కీస్ ల nను కలిపి నొక్కండి. |
01:22 | నా మెషిన్లో, నా Home డైరెక్టరీలో Git repository కొరకు ఒక directory ని క్రియేట్ చేస్తాను. |
01:28 | మీరు మీ మెషిన్లో, మీకు కావలసిన చోట డైరెక్టరీని క్రియేట్ చేయవచ్చు. |
01:33 | డిఫాల్ట్ గా, మనము Home డైరెక్టరీలో ఉన్నాము. |
01:37 | mkdir space mywebpage అని టైప్ చేసి Enter చేసి నొక్కండి. |
01:44 | ఇప్పుడు మన Home డైరెక్టరీలో mywebpage అనే డైరెక్టరీని క్రియేట్ చేసాము. |
01:49 | ఈ Directory కి వెళ్ళడానికి, cd space mywebpage అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:00 | mywebpage డైరెక్టరీని Git repository గా తయారుచేయుటకు, git space init అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:08 | మీరు Initialized empty Git repository అనే సందేశాన్ని చూడవచ్చు. |
02:13 | ఇది Git విజయవంతంగా ఇనిష్యలైజ్ అయ్యిందని సూచిస్తుంది. |
02:17 | మరియు ఇది మన సిస్టం లో ఎక్కడ Git repository సృష్టించబడిందో దాని పాత్. |
02:24 | initialize అయిన తర్వాత, dot git అనే ఒక దాగి ఉన్న ఫోల్డర్ mywebpage ఫోల్డర్ లోపల సృష్టించబడుతుంది. |
02:32 | ఈదాగి ఉన్న ఫోల్డర్ను చూడడానికి, ls space hyphen a అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:39 | ఇది dot git ఫోల్డర్ను చూపిస్తుంది. ఈ dot git ఫోల్డర్ డిలీట్ చేస్తే మొత్తం repository డిలీట్ అవుతుంది. |
02:47 | కాబట్టి, మీరు ఈ dot git ఫోల్డర్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. |
02:51 | ఇప్పుడు, Git కు, మన ఐడెంటిటీ ను సెట్ చేయాలి. |
02:55 | ఇమెయిల్ చిరునామాను సెట్ చేయడానికి, git space config space hyphen hyphen global space user dot email space priya [dot] spoken@gmail.com అని టైప్ చేసి, Enter నొక్కండి. |
03:12 | ఇక్కడ నేను priya[dot]spoken[at]gmail[dot]com ని ఉపయోగించాను. |
03:18 | మీరు మీ స్వంత ఇమెయిల్ చిరునామాను ఉపయోగించవచ్చు. |
03:21 | usernameని సెట్ చేయడానికి git space config space hyphen hyphen global space user dot name space Priya అని టైప్ చేసి, Enter నొక్కండి. |
03:36 | నేను Priya ను ఒక యూజర్ నేమ్ గా ఉపయోగించాను. దయచేసి Priya కు బదులుగా మీ పేరుని ఉపయోగించండి. |
03:43 | మనము సెట్ చేసే పేరు మరియు ఇమెయిల్ చిరునామా GIT పై పని చేసే వ్యక్తి యొక్క గుర్తింపు. |
03:51 | ఇప్పుడు , నేను commit సందేశాన్ని ఇవ్వడానికి gedit టెక్స్ట్ ఎడిటర్ ను కాన్ఫిగర్ చేస్తాను. |
03:57 | git space config space hyphen hyphen global space core dot editor space gedit అని టైప్ చేసి, Enter నొక్కండి. |
04:09 | ఇప్పుడు gedit, Git కు కాన్ఫిగర్ అయింది. |
04:14 | ఇక్కడ, global flag అనేది ఐచ్చికం. |
04:17 | మనము global flag గురించి మరింత తెలుసుకోవడానికి మన స్లయిడ్లకు వెళ్దాం. |
04:22 | బహుళ రిపోజిటరీలను ఒకే మెషిన్ లో క్రియేట్ చేయవచ్చు. |
04:26 | ఒకవేళ మీరు hyphen hyphen global flag ను ఉపయోగిస్తే గనక, మెషిన్ లోని అన్ని రిపోజిటరీలకు సెట్టింగ్ వర్తిస్తుంది. |
04:34 | మీరు కొత్త Git repositoryని సృష్టించిన ప్రతిసారి, ఈ సెట్టింగ్ అప్రమేయంగా వర్తిస్తుంది. |
04:42 | ఒకవేళ మీకు ఏదో ఒక ప్రత్యేక రిపోజిటరీ కి మాత్రమే గుర్తింపు కావలిస్తే, hyphen hyphen global flag ను ఉపయోగించకండి. |
04:49 | టెర్మినల్ కు తిరిగి వెళ్ళండి. |
04:51 | ఇప్పుడు , మనం ముందుగా సెట్ చేసిన identityయొక్క configuration వివరాలను పరిశీలిద్దాం. |
04:57 | git space config space hyphen hyphen list అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:04 | ఇప్పుడు మీరు editor name, email address మరియు username లను చూడగలరు. |
05:10 | నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళ ను ఉపయోగిస్తాను. |
05:14 | మీరు మీకు నచ్చిన ఫైల్ రకమును ఉపయోగించవచ్చు.ఉదాహరణకు టెక్స్ట్ ఫైళ్ళు లేదా doc ఫైళ్ళు. |
05:22 | Terminal కు తిరిగి వెళ్ళండి. prompt ను క్లియర్ చేద్దాం. |
05:26 | ఇప్పుడు gedit space mypage.html space ampersand అని టైప్ చేయండి. |
05:34 | ఒకవేళ మీరు మరొక ఫైల్ ఉపయోగిస్తున్నట్లయితే, mypage.html కు బదులుగా ఆ ఫైల్ పేరును ఇవ్వండి. |
05:41 | ప్రాంప్ట్ ను ఫ్రీ చెయ్యడానికి & (ఆంపర్సండ్) ను ఉపయోగిస్తాము. ఇప్పుడు, Enter నొక్కండి. |
05:47 | నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొంత కోడ్ ను ఈ ఫైల్ లో కి copy మరియు paste చేస్తాను. |
05:54 | అలాగే, మీ ఫైల్లో కొంత కంటెంట్ను జోడించండి. |
05:58 | ఇప్పుడు, నేను నా ఫైల్ ను save చేస్తాను. |
06:00 | నా దగ్గర కొంత కోడ్ ను కలిగి ఉన్న html ఫైల్ ఉంది. |
06:05 | గమనిక: నేను ఎక్కడైతే mypage.html ను ఉపయోగిస్తానో, అక్కడ మీరు మీ ఫైల్ పేరుతో దాన్ని బదిలీ చేయాలి. |
06:13 | తదుపరి, మనము mypage.html ఫైల్ ను అనుసరించమని Git ను అడుగుతాము. |
06:18 | తిరిగి టెర్మినల్ కు వెళ్ళి git space add space mypage.html అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:27 | ఇప్పుడు, మనము Git యొక్క ప్రస్తుత స్థితిని చూద్దాము . కాబట్టి git space status అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:36 | మీరు new file mypage.html ను చూడవచ్చు. ఈ ఫైల్ mypage.html కు చేసే మార్పులను Git అనుసరించడం మొదలు పెట్టిందని అర్థం. |
06:48 | దీనినే tracking అంటారు. |
06:51 | మన file mypage.html కు తిరిగి వెళ్ళి, |
06:55 | ఈ ఫైల్ కు మరికొంత కోడ్ ను జత చేద్దాము. |
06:58 | ముందు చేసినట్లుగా , నేను నా Writer ఫైల్ నుండి కాపీ చేసి పేస్ట్ చేస్తాను. |
07:06 | ఫైల్ ను Save చేసి క్లోజ్ చేయండి |
07:10 | ఇప్పుడు Terminal కు తిరిగి వెళ్ళండి. ఇంతకముందు చేసినట్లుగా Git యొక్క ప్రస్తుత స్థితిని తనిఖీ చేయడానికి, git space status అని టైప్ చేసి Enter నొక్కండి. |
07:21 | ఇది “Changes not staged for commit: మరియు “modified: mypage.html అని చూపిస్తుంది. |
07:28 | మనం చేసిన మార్పులు staging area కు జత కాలేదని అర్దం. |
07:34 | Staging area గురించి మరింత తెలుసుకోవడానికి మన slides కు వెళ్దాం |
07:39 | Staging area అనేది commit అవ్వవలసిన మార్పుల సమాచారాన్ని నిల్వ చేసే ఒక ఫైల్. |
07:46 | commitచేసే ముందుగా ఫైల్ కంటెంట్ల ను staging area కు జత చేయాలి. |
07:51 | మనము తరువాత tutorials లో commit గురించి మరింతగా చర్చిద్దాం. |
07:56 | పాత Git వర్షన్స్లలో staging area కు బదులుగా index అనే పదాన్ని ఉపయోగించేవారు. |
08:01 | ఇప్పుడు, ఫైల్ యొక్క కొత్త మార్పులను staging area కు ఎలా జోడించాలో చూద్దాం. |
08:07 | Terminal కు తిరిగి వెళ్ళండి. prompt ను క్లియర్ చేద్దాం. |
08:11 | git space add space mypage dot html అని టైప్ చేసి, Enter నొక్కండి. |
08:19 | Git స్టేటస్ని తనిఖీ చేయడానికి, git space status అని టైప్ చేసి, Enter నొక్కండి. |
08:26 | ఇప్పుడు మీరు “Changes to be committed అనే సందేశాన్ని చూడవచ్చు |
08:30 | అంటే ఫైల్, staging areaకి జోడించబడింది మరియు commit అవ్వడానికి సిద్ధంగా ఉందని అర్దం . |
08:37 | మన కోడ్ ని ఈ బిందువు వద్ద freeze చేద్దాం. |
08:40 | మనము పనిలో ఒక ప్రత్యేక దశకు చేరుకున్నప్పుడు, ఆ పనిని repository లో save చేయవచ్చు. దీనినే commit అంటారు. |
08:49 | ప్రతి commit, username, email-id, date, time మరియు commit message ల సమాచారంతో సేవ్ చేయబడుతుంది . |
08:57 | ఇప్పుడు commit ఎలా చేయాలో చూద్దాం. టెర్మినల్ కు తిరిగి వెళ్ళండి మరియు git space commit అని టైప్ చేసి Enter నొక్కండి. |
09:07 | Commit మెసేజ్ పొందడానికి, gedit టెక్స్ట్ ఎడిటర్ స్వయంగా తెరుచుకుంటుంది. |
09:13 | మొదటి లైన్ లో నేను “Initial commit ని commit messageగా టైప్ చేస్తాను. |
09:18 | మీరు కోరుకున్న ఏదైనా సమాచార సందేశాన్ని టైప్ చేయవచ్చు. |
09:22 | ఇక్కడ, కొన్ని లైన్ లను hash తో ప్రారంభం కావడాన్ని చూడవచ్చు. మీరు వాటిని అలానే వదిలివేయవచ్చు లేదా డిలీట్ చేయవచ్చు . |
09:30 | దయచేసి hash లైన్ కు ముందు లేదా తర్వాత commit message ను రాయండి. |
09:35 | భవిష్యత్తులో ఈ commit message తో ఇప్పటి వరకు మనము ఏం చేసామో గుర్తించగలం. |
09:41 | నన్ను ఎడిటర్ ని save చేసి క్లోజ్ చేయనివ్వండి. |
09:44 | మనము commit message, ఎన్ని ఫైళ్ళను మార్చాము, ఎన్ని మార్పులు చేశాము మరియు ఫైల్ యొక్క పేరు లాంటి కొన్ని వివరాలను చూస్తాము. |
09:56 | ఇప్పుడు, git log కమాండ్ ని ఉపయోగించి commit వివరాలు చూద్దాము. |
10:00 | git space log అని టైప్ చేసి Enter నొక్కండి. |
10:06 | మన రిపోజిటరీలో మనకు ఒకే ఒక్క commit ఉంది. |
10:09 | ఇది commit hash లేదా SHA-1 hash అనబడే ఏకైక ఐడిని చూపుతుంది. |
10:16 | SHA-1 hash గురించి మరింత తెలుసుకోవడానికి మన స్లయిడ్లకు వెళ్దాం. |
10:20 | SHA-1 hashఅనేది 40 ఆల్ఫాన్యూమరిక్ అక్షరాల యొక్క ఏకైక ఐడి. |
10:25 | Git దాని మొత్తం సమాచారాన్ని hash విలువ ద్వారా డేటాబేస్లో నిల్వ చేస్తుంది. |
10:31 | Git commits అనేవి SHA-1 hash ద్వారా గుర్తించబడతాయి. |
10:35 | మీరు భవిష్యత్ ట్యుటోరియల్స్ లో SHA-1 hash యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. |
10:41 | మనం టెర్మినల్కు వెళ్దాం . |
10:43 | ఇది author name, email address, date, time మరియు మనము ఇంతకు ముందు ఇచ్చినcommit message వంటి commit కు సంభందించిన వివరాలను చూపుతుంది. |
10:56 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
11:00 | ట్యుటోరియల్ సారాంశం.
ఈ ట్యుటోరియల్ లో మనము Git repository గురించి మరియు git init, status, commit మరియు log అనబడే కొన్ని ప్రాథమిక Git commands గురించి నేర్చుకున్నాము |
11:14 | ఒక అసైన్మెంట్ గా, మీ మెషిన్ లో directory ని సృష్టించి, దానిని repository గా చేయండి. |
11:20 | ఒక టెక్స్ట్ ఫైల్ సృష్టించి, దానిలో కొంత కంటెంట్ ను జత చేర్చండి. |
11:25 | Git repository యొక్క staging area కి ఫైల్ ను జోడించండి. |
11:29 | మీ repository కి ఫైల్ ను Commit చేయండి |
11:32 | git log కమాండ్ ఉపయోగించి commit వివరాలు చూడండి. |
11:35 | ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
11:43 | Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
11:55 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
12:02 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
12:08 | ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు |