Inkscape/C4/Warli-art-for-Textle-design/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 19:42, 6 September 2017 by Yogananda.india (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 Inkscape ను ఉపయోగించి Warli art for Textile design అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం సరిహద్దుల కోసం ఒక వర్లీ నమూనా రూపకల్పనను సృష్టించడం, క్లోనింగ్ ఉపయోగించి పునరావృత నమూనాలు చేయడం నేర్చుకుంటాం.
00:17 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను Ubuntu Linux 12.04 OS, Inkscape వర్షన్ 0.91 ఉపయోగిస్తున్నాను.
00:27 Inkscape ను తెరుద్దాం.ముందుగా వర్లీ పాటర్న్ ను రూపొందిద్దాం.
00:32 File కి వెళ్ళీ Document Properties పై క్లిక్ చేయండి.Orientation ను Landscape కు మార్చి డైలాగ్ బాక్స్ ను మూసివేయండి.
00:42 rectangle tool ను ఎంచుకుని మొత్తం canvas ని కప్పి ఉంచేలా ఒక దీర్ఘచతురస్రాన్ని గీసి, దానిని నీలంరంగుకు మార్చండి.
00:53 Ellipse tool పై క్లిక్ చేసి canvas బయటి భాగంలో ఒక వృత్తాన్ని గీయండి. ఆపై Selector tool పై క్లిక్ చేయండి.
01:02 Tool controls bar పైన విడ్త్ (వెడల్పు)మరియు హైట్ (ఎత్తు)లను 15 కు మార్చండి.
01:08 దాని రంగును నారింజకు మార్చండి. చూపిస్తున్నట్లుగా దానిని canvas యొక్క దిగువభాగానికి కదిలించండి.
01:15 వృత్తాన్ని నకిలీ చేయడానికి Ctrl + D ను నొక్కండి.
01:19 Tool controls bar పైన విడ్త్ (వెడల్పు)మరియు హైట్(ఎత్తు)లను 7 కు మార్చండి.
01:25 నకిలీ వృత్తాన్ని అసలు వృత్తం యొక్క ఎడమ దిగువకు కదిలించండి.
01:31 ఇది వర్లీ ఆకారం యొక్క తల.
01:34 తరువాత, Object menu కి వెళ్ళి Symbols ఎంపికపై క్లిక్ చేయండి.Symbol set డ్రాప్ -డౌన్ మెనూ పై క్లిక్ చేసి, Flow Chart Shapes ను ఎంచుకోండి.
01:46 జ్యామితీయ ఆకృతుల యొక్క ఒక జాబితా కనిపిస్తుంది.త్రిభుజం ఆకారంపై క్లిక్ చేసి దానిని canvas దగ్గరకు లాగండి.రంగును నారింజకు మార్చి Stroke ను తొలగించండి.
02:00 Tool controls bar పైన విడ్త్ (వెడల్పు)మరియు హైట్(ఎత్తు)లను 20 కు మార్చండి.
02:07 త్రిభుజాన్ని నకిలీ చేయటానికి Ctrl + D ని నొక్కి దానిని ఫ్లిప్ చేయడానికి V ని నొక్కండి.
02:14 చూపించినట్లుగా, త్రిభుజాలను తల కింద సర్దుబాటుచేయండి.
02:21 ఇది వర్లీ ఆకారం యొక్క శరీరం.
02:24 Rectangle tool ను ఎంచుకుని తల మరియు శరీరం మధ్యలో ఒక గీతను గీయండి.
02:30 ఇప్పుడు ఆకారం యొక్క మెడ గీయబడింది.
02:33 తరువాత మనం చేతులు మరియు కాళ్ళు గీద్దాం.దీనికోసం, మనం Bezier tool ను ఎంచుకుందాం.
02:41 ప్రదర్శిస్తున్నట్టుగా చేతులు మరియు కాళ్ళు గీయండి.
02:47 హ్యాండ్స్(చేతులు)మరియు లెగ్స్(కాళ్ళు)రెండిటిని ఎంచుకోండి. Fill and Stroke పైన Picker tool ను ఉపయోగించి, వర్లీ ఆర్ట్(కళ)యొక్క బాడీ(శరీరం)నుండి నారింజరంగును ఎంచుకోండి.
02:59 స్ట్రోక్ వెడల్పు(విడ్త్)ను 2 కు మార్చండి.
03:02 ఇప్పుడు అన్ని అంశాలను(ఎలెమెంట్స్)ఎంచుకుని వాటిని అన్నింటినీ సమూహం చేయడానికి Ctrl + G ని నొక్కండి.
03:09 ఇప్పుడు వర్లీ ఆకారం సిద్ధమైనది.ఇప్పుడు ఈ వర్లీ ఫిగర్(ఆకారం)తో ఒక గుండ్రని పాటర్న్(నమూనా)ను సృష్టిద్దాం.
03:17 తరువాత వాటికి వెళ్ళేముందు, నేను ఈ ఫిగర్(ఆకారం)యొక్క ఒక కాపీ( నకలు )చేసి దానిని ఒక్క పక్కన ఉంచుతాను.
03:22 ఇప్పుడు అసలు (ఒరిజినల్)వర్లీ ఆర్ట్(కళ)ను ఎంచుకోండి.యాంకర్ పాయింట్ (బిందువు )కనిపించేలా చేయడానికి ఇప్పుడు, ఫిగర్(ఆకారం)పై ఇంకోసారి క్లిక్ చేయండి
03:30 యాంకర్ పాయింట్ మీద క్లిక్ చేసి ప్రదర్శించినట్లుగా దానిని కిందికి కదిలించండి.
03:36 ఇప్పుడు Edit కి వెళ్ళి Clone పై తరువాత Create Tiled Clones పై క్లిక్ చేయండి.
03:42 డైలాగ్ బాక్స్ లో, Symmetry tab కింద డ్రాప్ -డౌన్ మెనూ లో Simple translation ఎంపిక తప్పకుండా ఉఁడాలి.
03:51 ఆపై Shift tab కి వెళ్ళండి.Per column ఎంపిక కింద, X విలువను -100 కి మార్చండి.
03:58 తరువాత Rotation tab కి వెళ్ళండి.Per row మరియు Per column పారామీటర్స్ యొక్క కోణాన్ని 30 కు మార్చండి.
04:07 దిగువన, rows యొక్క సంఖ్యను 1గా ఉంచుదాం.columns యొక్క సంఖ్యను 12 కు మార్చుదాం.
04:14 ఆపై Create బటన్ పై క్లిక్ చేయండి.
04:16 canvas పైన గుండ్రని పాటర్న్(నమూనా)సృష్టించబడింది గమనించండి.
04:21 ఇప్పుడు మనం కొన్ని ఇతర ఎంపికలను ప్రయత్నిద్దాం.
04:24 Rotation tab కింద Per row మరియు Per column పారామీటర్స్ యొక్క కోణాన్ని 10 కి మార్చి Create పై క్లిక్ చేయండి.
04:33 canvas పైన సృష్టించబడిన పాటర్న్(నమూనా)ను గమనించండి.దానిని పూర్తి గుండ్రని పాటర్న్(నమూనా)గా చేయడానికి Rows ను 40 కి మార్చండి.
04:41 Create పై క్లిక్ చేసి canvas పై మార్పులను గమనించండి.
04:46 అదే విధంగా మీరు వివిధ కోణాల్లో పాటర్న్స్(నమూనాలను)పొందడానికి Rotation పారామీటర్స్ ను మార్చవచ్చు.
04:53 గుండ్రని పాటర్న్(నమూనా)ను ఎంచుకుని వాటన్నిటిని కలిపి సమూహం చేయడానికి Ctrl + G ని నొక్కండి.
04:59 ఇప్పుడు మన canvas పై మనం ఒక మనోహరమైన వర్లీ ఆర్ట్(కళ)ను కలిగిఉన్నాము.
05:04 ఈ విధంగా, దానిని ఒక పక్కకి కదిలిద్దాం.
05:08 ఇప్పుడు, కొన్ని ఇతర ఎంపికలను ప్రయత్నిద్దాం.
05:11 తరువాత, Create Spirals టూల్ ను ఉపయోగించి, చూపించిన విధంగా canvas పై,ఒక చక్కని పెద్ద సర్పిలాకారాన్ని గీయండి.
05:20 Selector tool పై క్లిక్ చేసి, ఒకే ఒక్క వర్లీ ఆకారంను ఎంచుకుని, చూపినవిధంగా, దానిని(స్పైరల్ ) సర్పిలాకారము యొక్క మధ్యభాగంలో ఉంచండి.
05:27 ఇప్పుడు Tool Controls bar పైన Raise to top ఎంపికపై క్లిక్ చేయండి.
05:32 అప్పుడు,( స్పైరల్)సర్పిలాన్ని కూడా ఎంచుకోండి.
05:35 Extensions menu పై క్లిక్ చేసి Generate from path ఎంపికను ఎంచుకోండి.
05:41 కనిపించే సబ్-మెనూ లో Scatter ను ఎంచుకోండి.
05:45 స్క్రీన్ పైన ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.ఇక్కడ, Follow path orientation చెక్ బాక్స్ ను చెక్ చేయండి.
05:54 Space between copies లో, మనం 5 అని ఇస్తాం.
05:58 దానిని నిర్ధారించడానికి-Original pattern will be అనేది Moved కు సర్దబడింది మరియు Duplicate the pattern before deformation అనేది కూడా చెక్ చేయబడింది.
06:08 Apply బటన్ పై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ మూసివేయండి.
06:12 సర్పిల మార్గాన్ని బహిర్గతంచేయడానికి సర్పిల వర్లీ పాటర్న్(నమూనా)ను ఒక పక్కకి కొంచం కదిలిద్దాం.ఇప్పుడు, సర్పిల మార్గాన్ని(పాత్ ను)ఎంచుకుని దానిని తొలగించండి.
06:21 ఇలా Inkscape లో ఒక అందమైన సర్పిల వర్లీ పాటర్న్(నమూనా)ను ఎవరైనా గీయవచ్చు.
06:26 అదేవిధంగా, మనం ఎన్నో మనోహరమైన వర్లీ(పాటర్న్స్)నమూనాలను సృష్టించవచ్చు.
06:31 తరువాత, సరిహద్దును ఎలా సృష్టించాలో నేర్చుకుందాం.
06:35 Object menu కి వెళ్ళి Symbols పై క్లిక్ చేయండి.త్రిభుజం ఆకారంపై క్లిక్ చేసి దానిని canvas వద్దకు లాగండి.
06:42 Tool controls bar పైన విడ్త్(వెడల్పు)మరియు హైట్ (ఎత్తు)లను 30కి మార్చండి.
06:47 ఇప్పుడు త్రిభుజాన్ని canvas యొక్క ఎగువ ఎడమకు కదిలించండి.
06:52 నేను త్రిభుజాన్ని ఉపయోగించి ఒక వరుస (రో)పాటర్న్(నమూనా)ను సృష్టించాలి అనుకుంటున్నాను.
06:56 Edit కి వెళ్ళి Clone పై క్లిక్ చేసి తరువాత Create Tiled Clones పై క్లిక్ చేయండి.మునుపటి అన్నిసెట్టింగులు ఇక్కడ కనిపిస్తాయి.
07:06 Rotation ట్యాబ్ లో, Per Row మరియు Per Column యొక్కAngle పారామీటర్ ను 0 కి మార్చండి.
07:13 Shift ట్యాబ్ లో, Per column ఎంపిక కింద, X విలువను 0 కి మార్చండి.
07:19 చివరగా, ఇక్కడ చుపిస్తున్నట్లుగా, దిగువభాగం వద్ద Column ను 35కు మార్చండి. ఆపై Create బటన్ పై క్లిక్ చేయండి.
07:27 canvas పైన వరుస (రో)పాటర్న్(నమూనా)సృష్టించబడింది గమనించండి.
07:31 అన్ని త్రిభుజాలను ఎంచుకుని వాటన్నిటిని కలిపి సమూహం చేయడానికి Ctrl + G ని నొక్కండి.
07:37 త్రిభుజం పాటర్న్(నమూనా)ను నకిలీ చేయడానికి Ctrl + D ని నొక్కండి.దానిని ఫ్లిప్ చేయడానికి V ని నొక్కండి.
07:43 ఇప్పుడు పాటర్న్(నమూనా)ను canvas యొక్క దిగువభాగానికి కదిలించండి.
07:48 ఇప్పుడు మన వర్లీ పాటర్న్(నమూనా)సిద్ధమైనది.మనం వివిధ వస్త్ర రూపకల్పన కార్యక్రమాలలో ఈ నమూనాను సరిహద్దులుగా ఉపయోగించవచ్చు.
07:55 ఒక కుర్తీ పై అది ఇలా కనిపించాలి.
07:58 మనం దీనిని ఒక దిండు కవర్ డిజైన్ గా కూడా ఉపయోగించవచ్చు.
08:02 మరియు ఈ వర్లీ ఆర్ట్(కళ)ఒక వస్త్ర సంచిపై కూడా చాల గొప్పగా కనిపిస్తుంది.
08:06 కనుక, ఇదేవిధంగా, మీరు వర్లీ కళారూపాన్ని ఉపయోగించి వివిధ రకాల వస్త్ర నమూనాలను సృష్టించవచ్చు.
08:13 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము, సారాంశం చూద్దాం.
08:18 ఈ ట్యుటోరియల్ లో మనం వస్తాల కొరకు వర్లీ పాటర్న్(నమూనా)ను,క్లోనింగ్ ఉపయోగించి (పాటర్న్స్) నమూనాలను సృష్టించడం నేర్చుకున్నాం.
08:27 ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్, ఒక నెమలి పాటర్న్(నమూనా)డిజైన్ ను సృష్టించండి.
08:33 మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
08:37 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది దయచేసి దానిని చూడండి.
08:43 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org.
08:53 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro.
09:03 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya, Yogananda.india