Linux/C3/More-on-sed-command/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:55, 6 September 2017 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 స్పోకెన్ ట్యుటోరియల్ నందు More on sed నకు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం కొన్ని ఉదాహరణల ద్వారా sed command ను గురించి నేర్చుకొంటాము.
00:13 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తున్నది
00:15 Ubuntu Linux ఆపరేటింగ్ సిస్టం వర్షన్ 12.04
00:20 GNU BASH వర్షన్ 4.2.24.
00:24 సాధన చేయుటకు GNU Bash వర్షన్ 4 అంతకంటే ఎక్కువ సిఫార్సు చేయబడుతుంది అని గమనించండి.
00:32 ముందుగా కావలసినవి
00:34 మీకు Linux టెర్మినల్ పై అవగాహన,
00:37 Sed టూల్ గురించి తెలుసుండాలి.
00:40 సంబంధిత ట్యుటోరియల్ కొరకు ఈ క్రింది చూపిన వెబ్ సైట్ ను సందర్శించండి. http://spoken-tutorial.org
00:46 sed టూల్ యొక్క ముఖ్య ఉపయోగము ప్రతిక్షేపణ
00:49 ఇన్పుట్ నందు గల ఒక పాటర్న్ ను వేరొక దానితో ప్రతిక్షేపణ చేయడం.
00:55 ముందుగా ఒక ఒరిజినల్ ఫైల్ seddemo.txt ను పరిశీలిద్దాం.
01:01 Kumar అనే పదం 4 వరుసలో 2 సార్లు, 6 వరుసలో 1 సారి తారసపడినదని గమనించండి.
01:10 మీరు కనుక Kumar తారసపడిన ప్రతీ చోట Roy తో ప్రతిక్షేపణ చేయాలనుకుంటే,
01:16 టెర్మినల్ పై
01:18 sed space within single quote s front slash / opening square bracket small k capital K closing square bracket umar slash Roy slash after the single quotes space seddemo.txt అని టైప్ చేసి,
01:40 ఎంటర్ ను నొక్కండి.
01:43 నాల్గవ వరుసను గమనిస్తే,
01:46 మొదటి సారి తారసపడిన చోట మాత్రమే Kumar విలువ Roy గా మారటం గమనించవచ్చు.
01:52 ఆరవ వరుస ఒకసారి మాత్రమే Kumar విలువను కలిగియున్నది, కావున ఇది ఇప్పుడు ప్రతిక్షేపించబడినది.
01:57 కాబట్టి, ఒక వరుసలో మొదటి విలువ మాత్రమే మారటం మనం గమనించవచ్చు.
02:03 ఇది ఎందువల్లనంటే, by default, వరుసలో మొదట సరిపోలిన ఎంట్రీ మాత్రమే ప్రతిక్షేపణ చేయబడును.
02:11 అన్ని ఎంట్రీలను ప్రతిక్షేపణ జరపాలంటే, మనం flag g ఎంపికను ఉపయోగించాలి.
02:17 ముందుగా నేను ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను.
02:20 sed space (within single quote) s front-slash opening square bracket small k capital K closing square bracket umar slash Roy slash g after the single quote space seddemo.txt అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి.
02:43 ఇప్పుడు నాల్గవ వరుసలో రెండు ఎంట్రీలు ప్రతిక్షేపణ చేయబడ్డాయి.
02:48 మనం ఒకేసారి ఎక్కువ ప్రతిక్షేపణలు కూడా చేయవచ్చు.
02:53 మనం seddemo.txt ఫైల్ లో electronics అనే పదాన్ని electrical పదం తో
02:58 మరియు civil ను metallurgy తో ప్రతిక్షేపణ చేయాలనుకుందాం.
03:04 ముందుగా ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాం.
03:07 sed space hyphen e space within single quotes s front slash electronics slash electrical slash g after the single quote space hyphen e space within single quotes s front-slash civil slash metallurgy slash g after the single quotes space seddemo.txt అని టైప్ చేసి,
03:37 ఎంటర్ ను నొక్కండి.
03:39 పదాలు ప్రతిక్షేపణ చేయబడటం గమనించవచ్చు.
03:43 ఇప్పుడు Anirban యొక్క స్ట్రీమ్ computers నుండి mathematics కు మార్చాలనుకుంటే,
03:49 అటువంటప్పుడు మనం
03:54 sed space within single quotes front-slash Anirban slash s slash computers slash mathematics slash g after the single quotes space seddemo.txt అని టైప్ చేసి,
04:11 ఎంటర్ ను నొక్కాలి.
04:14 stream మారటం మనం చూడవచ్చు.
04:17 దీనిని అర్ధం చేసుకుందాం.
04:21 ముందుగా మనం sed అని వ్రాసి సింగల్ కోట్స్ లో పోల్చవలసిన పాటర్న్ ను వ్రాయాలి.
04:28 ఇది Anirban .
04:30 ఇప్పుడు స్లాష్ తరువాత ఆపరేషన్ వస్తుంది.
04:34 మనం ముందే చూసినట్టు, s అంటే substitution
04:41 తరువాత మనం ప్రతిక్షేపణ చేయబడవలసిన పాటర్న్ అయిన computers ను ఉంచాలి.
04:47 తరువాత ప్రతిక్షేపణ చేయవలసిన పదం mathematics ను ఉంచాలి.
04:53 మనం sed ను ఒక ఫైల్ కు లైన్స్ ను జోడించుటకు,తీసివేయుటకు కూడా ఉపయోగిస్తాము.
05:00 stream విలువ electronics. గా లేని లైన్స్ మనకు అవవసరం లేదనకుందాం.
05:06 దానికోసం మనవద్ద d flag ఉన్నది.
05:10 sed space within single quotes front-slash electronics slash d after the single quotes స్పేస్ seddemo.txt స్పేస్ greater than sign స్పేస్ nonelectronics.txt అని టైప్ చేసి,
05:31 ఎంటర్ ను నొక్కండి.
05:33 విషయాలను చూచుటకు cat space nonelectronics.txt అని టైప్ చేసి, ఎంటర్ ను నొక్కండి.
05:43 ఫైల్ ప్రారంభంలో, మనం Student Information అనే ఒక పంక్తిని జోడించాలని అనుకుందాం.
05:49 దీనికి మనకు i ఎంపిక తో ఒక చర్యఉన్నది.
05:54 sed space in single quotes 1i space Student Information after the quote space seddemo.txt అని టైప్ చేయాలి.
06:10 ఎంటర్ ను నొక్కాలి.
06:13 మీరు ఔట్పుట్ ను చూడగలరు.
06:15 వాస్తవానికి, మనము ఇలాంటి బహుళ పంక్తులను నమోదు చేయవచ్చు.
06:20 మనము రెండు లైన్లను జోడించాలనుకుందాము. దీనికి మనము ఇదే విధంగా చేస్తాము.
06:26 స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తో పాటుగా వచ్చే ఏడాదిలో విద్యావేత్తల ఇన్ఫర్మేషన్ చేర్చాలనుకుంటున్నాము.
06:33 కాబట్టి ఆ సందర్భంలో మనం sed space in single quotes 1i space Student Information slash n 2013 after the quotes seddemo.txt అని వ్రాసి,
06:55 ఎంటర్ నొక్కండి.
06:57 ‘Information’ మరియు ‘2013’ స్ట్రింగ్స్ ల మధ్య slash n ను గమనించండి. .
07:05 slash n అనేది 2013 ను ‘Student Information’ తరువాత లైన్ లో ప్రింట్ చేస్తుంది.
07:12 ఇంతటితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
07:14 సంగ్రహంగా,
07:17 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది.
07:19 ప్రతిక్షేపణ, ప్రత్యామ్నాయం
07:21 మరియు చొప్పించడం
07:24 ఒక అసైన్మెంట్ గా, టెక్స్ట్ ఫైల్ seddemo.txt ను ఉపయోగించి,
07:30 అంకిత్ పేరును ఆశిష్ పేరు తో ప్రతిక్షేపణకు ప్రయత్నించండి.
07:35 ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. http://spoken-tutorial.org/What_is_a_Spoken Tutorial
07:39 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
07:42 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:47 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:53 ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది.
07:57 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి.
08:04 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
08:09 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
08:16 ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
08:22 ఈ స్క్రిప్ట్ అందించినది అనిర్బన్ మరియు సచిన్.
08:28 దీనిని తెలుగు లోనికి అనువదించినది స్వామి. మాతో కలిసినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india