Inkscape/C3/Design-a-visiting-card/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:46, 6 September 2017 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 Inkscape ను ఉపయోగించి Design a Visiting card అను Spoken Tutorial కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి,
00:08 ఒక విజిటింగ్ కార్డ్ కోసం సెట్టింగ్ లు,
00:10 ఒక విజిటింగ్ కార్డ్ ను రూపొందించడం,
00:12 విజిటింగ్ కార్డ్ యొక్క అనేక కాపీలు ముద్రించడానికి సెట్టింగులు.
00:16 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను Ubuntu Linux 12.04 OS, Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను.
00:26 Inkscape ను తెరుద్దాం.
00:28 File కి వెళ్ళండి.Document properties పై క్లిక్ చేయండి.
00:34 Default unitsను Inches కు మరియు డిఫాల్ట్ Orientationను Landscape కు మార్చండి.
00:41 ఇప్పుడు visiting card ను రూపొందించడం ప్రారంభిద్దాం.
00:45 కనుక, Rectangle tool ను ఉపయోగించి ఒక దీర్ఘచతురస్రాన్ని గీయండి.
00:49 Selector tool పై క్లిక్ చేయండి.
00:51 Tool controls bar పైన Width ను, 3.5కు మరియు Height ను 2కు మార్చండి.
01:00 దానిని canvas యొక్క ఎడమ ఎగువ మూలకు కదిలించండి.
01:05 రంగును ముదురు ఆకుపచ్చకు మార్చండి.
01:08 ఇప్పుడు ఒక నమూనాను రూపొందిద్దాము.
01:10 Bezier tool ను ఎంచుకుని ఒక తరంగాల రేఖను గీయండి.
01:14 Object మెనూ కి వెళ్ళండి. Fill and Stroke ను తెరవండి.
01:19 stroke రంగును పసుపుకు మార్చండి.
01:23 ఇప్పుడు, తరంగాల రేఖ కింద ఒక సరళ రేఖను గీయండి.
01:26 రెండు రేఖలను ఎంచుకుని Extensions మెనూ కి వెళ్ళండి.
01:30 Generate from path పై క్లిక్ చేసి, తరువాత Interpolate పై క్లిక్ చేయండి.
01:35 Exponent విలువ 0 గా ఉందా అని తనిఖీ చేయండి.
01:38 Interpolation steps విలువను 30 కి మార్చండి.
01:42 Apply బటన్ పై క్లిక్ చేసి, తరువాత Close బటన్ పై క్లిక్ చేయండి.
01:46 Interpolation ప్రభావం ఇపుడు వర్తించబడిందని గమనించండి.
01:50 Interpolate డిజైన్ (రూపకల్పనకు)కు కొంత ప్రకాశమైన ప్రభావాన్నిఇద్దాం.డిజైన్ ను ఎంచుకోండి.
01:55 Filters మెనూ కి వెళ్ళి, Shadows and Glows పై, తరువాత Glow పై క్లిక్ చేయండి.
02:02 డిజైన్ కు వర్తించబడిన ప్రకాశమైన ప్రభావాన్ని గమనించండి.
02:06 ఇప్పుడు Spoken Tutorial logo ను దిగుమతి చేద్దాం.
02:10 నేను దానిని నా Documents ఫోల్డర్ లో భద్రపరిచాను.
02:13 Code files లింక్ లో మీకు ఈ logo ఇవ్వబడింది.
02:17 File కి వెళ్ళి Import పై క్లిక్ చేయండి.
02:23 లోగో ను Resize చేసి, దానిని ఎగువ ఎడమ మూలలో ఉంచండి.
02:27 నేను ఇప్పటికే సేవ్ చేసియున్న ఒక LibreOffice Writer ఫైల్ నుండి విజిటింగ్ కార్డ్ వివరాలను కాపీ చేస్తాను.
02:34 ఈ ఫైల్ మీకు Codes files లింక్ లో ఇవ్వబడింది.
02:38 Font sizeను 12కు మరియు text colorను తెలుపుకు మార్చండి.
02:43 Spoken Tutorial పదాన్ని ఎంచుకోండి.
02:45 ఫాంట్ పరిమాణాన్ని16కు మార్చి దానిని బోల్డ్ గా చేయండి.
02:50 ఇప్పుడు, Spoken Tutorial కోసం మన విజిటింగ్ కార్డ్ సిద్ధమైనది.
02:55 తరువాత, మనం విజిటింగ్ కార్డ్ యొక్క అనేక కాపీలు సృష్టించడం నేర్చుకుంటాం.
02:59 మనము దీన్ని cloning పద్ధతి ద్వారా చేయవచ్చు.
03:03 ఇలా చేయడం కోసం, మనం మొదట అన్ని అంశాలను సమూహపరచాలి.
03:06 అన్ని అంశాలను ఎంచుకోవడానికి Ctrl + A ని నొక్కి వాటిని సమూహపరచడానికి Ctrl + G ని నొక్కండి.
03:13 ఇప్పుడు, Edit మెనూ కి వెళ్ళండి.
03:15 Clone పై క్లిక్ చేసి, తరువాత Create Tiled Clones పై క్లిక్ చేయండి.
03:20 Create Tiled Clones డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
03:23 Symmetry ట్యాబ్ కింద, అడ్డువరుసల సంఖ్యను 4 కి మరియు నిలువు వరుసల సంఖ్యను 3 కి మార్చండి.
03:30 ఇప్పుడు, Create బటన్ పై క్లిక్ చేయండి.
03:33 తరువాత డైలాగ్ బాక్స్ ని మూసివేయండి.
03:35 విజిటింగ్ కార్డ్ యొక్క అనేక కాపీలు కేన్వాస్ పై కనిపిస్తాయి, గమనించండి.
03:40 ఈ విధంగా, మనం విజిటింగ్ కార్డ్ యొక్క అనేక కాపీలు ముద్రించవచ్చు.
03:44 మీ దృష్టిని ఎగువ ఎడమవైపు ఉన్న విజిటింగ్ కార్డు వద్దకు మళ్ళించండి.
03:48 దానిపై క్లిక్ చేసి దానియొక్క స్థానం నుండి కదిలించండి.
03:50 ఇది అదనపు కాపీగా ఉన్నందున ఇప్పుడు ఈ కార్డ్ ను తొలగించండి.
03:54 ఒకవేళ చేర్చవలసిన కొన్ని మార్పులు ఏమైనా ఉంటే అవి ఏమిటి?
03:59 మనం విజిటింగ్ కార్డ్ యొక్క ప్రతీ కాపీని మార్చవల్సి ఉంటుందా?
04:02 ఆలా ఏమి కాదు, మనం అసలు విజిటింగ్ కార్డ్ లో మాత్రమే దిద్దుబాట్లు చేయవలసి ఉంటుంది.
04:07 అదే అన్ని కాపీలలో ప్రతిబింబిస్తుంది.
04:10 దీనిని ప్రయత్నిద్దాం, అసలు కార్డ్ లోని Spoken Tutorial అనే పదం పై డబల్-క్లిక్ చేసి, దాని రంగును గోధుమ రంగుకు మార్చండి.
04:18 ఈ మార్పు విజిటింగ్ కార్డ్ యొక్క అన్ని కాపీలలో ప్రతిబింబిస్తాయి గమనించండి.
04:24 ఇప్పుడు, ఫైల్ ను save చేద్దాం.
04:26 SVG ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl + S ను నొక్కండి.నేను నా ఫైల్ ను సేవ్ చేయటానికి Desktop ను లొకేషన్ గా ఎంచుకుంటాను.
04:35 ఇంకా నేను Filename ను ST-visiting-card గా టైప్ చేసి Save పై క్లిక్ చేస్తాను.
04:43 దీని తరువాత, మనము ఫైల్ ను PDF ఫార్మాట్ లో సేవ్ చేస్తాము.
04:48 మరోసారి, File కి వెళ్ళి Save As పై క్లిక్ చేయండి.
04:53 ఎక్స్టెన్షన్ ను PDF కు మార్చి Save పై క్లిక్ చేయండి.
04:57 resolution ను 300 కి మార్చి OK పై క్లిక్ చేయండి.
05:01 డెస్క్టాప్ కి వెళ్దాం.
05:03 ఇక్కడ మనం భద్రపరచిన ఫైల్ ఉంది.దానిని తెరుద్దాం.
05:08 మనం సృష్టించిన విజిటింగ్ కార్డ్ లు ఇక్కడ ఉన్నాయి.
05:11 సారాంశం చూద్దాం.
05:13 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,విజిటింగ్ కార్డ్ కొరకు సెట్టింగ్ లు, విజిటింగ్ కార్డ్ యొక్క రూపకల్పన, విజిటింగ్ కార్డ్ యొక్క బహుళ కాపీలు ముద్రించడానికి సెట్టింగులు.
05:23 ఇక్కడ మీ కోసం ఒక అసైన్మెంట్-
05:26 మీ పేరుతో, మీ ఇన్స్టిట్యూట్/ అర్గనైజీషాన్ యొక్క పేరు తోమీ ఇన్స్టిట్యూట్/ అర్ గనైజీషాన్ యొక్క లోగో తోమీ ఇన్స్టిట్యూట్/ అర్గనైజీషాన్ యొక్క వెబ్సైట్ చిరునామా తో ఒక విజిటింగ్ కార్డ్ను సృష్టించండి.
05:38 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. దయచేసి దానిని చూడండి.
05:44 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
05:51 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:contact@spoken-tutorial.org.
05:54 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
05:59 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:http://spoken-tutorial.org/NMEICT-Intro.
06:03 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya, Yogananda.india