Inkscape/C2/Basics-of-Bezier-Tool/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 21:55, 3 September 2017 by Madhurig (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:00 Inkscape ను ఉపయోగించి Basics of Bezier tool అను Spoken Tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి-
00:08 సరళ రేఖలు మరియు సంవృత ఆకారాలు గీయడం,
00:11 వక్ర రేఖలను గీయడం,
00:13 నోడ్స్ జోడించడం, సర్దుబాటు చేయడం మరియు తొలగించడం.
00:15 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను,
00:18 Ubuntu Linux12.04 OS
00:21 Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను.
00:24 నేను ఈ ట్యుటోరియల్ ని గరిష్ట రెసొల్యూషన్ మోడ్ లో రికార్డ్ చేస్తున్నాను.
00:28 ఇలా చేయటం వలన అన్నీటూల్స్ ప్రదర్శింపబడతాయి.
00:32 Inkscape ను తెరుద్దాం.
00:35 ముందుగా Bezier tool ను ఉపయోగించి ఒక సరళ రేఖను గీద్దాం.
00:39 Bezier tool సరిగ్గా Pencil tool క్రిందన ఉంటుంది.
00:42 దానిపై క్లిక్ చేద్దాం.
00:44 ఎగువన ఎడమవైపు ఉన్న Tool controls bar లోని 4 ఎంపికలను గమనించండి.
00:48 Bezier curve ను 4 రకాలుగా గీయవచ్చు.
00:51 అప్రమేయంగా, Create regular Bezier path ఎంపిక అమలులో ఉంటుంది.
00:57 ఒకసారి canvas పై క్లిక్ చేసి, కర్సర్ ను వేరొక చివరకు తరలించండి.
01:01 మరోసారి క్లిక్ చేయండి. గీసిన గీత ఆకుపచ్చ రంగులో హైలైట్ అవుతుందని గమనించండి.
01:07 ఇప్పుడు, రేఖను పూర్తి చేయడానికి రైట్ -క్లిక్ చేయండి.
01:11 రేఖ యొక్క రెండు చివరి బిందువులను nodes అంటారు.మనం వాటి గూర్చి త్వరలో నేర్చుకుంటాం.
01:17 తరువాత, మనం ఒక త్రిభుజాన్ని గీద్దాం.
01:21 ముందుగా, ఒక వాలు రేఖను గీయండి.మళ్ళీ క్లిక్ చేసి, ఒక కోణంలో మరొక గీతను గీయండి.
01:27 ఇప్పుడు మూడవ రేఖను గీయడానికి మరో సారి క్లిక్ చేసి, ప్రారంభ node తో కలపండి,దీనితో త్రిభుజం పూర్తి అవుతుంది.
01:34 తరువాత, మనం Bezier tool ను ఉపయోగించి ఒక వక్ర రేఖను గీద్దాం.
01:38 సరళ రేఖను గీయడానికి, కెన్వాస్ పై క్లిక్ చేయండి. ఒక వక్రమును రూపొందించడానికి మళ్ళీ క్లిక్ చేసి, పట్టుకొని లాగండి
01:46 వక్రమును పూర్తిచేయడానికి రైట్ -క్లిక్ చేయండి.
01:48 ఇదే విధంగా, కెన్వాస్ పై మరిన్ని వక్రములను గీయండి.
01:55 ఈ సోపానాలు గుర్తుంచుకోండి- 1.క్లిక్ చేసి ఒక సరళ రేఖను గీయండి.
01:59 2.ఒక వక్రమును రూపొందించడానికి మళ్ళీ క్లిక్ చేసి, పట్టుకొని లాగండి.
02:03 3.ఆపై వక్రతను పూర్తి చేయడానికి రైట్ -క్లిక్ చేయండి.
02:06 తరువాత వాటికి వెళ్ళే ముందు, Ctrl + A నొక్కి కెన్వాస్ ను శుభ్రం చేయండి.
02:11 తరువాత, మనము ఒక సంవృత వక్ర మార్గాన్ని ఎలా గీయాలో నేర్చుకుందాం.
02:15 ముందు కెన్వాస్ పై ఒక వక్రరేఖను గీయండి.
02:18 ఇప్పుడు మనం mouse ని వదిలిపెట్టి, కర్సర్ ను వక్రరేఖ యొక్క చివరి node నుండి దూరంగా కదిలిద్దాం.
02:23 మనం ఎరుపు రంగులో ఒక వక్ర మార్గాన్ని చూస్తాము.
02:27 ఒక వేళ మీరు కర్సర్ ను ఒకసారి క్లిక్ చేసి కదిపితే, ఎరుపు రంగులో ఒక సరళరేఖను చూస్తారు. దానిని వక్రంగా చేయటానికి, క్లిక్ చేసి లాగాలి.
02:36 మళ్ళీ చివరి నోడ్ వద్ద, కర్సర్ ను కదిపిన కొద్ది రేఖ వక్రంగా మారుతుంది.
02:41 మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి; మనం ఎరుపు రంగులో ఒక సరళరేఖ మార్గాన్ని చూస్తాము. సరళ రేఖను వక్రంగా చేయడానికి, క్లిక్ చేసి లాగండి.
02:50 మళ్ళీ చివరి నోడ్ వద్ద, కర్సర్ ని కదిపిన కొద్ది రేఖ వక్రంగా మారుతుంది. కర్సర్ ను కదిలిస్తూ మొదటి నోడ్ వద్దకు తిరిగివచ్చి పాత్ ను మూసివేయండి.
02:59 Tool controls bar కు వెళ్ళి, మోడ్ యొక్క రెండవ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇది సర్పిలాకార రేఖలు మరియు అక్రమ ఆకారాలను సృష్టించడానికి సహాయం చేస్తుంది.
03:08 కొన్ని అక్రమ వక్రాలను గీసి, పాత్ ను మూసివేయండి.
03:15 ఇది దానికి సన్నిహితమైన సర్పిలాకారములో లోకి రూపాంతరం చెందటం గమనించండి. నేను ఇప్పుడు కెన్వాస్ ను శుభ్రం చేస్తాను.
03:22 మూడవ ఐకాన్ సరళరేఖలను మాత్రమే సృష్టిస్తుంది. దానిపై క్లిక్ చేసి canvas పై రేఖలను గీయండి.
03:29 ఈ మోడ్ లో మనం వక్రరేఖలను గీయలేమని గమనించండి.
03:32 మనం సరళరేఖలు భుజాలుగా కలిగిఉండే త్రిభుజాలను లేదా బహుభుజులను గీయవచ్చు.
03:40 చివరి ఐకాన్ పై క్లిక్ చేసి canvas పై గీయండి.
03:44 ఈ మోడ్ లో, మనం సమాంతర రేఖలు మరియు లంబరేఖలను మాత్రమే గీయగలము అంటే అవి క్షితిజ లంబరేఖలు లేదా క్షితిజ సమాంతర రేఖలు ఏవయినా కావొచ్చు.
03:52 కనుక, మనం ఈ మోడ్ లో చతురస్రాలు మరియు దీర్ఘచతురస్రాలు గీయవచ్చు.
03:58 నేను గీసిన అన్ని ఆకారాలను తొలగిస్తాను.
04:02 Shape ఎంపిక, రేఖలు లేదా వక్రాలను ఒక నిర్దిష్టమైన ఆకారంలో గీయటానికి సహాయం చేస్తుంది.
04:07 డ్రాప్ -డౌన్ బటన్ పై క్లిక్ చేయండి.
04:09 ఇక్కడ 5 ఎంపికలు ఉన్నాయి అవి - None, Triangle in, Triangle out, Ellipse, From clipboard.
04:18 మొదటి ఎంపిక None ఇది ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వదు. కనుక, మనంTriangle in కు వెల్దాము.
04:25 canvas పైన ఒక రేఖను గీయటానికి దానిపై క్లిక్ చేయండి.
04:28 ఈ రేఖ లోపల వైపుకు చూపే ఒక త్రిభుజం ఆకారంలోకి మార్చబడింది.
04:34 తరువాత, Triangle out పై క్లిక్ చేసి కేన్వాస్ పైన ఒక రేఖను గీయండి.
04:39 ఇప్పుడు ఒక త్రిభుజం ఆకారం బయట వైపుకు ఏర్పడుతుంది.
04:43 Ellipse పై క్లిక్ చేసి ఒక రేఖను గీయండి.
04:47 రేఖ ఇప్పుడు ellipse ఆకారంలో ఉండటం గమనించండి.
04:50 చివరి ఎంపిక From clipboard మనం దేని గూర్చి తరువాత ట్యుటోరియల్ లో నేర్చుకుంటాం.
04:56 ఇప్పుడు,nodes ఎలా జోడించాలో, సవరించాలో మరియు తొలగించాలో నేర్చుకుందాం.
05:00 ఇది Node tool ను ఉపయోగించి చేయవచ్చు.
05:03 canvas పైన రేఖలను తొలగించండి.
05:06 Tool controls bar కి వెళ్ళి Mode ను regular path కు మరియు Shape ను None కు మార్చండి.
05:13 canvas కు తిరిగివచ్చి ఒక సుమారుగా ఉండే మనిషి అరచేతిని గీయండి.
05:23 ఇప్పుడు, Node టూల్ పై క్లిక్ చేయండి.
05:26 ఈ చిత్రంలో అన్ని నోడ్స్ కనిపిస్తున్నాయి అని గమనించండి.
05:30 మీ దృష్టిని Tool Controls bar కు మార్చండి.
05:33 ఇక్కడ ఉన్న మొదటి 6 ఐకాన్లు, nodes మరియు paths లను జోడించడానికి, తొలగించటానికి సహాయపడతాయి.
05:38 ఇంకా బాగా అర్ధం చేసుకోవటానికి టూల్ టిప్ ను (సాధన చిట్కా) చూడండి.
05:41 ఏదైనా విభాగంలో క్లిక్ చేస్తే, నోడ్స్ రెండూ నీలం రంగులోనికి, మారతాయి అని గమనించండి.
05:48 ఇప్పుడు Add node ఎంపికపై క్లిక్ చేయండి.
05:52 సరిగ్గా ఎంచుకున్న సిగ్మెంట్ నోడ్ల మధ్య, క్రొత్త నోడ్ జతచేయబడిందని గమనించండి.
05:58 ఇప్పుడు, చిన్నసిగ్మెంట్ ను ఎంచుకుని, పైన ఉన్న దశలను పునరావృతం చేయండి.
06:04 చిన్న సిగ్మెంట్ మధ్య బిందువు వద్ద ఒక కొత్త నోడ్ జోడించబడిందని మీరు చూస్తారు.
06:10 ఇప్పుడు, కొత్తగా జోడించిన నోడ్ ను ఎంచుకోండి.
06:13 Delete node ఎంపికపై క్లిక్ చేయండి. నోడ్ ఇప్పుడు తొలగించబడింది.
06:18 అరచేతిపై ఉన్న nodes లో ఏదయినా ఒకదాన్ని క్లిక్ చేయండి.
06:21 Bezier handle కనిపించేలా చేయడానికి,Tool controls bar పై చివర నుండి రెండవ ఐకాన్ పై క్లిక్ చేయండి.
06:27 ఇప్పుడు, ఎంచుకున్న సిగ్మెంట్ కోసం Bezier handles కనిపిస్తాయి.
06:32 ఒకవేళ కనిపించకపోతే, అప్పుడు సిగ్మెంట్ మీద క్లిక్ చేసి mouse ను వదిలి పెట్టకుండా, దాన్ని కొద్దిగా కదిలించండి.
06:37 సెగ్మెంట్ వక్రం అవుతుంది మరియు ఇప్పుడు Bezier handles కనిపిస్తాయి.
06:41 ఎంచుకున్నnode యొక్క పరిమాణం మార్చుటకు మరియు త్రిప్పుటకు handles పై క్లిక్ చేయండి.
06:45 ఇదే విధంగా, ఇతర nodes ను కూడా మార్చండి.
07:04 తరువాత ఐకాన్ nodes ను జోడించడానికి సహాయపడుతుంది.
07:07 చూపుడు వేలుపై ఒక అదనపు node ఉందని, గమనించండి,
07:11 Shift కీ ని ఉపయోగించి అదనపు మధ్య మరియు ఎగువ node లను ఎంచుకోండి.
07:18 ఇప్పుడు, Join node ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు నోడ్స్ ఒకదానితో ఒకటి కలిసిపోవటం గమనించండి.
07:25 తరువాత ఐకాన్, ఎంచుకున్న nodes వద్ద path ను విచ్చిన్నం చేయటానికి సహాయం చేస్తుంది.
07:29 ఇప్పుడు నేను బొటన వేలు మరియు చూపుడు వేలు మధ్య సంబంధాన్ని విచ్చిన్నం చేస్తాను.
07:33 కనుక, వాటి మధ్యలో ఉన్న ప్రారంభపు node ను ఎంచుకుని, Break path ఐకాన్ పై క్లిక్ చేయండి.
07:40 నోడ్ ఎంపికను రద్దు చేయండి. తర్వాత మళ్ళీ దాన్ని ఎంచుకుని, దాన్ని కొద్దిగా కదిలించండి.
07:46 పాత్ విచ్ఛిన్నం అయిందని మీరు గమనిస్తారు మరియు nodes రెండు విభిన్న నోడ్స్ గా వేరుచేయబడతాయి.
07:53 వాటిని అతికించడానికి, అవే రెండు nodes ను ఎంచుకుని, Tool controls bar లోని Join selected end-nodes ఐకాన్ పై క్లిక్ చేయండి.
08:03 ఈ రెండు nodes మధ్య ఒక కొత్త path సృష్టించబడిందని గమనించండి.
08:08 path లేదా segment ను తొలగించడానికి తరువాత ఐకాన్ అనగా Delete segment పై క్లిక్ చేయండి.ఇపుడు పాత్ తొలగించబడింది.
08:17 ఈ చర్యను undo చేయటానికి Ctrl + Z నొక్కండి.
08:20 నేను ఈ చేతిని పక్కన పెడతాను. Node tool పై ఇంకోసారి క్లిక్ చేయండి.
08:26 Tool controls bar పై ఉన్న తరువాత నాలుగు ఐకాన్స్ ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం.
08:30 ఈ ఐకాన్స్ ఎంచుకున్న నోడ్స్ ను edit చేయటానికి సహాయం చేస్తాయి.
08:34 Bezier tool ఉపయోగించి, బోర్లించిన U ఆకారాన్ని గీయండి. Node టూల్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మూడు nodes ఉన్నాయి అని గమనించండి.
08:49 ఎగువ నోడ్ ను ఎంచుకుని, Tool controls bar పై ఉన్న Make selected nodes corner icon అనే ఐకాన్ పై క్లిక్ చేయండి.
08:55 ఆ నోడ్ కార్నర్ నోడ్ గా అవుతుంది.
08:58 మార్పును చూడటానికి Bezier handles పై క్లిక్ చేసి వాటిని పైకి క్రిందికి కదిలించండి.
09:03 node ని మృదువుగా చేయటానికి తరువాత ఐకాన్ పై క్లిక్ చేయండి.ఆకారంలో వచ్చిన మార్పును గమనించండి.
09:11 తరువాత ఐకాన్ పై క్లిక్ చేయండి ఇది node ను సమానం చేస్తుంది.
09:16 తరువాత ఐకాన్ పై క్లిక్ చేయండి ఇది nodeను స్వయంచాలకంగా మృదువుగా మారేలా చేస్తుంది.
09:20 తరువాత రెండు ఐకాన్స్ సెగ్మెంట్స్ పైన మాత్రమే పనిచేస్తాయి. కనుక, U ఆకారం యొక్క ఎడమ సెగ్మెంట్ ను ఎంచుకుని మొదటి ఐకాన్ పై క్లిక్ చేయండి.
09:30 టూల్ చిట్కా చూపినట్లు, సిగ్మెంట్ ఇప్పుడు ఒక సరళరేఖగా తయారుచేయబడింది.
09:35 Bezier handle మీద క్లిక్ చేసి, కదిలించడానికి ప్రయత్నించండి. మనం దానిని వక్రంగా చేయలేము అని మీరు చూస్తారు.
09:44 మళ్ళీ ఒక వక్ర రేఖ ను తయారు చేయడానికి తరువాత ఐకాన్ పై క్లిక్ చేయండి.
09:49 ఇప్పుడు, Bezier handles ను కదిలించి మనం దానిని ఒక వక్రం ఆకారంలోకి మార్చవచ్చు.
09:54 ఎంచుకున్న ఆబ్జెక్టు ను path కు మార్చడానికి తరువాత ఐకాన్ పై క్లిక్ చేయండి.
09:58 stroke ను path కు మార్చడానికి తరువాత ఐకాన్ పై క్లిక్ చేయండి.
10:02 strokes కనిపించేలా చేయడానికి nodes పై క్లిక్ చేసి, లాగండి.
10:08 తరువాత రెండు ఐకాన్స్ ఎంచుకున్న nodes ను వరుసగా X మరియు Y దిశలలో కదిలించడానికి సహాయం చేస్తాయి.
10:15 పైకి మరియు క్రిందికి ఉన్న బాణాలపై క్లిక్ చేసి, మార్పును గమనించండి.
10:24 పాత్ క్లిప్పింగ్ మరియు మాస్కింగ్ ప్రభావాలను కలిగిఉన్నపుడు మాత్రమే తరువాత రెండు ఐకాన్స్ పనిచేస్తాయి.
10:29 మీరు ఈ ఎంపికలను మీ స్వంతంగా అన్వేషించవచ్చు.
10:33 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి,
10:37 సరళ రేఖలు మరియు సంవృత ఆకారాలు గీయడం,
10:39 వక్రరేఖలను గీయడం,
10:41 నోడ్స్ జోడించడం, సర్దుబాటు చేయడం మరియు తొలగించడం.
10:43 మీకోసం ఇక్కడొక అసైన్మెంట్-
10:46 అయిదు రేకులు, ఒక కాడ మరియు రెండు ఆకులతో Bezier tool ను ఉపయోగించి ఒక పుష్పాన్ని గీయండి.
10:52 రేకులకు పింక్ కలర్ ఇవ్వండి.
10:54 కాడ మరియు ఆకులకు గ్రీన్ కలర్ ను ఇవ్వండి.
10:57 మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
11:00 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. దయచేసి దానిని చూడండి.
11:05 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
11:12 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి:
11:14 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
11:20 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro.
11:24 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
11:26 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya, Yogananda.india