Firefox/C4/Extensions/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 17:17, 31 August 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:00 | Mozilla Firefox లో Extensions పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనం Extensions ,లేదా Add-ons , Extensionsను స్థాపన చేయుట, మరియు సిఫార్స్ చేయగల Extensions గురించి నేర్చుకుంటాము. |
00:14 | ఇక్కడ,నేను ఉబుంటు 10.04 OS పై ఫైర్ఫాక్స్ 7.0 ను ఉపయోగిస్తున్నాను. |
00:20 | Firefox బ్రౌజర్ ను ఓపెన్ చేద్దాము |
00:23 | అప్రమేయంగా, "యాహూ" హోమ్ పేజీ తెరవబడును. |
00:27 | Extensions or Add-ons అంటే ఏమిటి? |
00:29 | Extensions మనకు, |
00:31 | Firefox బ్రౌజర్ కు క్రొత్త ఫీచర్లను జోడించడం, |
00:35 | ఇప్పటికే ఉన్న లక్షణాలను మెరుగుపరచడం, |
00:37 | మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ను అనుకూలీకరించడం మొదలైన వాటిని అందిస్తుంది. |
00:42 | Extensions అనేవి ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో ఒక భాగం |
00:45 | ఇవి బ్రౌజర్ యొక్క సామర్థ్యాలను విస్తరిస్తాయి. |
00:48 | ఉదాహరణకు, మీరు ఎక్స్టెన్షన్స్ ను ఇన్స్టాల్ చేసి, |
00:51 | ప్రకటనలు లేదా పాప్-అప్ లను బ్లాక్ చేయవచ్చు, |
00:54 | సరుకుల ధరలను కూడా సరిపోల్చవచ్చు మరియు |
00:56 | నవీకరించబడినదో లేదో ప్రదర్శించవచ్చు. |
01:00 | ముందుగా Grab and Drag పొడిగింపును ఇన్స్టాల్ cheddam. |
01:03 | Grab and Drag వివిధ మార్గాల్లో వెబ్ పుటలను స్క్రోల్ చేయుటకు ఉపయోగపడును. |
01:07 | ఇది అడోబ్ అక్రోబాట్ లో grab and drag లాగా పనిచేస్తుంది. |
01:12 | మెనూ బార్ నుండి, టూల్స్ ఆపై యాడ్-ఆన్స్ పై క్లిక్ చెయ్యండి. |
01:16 | యాడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది. |
01:20 | ప్రత్యామ్నాయంగా, మీరు Ctrl + Shift + A కీలను ఒకేసారి నొక్కి యాడ్-ఆన్స్ మేనేజర్ ట్యాబ్ నుతెరవవచ్చు. |
01:28 | యాడ్-ఆన్స్ మేనేజర్లో ఎడమ పానెల్ అందుబాటులో ఉన్న ఎంపికలను ప్రదర్శిస్తుంది. |
01:34 | అప్రమేయంగా Get Add-ons ఐచ్చికం ఎంపికై ఉన్నదని గమనించండి. |
01:39 | ఎడమ పానెల్ లో ఎంపిక చేసిన ఐచ్చికం యొక్క సమాచారాన్ని కుడి పానల్ ప్రదర్శిస్తుంది. |
01:45 | కాబట్టి, కుడి పానెల్ Add-ons లను నిర్వచిస్తూ, యాడ్-ఆన్‌లతో ఎలా ప్రారంభించాలో మీకు చెబుతుంది. |
01:51 | ఇది మీరు ఇన్స్టాల్ చేయదగిన కొన్ని Add-ons జాబితాను కూడా ప్రదర్శిస్తుంది. |
01:55 | ఇప్పుడు, మనము కొత్త యాడ్-ఆన్ అయిన గ్రాబ్ అండ్ డ్రాగ్ ను ఇన్స్టాల్ చేస్తాము. |
01:59 | మొదటగా, ఎగువ కుడి మూలన ఉన్న సెర్చ్ బార్ లో, Grab and Drag అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి. |
02:08 | కుడి పానెల్, ఇప్పుడు మనం శోధించిన పేరుకు సరిగ్గా సరిపోయే add-ons జాబితా ను ఇస్తుంది. |
02:14 | అలాగే, టైటిల్ లో డ్రాగ్ పదం ఉన్న అన్ని add-ons ప్రదర్శించబడతాయని గమనించండి. |
02:20 | ఇక్కడ జాబితాలో మొదటి పేరు అయిన Grab and Drag ఖచ్చితమైన మ్యాచ్ అని గమనించండి, |
02:26 | ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. |
02:28 | చాలా సాఫ్ట్ వేర్ల మాదిరిగా, కొన్ని అనుబంధాలు కూడా, end-user license agreements lanu కలిగి ఉండవచ్చు. |
02:35 | End-User License Agreement డైలాగ్ బాక్స్ లో, Accept and Install పై క్లిక్ చేయండి. |
02:41 | యాడ్-ఆన్ డౌన్లోడ్ పురోగతి బార్ కనిపిస్తుంది. |
02:46 | తరువాత, add-on will be installed |
02:50 | when you restart Mozilla Firefox అనే సందేశం ప్రదర్శించబడుతుంది. |
02:54 | Restart Now పై క్లిక్ చేయండి. |
02:57 | ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ముగుస్తుంది మరియు తిరిగి తెరవబడును. |
03:01 | యాడ్-ఆన్స్ మేనేజర్ కొత్త ట్యాబ్‌లో తెరువబడును. |
03:05 | ఎక్స్టెన్షన్స్ ట్యాబ్ యొక్క కుడి ప్యానెల్లో Grab and Drag పొడిగింపు ప్రదర్శించబడిందని గమనించండి. |
03:11 | మునుపటి సోఫానాలను అనుసరిస్తూ, మరొక ఎక్స్టెన్షన్స్nu స్క్రాప్ బుక్ nu ఇన్స్టాల్ చేద్దాము. |
03:18 | స్క్రాప్ బుక్ ను ఉపయోగించి, మీరు వెబ్ పుట సేకరణలను సేవ్ చేసి నిర్వహించవచ్చు. |
03:24 | ఇన్స్టాలేషన్ పురోగతి పట్టీ మరియు ఫైర్ఫాక్స్ మూసివేసి, పునఃప్రారంభించే సందేశం ప్రత్యేకంగా ప్రదర్శించబడకపోవటం గమనించండి. |
03:33 | అవి Scrap Book బార్లో ప్రదర్శించబడతాయి. |
03:36 | Restart Now పై క్లిక్ చేయండి. |
03:40 | స్క్రాప్ బుక్ ఫైర్ఫాక్స్ లో ఇన్స్టాల్ చేయబడింది. |
03:44 | ఈ ట్యుటోరియల్ ను పాజ్ చేసి, ఈ assignment. ను చేయండి. |
03:48 | ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో, యాడ్-ఆన్స్ మేనేజర్ ను తెరవండి. |
03:52 | Featured Add-ons జాబితా నుండి Get Add-ons ఎంపికలో కొత్త యాడ్-ఆన్ ను ఇన్స్టాల్ చేయండి. |
03:59 | మీరు extensions జోడించడం, తొలగించడం లేదా update చేయటం వంటి వాటిని |
04:03 | యాడ్-ఆన్స్ మేనేజర్ లో Extensions ఎంపికను |
04:06 | ఉపయోగించడం ద్వారా నిర్వహిస్తారు |
04:08 | ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో, యాడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ పై క్లిక్ చేయండి. |
04:13 | ఎడమ పానెల్ నుండి, Extensions పై క్లిక్ చేయండి. |
04:16 | ఇప్పుడు కుడి పానెల్, మీ కంప్యూటర్లో స్థాపించబడిన ఎక్స్టెన్షన్స్ ను ప్రదర్శిస్తుంది. |
04:22 | ScrapBook గురించి మరింత తెలుసుకోవడానికి, దాన్ని ఎంచుకుని, More పై క్లిక్ చేయండి. |
04:27 | స్క్రాప్ బుక్ గురించి వివరాలు ప్రదర్శించబడతాయి. |
04:31 | Extensions గురించి తెలుసుకోవడానికి వెబ్సైట్ లింకుపై క్లిక్ చేయండి. |
04:35 | ఇప్పుడు, ఎడమ పానెల్ నుండి, Extension ఎంపికపై క్లిక్ చేయండి. |
04:40 | గమనిక, మీరు ప్రతి Extension యొక్క ప్రాధాన్యతలను అమర్చవచ్చు, నిలిపివేయవచ్చు లేదా తీసివేయవచ్చు. |
04:46 | Grab and Drag ను ఎంచుకుని , Preferences పై క్లిక్ చేయండి. |
04:49 | మీరు ఈ డైలాగ్ బాక్స్ ను ఉపయోగించి మీ ప్రాధాన్యతలను సెట్ చేయవచ్చు |
04:53 | డైలాగ్ బాక్స్ నుండి నిష్క్రమించడానికి Cancel పై క్లిక్ చేయండి. |
04:57 | ఇప్పుడు, స్క్రాప్ బుక్ ఎంచుకొని, Preferences పై క్లిక్ చేయండి. |
05:01 | Scrap Book Options డైలాగ్ బాక్స్ Grab and Drag Preferences డైలాగ్ బాక్స్ కంటే భిన్నంగా ఉంటుంది అని గమనించండి. |
05:09 | అందువల్ల, ప్రతి Extension కు మార్చగల వివిధ సెట్టింగులు ఉంటాయి. |
05:13 | ఏదైనా Extension కు Preferences బటన్ కనిపించకపోతే, |
05:17 | దీనికి ఎటువంటి ప్రాధాన్యతలు లేవు అని సూచిస్తుంది. |
05:21 | ScrapBook Options డైలాగ్బాక్స్ నుండి నిష్క్రమించడానికి Close పై క్లిక్ చేయండి. |
05:26 | చాలా సాఫ్ట్ వేర్ ల మాదిరిగా, యాడ్-ఆన్లు కూడా క్రమంగా update చేయబడతాయి. . |
05:31 | Scrap Book ను update చేయాడానికి , దాన్ని ఎన్నుకుని, కుడి-క్లిక్ చేసి, Find Updates పై క్లిక్ చేయండి. |
05:37 | Updates కనిపించినట్లైతే Update బటన్ ప్రదర్శించబడుతుంది. |
05:42 | యాడ్-ఆన్ ని update చేయడానికి దానిపై క్లిక్ చేయండి. |
05:47 | Scrap Book కు ఎటువంటి update లు లేనందున, Update బటన్ ప్రదర్శించబడదు. |
05:51 | చివరగా, మీరు ఎక్స్టెన్షన్ ను ఉపయోగించకుంటే Disable బటన్ పై క్లిక్ చేయండి. |
05:58 | మీ కంప్యూటర్ నుండి ఎక్స్టెన్షన్ ను తొలగించడానికి, Remove బటన్ పై క్లిక్ చేయండి. |
06:03 | మనము ఎక్స్టెన్షన్స్ గురించి అన్నింటినీ నేర్చుకున్నాం! |
06:06 | మీరు ఇప్పుడు ఫైర్ఫాక్స్ కు మరింత కార్యాచరణలను జోడించడం ద్వారా విధులను క్రమబద్దీకరించడానికి Extensions ఉపయోగించవచ్చు. |
06:13 | మీరు ఎక్కువ యాడ్-ఆన్స్ గురించి తెలుసుకోవడానికి Get Add-ons ఎంపికను వాడవచ్చు. |
06:18 | తరువాత మీరు, మీకు అత్యంత సందర్భోచితమైనవి లేదా ఉపయోగకరమైనవి అయిన Add-ons ను ఎంచుకోవచ్చు మరియు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. |
06:24 | ఫైరుఫాక్సు ఎక్స్టెన్షన్స్ గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి ఫైర్ఫాక్స్ వెబ్ సైట్ ను సందర్శించండి. |
06:31 | ఇంతటితో ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
06:34 | సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం installing Extensions, Recommended Extensions గురించి నేర్చుకున్నాము. |
06:42 | అసైన్-మెంట్ గా |
06:45 | WebMail Notifier అనే extension కోసం శోధించండి |
06:49 | మీ కంప్యూటర్లో దీన్ని ఇన్స్టాల్ చేయండి. |
06:52 | ఈ extension యొక్క లక్షణాల గురించి తెలుసుకోండి మరియు మీ మెయిల్ ఖాతాల నుండి చదవని సందేశాలు తనిఖీ చేయడానికి దానిని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోండి. |
07:01 | extension ను Disable చేయండి. (నిలిపివేయండి. ) |
07:03 | తరువాత దానిని ఫైర్ఫాక్స్ నుంచి తొలగించండి. |
07:07 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో ను చూడండి. |
07:10 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
07:13 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:18 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం |
07:19 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ను వాడి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
07:23 | ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. |
07:27 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి. |
07:33 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
07:37 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
07:45 | ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
07:48 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
07:56 | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. |
08:00 | ధన్యవాదాలు. |