Java/C2/if-else/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 08:26, 29 August 2017 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration |
00:02 | జావా నందు if else constructs అనే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి, |
00:09 | conditional statements గురించి, |
00:11 | వివిధ రకాల conditional statements మరియు |
00:13 | జావా ప్రోగ్రాం లో conditional statementsను ఉపయోగించడం. |
00:18 | ఈ ట్యుటోరియల్ కొరకు, మనం ఉబంటు వర్షన్ 11.10 JDK1.6 మరియు Eclipse IDE 3.7.0 ఉపయోగిస్తున్నాం. |
00:27 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించేందుకు మీకు, |
00:31 | జావా లోని అర్థమెటిక్, రిలేషనల్ మరియు లాజికల్ ఆపరేషన్స్ పై అవగాహన ఉండాలి. |
00:35 | లేదంటే, తత్సంబంధ ట్యుటోరియల్ కొరకు మా వెబ్సైట్ ను సంప్రదించండి |
00:42 | కండీషనల్ స్టేట్మెంట్స్- మీరు వేర్వేరు నిర్ణయాలకై వేర్వేరు ప్రక్రియలను నిర్వహించcవలసిcఉన్నపుడు, |
00:48 | అటువంటి సందర్భాలలో మీరు కండీషనల్ స్టేట్మెంట్స్ ను ఉపయోగించవచ్చు. |
00:52 | ఒక కండీషనల్ స్టేట్మెంట్ ఒక ప్రోగ్రామ్ యొక్క అమలు యొక్క ప్రవాహాన్ని నియంత్రించడానికి సహాయం చేస్తుంది. |
00:57 | జావా లో మనకు ఈ క్రింది conditional statements ఉన్నాయి. |
01:01 | If స్టేట్మెంట్ |
01:02 | If...Else స్టేట్మెంట్ |
01:03 | If...Else if స్టేట్మెంట్ |
01:05 | Nested If స్టేట్మెంట్ |
01:06 | Switch స్టేట్మెంట్ |
01:08 | ఈ ట్యుటోరియల్ లో మనం If, If...Else and If...Else If అనే స్టేట్మెంట్స్ గురించి వివరంగా నేర్చుకుంటాం. |
01:15 | if statement: ఒక కండిషన్ పై ఆధారపడి స్టేట్మెంట్స్(ప్రకటనల) యొక్క ఒక బ్లాక్ ను (సమూహాన్న) అమలుపరుచుటకు ఇఫ్ స్టేట్మెంట్ ను ఉపయోగిస్తాము. |
01:22 | దీనిని సింగల్ కండిషనల్ స్టేట్మెంట్ అంటారు. |
01:26 | if స్టేట్మెంట్ కొరకు సింటాక్స్. |
01:28 | ఇఫ్ స్టేట్మెంట్ లో, కండిషన్ సత్యం ఐతే, బ్లాక్ అమలు అవుతుంది. |
01:34 | ఒకవేళ కండిషన్ అసత్యం ఐతే, బ్లాక్ వదిలివేయబడి, అమలు కాదు. |
01:40 | ఇప్పుడు, if స్టేట్మెంట్ ను ఎలా ఉపయోగించవచ్చో అర్థంచేసుకోవడానికి ఒక ఉదాహరణను చూద్దాం. |
01:45 | అందుకు,ఎక్లిప్స్ కు మారుదాం. |
01:48 | మనం ఒక వ్యక్తి మైనర్ అవునా కాదా అని తెలుసుకోడానికి ఒక ప్రోగ్రాం ను వ్రాద్దాం. |
01:53 | నేను ఇంతకు ముందే Person అనే ఒక class ను సృష్టించాను. |
01:56 | ఇప్పుడు మెయిన్ మెథడ్ లో int రకానికి సంభందించిన age అనే వేరియబుల్ ను డిక్లేర్ చేద్దాం. |
02:02 | కనుక- మెయిన్ మెథడ్ లో int స్పేస్ age ఈక్వల్ టు 20 semicolon అని టైపు చెయ్యండి. |
02:14 | ఇప్పుడు, మనం దీనిని అనుసరిస్తున్నట్లుగా If స్టేట్మెంట్ ను వ్రాద్దాం. |
02:18 | తర్వాత వరుసలో, if బ్రాకెట్ లోపల age < 21 కర్లీ బ్రాకెట్స్ తెరిచి ఎంటర్ నొక్కండి. |
02:30 | ఇక్కడ, మనం age అనేది 21 కన్నా తక్కువగా ఉందేమో అని పరిశీలిస్తున్నాం. కర్లీబ్రాకెట్స్ తెరవండి. |
02:34 | బ్రాకెట్ లోపల ఏదయితే ఉందో అదంతా if బ్లాక్ కు సంభందించింది. |
02:38 | అందుకే బ్రాకెట్ లోపల |
02:41 | సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ ఎల్ ఎన్ బ్రాకెట్ లో డబుల్ కోట్స్ లో the person is minor సెమీకోలన్ అని టైప్ చేయండి. |
02:56 | ఇక్కడ, ఒకవేళ age అనేది 21 కన్నా తక్కువ అయితే The person is minor అని ప్రదర్శించబడుతుంది. |
03:03 | కనుక, ఫైల్ ను save చేసి runచేయండి. |
03:08 | మనకు ఔట్పుట్ లో The person is minor అని వస్తుంది. |
03:14 | ఈ సందర్భంలో, వ్యక్తి వయసు 20 అది 21 కన్నా తక్కువ. |
03:20 | అందువల్ల మనకు ఔట్పుట్ లో వ్యక్తి మైనర్ The person is minor అని వచ్చింది. |
03:24 | ఇప్పుడు, మనం if...else స్టేట్మెంట్ గురించి నేర్చుకుంటాం. |
03:27 | if...else స్టేట్మెంట్ ను ప్రత్యమ్నాయ స్టేట్మెంట్ లను అమలు చేయడానికి ఉపయోగిస్తాం. |
03:31 | ఇవి సింగల్ కండిషన్ పై ఆధారపడి ఉంటాయి. |
03:34 | మనం if...else స్టేట్మెంట్ ను వ్రాయడం కొరకు సింటాక్స్ చూద్దాం. |
03:38 | ఒకవేళ కండిషన్ సత్యం అయితే ఒక స్టేట్మెంట్ లేదా ఒక బ్లాక్ అనేది (ఎక్సిక్యూట్) అమలు అవుతుంది. |
03:44 | లేదంటే, అది వేరొక స్టేట్మెంట్ ను లేదా కోడ్ యొక్క బ్లాక్ ను (ఎక్సిక్యూట్) అమలు చేస్తుంది. |
03:49 | ఇప్పుడు, మనం if...else స్టేట్మెంట్ ను ఒక ప్రోగ్రాంలో ఎలా ఉపయోగించవచ్చో చూస్తాం. |
03:54 | కనుక, ఎక్లిప్స్ కు మారుదాం. |
03:57 | ఇప్పుడు మనం, ఒక వ్యక్తి మైనరా లేక మేజరా అని తెలుసుకోవడానికి ఒక ప్రోగ్రాం వ్రాస్తాం. |
04:03 | అందుకు మెయిన్ మెథడ్ లో int age equal to 25 అని |
04:12 | తరువాత, if బ్రాకెట్స్ లోపల age greater than 21. |
04:19 | కర్లీ బ్రాకెట్స్ లోపల System dot out dot println, బ్రాకెట్స్ లోపల The person is Major అని టైప్ చేయండి. |
04:28 | తర్వాత,నెక్స్ట్ లైన్ ను టైపు చేయండి, |
04:32 | కర్లీ బ్రాకెట్ లో else అని టైప్ చేసి, |
04:38 | సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ ఎల్ ఎన్ బ్రాకెట్ లో డబుల్ కోట్స్ లో The person is Minor, సెమీకోలోన్ అని టైప్ చేయండి. |
04:51 | ఇక్కడ,ఒకవేళ age 21 కన్నా తక్కువ అయితే The person is Minor అని ప్రదర్శించబడుతుంది. |
04:58 | లేదంటే, The person is Major అని ప్రదర్శించబడుతుంది. |
05:02 | ప్రోగ్రాం ను సేవ్ చేసి రన్ చేద్దాం. |
05:07 | మనకు The person is Major అని ఔట్పుట్ వస్తుంది. |
05:11 | ఇక్కడ, వ్యక్తి వయసు 25 అది 21 కన్నా ఎక్కువ. |
05:17 | అందువల్ల ప్రోగ్రాం The person is Major అని ఔట్పుట్ గా ప్రదర్శించబడింది. |
05:22 | If…Else If స్టేట్మెంట్: f…Else If స్టేట్మెంట్ ను, స్టేట్మెంట్స్ యొక్క వివిధరకాల సముదాయాలను అమలు చేయడానికి ఉపయోగిస్తారు. |
05:29 | ఇవి ఇవ్వబడిన రెండు కండిషన్ ల పై ఆధారపడి ఉంటాయి. |
05:33 | మీరు మీ అవసరానికి తగ్గట్టు మరిన్ని కండిషన్ లను దీనికి జోడించవచ్చు. |
05:38 | దీనినే బ్రాంచింగ్ లేదా డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అని కూడా అంటారు. |
05:43 | ఇప్పుడు,ఈ If…Else If స్టేట్మెంట్ కొరకు సింటాక్స్ వ్రాయడం ఎలాగో చూద్దాం. |
05:48 | ప్రాధమికంగా if స్టేట్మెంట్ కండిషన్ 1 కొరకు తనిఖీ చేస్తుంది. |
05:53 | ఒకవేళ కండిషన్ 1 సత్యం అయితే, అది statement-or-block1 code ను అమలు చేస్తుంది. |
05:59 | లేదంటే,అది మరలా కండిషన్2 ను తనిఖీ చేస్తుంది. |
06:02 | ఒకవేళ కండిషన్ 2 సత్యం అయితే అది statement-or-block 2 ను అమలు చేస్తుంది. |
06:09 | లేదంటే, అది statement 3 లేదా block code 3 ని అమలు చేస్తుంది. |
06:13 | ఈ విధంగా, మనం If…Else బ్లాక్స్ తో కోడ్ ను పొడిగించవచ్చు. |
06:17 | ఈ బ్లాక్స్ బహుళ కండిషన్లు కలిగి ఉంటాయి. |
06:20 | కండిషన్ సత్యం అయ్యేవరకు దానికి సంభందించిన కోడ్ ఎ అమలు అవుతూ ఉంటుంది. |
06:25 | ఒకవేళ అన్ని కండిషన్లూ అసత్యం అయితే, అది చివరి కండిషన్ అయిన Elseని అమలు చేస్తుంది. |
06:30 | మనం If…Else If స్టేట్మెంట్ ను ఒక ప్రోగ్రాం లో ఎలా వాడవచ్చో చూద్దాం. |
06:35 | కనుక, ఎక్లిప్స్ కు మారండి. |
06:37 | నేను ముందుగానే క్లాస్ ని సృష్టించి దానికి Student అనే పేరునిచ్చాను. |
06:40 | ఇప్పుడు విద్యార్థి (student) యొక్క గ్రేడ్ ను తెలుసుకోవడానికి ప్రోగ్రాం వ్రాద్దాం. |
06:44 | ఇది వారి స్కోర్ శాతం పై ఆధారపడి పని చేస్తుంది. |
06:47 | దానికోసం మెయిన్ మెథడ్ లోపల, int space testScore equal to 70 semicolon అని టైప్ చేయండి. |
06:58 | testScore అనే ఇన్పుట్ వేరియబుల్ ను పరీక్ష ఫలితాల స్కోర్ శాతం తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. |
07:05 | తర్వాతి లైన్ లో, if బ్రాకెట్స్ లోపల testScore less than 35తరువాత కర్లీ బ్రాకెట్స్ లోపల System dot out dot println అని టైప్ చేసి, బ్రాకెట్స్ లోపల మరియు డబుల్ కోట్స్ లో C grade semicolon అని టైప్ చేయండి. |
07:28 | ఒకవేళ, testScore అనేది 35 కన్నా తక్కువ అయితే అప్పుడు ప్రోగ్రాం C Grade అని ప్రదర్శిస్తుంది. |
07:34 | తర్వాత లైన్ లో, else అని టైప్ చేయండి. |
07:37 | తర్వాత లైన్ లో, if బ్రాకెట్ లో testScore గ్రేటర్-దాన్ ఆర్ ఈక్వల్ టు 35 AND (&&) testScore లెస్-దాన్ ఈక్వల్ టు 60. ఈ పూర్తి కండిషన్ ని కర్లీ బ్రాకెట్స్ లో పెట్టి ఎంటర్ నొక్కండి. |
08:03 | System dot out dot println బ్రాకెట్స్ లో B grade సెమీకోలన్ అని టైప్ చేయండి. |
08:13 | ఇక్కడ, ప్రోగ్రాం Else If విభాగం లో రెండవ కండిషన్ పరీక్షిస్తుంది. |
08:18 | ఒకవేళ టెస్ట్ స్కోర్ 35 మరియు 60 కి మధ్యలో ఉంటే ప్రోగ్రాం B Grade అని చూపిస్తుంది. |
08:24 | తర్వాత లైన్ లో, else బ్రాకెట్ లో System dot out dot println బ్రాకెట్స్ లో మరియు డబుల్ కోట్స్ లోపల A grade సెమీకోలన్ అని టైప్ చేయండి. |
08:42 | చివరగా, ఒకవేళ రెండు కండిషన్స్ అసత్యం అయితే ప్రోగ్రాం A Gradeఅని ప్రదర్శిస్తుంది. |
08:48 | ఇప్పుడు, ఈ కోడ్ ను సేవ్ చేసి, రన్ చేద్దాం. |
08:51 | మనకు A Grade అనే ఔట్పుట్ వస్తుంది. |
08:55 | ఈ ప్రోగ్రాం లో, స్టూడెంట్ యొక్క టెస్ట్ స్కోర్ 70. |
09:00 | అందువల్ల A Grade అనే ఔట్పుట్ డిస్ప్లే అవుతుంది. |
09:02 | ఇప్పుడు, టెస్ట్ స్కోర్ ను 55కు మారుద్దాం. |
09:07 | ఇప్పుడు, ప్రోగ్రాం ను సేవ్ చేసి, రన్ చేద్దాం. |
09:10 | ఇప్పుడు, B Grade అని ఔట్పుట్ ను కనిపిస్తుంది. |
09:16 | మనం కండిషన్ ల సంఖ్య ను కూడా పెంచవచ్చు. |
09:19 | మనం B grade ఔట్పుట్ సెక్షన్ తర్వాత, మరో కండిషన్ ను చేర్చుదాం. |
09:23 | ఇక్కడ టైప్ చేయండి else, తర్వాత లైన్ లో, if బ్రాకెట్ లో testScore గ్రేటర్ తాన్ ఈక్వల్ టు 60 AND (&&) testScore లెస్ దాన్ ఈక్వల్ టు 70. |
09:47 | కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి, ఎంటర్ నొక్కి, System dot out dot println బ్రాకెట్స్ లోపల మరియు డబుల్ కోట్స్ లోపల O grade semicolon. |
10:01 | ఇక్కడ testScore విలువ 60 మరియు 70 ల మధ్య ఉంటే, ప్రోగ్రాం O Grade ని డిస్ప్లే చేస్తుంది. |
10:07 | ఇప్పుడు testScore విలువ ను 70 కు మార్చండి. |
10:12 | ఇప్పుడు, ఫైల్ ను సేవ్ చేసి,రన్ చేయండి. |
10:15 | మనకు ఔట్పుట్ ఇలా వస్తుంది. |
10:17 | ప్రోగ్రాం O grade అని ఔట్పుట్ ను ప్రదర్శిస్తుంది. |
10:20 | ఇది ఇంతకు ముందులా A grade కాదు. |
10:23 | ప్రోగ్రాం టెస్ట్ స్కోర్ 70 కన్నా ఎక్కువ ఉంటే A grade అని ప్రదర్శిస్తుంది. |
10:28 | కండిషనల్ స్ట్రక్చర్స్ ను వ్రాసేటప్పుడు: |
10:30 | స్టేట్మెంట్ చివరలో సెమీకోలోన్ తప్పక జోడించాలి అని గుర్తుంచుకొనండి. |
10:35 | కానీ కండిషన్ స్టేట్మెంట్ తర్వాత సెమీకోలోన్ ను జోడించకండి. |
10:40 | కోడ్ ను కర్లీబ్రాకెట్ లలోనే ఉంచండి. |
10:43 | ఒకవేళ బ్లాక్,సింగల్ స్టేట్మెంట్ కలిగి ఉంటే, కర్లీ బ్రేసెస్ అనేవి ఐచ్చికం మాత్రమే. |
10:49 | మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాం. |
10:51 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
10:53 | కండిషనల్ స్టేట్మెంట్ గురించి వివరించాం. |
10:56 | కండిషనల్ స్టేట్మెంట్ల యొక్క రకాల జాబితా ను చూశాము. |
10:59 | కడిషనల్ స్టేటుమెంట్స్ if, if...else and if...else if లను జావా ప్రోగ్రామ్స్ లో ఉపయోగించాము. |
11:04 | ఇప్పుడు,కండిషనల్ స్టేట్మెంట్స్ -if, if...else మరియు if...else if స్టేట్మెంట్స్ ను ఉపయోగించి ఒక జావా ప్రోగ్రాం వ్రాయడాన్ని ఒక అసైన్మెంట్ గా తీసుకోండి. |
11:12 | if స్టేట్మెంట్ ఉపయోగించి రెండు విలువలను పోల్చడానికి ఒక జావా ప్రోగ్రామ్ ను వ్రాయండి. |
11:17 | ఇచ్చిన సంఖ్య సరిసంఖ్య లేదా బేసి సంఖ్య అని తెలుసుకోవడానికి ఒక జావా ప్రోగ్రాం వ్రాయండి.సూచన : if...else స్టేట్మెంట్ ఉపయోగించి. |
11:23 | ఇచ్చిన 3 సంఖ్యలలో గరిష్ట సంఖ్య ను తెలుసుకోవడానికి ఒక జావా ప్రోగ్రాం వ్రాయండి.సూచన : if...else స్టేట్మెంట్ ఉపయోగించి |
11:29 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం |
11:32 | ఈ క్రింది లింక్ లో గల వీడియోను చూడండి. |
11:35 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ సారాంశం. |
11:38 | మీకు మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు |
11:42 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు టీమ్: |
11:44 | స్పోకన్ ట్యుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. |
11:47 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది.మరిన్ని వివరాలకు contact AT spoken HYPHEN tutorial DOT org కి వ్రాయండి. |
11:56 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్-టు-ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. |
12:00 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
12:06 | మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి. |
12:15 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు ఉదయ ఉదయ లక్ష్మి. పాల్గొన్నందుకు ధన్యవాదములు. |