Advanced-Cpp/C2/Exception-Handling/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 18:39, 3 August 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ c++ కు స్వాగతం |
00:07 | ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది. |
00:09 | ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ |
00:11 | మనం దీనినిగురించి ఒక ఉదాహరణతో చూద్దాం. |
00:14 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది, |
00:16 | ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 |
00:20 | g++కంపైలర్ వర్షన్ 4.6.1 |
00:25 | ఎక్సప్షన్ యొక్క పరిచయముతో మొదలు పెడదాం |
00:29 | ఎక్సప్షన్ అనేది ప్రోగ్రాం అమలు జరుగుతుండగా వచ్చే ఒక సమస్య |
00:34 | ఇది ప్రోగ్రాం గుర్తించగల ఒక రన్-టైం ఎర్రర్ |
00:39 | ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ గురించి చూద్దాం. |
00:42 | ప్రోగ్రాం అమలు జరుగుతుండగా వచ్చే సమస్యలకు మనం ఇచ్చే స్పందనను ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ అని అందురు. |
00:50 | ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ మన ప్రోగ్రాం యొక్క ఎగ్జిక్యూషన్ ను కొనసాగునట్లు చేస్తుంది. |
00:55 | అది సమస్యను గుర్తించుటలో సహాయ పడుతుంది. మరియు |
00:57 | ప్రోగ్రాం ను ఒక నియంత్రణ పద్ధతి లో ముగించేవిధంగా చూస్తుంది. |
01:02 | ముందుగా ఎక్సప్షన్ (Exceptions)లో రకాలు గురించి చూద్దాం. |
01:05 | Try, Catch మరియు |
01:07 | Throw |
01:09 | మనం ఎర్రర్ వచ్చుటకు అవకాశం ఉన్న కోడ్ ను try block లో ఉంచుతాం. |
01:13 | తరువాత దానిని throw ను ఉపయోగించి హేండిల్ చేస్తాం. |
01:16 | దీని తరువాత , వచ్చిన ఎక్సప్షన్ ను catch ను ఉపయోగించి క్యాచ్ చేస్తాము. (చేస్తాం. ) |
01:21 | మరియు తరువాత అది ప్రోసెస్ చేయబడుతుంది. |
01:23 | try ,catch ,మరియు throw లకు వాక్యనిర్మాణం చూద్దాం. |
01:27 | throw : try block మరియు catch block |
01:32 | ఇక్కడ మనం అర్గుమెంట్ పంపిస్తున్నాము. |
01:35 | throw స్టేట్మెంట్ ను try బ్లాక్ లోపల కూడా వ్రాయవచ్చు. |
01:40 | మనం ఒకటికంటే ఎక్కువ try ,catch బ్లాక్ లు కలిగి ఉండవచ్చు. |
01:44 | ఇప్పుడు ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ పై ఒక ఉదాహరణ ను చూద్దాం. |
01:48 | నా దగ్గర ముందుగా వ్రాసిన కోడ్ ఉంది. |
01:51 | ఫైల్ పేరు exception.cpp అని గమనించండి. |
01:55 | ఈ ప్రోగ్రాంలో divide by zero ఎర్రర్ ను ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ ను ఉపయోగించి సాధించుట తెలుసుకొందాం. |
02:02 | ముందుగా కోడ్ చూద్దాం. |
02:04 | ఇది మన iostream హెడర్ ఫైల్ |
02:07 | ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాము. |
02:11 | ఇక్కడ మనకు int a మరియు int b ఆర్గుమెంట్స్ తో division() అనే ఫంక్షన్ ఉంది. |
02:18 | తరువాత మనం b==0 అవునో కాదో అని పరీక్షిస్తాము. |
02:22 | నిజమైతే అది Division by zero condition! ఎక్సప్షన్ ను త్రో చేస్తుంది. |
02:27 | ఆ ఫంక్షన్ a మరియు b ల భాగఫలం ను రిటర్న్ చేస్తుంది. |
02:32 | ఇది మన main() ఫంక్షన్. |
02:34 | దీనిలో మనం x ,y అను రెండు integer వేరియబుల్స్ ను , z అను ఒక float వేరియబుల్ ను డిక్లేర్ చేశాము. |
02:42 | ఇక్కడ మనం x ,y ల కు విలువలను తీసుకొంటున్నాము |
02:46 | ఇది మన try బ్లాక్ |
02:48 | ఇక్కడ మనం division() ఫంక్షన్ ను కాల్ చేశాము. |
02:51 | z నందు వచ్చిన ఫలితం స్టోర్ చేశాము. |
02:54 | తరువాత z యొక్క విలువ ను ప్రింట్ chestunnamu. |
02:57 | ఇది మన catch బ్లాక్ |
02:59 | ఇందులో మనం msg(message) అను ఒక ఆర్గుమెంట్ ను charcter constant గా పంపిస్తున్నాము. |
03:06 | తరువాత మనం msg(message) ను ప్రింట్ చేస్తున్నాం. |
03:08 | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్ |
03:11 | ఇప్పుడు ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం. |
03:13 | Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ ను తెరుద్దాం. |
03:21 | కంపైల్ చేయుటకు ,g++ space exception dot cpp space hyphen o space ex అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి |
03:32 | dot slash ex అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి |
03:36 | Enter the value of x and y |
03:38 | నేను 3, మరియు 0 అని ఇస్తాను. |
03:42 | అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. Division by zero condition! |
03:46 | మరలా కంపైల్ చేద్దాం. |
03:48 | రెండు సార్లు అప్ యారో కీస్ nuనొక్కండి. |
03:51 | ఎంటర్ ను నొక్కండి మరలా రెండు సార్లు అప్ యారో కీస్ నొక్కండి |
03:55 | Enter value of x and y |
03:57 | నేను 8, మరియు 2 అని ఇస్తాను. |
04:01 | అవుట్-ఫుట్ 4 |
04:04 | ఇది try ,catch ,మరియు throw లు పని చేసే విధానం. |
04:08 | దీనితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
04:11 | తిరిగి మన స్లైడ్స్ కు వద్దాం. |
04:14 | సంగ్రహంగా, |
04:16 | ఈ ట్యుటోరియల్ నందు మనం ఎక్సప్షన్ హ్యాండ్లింగ్ , try ,catch ,మరియు throw blocksల గురించి నేర్చుకున్నాం. |
04:23 | అసైన్మెంట్ గా employees యొక్క age ను display చేయుము. |
04:26 | age 15 కంటే తక్కువ అయితే ఎక్సప్షన్ ను త్రో చేయుము. |
04:31 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో ను చూడండి. |
04:34 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది . |
04:38 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
04:42 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
04:48 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. |
04:52 | మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. orgకు మెయిల్ చెయ్యండి. |
04:59 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
05:04 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
05:11 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
05:16 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు. |