Java/C2/Numerical-Datatypes/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | జావా లోని న్యూమరికల్ డేటా టైప్స్ అనే స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ టుటోరియల్ లో మనం, |
00:10 | జావా లోని వివిధ రకాల న్యూమరికల్ డాటా టైప్ లను మరియు |
00:13 | వాటి ద్వారా న్యూమరికల్ డాటాను ఎలా నిల్వ చేయాలో తెలుసుకుంటాము. |
00:18 | ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు 11.0
JDK1.6 మరియు Eclipse 3.7 ఉపయోగిస్తున్నాం. |
00:27 | ఈ టుటోరియల్ ను అనుసరించదానికి, మీకు జావా ప్రోగ్రాం రాసి దాన్ని రన్ చేయడం తెలిసిఉండాలి. |
00:34 | లేకపోతె, తత్సంబంధిత టుటోరియల్స్ కోసం మావెబ్సైట్ లో చూడండి. |
00:42 | పూర్ణాంకాలను నిల్వ చేసే డాటా టైప్ ని int అంటారు. |
00:47 | దశాంశ సంఖ్యలను నిల్వ చేసే డాటా టైప్ ని float అంటారు. |
00:52 | ముందుగా, పుర్ణాంకాలని నిర్వచించి ఉపయోగించడం చూద్దాం. |
01:02 | ఇక్కడ మనము ‘ఎక్లిప్స్IDE’ మరియు మిగిలినకోడ్ కి అవసరమైన స్కేలిటన్ కలిగి ఉన్నాం. |
01:10 | ఇక్కడ మనం న్యూమరికల్ డాటా అనే క్లాస్ ని సృష్టించి, దానికి మెయిన్ మెథడ్ ను జతచేశాం. |
01:15 | ఇప్పుడు, సంఖ్యలని ఎలా నిల్వ చేయాలో చూద్దాం. |
01:20 | int distance ఈక్వల్ టూ 28;. |
01:27 | ఈ స్టేట్మెంట్ పూర్ణాంక విలువని distance అనే పేరుగల వేరియబుల్ లో నిల్వ చేస్తుంది. |
01:33 | distance అనేది ఒక పూర్ణాంక వేరియబుల్ |
01:37 | ఇప్పుడు మనం వేరియబుల్ అయిన distance ని దానిలో నిల్వ చేయబడిన విలువను ముద్రించడానికి వాడుదాం. |
01:47 | సిస్టమ్ డాట్ ఔట్ డాట్ println, పారెంథేసిస్ లో distance; |
02:01 | ఈ స్టేట్మెంట్, distance అనే వేరియబుల్ విలువని ప్రచురిస్తుంది. |
02:06 | ఫైల్ ను సేవ్ చేసి, రన్ చేయండి. |
02:14 | 28 అనే విలువ distanceలో నిల్వ చేయబడడం మనం చూడొచ్చు. |
02:21 | వేరియబుల్ లో నిలువ ఉన్న విలువను మారుద్దాం. |
02:25 | 28 ను 24 కు మారుద్దాం. |
02:29 | సేవ్ చేసి రన్ చేయండి. |
02:34 | ఔట్పుట్ తదనుగుణంగా మారడం మనం చూడొచ్చు. |
02:39 | int ఋణసంఖ్యలు కూడా నిల్వ చేయగలదు. |
02:42 | 24 ను -25 కు మారుద్దాం. |
02:48 | సేవ్ చేసి రన్ చేయండి. |
02:56 | int ఋణసంఖ్యలు కూడా నిల్వ చేయగలదని మనం చూడవచ్చు. |
03:02 | int డాటా టైప్ మన చాలా ప్రోగ్రామింగ్ అవసరాలకు సరిపోతుంది. |
03:06 | కానీ ఇది కొంత అవధి వరకు మాత్రమే విలువలని నిల్వ చేయగలదు. |
03:10 | ఒక గరిష్ట విలువను నిల్వ చేసి, ఏం జరుగుతుందో చూద్దాం. |
03:25 | మనకు సంఖ్య కింద ఎరుపుగీత error(తప్పు) అని సూచిస్తుంది. |
03:34 | ఎర్రర్ సందేశంలో, సంఖ్య వేరియబుల్ డాటా టైప్ పరిధి బయట ఉంది అని సూచిస్తుంది. |
03:42 | int అనేది 32 బిట్ల మెమోరీ వరకు తీసుకోగలడు. అది -2 power 31 నుండి 2 power 31 వరకు నిల్వచేయగలదు. |
03:49 | గరిష్ట సంఖ్యలను నిల్వ చేయడానికి, జావా long అనే డాటాటైప్ అందిస్తుంది. |
03:54 | ఒక పెద్ద సంఖ్యను నిల్వచేయడానికి దీనిని ఉపయోగిద్దాం. |
03:59 | int ను long కు మార్చండి. |
04:04 | సంఖ్య చివరలో కాపిటల్ L జతచేయండి. |
04:11 | Ctrl, S తో సేవ్ చేయండి. |
04:16 | ఇప్పుడు ఏ ఎర్రర్ కనిపించుటలేదు. |
04:19 | Ctrl, F11 తో రన్ చేస్తే, విలువ ముద్రించబడింది. |
04:27 | long variable లో, పెద్ద సంఖ్యలు నిల్వ చేయవచ్చని మనం చూశాము. |
04:32 | ఇప్పుడు, దశాంశ సంఖ్యలని int వేరియబుల్ లో నిల్వ చేసి చూద్దాం. |
04:37 | long ను int కి మార్చి, సంఖ్యను 23.5 కి మారుద్దాం. |
04:50 | ఎర్రర్ కనిపిస్తుంది. ఎందుకంటే int పూర్ణంకాలను మాత్రమే నిల్వ చేస్తుంది. |
05:00 | దశాంశ సంఖ్యలని నిల్వ చేయడానికి మనం float వాడాలి. |
05:05 | దాటాటైప్ ని float కి మార్చాలి. |
05:10 | తర్వాత, f ను విలువ చివరన చేర్చాలి. |
05:17 | దాన్ని సేవ్ చేయండి. |
05:19 | ఇప్పుడు ఏ ఎర్రర్ లేదు. |
05:22 | Control F11 తో రన్ చేయండి. |
05:29 | దశాంశ సంఖ్య నిల్వ అయి, ముద్రించబడడం మనం చూడవచ్చు. |
05:37 | distance అనే వేరియబుల్ విలువను మారుద్దాం. |
05:46 | ఇక్కడ చూపించినట్టుగా దశాంశ స్థానం తర్వాత చాలా అంకెలను చేర్చండి. |
05:53 | సేవ్ చేసి రన్ చేయండి. |
06:01 | ఔట్పుట్ మనం నిల్వ చేసినదానికి కొంచెం భిన్నంగా ఉండడం చూస్తాం. |
06:06 | ఎందుకంటే అక్కడ ఫ్లోటింగ్ పాయింట్ ఆవర్తనమునకు పరిమితి ఉంది. |
06:11 | ఆ సంఖ్యని సరిగ్గా అలాగే నిల్వ చేయలేక పొతే, దానికి దగ్గర గల సంఖ్య తో సరిచేయబడుతుంది. |
06:18 | వేరియబుల్ ల నామకరణ నియమాలను చూద్దాం. |
06:23 | పేరుకు ముందు 2 చేర్చండి. |
06:30 | మనకు సింటాక్స్ ఎర్రర్ కనిపిస్తుంది. |
06:34 | ఎందుకంటే వేరియబుల్ పేరు ఆల్ఫాబెట్ కానీ లేదా ఒక అండర్ స్కోర్ తో కానీ మొదలవ్వాలి |
06:40 | కానీ అండర్ స్కోర్ని సాధారణంగా పేరుకి ముందు ఉపయోగించము. |
06:45 | ఇప్పుడు, వేరియబుల్ పేరు చివరలో ఒక సంఖ్య జోడిద్దాం. |
06:55 | ఎర్రర్ లేదని గమనించ వచ్చు. |
06:59 | వేరియబుల్ పేరులో సంఖ్యలు ఉండవచ్చు కానీ,ప్రారంభం లో కాదు. |
07:04 | ఇప్పుడు, అండర్ స్కోర్ ను పేరు మధ్య లో జోడించండి. |
07:15 | ఎర్రర్ లేదని గమనించ వచ్చు. |
07:17 | తద్వారా, అండర్ స్కోర్ వేరియబుల్ పేరులో ఉండడానికి అనుమతి ఉందని తెలుస్తుంది. |
07:22 | కానీ, వేరే విరామచిహ్నాలు వేరియబుల్ పేరులో ఉండడం వలన సింటాక్స్ లేదా వేరే ఎర్రర్లు రావచ్చు. |
07:28 | ఈ విధంగా మీరు జావా లో న్యూమరికల్ డాటాని నిల్వ చేయవచ్చు. |
07:35 | దీనితో, ఈ టుటోరియల్ ముగింపుకు వచ్చాము. |
07:38 | ఈ టుటోరియల్ లో మనం, న్యూమరికల్ డాటా టైప్ ల గురించి, |
07:44 | అదేవిధంగా వాటిని నిల్వ చేయటం, |
07:46 | అలాగే, వేరియబుల్ పేర్ల నామకరణ నియమాలని కూడా నేర్చుకున్నాం. |
07:51 | ఈ టుటోరియల్కు సంబంధించిన, ఒక అసైన్మెంట్ |
07:53 | ఇతర, న్యూమరికల్ డాటా టైప్ ల గురించి చదవండి. |
07:56 | ఇంకా అవి int మరియు float కంటే ఎలా భిన్నంగా ఉన్నాయో చూడండి. |
08:00 | క్రింది లింక్ లో, జావా టుటోరియల్ లు లభ్యమవుతాయి. |
08:05 | స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి. |
08:11 | ఇది ఈ ప్రాజెక్టు సారాంశం. |
08:14 | మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
08:20 | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్: స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. |
08:24 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి |
08:35 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. |
08:39 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది |
08:45 | దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. |
08:51 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు ఉదయ లక్ష్మి. పాల్గొన్నందుకు ధన్యవాదములు. |