Java/C2/Logical-Operations/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 21:28, 28 July 2017 by Simhadriudaya (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:02 జావా లోని లాజికల్ ఆపరేటర్స్ అనే స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ టుటోరియల్ లో మీరు లాజికల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుంటారు.
00:11 లాజికల్ ఆపరేటర్స్ ఉపయోగించి వివిధ ఎక్స్ ప్రెషన్స్ ను ఎలా పరీక్షించాలో మరియు పరేంథేసిస్ ఉపయోగించి ప్రేసీడెన్స్ ని ఎలా ఓవర్ రైడ్, చేయాలో చూద్దాం.
00:20 ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు 11.10JDK1.6 మరియు Eclipse3.7.0 ఉపయోగిస్తున్నాం.
00:30 ఈ టుటోరియల్ ను అనుసరించడానికి మీకు రిలేషనల్ ఆపరేటర్స్ పై అవగాహన ఉండాలి.
00:35 లేదంటే, తత్సంభంధ టుటోరియల్స్ కొరకు మా వెబ్సైట్ ను సంప్రదించండి.
00:42 లాజికల్ ఆపరేటర్స్ వివిధ రకాల కండిషన్స్ ను పరిశీలించడానికి ఉపయోగిస్తారు.
00:48 ఇది జావాలో మనకు లభ్యమయ్యే లాజికల్ ఆపరేటర్ల జాబితా.
00:54 and, or, not. మనం వీటిలో ప్రతి ఒక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. Eclipse కు మారండి .
01:04 ఇక్కడ మనము ‘ఎక్లిప్స్IDE’ మరియు మిగిలినకోడ్ కి అవసరమైన స్కేలిటన్ కలిగి ఉన్నాం
01:10 ఇక్కడ మనం లాజికల్ ఆపరేటర్స్ అనే క్లాస్ ని సృష్టించి, మెయిన్ మెథడ్ జతచేశాం.
01:15 కొన్ని వేరియబుల్స్ ని సృష్టిద్దాం.
01:20 బూలియన్ బి ;
01:23 మనం కండిషన్ యొక్క ఫలితాన్ని 'b' నిల్వ చేద్దాం.
01:29 int age is equal to 11;
01:35 int weight is equal to 42;
01:42 మన దగ్గర ఒక వ్యక్తి వయసు మరియు బరువుల వివరాలున్నాయి.
01:46 మనం ఆ వ్యక్తి వయసు 18 యేళ్ళ కంటే తక్కువ మరియు కనీస బరువు 40 కేజీ లు ఉందో లేదో చూద్దాం.
01:52 దాన్ని ఎలా చేయాలో చూద్దాం.
01:57 b is equal to age less than 18 ampersand ampersand weight greater than equal to 40;
02:19 ఈ స్టేట్మెంట్ లో రెండు ఎక్స్ ప్రెషన్స్ మరియు రెండు అంపెర్సాండ్ సింబల్స్ ఆ రెండిటి మధ్యలో ఉన్నాయి.
02:24 ఇది వయసు 18 యేళ్ళ లోపు మరియు బరువు 40 కంటే ఎక్కువ లేక సమానంగా ఉందా లేదా అని పరిశీలిస్తుంది.
02:31 ఈ ఆపరేషన్ ని అండ్ అని ఆపరేషన్ అంటారు.
02:35 ఇప్పుడు 'b' విలువను ముద్రిద్దాం.
02:40 System dot out dot println(b);
02:48 సేవ్ చేసి రన్ చేయండి.
02:56 ఔట్పుట్ సత్యం అని రావడం మనం చూడవచ్చు, ఎందుకంటే రెండు కండిషన్స్ సంతృప్తి చెందాయి.
03:02 ఇప్పుడు బరువుని మార్చి ఒక కండిషన్ని అసంతృప్తి పొందేలా కోడ్ ని రన్ చేద్దాం.
03:08 42 ని 32 కి మారుద్దాం.
03:14 సేవ్ చేసి రన్ చేయండి
03:21 ఔట్పుట్ అసత్యం అని చూడవచ్చు.
03:24 ఎందుకంటే వయసు 18 లోపు ఉండాలి అనే కండిషన్ సంతృప్తి పొందింది
03:29 కానీ బరువు 40 కంటే ఎక్కువ లేక సమానం అనే కండిషన్ అసంతృప్తి పొందింది.
03:34 అండ్ ఆపరేషన్ లో ఫలితం ట్రూ అవ్వడానికి రెండు కండిషన్స్ సత్యం కావాలి.
03:39 అందువల్లే మనకు ఫాల్స్ అనే ఔట్పుట్ వచ్చింది.
03:43 ఈ విధంగా రెండు అంపెర్సాండ్ గుర్తులను వాడడం ద్వారా మనం అండ్ ఆపరేషన్ ని చేయవచ్చు.
03:53 మనకు వయసు, బరువు రెండిటి లో ఏదో ఒక కండిషన్ మాత్రమే సంతృప్తి చెందితే చాలు అనుకోండి.
03:59 ఇంకోలా చెప్పాలంటే, మొదటి లేదా రెండో కండిషన్లలో ఏదో ఒకటి సంతృప్తి చెందితే చాలు అనుకుంటే,
04:05 దాన్ని మనం ఆర్ ఆపరేషన్ ద్వారా చేయవచ్చు.
04:09 ముందుగా, మునుపటి కండిషన్ ను తీసేద్దాం.
04:15 టైప్ చేయండి,
04:17 age లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 రెండు పైప్ గుర్తులు weight లెస్ దాన్ఆర్ ఈక్వల్ టు 30.
04:35 ఇక్కడ రెండు కండిషన్స్ మధ్య రెండు పైప్ గుర్తులు ఉన్నాయి.
04:40 ఈ వాక్యం ఏదైనా ఒక కండిషన్ వర్తిస్తుందో లేదో అని పరిశీలిస్తుంది.
04:46 ఔట్పుట్ కోసం కోడ్ ని సేవ్ చేసి రన్ చేద్దాం.
04:54 ఔట్పుట్ సత్యం రావడం మనం చూస్తాం.
04:57 ఎందుకంటే ఆర్ ఆపరేషన్ లో ఒక కండిషన్ సత్యం అయితే చాలు. అండ్ ఆపరేషన్ లాగ రెండూ సత్యం అవ్వాల్సిన అవసరం లేదు.
05:03 దీనికి ఒక కండిషన్ సత్యం అయితే చాలు.
05:06 వెయిట్ కండిషన్ సరిపోక పోయిన గాని ఏజ్ కండిషన్ సరిపోయింది కాబ్బటి,
05:13 మనకు ఔట్పుట్ సత్యం అని వస్తుంది.
05:18 ఇప్పుడు వయసు విలువ మార్చి రెండు కండిషన్స్ అసత్యం అయ్యేలా మారుద్దాం.
05:25 11 ని 17 గా మారుద్దాం.
05:30 సేవ్ చేసి రన్ చేయండి.
05:36 ఇప్పుడు ఔట్పుట్ ఫాల్స్ అయింది, ఎందుకంటే రెండు కండిషన్ లూ అసంతృప్తి చెందాయి.
05:41 ఈ విధంగా, మనం రెండు పైప్ గుర్తులను ఉపయోగించి ఆర్ ఆపరేషన్ తనిఖీ చేస్తాం.
05:50 ఇప్పుడు, మనము వయసు 15 కంటే ఎక్కువ ఉండి బరువు 30 కంటే ఎక్కువ ఉండేలా కండిషన్ తనిఖీ చేయాలనుకోండి.
05:57 మరోలా చెప్పాలంటే మనం ఇంతకూ ముందు తనిఖీ చేసిన కండిషన్ లకు పూర్తి వ్యతిరేకంగా తనిఖీ చేయాలి.
06:03 ఆ సంధర్భంలో మనం నాట్ ఆపరేషన్ ఉపయోగిస్తాం.
06:07 ముందుగా కండిషన్ ని పారేంథేసిస్ లో వేయండి.
06:17 ఇంకా, ఒక ఆశ్యర్యార్థక చింహాన్ని శరతుకి ముందు జత చేయండి.
06:25 ఆశ్యర్యార్థక చిహ్నం ఉపయోగించి ఆ షరతుకు ముందు దానికి పూర్తి వ్యతిరేకంగా ఉందో లేదో పరిశీలించండి.
06:32 ఎందుకంటే ముందు వచ్చిన ఔట్పుట్ అసత్యం కావున ఇప్పుడు సత్యం రావాలి. పరిశీలిద్దాం.
06:38 సేవ్ చేసి రన్ చేయండి.
06:44 ఔట్పుట్ ముందు వచ్చిన దానికి పూర్తిగా వ్యతిరేకం అని చూడవచ్చు.
06:48 ఈ విధంగా, ఆశ్యర్యార్థక చిహ్నం ఉపయోగించి మనం నాట్ ఆపరేషన్ తనిఖీ చేస్తాం. మనకు వయసు 15 కంటే తక్కువ ఉన్న వ్యక్తులు కావాలనుకోండి,
06:58 లేదా 18 యేళ్ళకంటే తక్కువ వయసు మరియు 40 కిలో ల కంటే తక్కువ బరువు గల వ్యక్తులు కావాలనుకోండి,
07:04 ఈ కండిషన్ని ఎలా తనిఖీ చేయాలో చూద్దాం.
07:07 ముందున్న కండిషన్ ను తీసివేసి టైప్ చేయండి.
07:12 age less than 15
07:15 OR age less than 18
07:24 AND weight less than 40;
07:33 మనం చూసినట్లయితే కండిషన్ కొంచెం గందరగోళంగా ఉంది.
07:36 ఇంకా ఏంటంటే, మనకి ఆర్ ఆపరేషన్ ముందా లేక అండ్ ఆపరేషన్ ముందు చేయాలో తెలియదు.
07:42 ఇది ఆపరేటర్ ప్రాముఖ్యత పై ఆధారపడి ఉంటుంది.
07:46 అలాంటి సంధర్భాలలో మనం పరేంథేసిస్ ని ప్రాముఖ్యతను మార్చడానికి మరియు కండిషన్ ను సరిదిద్దాడానికి ఉపయోగిస్తాం.
07:53 పరేంథేసిస్ ని రన్ చేద్దాం.
08:06 కోడ్ ని సేవ్ చేసి రన్ చేయండి.
08:13 ఇపుడు, మొదటి షరతు వయసు 15 యేళ్ళ కంటే తక్కువ అనేది అసంతృప్తిచెందినా,
08:20 రెండవది
08:22 యేజ్ లెస్ దాన్ 18 మరియు వెయిట్ లెస్ దాన్ 40 సంతృప్తి చెందింది.
08:27 అందుకే ఔట్పుట్ సత్యం అయింది.
08:30 సంధిగ్ధత లేకుండా ఉండడానికి మరియు ఎక్స్ ప్రెషన్స్ స్పష్టంగా ఉండడానికి మనం విధిగా, పారేంథేసిస్ ను ఉపయోగించాలి.
08:36 ఈ విధంగా మనం వివిధ కండిషన్ లను పరిశీలించడానికి లాజికల్ ఆపరేటర్స్ ను ఉపయోగిస్తాము.
08:44 దీనితో, ఈ టుటోరియల్ ముగింపుకు వచ్చాము.
08:47 మనం నేర్చుకున్న అంశాలు ; లాజికల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ ను ఉపయోగించి వివిధ ఎక్స్ ప్రెషన్స్ పరిశీలించడం.
08:54 వాటిని ఎలా సరిదిద్దాలి, పారేంథేసిస్ ఉపయోగించి ప్రాముఖ్యత మార్చడం.
09:00 ఈ టుటోరియల్ సంబంధించిన, ఒక అసైన్మెంట్
09:02 రెండు ఎక్స్ ప్రెషన్స్ విలువలు సమానంగా ఉంటే ఎలా చేయాలి?
09:10 స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి.
09:18 మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు
09:23 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్: స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది.
09:30 మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి
09:36 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
09:40 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
09:46 దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ ఎన్ ఎం ఈ ఐసి టి హైఫన్ ఇంట్రో
09:52 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు మాధురి గణపతి. నేను ఉదయ లక్ష్మి పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya