Inkscape/C3/Design-a-visiting-card/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 21:17, 27 July 2017 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration |
00:00 | Inkscape ను ఉపయోగించి Design a Visiting card అను Spoken Tutorial కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి, |
00:08 | ఒక విజిటింగ్ కార్డ్ కోసం సెట్టింగ్ లు |
00:10 | ఒక విజిటింగ్ కార్డ్ ను రూపొందించడం |
00:12 | విజిటింగ్ కార్డ్ యొక్క అనేక కాపీలు ముద్రించడానికి సెట్టింగులు. |
00:16 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను-
Ubuntu Linux 12.04 OS Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను. |
00:26 | Inkscape ను తెరుద్దాం. |
00:28 | File కి వెళ్ళండి.Document properties పై క్లిక్ చేయండి. |
00:34 | Default units ను Inches కు మరియు డిఫాల్ట్ Orientation ను Landscape కు మార్చండి. |
00:41 | ఇప్పుడు visiting card ను రూపొందించడం ప్రారంభిద్దాం. |
00:45 | కనుక, Rectangle tool ను ఉపయోగించి ఒక దీర్ఘచతురస్రాన్ని గీయండి. |
00:49 | Selector tool పై క్లిక్ చేయండి. |
00:51 | Tool controls bar పైన Width ను, 3.5 కు మరియు Height ను 2కు మార్చండి. |
01:00 | దానిని canvas యొక్క ఎడమ ఎగువ మూలకు కదిలించండి. |
01:05 | రంగును ముదురు ఆకుపచ్చకు మార్చండి. |
01:08 | ఇప్పుడు ఒక నమూనాను రూపొందిద్దాము. |
01:10 | Bezier tool ను ఎంచుకుని ఒక తరంగాల రేఖను గీయండి. |
01:14 | Object మెనూ కి వెళ్ళండి.Fill and Stroke ను తెరవండి. |
01:19 | stroke రంగును పసుపుకు మార్చండి. |
01:23 | ఇప్పుడు, తరంగాల రేఖ కింద ఒక సరళ రేఖను గీయండి. |
01:26 | రెండు రేఖలను ఎంచుకుని Extensions మెనూ కి వెళ్ళండి. |
01:30 | Generate from path పై క్లిక్ చేసి, తరువాత Interpolate పై క్లిక్ చేయండి. |
01:35 | Exponent విలువ 0 గా ఉందా అని తనిఖీ చేయండి. |
01:38 | Interpolation steps విలువను 30 కి మార్చండి. |
01:42 | Apply బటన్ పై క్లిక్ చేసి, తరువాత Close బటన్ పై క్లిక్ చేయండి. |
01:46 | Interpolation ప్రభావం ఇపుడు వర్తించబడిందని గమనించండి. |
01:50 | Interpolate డిజైన్ (రూపకల్పనకు)కు కొంత ప్రకాశమైన ప్రభావాన్నిఇద్దాం.డిజైన్ ను ఎంచుకోండి. |
01:55 | Filters మెనూ కి వెళ్ళి, Shadows and Glows పై తరువాత Glow పై క్లిక్ చేయండి. |
02:02 | డిజైన్ కు వర్తించబడిన ప్రకాశమైన ప్రభావాన్ని గమనించండి. |
02:06 | ఇప్పుడు Spoken Tutorial logo ను దిగుమతి చేద్దాం. |
02:10 | నేను దానిని నా Documents ఫోల్డర్ లో భద్రపరిచాను. |
02:13 | Code files లింక్ లో మీకు ఈ logo ఇవ్వబడింది. |
02:17 | File కి వెళ్ళి Import పై క్లిక్ చేయండి. |
02:23 | లోగో ను Resize చేసి, దానిని ఎగువ ఎడమ మూలలో ఉంచండి. |
02:27 | నేను ఇప్పటికే సేవ్ చేసియున్న ఒక LibreOffice Writer ఫైల్ నుండి విజిటింగ్ కార్డ్ వివరాలను కాపీ చేస్తాను. |
02:34 | ఈ ఫైల్ మీకు Codes files లింక్ లో ఇవ్వబడింది. |
02:38 | Font size ను12 కు మరియు text color ను తెలుపుకు మార్చండి. |
02:43 | Spoken Tutorial పదాన్ని ఎంచుకోండి. |
02:45 | ఫాంట్ పరిమాణాన్ని16కు మార్చి దానిని బోల్డ్ గా చేయండి. |
02:50 | ఇప్పుడు, Spoken Tutorial కోసం మన విజిటింగ్ కార్డ్ సిద్ధమైనది. |
02:55 | తరువాత, మనం విజిటింగ్ కార్డ్ యొక్క అనేక కాపీలు సృష్టించడం నేర్చుకుంటాం. |
02:59 | మనము దీన్ని cloning పద్ధతి ద్వారా చేయవచ్చు. |
03:03 | ఇలా చేయడం కోసం, మనం మొదట అన్ని అంశాలను సమూహపరచాలి. |
03:06 | అన్ని అంశాలను ఎంచుకోవడానికి Ctrl + A ని నొక్కి వాటిని సమూహపరచడానికి Ctrl + G ని నొక్కండి. |
03:13 | ఇప్పుడు, Edit మెనూ కి వెళ్ళండి. |
03:15 | Clone పై క్లిక్ చేసి, తరువాత Create Tiled Clones పై క్లిక్ చేయండి. |
03:20 | Create Tiled Clones డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
03:23 | Symmetry ట్యాబ్ కింద, అడ్డువరుసలా సంఖ్యను 4 కి మరియు నిలువు వరుసల సంఖ్యను 3 కి మార్చండి. |
03:30 | ఇప్పుడు, Create బటన్ పై క్లిక్ చేయండి. |
03:33 | తరువాత డైలాగ్ బాక్స్ ని మూసివేయండి. |
03:35 | విజిటింగ్ కార్డ్ యొక్క అనేక కాపీలు కేన్వాస్ పై కనిపిస్తాయి, గమనించండి. |
03:40 | ఈ విధంగా, మనం విజిటింగ్ కార్డ్ యొక్క అనేక కాపీలు ముద్రించవచ్చు. |
03:44 | మీ దృష్టిని ఎగువ ఎడమవైపు ఉన్న విజిటింగ్ కార్డు వద్దకు మళ్ళించండి. |
03:48 | దానిపై క్లిక్ చేసి దానియొక్క స్థానం నుండి కదిలించండి. |
03:50 | ఇది అదనపు కాపీగా ఉన్నందున ఇప్పుడు ఈ కార్డ్ ను తొలగించండి. |
03:54 | ఒకవేళ చేర్చవలసిన కొన్ని మార్పులు ఏమైనా ఉంటే అవి ఏమిటి? |
03:59 | మనం విజిటింగ్ కార్డ్ యొక్క ప్రతీ కాపీని మార్చవల్సి ఉంటుందా? |
04:02 | ఆలా ఏమి కాదు, మనం అసలు విజిటింగ్ కార్డ్ లో మాత్రమే దిద్దుబాట్లు చేయవలసి ఉంటుంది. |
04:07 | అదే అన్ని కాపీలలో ప్రతిబింబిస్తుంది. |
04:10 | దీనిని ప్రయత్నిద్దాం, అసలు కార్డ్ లోని Spoken Tutorial అనే పదం పై డబల్ -క్లిక్ చేసి, దాని రంగును గోధుమ రంగుకు మార్చండి. |
04:18 | ఈ మార్పు విజిటింగ్ కార్డ్ యొక్క అన్ని కాపీలలో ప్రతిబింబిస్తాయి గమనించండి. |
04:24 | ఇప్పుడు, ఫైల్ ను save చేద్దాం. |
04:26 | SVG ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl + S ను నొక్కండి.నేను నా ఫైల్ ను సేవ్ చేయటానికి Desktop ను లొకేషన్ గా ఎంచుకుంటాను. |
04:35 | ఇంకా నేను Filename ను ST-visiting-card గా టైప్ చేసి Save పై క్లిక్ చేస్తాను. |
04:43 | దీని తరువాత, మనము ఫైల్ ను PDF ఫార్మాట్ లో సేవ్ చేస్తాము. |
04:48 | మరోసారి, File కి వెళ్ళి Save As పై క్లిక్ చేయండి. |
04:53 | ఎక్స్టెన్షన్ ను PDF కు మార్చి Save పై క్లిక్ చేయండి. |
04:57 | resolution ను 300 కి మార్చి OK పై క్లిక్ చేయండి. |
05:01 | డెస్క్‌టాప్ కి వెళ్దాం. |
05:03 | ఇక్కడ మనం భద్రపరచిన ఫైల్ ఉంది.దానిని తెరుద్దాం. |
05:08 | మనం సృష్టించిన విజిటింగ్ కార్డ్ లు ఇక్కడ ఉన్నాయి. |
05:11 | సారాంశం చూద్దాం. |
05:13 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,
విజిటింగ్ కార్డ్ కొరకు సెట్టింగ్ లు విజిటింగ్ కార్డ్ యొక్క రూపకల్పన విజిటింగ్ కార్డ్ యొక్క బహుళ కాపీలు ముద్రించడానికి సెట్టింగులు. |
05:23 | ఇక్కడ మీ కోసం ఒక అసైన్మెంట్- |
05:26 | మీ పేరుతో,
మీ ఇన్స్టిట్యూట్/ అర్గనైజీషాన్ యొక్క పేరు తో మీ ఇన్స్టిట్యూట్/ అర్గనైజీషాన్ యొక్క లోగో తో మీ ఇన్స్టిట్యూట్/ అర్గనైజీషాన్ యొక్క వెబ్సైట్ చిరునామా తో ఒక విజిటింగ్ కార్డ్‌ను సృష్టించండి. |
05:38 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది దయచేసి దానిని చూడండి. |
05:44 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
05:51 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:contact@spoken-tutorial.org. |
05:54 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
05:59 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: |
06:03 | మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |