Inkscape/C2/Text-Manipulation/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 16:08, 27 July 2017 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration |
00:01 | Inkscape ను ఉపయోగించి Text Manipulation అను Spoken Tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి- |
00:09 | path పై text ను సృష్టించడం. |
00:11 | షేప్(ఆకారం)పై టెక్స్ట్ ను సృష్టించడం |
00:13 | టెక్స్ట్ లోపల చిత్రం |
00:15 | దృక్కోణంలో టెక్స్ట్ |
00:17 | Cut-out text. |
00:19 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను- |
00:22 | Ubuntu Linux 12.04 OS |
00:25 | Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను. |
00:28 | Inkscape ను తెరుద్దాం. |
00:31 | ముందుగా, మనం ఒక path పై text ను ఎలా సృష్టించాలో నేర్చుకుంటాం. Text టూల్ పై క్లిక్ చేయండి. |
00:36 | కేన్వాస్ పైన Spoken Tutorial is an Audio-Video tutorial అనే వాక్యాన్ని టైప్ చేయండి. |
00:43 | font size ను 20 కి తగ్గించండి. |
00:46 | మునుపటి ట్యుటోరియల్ లో మనం Bezier tool ఉపయోగించి path ని సృష్టించడం నేర్చుకున్నామని గుర్తుంచుకోండి. |
00:51 | కాబట్టి, దానిపై క్లిక్ చేయండి. |
00:53 | canvas పై క్లిక్ చేసి టెక్స్ట్ కిందన పాత్ వలే ఉన్నఒక tilde ఆకారాన్ని గీయండి. |
00:59 | text మరియు path రెండింటినీ ఎంచుకోండి. |
01:03 | Text మెనూ కి వెళ్ళి Put on Path ఎంపిక పై క్లిక్ చేయండి. |
01:08 | path పైన ఏర్పడిన మన టెక్స్ట్ ను గమనించండి. |
01:12 | అన్నిటి పై ఎంపిక తీసివేయడానికి,canvas పైన ఎక్కడైనా క్లిక్ చేయండి. |
01:16 | Text tool ను ఎంచుకోండి మరియు టెక్స్ట్ యొక్క ప్రారంభ బిందువుపై క్లిక్ చేయండి. |
01:21 | పాత్ పైన టెక్స్ట్ ను సర్దుబాటు చేయడానికి space bar ను నొక్కడం ద్వారా కొన్ని ఖాళీలను ఇవ్వండి. |
01:28 | ఇప్పుడు, path ని ఎంచుకుని Node tool పై క్లిక్ చేయండి. |
01:35 | handles ను ఉపయోగించి, పాత్ ను resize చేయండి. |
01:39 | పాత్ యొక్క పునఃపరిమాణం ప్రకారం టెక్స్ట్ రూపాంతరం చెందిందని గమనించండి. |
01:45 | పాత్ నుండి టెక్స్ట్ ను తొలగించడానికి, text ను ఎంచుకోండి. |
01:49 | Text మెనూ కి వెళ్ళండి. |
01:51 | Remove from Path పై క్లిక్ చేయండి. |
01:54 | Observe that the path is now removed.
టెక్స్ట్ ఇప్పుడు తొలగించబడిందని గమనించండి. |
01:57 | ఈ చర్యను undo చేయడానికి Ctrl + Z ని నొక్కండి. |
02:01 | తరువాత, మనం ఆకారంలోకి టెక్స్ట్ ను ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకుంటాం. |
02:05 | Polygon tool ను ఉపయోగించి, ఒక hexagon ను సృష్టించండి. |
02:09 | ఇప్పుడు మనం hexagon లోపల కొంత టెక్స్ట్ ను ఇన్సర్ట్ చేస్తాము. |
02:14 | నేను మునుపు సేవ్ చేసియున్నఒక LibreOffice Writer ఫైల్ నుండి కొంత టెక్స్ట్ ను కాపీ చేస్తాను. |
02:19 | టెక్స్ట్ ను ఎంచుకోవడానికి Ctrl + A ని నొక్కి దానిని కాపీ చేయడానికి Ctrl + C ని నొక్కండి. |
02:25 | ఇప్పుడు, Inkscape కు తిరిగి రండి. |
02:27 | Text tool పై క్లిక్ చేయండి. |
02:30 | టెక్స్ట్ ను paste చేయడానికి hexagon కిందన Ctrl + V ని నొక్కండి. |
02:35 | టెక్స్ట్ మరియు hexagon రెండింటినీ ఎంచుకోండి. |
02:39 | ఇప్పుడు Text మెనూ కి వెళ్ళండి. |
02:41 | Flow into Frame పై క్లిక్ చేయండి. |
02:45 | ఇప్పుడు, మన టెక్స్ట్ hexagon లోపల పెట్టబడింది(ఇన్సర్ట్ చేయబడింది. |
02:49 | మొత్తం టెక్స్ట్ కనపడేలా చేయటానికి ఫాంట్ పరిమాణాన్ని10 కి తగ్గించండి. |
02:54 | Flow ను తొలగించడానికి, Text menu కి వెళ్ళి Unflow పై క్లిక్ చేయండి. |
03:00 | టెక్స్ట్ ఇప్పుడు అదృశ్యమైనదని గమనించండి.ఈ చర్యను undo చేయటానికి Ctrl + Z ని నొక్కండి. |
03:07 | ఇప్పుడు మనం image పైన టెక్స్ట్ ను ఎలా సృష్టించాలో నేర్చుకుంటాం. |
03:11 | ముందుగా మనం ఒక ఇమేజ్(చిత్రాన్ని import చేద్దాం. File కి వెళ్ళండి. Import పై క్లిక్ చేయండి. |
03:19 | నేను Pictures ఫోల్డర్ లోఒక చిత్రాన్నిభద్రపరిచాను. |
03:25 | ఇప్పుడు, మన canvas పై ఒక చిత్రం ఉంది. |
03:29 | దానిని ఎంచుకుని Object మెనూ కి వెళ్ళండి. |
03:33 | Pattern పై క్లిక్ చేసి Object to Pattern పై క్లిక్ చేయండి. |
03:38 | Text టూల్ ను ఉపయోగించి, image కిందన SPOKEN TUTORIAL అని టైప్ చేయండి. |
03:44 | ఈ టెక్స్ట్ ని Bold చేయండి. |
03:47 | Object మెనూ కి వెళ్ళి Fill and Stroke ఎంపిక పై క్లిక్ చేయండి. |
03:52 | Fill ట్యాబ్ కిందన ఉన్నPattern పై క్లిక్ చేయండి.ఇప్పుడు టెక్స్ట్ పైన ఇమేజ్(చిత్రం)ఏర్పడింది. |
04:01 | ఇమేజ్(చిత్రాన్ని)ని సర్దుబాటు చేయడానికి, Node tool పై క్లిక్ చేయండి. |
04:04 | మనం చిత్రం)ఇమేజ్ పైన ఒక square handle మరియు ఒక circular handle లను చూడవచ్చు. |
04:08 | టెక్స్ట్ పైన ఇమేజ్ (చిత్రాన్ని)ను తిప్పటానికి(రొటేట్ చేయడానికి)circular handle పై క్లిక్ చేయండి. |
04:13 | దానిని పునఃపరిమాణం చేయడానికి square handle పై క్లిక్ చేయండి. |
04:17 | తరువాత, మనం ఒక దృక్కోణంలో టెక్స్ట్ ను ఎలా సృష్టించాలో నేర్చుకుంటాం. |
04:21 | canvas పైన SPOKEN అని టైప్ చేయండి. |
04:24 | Path మెనూ కి వెళ్ళి Object to Path పై క్లిక్ చేయండి. |
04:30 | తరువాత,Bezier curve ఎంచుకోవడం ద్వారా పాత్ ని గీద్దాం. |
04:34 | ఎడమ దిగువ నుండి path గీయడం ప్రారంభించండి. |
04:38 | ఎడమవైపున పెద్దభాగం మరియు కుడివైపున ఉన్న చిన్నభాగం ఉండేలా perspective లో ఒక దీర్ఘచతురస్రాన్ని గీయండి. |
04:46 | ముందు టెక్స్ట్ ను ఎంచుకొని తరువాత దీర్ఘచతురస్రాకార మార్గాన్ని ఎంచుకోండి. |
04:50 | Extensions కి వెళ్ళి, Modify Path పై క్లిక్ చేసి ఆపై Perspective పై క్లిక్ చేయండి. |
04:57 | ఇప్పుడు, మనం టెక్స్ట్ perspective లోకనిపిస్తుంది అని చూడవచ్చు. |
05:01 | గమనిక, పాత్(మార్గం)యొక్క ప్రారంభ స్థానం మరియు దిశలను టెక్స్ట్ తీసుకుంటుంది. |
05:07 | తరువాత, మరొక దృక్కోణంలో టెక్స్ట్ ని సృష్టించండి. |
05:11 | కేన్వాస్ పైన TUTORIAL అని టైప్ చేయండి. |
05:15 | Path మెనూ కి వెళ్ళి Object to Path పై క్లిక్ చేయండి. |
05:19 | Bezier tool ఉపయోగించి ఇటువంటిదే ఒక దృక్కోణ దీర్ఘచతురస్రాకార మార్గాన్ని(పాత్ ను)గీయండి. |
05:24 | ఈసారి, ఎడమ ఎగువ మూలలో నుండి ప్రారంభించి, సవ్య దిశలో కొనసాగించండి. |
05:30 | ముందు టెక్స్ట్ ను తరువాత పాత్ ను ఎంచుకోండి. |
05:34 | Extensions > Modify Path కి వెళ్ళి, తరువాత Perspective పై క్లిక్ చేయండి. |
05:42 | ఇప్పుడు మన టెక్స్ట్ ఎగువ నుండి దిగువకు కనిపించడం చూస్తాం. |
05:46 | పాత్ యొక్క ప్రారంభ బిందువు పై ఆధారపడి టెక్స్ట్ క్రమపచబడటం వలన ఇలా అయింది. |
05:51 | చివరగా, cut-out text గురించి నేర్చుకుంటాము. |
05:55 | ఒక దీర్ఘచతురస్రాన్ని సృష్టించి,దీర్ఘచతురస్రం యొక్క ఎగువన INKSCAPE అనే పదాన్ని టైప్ చేయండి. |
06:01 | రెండిటినీ ఎంచుకోండి.Path మెనూ కి వెళ్ళండి.Difference ఎంపికను ఎంచుకోండి. |
06:08 | కేన్వాస్ పై ఏమి జరుగుతుందో గమనించండి. |
06:11 | cut-out text సృష్టించడానికి మరొక పద్దతిని మనం నేర్చుకుంటాం. |
06:15 | మళ్ళీ,INKSCAPE అనే పదాన్ని టైప్ చేయండి. |
06:17 | Object మెనూ కి వెళ్ళి Fill and Stroke పై క్లిక్ చేయండి. |
06:21 | Stroke paint ట్యాబ్ కి వెళ్ళి, Flat color పై క్లిక్ చేయండి. |
06:25 | Stroke style ట్యాబ్ కు వెళ్ళి, విడ్త్ పారామీటర్ ను 2 కు మార్చండి. |
06:30 | Fill ట్యాబ్ కి వెళ్ళి No paint పై క్లిక్ చేయండి. |
06:35 | మన టెక్స్ట్ పైన ఒక cut out ఆకారం ఏర్పడిందని గమనించండి. |
06:38 | సారాంశం చూద్దాం. |
06:40 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి: |
06:42 | పాత్ పైన టెక్స్ట్ ను సృష్టించడం |
06:44 | ఆకారం పైన టెక్స్ట్ ను సృష్టించడం |
06:46 | టెక్స్ట్ లోపల చిత్రం |
06:48 | దృక్కోణంలో టెక్స్ట్ మరియు Cut-out text. |
06:51 | ఇక్కడ మీకోసం కొన్ని అసైన్మెంట్లు. |
06:54 | ఒక వేవి పాత్ లో Learn FOSS using Spoken Tutorial అనే టెక్స్ట్ ను సృష్టించండి. |
06:59 | Bezier tool ఉపయోగించి ఒక Trapezoid ను గీయండి. |
07:02 | కోడ్ ఫైల్ నుండి టెక్స్ట్ ను కాపీ చేసి దానిని Trapezoid లోపల పేస్ట్ చేయండి. |
07:07 | ఒక వర్ణభరితమైన(రంగురంగుల)చిత్రం లో INKSCAPE అనే టెక్స్ట్ ను ఇన్సర్ట్ చెయ్యండి. |
07:10 | దృక్కోణంలో INKSCAPE టెక్స్ట్ ను సృష్టించండి. |
07:13 | SPOKEN TUTORIAL కొరకు ఒక cut-out text ను సృష్టించండి. |
07:17 | మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
07:21 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది దయచేసి దానిని చూడండి. |
07:27 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
07:34 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:contact@spoken-tutorial.org. |
07:36 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
07:42 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro. |
07:47 | మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు |