Advanced-Cpp/C2/Polymorphism/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 16:04, 27 July 2017 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:02 స్పోకెన్ ట్యుటోరియల్ నందు పాలిమార్ఫిజం ఇన్ c++ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది,
00:10 పాలిమార్ఫిజం, వర్చువల్ ఫంక్షన్.
00:13 మనం దీనిని గురించి ఒక ఉదాహరణతో చూద్దాం.
00:16 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది, ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 g++ కంపైలర్ వర్షన్ 4.6.1.
00:27 పాలిమార్ఫిజం యొక్క పరిచయముతో మొదలు పెడదాం.
00:31 పాలిమార్ఫిజం అనేది వేరువేరు రూపాలలో ఉండగలిగే సామర్ధ్యం.
00:36 పాలిమార్ఫిజం ఒక ఫంక్షన్ ను, ఒకే పేరు తో వేరువేరు రకాలుగా ఉపయోగించగల పద్దతి
00:42 virtual ఫంక్షన్స్ గురించి చూద్దాం.
00:45 virtual ఫంక్షన్స్ అనేది ఒక క్లాస్ యొక్క మెంబర్ ఫంక్షన్.
00:49 అది దాని డిరైవ్డ్ క్లాస్ లో ఓవర్-రైడ్ చేయబడుతుంది.
00:53 దానిని virtual కీవర్డ్ ను ఉపయోగించి డిక్లేర్ చేస్తాము.
00:57 virtual ఫంక్షన్ కాల్ అనేది రన్-టైం లో నిర్దారించబడును.
01:01 ఇప్పుడు virtual ఫంక్షన్ గురించి ఒక ఉదాహరణ తో చూద్దాం.
01:06 నాదగ్గర ఇప్పటికే వ్రాసిన కోడ్ ఉన్నది.
01:08 ముందుగా దానిని చూద్దాం.
01:10 ఫైల్ పేరు virtual.cpp అని గమనించండి.
01:15 ఈ ప్రోగ్రాంలో మనం ఒక దీర్ఘచతురస్రం, సమాంతర చతుర్భుజం మరియు త్రిభుజం వైశాల్యంను గణిస్తాము.
01:22 ఇది మన iostream హెడర్ ఫైల్.
01:25 ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాము.
01:29 తరువాత మనకు Parallelogramఅనే క్లాస్ ఉన్నది.
01:33 ఇది బేస్ క్లాస్
01:35 దీనియందు మనం weight, height మరియు ar వంటి మూడు integer వేరియబుల్స్ డిక్లేర్ చేసి ఉంచాము.
01:42 ఇవి ప్రొటెక్టెడ్ గా డిక్లేర్ చేయబడినవి.
01:45 తరువాత set_values() ఫంక్షన్ పబ్లిక్ గా డిక్లేర్ చేయబడినది.
01:50 ఇక్కడ మనం రెండు ఆర్గుమెంట్స్ a మరియు b లను పంపిస్తున్నాము.
01:55 తరువాత మనం ప్రొటెక్టెడ్ మెంబర్స్ ను పబ్లిక్ మెంబర్స్ ను ఉపయోగించి పొందుతాము.
02:00 ఇది మన virtual ఫంక్షన్ area()
02:04 ఇక్కడ మనం సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యంను కనుగొందుము.
02:07 తరువాత మనకు ఒక డిరైవ్డ్ క్లాస్ గా Rectangle ఉన్నది.
02:12 అది దాని బేస్ క్లాస్ అయిన Parallelogram యొక్క లక్షణాలను ఇన్-హెరిట్ చేస్తుంది.
02:17 ఇక్కడ మనం area() ఫంక్షన్ ను ఓవర్-రైడ్ చేస్తున్నాము.
02:21 తరువాత rectangle యొక్క వైశాల్యం ను గణిస్తాము.
02:23 మరియు విలువను ప్రింట్ చేస్తాము.
02:25 ఇక్కడ మనకు మరొక డిరైవ్డ్ క్లాస్ గా triangle ఉన్నది.
02:29 ఇది కూడా బేస్ క్లాస్ అయిన Parallelogram యొక్క లక్షణాలను ఇన్-హెరిట్ చేస్తుంది.
02:35 ఇక్కడ తిరిగి మనం area() ఫంక్షన్ ను ఓవర్-రైడ్ చేస్తున్నాము.
02:39 తరువాత మనం triangle యొక్క వైశాల్యంను గణిస్తాము.
02:41 మరియు విలువను ప్రింట్ చేశాము.
02:43 ఇది మన main() ఫంక్షన్.
02:46 ఇక్కడ మనం Parallelogram క్లాస్ కు p అను ఆబ్జక్టు ను సృష్టించాము.
02:52 ఇక్కడ మనం ఒక parallel అను పాయింటర్ చూడవచ్చు.
02:56 ఇది parallelogram క్లాస్ కు ఒక పాయింటర్.
03:00 ఇది బేస్ క్లాస్ పాయింటర్ గా పిలువ బడును.
03:03 బేస్ క్లాస్ యొక్క పాయింటర్ డెరైవ్డ్ క్లాస్ యొక్క ఆబ్జక్టు ను పాయింట్ చేయగలదు.
03:08 ఇక్కడ మనం Rectangle మరియు Triangle క్లాసులకు ఆబ్జక్టులను సృష్టించాము.
03:14 ఇక్కడ p యొక్క అడ్రస్ ను parallel నందు ఉంచండి.
03:18 తరువాత మనం 3 మరియు 2లను ఆర్గుమెంట్స్ గా పంపించాము.
03:23 తరువాత మనం area() అను ఫంక్షన్ ను కాల్ చేసాం
03:26 ఇక్కడ rect యొక్క అడ్రస్ ను parallel నందు ఉంచండి.
03:30 rect, అనేది Rectangleక్లాస్ యొక్క ఆబ్జక్టు .
03:33 తరువాత మనం4 మరియు 5 లను ఆర్గుమెంట్స్ గా పంపించాము.
03:37 తరువాత మనం area() అను ఫంక్షన్ ను కాల్ చేస్తున్నాము.
03:40 ఇక్కడ చివరిగా Triangle యొక్క అడ్రస్ ను parallel నందు ఉంచాము.
03:45 trgl,
03:47 ఇది Triangle యొక్క ఆబ్జక్టు.
03:51 తరువాత మనం 6 మరియు 5 లను ఆర్గుమెంట్స్ గా పంపించాము.
03:54 మరియు area() అను ఫంక్షన్ ను కాల్ చేసాం.
03:56 మరియు ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
03:59 ఇప్పుడు ప్రోగ్రాం ను అమలుపర్చుదాం.
04:02 Ctrl,Alt మరియు T కీలను ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ ను తెరుద్దాం.
04:09 కంపైల్ చేయుటకు,
04:10 g++ space virtual.cpp space o space vir అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి.
04:20 ./vir అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి
04:24 అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును.
04:27 Area of parallelogram is 6
04:29 Area of rectangle is 20
04:31 మరియు Area of triangle is 15
04:34 తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం
04:36 సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకున్నది.
04:39 పాలిమార్ఫిజం
04:41 వర్చువల్ ఫంక్షన్ ఒక ఉదాహరణ virtual int area()
04:45 అసైన్మెంట్ గా దీర్ఘచతురస్రం,చతురస్రం, మరియు త్రిభుజం యొక్క చుట్టుకొలతలు కనుగొనుము.
04:50 perimeter ను virtual ఫంక్షన్ గా డిక్లేర్ చేయండి.
04:54 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి.
04:57 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
05:00 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
05:04 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం;
05:06 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
05:09 ఆన్-లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
05:14 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి.
05:21 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
05:25 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
05:32 ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
05:37 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి. మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india