Git/C2/The-git-checkout-command/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 17:23, 12 June 2017 by Pratik kamble (Talk | contribs)
Time | Narration |
00:01 | git checkout commandపై spoken tutorialకు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో ఒకటి కంటే ఎక్కువ ఫైళ్లను Git repository కి ఎలా జోడించాలో మనం నేర్చుకుందాం. |
00:12 | అలాగే Git repositoryనుండి ఫైల్ తొలగించడం, |
00:16 | తొలగించిన ఫైల్ ని restore చేయడం, |
00:18 | ఫైల్ కు చేసిన మార్పులను విస్మరించడం, |
00:21 | మునుపటి రివిజన్ కు తిరిగి వెళ్ళటం. |
00:25 | ఈ ట్యుటోరియల్ కోసం, నేను Ubuntu Linux 14.04 |
00:31 | Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను. |
00:36 | మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు |
00:40 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Terminal పై పనిచేసే లినక్స్ కమాండ్ల గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:47 | లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి |
00:52 | ఇపుడు మనం Git repositry కు మల్టిపుల్ ఫైల్స్ ను ఎలా జోడించాలో చూద్దాం |
00:58 | terminal తెరవడానికి Ctrl+Alt+T నొక్కండి. |
01:02 | మనము ముందుగా సృష్టించిన Git repository "mywebpage" లోనికి వెళదాం |
01:09 | cd space mywebpage టైప్ చేసి Enter నొక్కండి |
01:14 | ప్రదర్శించడానికి నేను html ఫైల్ ను వాడటమును కొనసాగిస్తాను. |
01:19 | మీకునచ్చిన ఏ ఫైల్ రకాన్నిఐన మీరు ఉపయోగించవచ్చు |
01:23 | మనము ఇప్పుడు రెండు html ఫైల్‌లను సృష్టించుదుము. |
01:27 | కాబట్టి gedit space mystory.html space mynovel.html space ampersand అని టైప్ చెయ్యండి |
01:37 | ప్రాంప్ట్ ను ఫ్రీ చెయ్యడానికి మనము '&' (ఆంపర్సండ్) ను ఉపయోగిస్తాము. ఇప్పుడు, Enter నొక్కండి |
01:43 | నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి కొంత కోడ్ ను copy చేసి, ఈ ఫైల్ లో కి paste చేస్తాను. |
01:50 | ఈ ఫైళ్ళను save చేద్దాము. |
01:53 | terminal లో, ముందుగా git space statusఅని టైప్ చేసి Git status ను తనిఖీ చేయండి మరియు Enter నొక్కండి. |
02:03 | ఇది రెండు untracked files ను చూపిస్తుంది |
02:06 | tracking కోసం ఇప్పుడు మేము ట్రాక్ చేయని ఫైల్‌లను చేర్చుతాము.' |
02:10 | git space add space dot అని టైప్ చెయ్యండి మరియు Enter నొక్కండి |
02:17 | git add dot కమాండ్ staging area కు అన్ని untracked ఫైళ్లను జోడిస్తుంది. |
02:23 | అందువల్ల, "mystory.html" మరియు "mynovel.html" అనే రెండు ఫైల్స్ staging area కి జోడించబడ్డాయి |
02:32 | git space status టైప్ చేసి Enter నొక్కడం ద్వారా మరోసారి Git status ను తనిఖీ చేద్దాం. |
02:40 | ఇప్పుడు, మనము Git repository యొక్క staging areaకి రెండు ఫైళ్లు జతచేయబడడం చూడవచ్చు. |
02:47 | మనం mystory.html మరియు mynovel.html ఫైళ్లకు తిరిగి వెళదాము . |
02:54 | ఇప్పుడు, ఈ రెండు ఫైళ్ళకు మరి కొంత కోడ్ ను జత చేద్దాము. |
03:00 | ముందు వలె, నేను నా Writer డాక్యుమెంట్ నుండి కాపీ చేసి పేస్ట్ చేస్తాను |
03:05 | మరోసారి ఫైల్‌లను సేవ్ చేసి, మూసివేయండి. |
03:08 | git space statusఅని టైప్ చేసి Git స్థితిని తనిఖీ చేసి Enterనొక్కండి. |
03:16 | ఇది "Changes not staged for commit" మరియు “modified: mynovel.html" మరియు "mystory.html”అని చూపిస్తుంది. |
03:26 | దీని అర్థం మనం చేసిన మార్పులు, staging area కి చేర్చబడలేదు. |
03:32 | ఇప్పుడు మన పనిని commit చేద్దాము |
03:36 | కాబట్టి, git space commit space hyphen a space hyphen m space within double quotes “Added two files” అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి |
03:50 | మనం మార్చిన ఫైళ్లను అవి commit చేయకముందు staging area కి జత చేయలేదని గమనించండి. |
03:57 | మనం మునుపటి ట్యుటోరియల్‌లో చూసినట్లుగా committing message కోసం editor కూడా ఓపెన్ కాలేదు. |
04:03 | ఎందుకంటే, ఇక్కడ మనము hyphen a మరియు hyphen m flagsను ఉపయోగించాము. |
04:10 | ఈ flags ఎందుకు? |
04:13 | మన slides కు తిరిగి మారండి. |
04:15 | Hyphen 'a' flag మార్పులు చేసిన అన్ని ఫైళ్లను staging area కు చేర్చడానికి ఉపయోగిస్తారు |
04:21 | మనము hyphen a flag ఉపయోగించినప్పుడు, మార్పు చేయబడిన ఫైళ్ళను staging area కి జోడించడానికి ప్రత్యేకంగా కమాండ్ git add అవసరం లేదు. |
04:30 | command line లో దానంతట అదే commit message ఇవ్వడానికి Hyphen m flag ని ఉపయోగిస్తాము. |
04:36 | మనము hyphen a మరియు hyphen m flag లను hyphen am గ కూడా ఉపయోగించవచ్చు. |
04:42 | తిరిగి Terminal కు వెళ్ళండి . |
04:45 | Git log ను తనిఖీ చేయుటకు git space logఅని టైప్ చేసి Enter నొక్కండి. |
04:52 | మీరు commit ల లిస్ట్ ను చూడవచ్చు. |
04:54 | కొత్త commits మొదట లిస్ట్ చేయబడతాయి అని గమనించండి |
04:58 | అంటే, commits కాలక్రమానుసారంగా లిస్ట్ చేయబడ్డాయి. |
05:03 | ఒకవేళ మీరు Git repository కీ తప్పు ఫైల్‌ను చేర్చాము అనుకుంటే , దాన్ని సులభంగా తీసివేయవచ్చు |
05:10 | ఉదాహరణకు, నేను ఫైల్ mypage.html ను తొలగించాలనుకుంటున్నాను |
05:16 | git space rm space hyphen hyphen cached space mypage dot html అని టైప్ చేయండి మరియు Enterనొక్కండి. |
05:26 | ఈ కమాండ్ staging area నుండి ఫైల్ mypage.html ను తొలగిస్తుంది. |
05:32 | git space ను టైప్ చేసి Enter నొక్కడం ద్వారా Git statusని తనిఖీ చేయవచ్చు |
05:40 | అది mypage.html ఫైల్ ఒక untracked ఫైల్అని చెబుతుంది |
05:45 | ఇప్పుడు, మనం ఫైల్ సిస్టమ్ నుండి ఫైల్ ను తీసివేయడానికి |
05:49 | rm space mypage dot html అని టైప్ చేయండి మరియు Enterనొక్కండి. |
05:55 | ఈ కమాండ్ mywebpage ఫోల్డర్ నుండి ఫైల్ ను పూర్తిగా తీసివేస్తుంది. |
06:00 | ఇప్పుడు, Git repository నుండి ఫైలు తీసివేయబడిందో లేదో చెక్ చేద్దాం |
06:06 | కాబట్టి, git space status అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి |
06:12 | ఇది “deleted: mypage.html” అనే సందేశాన్ని చూపుతుంది |
06:16 | ఇప్పుడు, పైళ్ల పేర్లు లిస్ట్ చేయుటకు "ls" అని టైప్ చేసి Enterనొక్కండి |
06:21 | ఇక్కడ, మనము ఇకపై mypage.html ని చూడలేము |
06:28 | ఈ సమయంలో, మన కోడ్ ను ఫ్రీజ్ చేద్దాం |
06:32 | commit, కొరకు git space commit space hyphen am space " డబుల్ కోట్స్ లో “Deleted mypage.html” అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
06:45 | Git log ను చూడడానికి git space log అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి |
06:51 | exit అవటానికి మీ కీ బోర్డు పై ఉన్న q కీ ని నొక్కండి |
06:55 | ఇక్కడ, మనము commit message ను చదవటం ద్వారా చివరి commit ను చూడవచ్చు |
06:59 | ఇప్పుడు, మనం పొరపాటున mypage.html తొలగించబడింది ఇప్పుడు మనము దాన్ని పునరుద్ధరించాలి అని అనుకుంటున్నాము. |
07:08 | మనం ఏమి చేయవచ్చు ? మునుపటి commits నుండి తొలగించిన ఫైల్‌ను మనం తిరిగి పొందవచ్చు. s |
07:13 | “Added two files”అనే commit message ఉన్న రెండవ commit నుండి మన ఫైల్ ను పునరుద్ధరించుదాం. |
07:20 | రెండవ commit hash యొక్క మొదటి ఐదు అంకెలను ఎంచుకోండి |
07:24 | మరియు వాటిని కాపీ చేయడానికి Ctrl + Shift + C కీలను కలిపి నొక్కండి. |
07:28 | మొదటి ఐదు అంకెలు సరిపోతాయి. |
07:31 | కానీ మీరు కోరుకుంటే, ఐదు కంటే ఎక్కువ అంకెలను కూడా కాపీ చేయవచ్చు. |
07:36 | git space checkout spaceఅని టైప్ చేయండి మరియు commit hash ను పేస్ట్ చేయుటకు Ctrl + Shift + V కీలను కలిపి నొక్కండి |
07:45 | ఇప్పుడు, ఫైల్ పేరు "mypage.html" అని టైప్ చేసి Enter నొక్కండి. |
07:51 | Git statusను తనిఖీ చేయుటకు git space status అని టైప్ చేసి Enter నొక్కండి |
07:58 | ఇప్పుడు, మీరు mypage.html ఫైల్ ను చూడవచ్చు. |
08:02 | ఇప్పుడు మన పనిని commit చేద్దాము |
08:05 | మనం ఏ ఫైల్ ను అయిన జోడించినా లేదా తొలగించినా పనిని commit చేయుట ముఖ్యమని గమనించండి |
08:12 | git space commit space hyphen am space “Restored mypage.html” అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి |
08:22 | ఇప్పుడు, ls ను టైపుచేసి మరియు Enter నొక్కడం ద్వారా ఫైళ్ళ జాబితా చూడవచ్చు |
08:28 | మన ఫైల్ mypage.html పునరుద్ధరించబడిందని మనము చూడవచ్చు |
08:33 | ఇప్పుడు మనము ఫైల్ కు చేసిన మార్పులను ఎలా తీసివేయాలో చూద్దాము .. |
08:38 | ఈ ఫైళ్లను తెరవడానికి gedit space mypage.html space mystory.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి |
08:50 | మనము mypage.html మరియు mystory.html లో కొన్ని మార్పులను చేద్దాము |
08:58 | రెండు ఫైళ్ళలో కొన్ని లైన్స్ ను చేర్చండి మరియు తొలగించండి |
09:03 | అప్పుడు save చేసి ఫైల్స్ ను మూసివేయండి. |
09:06 | కొన్ని సందర్భాల్లో, మనము ఈ మార్పులతో కొనసాగలేము |
09:11 | అంటే మన పని యొక్క మునుపటి stage కు వెళ్లాలని అర్ధం |
09:16 | దీన్ని ఎలా చేయాలో నేర్చుకుందాం. |
09:19 | మొదటగా , Git statusని తనిఖీ చేయడానికి git space statusని టైప్ చేసి Enter నొక్కండి |
09:27 | ఇది కొన్ని ఫైళ్ళను సవరించినట్లు చెబుతోంది |
09:30 | ఇప్పుడు, git space checkout space dot అని టైప్ చేయండి మరియు Enter చేయండి |
09:37 | ఈ command మన పని యొక్క కొత్త మార్పులను తీసివేస్తుంది |
09:41 | git space status టైప్ చేసి Git status తనిఖీ చేసి Enter నొక్కండి |
09:48 | ఇది “nothing to commit” అని చెప్తుంది. |
09:51 | మార్పులు ఇప్పటికీ ఉన్నవో లేవో చూడడానికి ఫైళ్ళను చెక్ చేద్దాం |
09:57 | gedit space mypage.html space mystory.html & అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి |
10:07 | మన మార్పులు డిస్కార్డెడ్ అయినట్లు మనము చూడవచ్చు. ఫైల్‌లను మూసివేయండి |
10:13 | ఇప్పుడు, Git log ను తనిఖీ చేయుటకు git space log అని టైప్ చేసి Enter నొక్కండి |
10:20 | ఇది commits యొక్క list ను చూపుతుంది |
10:23 | మరికొన్ని చూడడానికి down arrow కీ ని నొక్కండి |
10:26 | exit అవడానికి కీ బోర్డు పై ఉన్న qకీ ని నొక్కండి |
10:30 | commits list ని ఒక లైన్ లోనే చూడడానికి git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి |
10:42 | ఇక్కడ మీరు commits list ను వాటి యొక్క commit hash మరియు commit messages తో కలిపి ఒకే లైన్ లో చూడవచ్చు . |
10:48 | మన పని యొక్క మునుపటి రివిజన్ కు ఎలా వెళ్ళవచ్చు? |
10:53 | ప్రస్తుతం మన repository లో నాలుగు commits ఉన్నాయి |
10:56 | దీని అర్థం మన పనిలో నాలుగు మార్పులు ఉన్నాయి. |
11:01 | మనము “Initial commit” దశకు వెళ్లాలనుకుంటున్నాము, అనుకొందాము. |
11:05 | కాబట్టి git space checkout space, అని టైప్ చేసి Initial commit యొక్క commit hash ను కాపీ చేసి పేస్ట్ చేయండి మరియు Enter నొక్కండి |
11:15 | ఫైళ్ల లిస్ట్ కోసం ls అని టైప్ చేసి Enter నొక్కండి. |
11:19 | మనము ఇక్కడ mypage.html మాత్రమే చూడగలము ఎందుకంటే ఈ stage లోఈ ఫైల్ మాత్రమే ఉంది |
11:28 | ఇప్పుడు git space logఅని టైప్ చేసి Enterనొక్కి Git log ను చెక్ చేయండి |
11:34 | మనము మొదటి commit, అదే, Initial commit మాత్రమే చూడగలము |
11:39 | ప్రస్తుత రివిజన్ కు వెళ్ళడానికి git space checkout space master అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
11:48 | మనము master అనే పదం గురించి తరువాతి ట్యుటోరియల్స్ లో నేర్చుకుంటాము |
11:53 | మళ్ళీ ఒకసారి Git log ను చెక్ చేద్దాం |
11:57 | git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి |
12:03 | ఇప్పుడు మీరు నాలుగు commits చూడవచ్చు. కాబట్టి, మనము లేటెస్ట్ stage లో ఉన్నాము |
12:10 | ఇదే పద్ధతి లో మనము ఏ stage లోనైనా చేయవచ్చు |
12:14 | పాత రివిజన్ కు వెళ్ళడానికి మరొక మార్గం కూడా ఉంది |
12:18 | git space reset space hyphen hyphen hard అని టైప్ చేయండి |
12:23 | తరువాత Initial commitయొక్క commit hash ను copy చేసి paste చేయండి మరియు Enter నొక్కండి. |
12:29 | git space logఅని టైప్ చేసి Enterనొక్కి Git log ను చెక్ చేయండి |
12:35 | ఇది మనము Initial commit stage వద్ద ఉన్నామని చూపిస్తుంది |
12:39 | ఇప్పుడు, తాజా రివిజన్ కు వెళ్లడానికి ప్రయత్నిద్దాం. |
12:43 | ముందు చేసినట్లుగా git space checkout space master మరియు Enter నొక్కండి |
12:51 | మనము తాజా రివిజన్ కు తిరిగి వెళ్ళలేకపోయాము |
12:55 | బదులుగా, మనము “Already on 'master'” అనే సందేశాన్ని అందుకున్నాము: |
12:58 | దీని అర్ధం ఇది మన కొత్త రివిజన్ |
13:02 | కాబట్టి ఒక్కసారి మనం git reset hyphen hyphen hard, కమాండ్ ను ఉపయోగిస్తే తిరిగి మనం లేటెస్ట్ stage కు వెళ్లలేము అని గుర్తుపెట్టుకోండి |
13:11 | కాబట్టి మనం ఈ కమాండ్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి |
13:15 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
13:18 | ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మల్టిపుల్ ఫైల్స్‌ను ను Git repository కి ఎలా జోడించటం |
13:27 | Git reopitory నుండి ఒక ఫైల్ తీసేయటం తొలగించిన ఫైల్ ని పునరుద్ధరించటం |
13:32 | ఫైల్ లో మార్పులు చేయ టం పాత రివిజన్ కుతిరిగి వెళ్ళటం గురించి తెలుసుకున్నాం |
13:39 | అస్సైన్మెంట్ గా మీరు ఇంతకు ముందు ట్యుటోరియల్ లో క్రియేట్ చేసిన Git repositoryకి వెళ్లి |
13:46 | ఆ text ఫైల్ కు కొన్ని మార్పులు చేయండి |
13:49 | మార్పులు Commitచేయండి |
13:52 | మీ పాత రివిజన్ కు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించండి |
13:55 | మళ్ళీ మీ text ఫైల్ లో కొన్ని మార్పులు చేయడానికి మరియు మార్పులను విస్మరించటానికి ప్రయత్నించండి |
14:02 | ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది . దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
14:11 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది |
14:18 | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి |
14:22 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
14:29 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది |
14:34 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు |