Advanced-Cpp/C2/More-On-Inheritance/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 13:04, 1 June 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్ మరియుహైరర్కికల్ ఇన్-హెరిటెన్స్ ఇన్ c++ కు స్వాగతం |
00:07 | ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది. |
00:09 | మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్ |
00:11 | హైరర్కికల్ ఇన్-హెరిటెన్స్ |
00:13 | మనం మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్ గురించి ఒక ఉదాహరణతో చూద్దాం. |
00:17 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది, |
00:20 | ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 |
00:24 | g++కంపైలర్ వర్షన్ 4.6.1 |
00:29 | మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్ లో ఒక డిరైవ్డ్ క్లాస్ ఎక్కువ బేస్ క్లాస్‌ల నుండి ఇన్-హెరిట్ చేయబడును. |
00:36 | మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్ ను ఒక ఉదాహరణతో చూద్దాం. |
00:40 | నేను ఇప్పటికే ఎడిటర్ నందు టైప్ చేసి ఉంచిన కోడ్ నాదగ్గర ఉంది. |
00:42 | నా కోడ్ ను తెరుచుచున్నాను. |
00:45 | మన ఫైల్ పేరు multiple.cpp అని గమనించండి. |
00:49 | ఈ ప్రోగ్రాం నందు, మనం name, roll no, marks మరియు average లను ప్రదర్శిస్తున్నాం. |
00:56 | ముందుగా కోడ్-ను వివరిస్తాను. |
00:59 | iostream అనేది మన headerfile |
01:01 | ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాం. |
01:05 | ఇక్కడ మనకు student అనే క్లాస్ ఉన్నది. |
01:07 | ఇది బేస్ క్లాస్ |
01:09 | దీనియందు మనకు roll_no ,interger వేరియబుల్ గాను మరియు name, character వేరియబుల్ గాను ఉన్నవి. |
01:16 | ఇవి ప్రొటెక్టెడ్ గా డిక్లేర్ చేయబడ్డాయి. |
01:19 | తరువాత మనకు exam-inherit అనే మరొక క్లాస్ ఉన్నది. |
01:24 | ఇది కూడా ఒక బేస్ క్లాస్ |
01:26 | కాబట్టి మనకు student, మరియు exam_inherit అను రెండు బేస్ క్లాస్ లు కలవు. |
01:32. | ఇందులో మనకు sub1,sub2, మరియు sub3 అనే మూడు ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ కలవు. |
01:38 | ఇది ఎందువలనంటే ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ ను మనం డెరైవ్డ్ క్లాస్ లో పొందగలము కనుక |
01:44 | ఇక్కడ మనకు gradeఅనే డెరైవ్డ్ క్లాస్ కలదు. |
01:50 | ఇది student,మరియు exam_inherit అనే బేస్ క్లాసుల నుండి డెరైవ్ చేయబడినది . |
01:56 | దీనియందు మనకు avg అను, ఒక ప్రైవేట్ integer వేరియబుల్ ఉన్నది. |
02:02 | తరువాత మనకు - |
02:04 | innput() ,display() |
02:06 | average(), input_exam() |
02:08 | మరియు display_exam() వంటి పబ్లిక్ ఫంక్షన్లు ఉన్నాయి. |
02:11 | దీనియందు మనకు total, పబ్లిక్ integer వేరియబుల్ గా ఉన్నది. |
02:17 | తరువాత మనం input() ఫంక్షన్ ను roll_no మరియు name లను యూసర్ నుండి పొందుటకు ఉపయోగిస్తున్నాము. |
02:24 | display() ఫంక్షన్ లో మనం roll_no మరియు name లను display చేస్తున్నాము. |
02:28 | ఇక్కడ మనకు input_exam(), అనే ఫంక్షన్ ఉన్నది. |
02:31 | దీనియందు మనం sub1,sub2,sub3 మరియు total ల కు మార్క్స్ యూసర్ నుండి పొందుచున్నాము. |
02:37 | తరువాత display_exam() లో మనం మూడు పాఠ్యాంశము ల మొత్తం గణించి మరియు total ప్రింట్ చేస్తున్నాము. |
02:44 | మరియు average ఫంక్షన్ నందు మనం సగటు ను గణించుచున్నాము. |
02:48 | ఇది మన main ఫంక్షన్ |
02:51 | ఈ ఫంక్షన్ లోపల మనం డిరైవ్డ్ క్లాస్ అయినటువంటి grade క్లాస్ కు gd ను ఆబ్జక్ట్ గా సృష్టిస్తాం. |
02:57 | తరువాత మనం అన్ని ఫంక్షన్స్ ను కాల్ చేస్తాం |
03:01 | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
03:03 | ఇప్పుడు ప్రోగ్రాం ను అమలు చేద్దాం. |
03:05 | Ctrl, Alt మరియు T లు కలిపి ఒకేసారి నొక్కి టెర్మినల్ విండో తెరుద్దాం. |
03:14 | కంపైల్ చేయుటకు g++ space multiple dot cpp space-o space multఅని టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
03:24 | dot slash mult అని టైప్ చేసి, ఎంటర్ ను నొక్కండి. |
03:29 | ఇక్కడ మనం Enter Roll no అని చూస్తాం. |
03:32 | నేను 3 అని ఇస్తాను. |
03:34 | Enter Name |
03:36 | నేను Pratham అని నమోదు చేస్తాను. |
03:39 | Enter marks of subject1 |
03:41 | నేను 67 అని, |
03:43 | subject2 కు 78 అని మరియు |
03:46 | subject3 కు 84 అని ఇస్తాను |
03:48 | అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. |
03:51 | Roll no is 3 Name is Pratham |
03:53 | Total is 229 |
03:55 | Average is 76 |
03:58 | ఇది మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్ |
04:00 | ఇప్పుడు హైరర్కికల్ ఇన్-హెరిటెన్స్ గురించి |
04:03 | తిరిగి మనం మన ప్రోగ్రాం కు వెళ్దాం. |
04:05 | హైరర్కికల్ ఇన్-హెరిటెన్స్ నందు ఎక్కువ డిరైవ్డ్ క్లాసులు ఒకే బేస్ క్లాస్ నుండి ఇన్-హెరిట్ చేయబడును. |
04:12 | మన ఫైల్ పేరు hierarchical dot cpp అని గమనించండి. |
04:16 | నేను ముందుగా కోడ్-ను వివరిస్తాను. |
04:19 | iostream అనేది మన header file |
04:22 | ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాం. |
04:25 | తరువాత మనకు student అనే క్లాస్ ఉన్నది. |
04:29 | ఇందులో మనకు గా roll_no అనే ఒక integer వేరియబుల్ , |
04:34 | sub1,sub2,sub3 మరియు total అనే integer వేరియబుల్స్ , |
04:40 | తరువాత name ను character వేరియబుల్ గాను కలవు. |
04:43 | ఇవి ప్రొటెక్టెడ్ గా డిక్లేర్ చేయడ్డాయి. |
04:46 | ఇక్కడ మనకు show అనే క్లాస్ ఉన్నది |
04:49 | ఇది డిరైవ్డ్ క్లాస్ |
04:51 | ఇది student క్లాస్ యొక్క లక్షణాలను ఇన్-హెరిట్ చేస్తుంది. |
04:54 | దీని యందు input(), display() అను రెండు ఫంక్షన్ లు కలవు. |
04:59 | ఈ ఫంక్షన్ లు పబ్లిక్ గా డిక్లేర్ చేయబడ్డాయి. |
05:02 | input() ఫంక్షన్ లో మనం స్టూడెంట్ యొక్క roll_no మరియు name లను పొందుతాము. |
05:07 | display() ఫంక్షన్ లో మనం స్టూడెంట్ యొక్క roll_no మరియు name లను ప్రదర్శిస్తాము. |
05:11 | తరువాత మనం exam అనే డిరైవ్డ్ క్లాస్ కలిగి ఉన్నాము. |
05:15 | ఇది కూడా student క్లాస్ ను ఇన్-హెరిట్ చేస్తుంది. |
05:19 | అక్కడ రెండు డిరైవ్డ్ క్లాస్లులు exam మరియు showలు ఉండటం మీరు చూడవచ్చు. |
05:26 | రెండూ, student క్లాస్ నుండి ఇన్-హెరిట్ చేయబడ్డాయి. |
05:30 | exam క్లాస్ లో మనకు iput_exam() మరియు total_marks() అను రెండు పబ్లిక్ ఫంక్షన్లు ఉన్నాయి. |
05:38 | ఇక్కడ మనం input_exam() ఫంక్షన్ ను పొందుతున్నాము. |
05:41 | ఇది sub1,sub2 and sub3 అను మూడు విభిన్న పాఠ్యాంశములమార్కులు అంగీకరిస్తుంది |
05:46 | తరువాత మనకు total_marks () ఫంక్షన్ ఉంటుంది. |
05:49 | ఇది మూడు విభిన్న పాఠ్యాంశముల మొత్తం లెక్కించి ముద్రిస్తుంది. |
05:53 | ఇది మన main () ఫంక్షన్ |
05:56 | దీనిలో మనం మూడు క్లాసుల ఆబ్జాక్ట్స్ st,sw ,మరియు em లను సృష్టిస్తాము. |
06:03 | తరువాత మనం ఈ ఆబ్జక్ట్స్ ను ఉపయోగించి అన్ని ఫంక్షన్స్ కాల్ చేస్తాము. sw.input(); em.input_exam(); sw.display(); em.total_marks(); |
06:15 | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
06:17 | మన ప్రోగ్రాం ను అమలు పరచుదాం. |
06:19 | టెర్మినల్ కు తిరిగి వద్దాం. |
06:21 | ప్రాంప్ట్ క్లియర్ చేస్తాను. |
06:24 | కంపైల్ చేయుటకు, g++ space hierarchical dot cpp space hyphen o space hier అని టైప్ చెయ్యండి. |
06:36 | ఎంటర్ ను నొక్కండి. dot slash hier అని టైప్ చేసి |
06:41 | ఎంటర్ ను నొక్కండి. |
06:43 | Enter Roll no నేను 4 అని ఇస్తాను. |
06:46 | Enter Name నేను Ashwini అని ఇస్తాను. |
06:50 | Enter marks of subject1 |
06:52 | నేను 87 అని |
06:54 | subject2 67 గా, మరియు subject3 97 గా ఇస్తాను. |
07:00 | అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. |
07:02 | Roll no is 4 |
07:04 | Name is: Ashwini మరియు |
07:06 | Total is 251 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
07:10 | తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం . |
07:13 | సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకున్నది. |
07:16 | మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్ మరియు |
07:18 | హైరర్కికల్ ఇన్-హెరిటెన్స్ |
07:20 | అసైన్మెంట్ గా area మరియు perimeter అనే క్లాస్ లను సృష్టించండి. |
07:25 | rectangle యొక్క వైశాల్యం మరియు చుట్టుకొలతలను కనుగొనుము. |
07:29 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి. |
07:32 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది . |
07:35 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:40 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: |
07:42 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
07:45 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.. |
07:49 | మరిన్ని వివరాలకు,దయచేసి |
07:51 | contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి. |
07:56 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
08:01 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
08:07 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది. |
08:11 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. |