Advanced-Cpp/C2/Inheritance/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 11:26, 29 May 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఇన్-హెరిటెన్స్ ఇన్ c++ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది. |
00:09 | ఇన్-హెరిటెన్స్,ఇన్-హెరిటెన్స్ లో రకాలు. |
00:12 | ఇది మనం ఉదాహరణలను ఉపయోగించి చేద్దాం. |
00:16 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది, |
00:19 | ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 |
00:24 | g++కంపైలర్ వర్షన్ 4.6.1 |
00:28 | Inheritanceయొక్క పరిచయంతో మొదలు పెడదాం. |
00:32 | ఒక ఆబ్జక్ట్ మరొక ఆబ్జక్ట్ యొక్క లక్షణాలను ఆర్జించినట్లైతే , ఆ విధానమును inheritance అని అందురు. |
00:38 | ఇది మనుగడలో ఉన్న ఒక ఆబ్జక్ట్ ను తిరిగి మార్చకుండా ఉపయోగించుకొనే పద్దతి. |
00:44 | ఇన్-హెరిటెన్స్ లో రకాలు-సింగిల్ లెవెల్ ఇన్-హెరిటెన్స్ |
00:48 | మల్టిపుల్ లెవెల్ ఇన్-హెరిటెన్స్. |
00:50 | హైరర్కికల్ ఇన్-హెరిటెన్స్. |
00:52 | మల్టీలెవెల్ ఇన్-హెరిటెన్స్ మరియు |
00:55 | హైబ్రెడ్ ఇన్-హెరిటెన్స్. |
00:57 | ముందుగా బేస్ క్లాస్ మరియు డిరైవ్డ్ క్లాస్ గురించి తెలుసుకొందాం. |
01:02 | బేస్ క్లాస్ తన సొంత లక్షణాలు మరియు ఫంక్షనాలిటీ కలిగి ఉంటుంది. |
01:06 | దీనిని పేరెంట్ క్లాస్ అని కూడా అందురు. |
01:09 | దీనియందు మిగిలిన ఆబ్జక్ట్స్ ఇన్-హెరిట్ చేయగల ఉమ్మడి లక్షణాలు కలిగి ఉంటుంది. |
01:14 | డిరైవ్డ్ క్లాస్ ఒక చైల్డ్ క్లాస్ |
01:18 | డిరైవ్డ్ క్లాస్ అనునది బేస్ క్లాస్ యొక్కలక్షణాలు మరియు ఫంక్షనాలిటీ లను ఇన్-హెరిట్ చేస్తుంది. |
01:23 | సింగిల్ లెవెల్ ఇన్-హెరిటెన్స్ అంటేఏమిటో చూద్దాం |
01:27 | సింగిల్ లెవెల్ ఇన్-హెరిటెన్స్ లో ఒకేఒక బేస్ క్లాస్ మరియు ఒక డిరైవ్డ్ క్లాస్ ఉంటాయి. |
01:34 | మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్ |
01:37 | మల్టిపుల్ ఇన్-హెరిటెన్స్ లో ఒక డిరైవ్డ్ క్లాస్ ఎక్కువ బేస్ క్లాస్ నుండి ఇన్-హెరిట్ చేయబడును. |
01:44 | హైరర్కికల్ ఇన్-హెరిటెన్స్ |
01:47 | హైరర్కికల్ ఇన్-హెరిటెన్స్ లో ఎక్కువ డిరైవ్డ్ క్లాస్ లు ఒక బేస్ క్లాస్ నుండి ఇన్-హెరిట్ చేయబడును. |
01:55 | మల్టీలెవెల్ ఇన్-హెరిటెన్స్ |
01:57 | మల్టీలెవెల్ ఇన్-హెరిటెన్స్ లో ఒక సబ్ క్లాస్, వేరొక క్లాస్ కు ఒక బేస్ క్లాస్ లా ప్రవర్తిస్తుంది. |
02:05 | మరియు హైబ్రెడ్ ఇన్-హెరిటెన్స్ |
02:08 | హైబ్రెడ్ ఇన్-హెరిటెన్స్ లో ఒకటికంటే ఎక్కువ ఇన్-హెరిటెన్స్ రూపాలు కలపబడి ఉంటాయి. |
02:14 | సింగిల్ లెవెల్ ఇన్-హెరిటెన్స్ ను ఒక ఉదాహరణతో చూద్దాం. |
02:18 | నేను ఇప్పటికే ఒక ఎడిటర్ నందు టైప్ చేసి ఉంచిన నా కోడ్ ను తెరుచుచున్నాను. |
02:21 | నేను కోడ్-ను వివరిస్తాను. |
02:23 | మన ఫైల్ పేరు exam_inherit.cpp అని గమనించండి. |
02:28 | ఈ ఉదాహరణ స్టూడెంట్ యొక్క name ,rollno, మరియు marks లను కలిగి ఉంది. |
02:35 | iostream అనేది మన headerfile |
02:38 | ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాం. |
02:42 | ఇక్కడ మనకు student అనే క్లాస్ ఉన్నది. |
02:44 | తరువాత మనకు మన క్లాస్ నందు ప్రైవేట్ మెంబర్స్ గా ఒక integer వేరియబుల్ roll_no మరియు ఒక character array name లు ఉన్నవి. |
02:53 | input() మరియు display()లు student క్లాస్ యొక్క పబ్లిక్ ఫంక్షన్లు. |
02:59 | ఇక్కడ మనం input() ఫంక్షన్ ను roll_no,name లను యూసర్ నుండి పొందుటకు ఉపయోగిస్తున్నాము. |
03:06 | మరియు మనము display() ఫంక్షన్ ను roll_no, name లను display చేయుటకు ఉపయోగిస్తున్నాము. |
03:11 | ఇక్కడ మనకు exam_inheritఅనే వేరొక క్లాస్ కలదు. |
03:16 | ఇది డిరైవ్డ్ క్లాస్ |
03:18 | అది student క్లాస్ యొక్క ఫంక్షన్స్ మరియు డేటా లను ఇన్-హెరిట్ చేస్తుంది. |
03:23 | తరువాత మనం sub1,sub2,sub3 మరియు total లను |
03:28 | exam_inherit క్లాస్ లో ప్రైవేట్ మెంబర్స్ గా డిక్లేర్ చేశాము. |
03:33 | ఇక్కడ మనకు input_exam(), display_exam() అనే రెండు పబ్లిక్ ఫంక్షన్లు ఉన్నాయి. |
03:41 | ఇక్కడ మనం exam_inherit క్లాసును ముగిస్తున్నాము. |
03:44 | ఇప్పుడు మనం మార్క్స్ ను యూసర్ నుండి పొందుటకు input_exam() ఫంక్షన్ ను ఉపయోగిస్తున్నాము. |
03:52 | ఇక్కడ మనం display_exam() ఫంక్షన్ ను మూడు పాఠ్యాంశము ల మొత్తం గణించుటకు ఉపయోగిస్తున్నాము |
03:59 | తరువాత మన total ను ప్రింట్ చేస్తున్నాము. |
04:01 | ఇది మన main ఫంక్షన్ |
04:03 | ఇక్కడ మనం exam_inherit క్లాస్ కు ex అను ఒక ఆబ్జక్ట్ ను సృష్టిస్తున్నాం. |
04:10 | తరువాత exఆబ్జక్ట్ ను ఉపయోగించి ఫంక్షన్స్ ను పిలుస్తున్నాము. |
04:15 | మరియు ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
04:18 | ప్రోగ్రాం ను అమలు పరుచుదాం. |
04:20 | Ctrl, Alt మరియు T లు కలిపి ఒకేసారి నొక్కి టెర్మినల్ విండో తెరుద్దాం. |
04:30 | కంపైల్ చేయుటకు |
04:31 | g++ (space) exam_inherit.cpp (space)-o (space) exam అని టైప్ చెయ్యండి. |
04:41 | ఎంటర్ ను నొక్కండి. |
04:42 | ./ (dot slash) exam అని టైప్ చేసి, ఎంటర్ ను నొక్కండి. |
04:46 | ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అగును. Enter Roll no.అని చూస్తాం. |
04:49 | నేను 1 అని ఇస్తాను. |
04:51 | Enter Name నేను Arya అని ఇస్తాను. |
04:55 | Enter marks of subject1 |
04:57 | నేను 60 అని ఇస్తాను |
05:00 | నేను subject2 కు 70 అని ఇస్తాను |
05:02 | నేను subject3 కు 80 అని ఇస్తాను |
05:06 | అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. |
05:08 | Roll no is 1 Name is Arya మరియు |
05:11 | Total is 210 |
05:13 | ఇప్పుడు మనం మల్టీలెవెల్ ఇన్-హెరిటెన్స్ గురించి ఒక ఉదాహరణతో చూద్దాం. |
05:18 | ఇప్పటికే టైప్ చేసి ఉంచిన కోడ్ నాదగ్గర ఉంది. |
05:20 | తిరిగి మన ఎడిటర్ కు వెళ్దాం |
05:22 | మన ఫైల్ పేరు multilevel.cpp అని గమనించండి. |
05:28 | ఇక్కడ మనం total అనే వేరియబుల్ ను |
05:32 | exam_inherit అనే క్లాస్ కు పబ్లిక్ గా డిక్లేర్ చేశాము. |
05:38 | ఇది ఎందువలనంటే ప్రైవేట్ వేరియబుల్స్ ను మనం డెరైవ్డ్ క్లాస్ లో పొందలేము కనుక . |
05:44 | ఇక్కడ మనకు grade అనే మరొక క్లాస్ కలదు. |
05:49 | ఇది exam_inherit అనే క్లాస్ ను ఇన్-హెరిట్ చేస్తుంది. |
05:53 | grade అనే క్లాస్ ఒక డెరైవ్డ్ క్లాస్ |
05:56 | మరియు exam_inheritక్లాస్, grade క్లాస్ కు ఒక బేస్ క్లాస్ |
06:02 | exam_inherit యొక్క ఫంక్షన్స్ మరియు dataలు అన్ని grade లోనికి ఇన్-హేరిట్ చేయబడతాయి. |
06:11 | ఇక్కడ మనం grade క్లాస్ లో avg అనే privateవేరియబుల్ ను , |
06:17 | మరియు average()ఫంక్షన్ ను ఒక పబ్లిక్ ఫంక్షన్ గా డిక్లేర్ చేశాము. |
06:21 | తరువాత మనం క్లాస్ ను క్లోజ్ చేస్తాం. |
06:23 | ఇక్కడ మనం average() ఫంక్షన్ ను average ను గణించడానికి ఉపయోగిస్తున్నాం. |
06:27 | తరువాత మనం average ను ప్రింట్ చేస్తాం. |
06:30 | main ఫంక్షన్ లోపల మనం grade క్లాస్ కు object గా gd ను సృష్టిస్తాం. |
06:36 | తరువాత మనం gd ను ఉపయోగించి అన్ని ఫంక్షన్స్ ను కాల్ చేస్తాం. |
06:40 | gd.input() |
06:42 | input_exam() |
06:44 | display(), display_exam() |
06:46 | average() ఫంక్షన్. |
06:49 | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
06:52 | ఇప్పుడు మనం మన డెరైవ్డ్ క్లాస్ grade గురించి చూద్దాం. |
06:56 | exam_inherit క్లాస్ grade క్లాస్ కు బేస్ క్లాస్ |
07:01 | ఇక్కడ exam_inherit క్లాస్ ఒక డెరైవ్డ్ క్లాస్ |
07:06 | student క్లాస్ exam_inherit క్లాస్ కు బేస్ క్లాస్ |
07:12 | ప్రోగ్రాం ను అమలు పరచుదాం. |
07:14 | తిరిగి మన టెర్మినల్ కు వద్దాం. |
07:17 | కంపైల్ చేయుటకు |
07:18 | g++ (space) multilevel.cpp (space)-o (space) mul అని టైప్ చెయ్యండి. |
07:26 | ఎంటర్ ను నొక్కండి. ./mulఅని టైప్ చెయ్యండి. |
07:30 | ఎంటర్ ను నొక్కండి. |
07:32 | ఇక్కడ మనం Enter Roll no. అని చూడవచ్చు. |
07:34 | నేను 2 అని నమోదు చేస్తాను |
07:36 | Enter Name |
07:38 | నేను pratham అని నమోదు చేస్తాను. |
07:41 | Enter marks of subject1 |
07:43 | నేను 65 అని |
07:46 | subject2 కు 67 అని |
07:48 | subject3 కు 82 అని నమోదు చేస్తాను |
07:52 | ఔట్పుట్ ఈ విధంగా ప్రదర్శించబడును. |
07:54 | Roll no is 2 |
07:56 | Name is Pratham Total is 214 మరియు |
07:59 | Average is 71 |
08:01 | మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
08:05 | తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం |
08:07 | సంగ్రహంగా |
08:08 | ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకున్నది. |
08:10 | ఇన్-హెరిటెన్స్ మరియు ఇన్-హెరిటెన్స్ లో రకాలు |
08:14 | అసైన్మెంట్ గా Shape అనే క్లాస్ ను సృష్టించండి. |
08:18 | తరువాత Area మరియు Perimeterఅను రెండు ఫంక్షన్స్ సృష్టించండి. |
08:23 | తరువాత చతురస్రం మరియు దీర్ఘచతురస్రం మరియు వృత్తం వంటి వివిధ రకాలైన ఆకారాల వైశాల్యం ,చుట్టుకొలత లను కనుగొనండి. |
08:31 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి. |
08:34 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది . |
08:37 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
08:42 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- |
08:44 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
08:47 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. |
08:51 | మరిన్ని వివరాలకు, దయచేసి |
08:53 | contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి. |
08:58 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
09:02 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
09:09 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది. |
09:13 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. |