Inkscape/C2/Create-and-edit-multiple-objects/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 11:31, 9 May 2017 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration |
00:01 | Inkscape ను ఉపయోగించి Create and edit multiple objects పై ఈ Spoken Tutorial కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లోమనం నేర్చుకునేవి- ఆబ్జెక్ట్ లను కాపీ మరియు పేస్ట్ చేయటం. |
00:13 | ఆబ్జెక్ట్ లను డూప్లికేట్ మరియు క్లోన్ చేయటం |
00:16 | వివిధ ఆబ్జెక్ట్ లను సమూహ పరచుట మరియు క్రమ పరచుట |
00:19 | మల్టిపుల్ సెలక్షన్ మరియు ఇన్వెర్ట్ సెలక్షన్ (బహుళ ఎంపిక మరియు ఎంపికను తిరగవేయటం). |
00:22 | Clipping మరియు Masking. |
00:25 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయటానికి, నేను-Ubuntu Linux 12.04 OS |
00:31 | Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను |
00:35 | Dash home కు వెళ్ళి, Inkscap అని టైప్ చేయండి. |
00:39 | మీరు logo పై క్లిక్ చేసి కూడా Inkscape ను తెరువవచ్చు. |
00:42 | మనం ఇంతకుముందే రూపొందించిన Assignment.svg ఫైల్ ను తెరుద్దాం. |
00:49 | నేను దానిని నా Documents ఫోల్డర్ లో భద్రపరిచాను. |
00:52 | ముందుగా మనం ఒక ఆబ్జెక్ట్ ను copy మరియు paste ఎలా చేయాలో నేర్చుకుందాం. |
00:56 | ఆలా చేయటానికి, ముందుగా మనం ఒక ఆబ్జెక్ట్ ను ఎంచుకోవాలి. కనుక, పంచభుజి పై క్లిక్ చేయండి. |
01:02 | దానిని copy చేయటానికి మీ కీ బోర్డు పై Ctrl + C ని నొక్కండి. |
01:07 | ఆబ్జెక్ట్ ను పేస్ట్ చేయటానికి Ctrl + V ని నొక్కండి.మీరు కేన్వాస్ పై పంచభుజి యొక్క ఒక ప్రతిని చూడవచ్చు. |
01:17 | ఆబ్జెక్ట్ ల కాపీలు సృష్టించడానికి మూడు ఇతర మార్గాలు ఉన్నాయి. |
01:21 | ఈ మూడు పద్ధతులలోను, ఆబ్జెక్ట్ యొక్క కాపీ ఖచ్చితంగా అసలుదానివలె సృష్టించబడుతుంది. |
01:29 | మొదటి పద్దతిని Paste Special అంటారు. |
01:32 | ఆబ్జెక్ట్ ను copy చేయటానికి ఇప్పటికే మనం Ctrl + C ని నొక్కామని గుర్తుంచుకోండి. |
01:38 | ఆబ్జెక్ట్ ఎక్కడనుండి అయితే కాపీ చేయబడిందో ఖచ్చితంగా అదే స్థానంలో paste చేయటానికి, Ctrl + Alt + V కీ ని నొక్కండి. |
01:47 | సరిగ్గా దానికిందనే ఉన్న అసలు ఆబ్జెక్ట్ ను చూడటానికి కాపీ చేయబడిన ఆబ్జెక్ట్ ను కదిలించండి. |
01:54 | ఈ రెండు ఆబ్జెక్ట్ లను కదిలిద్దాం ఇంకా వాటిని ఒక పక్కన పెడదాం. |
01:57 | రెండవ పద్దతిని Duplication అంటారు.డూప్లికేషన్ కొరకు, మనం ముందుగా ఆబ్జెక్ట్ ను కాపీ చేయవల్సిన అవసరం లేదు. |
02:05 | పంచభుజిని ఎంచుకోండి ఇంకా మీ కీబోర్డ్ పై Ctrl + D కీ లను నొక్కండి. |
02:13 | సరిగ్గా అసలు దానిలాగే ఉన్న ఒక డూప్లికేట్ పంచభుజి, అసలు దాని పైన సృష్టించబడింది |
02:19 | డూప్లికేట్ ఆబ్జెక్ట్ కిందన ఉన్న అసలు ఆబ్జెక్ట్ ను చూడటానికి దానిని కదిలిద్దాం. |
02:25 | డూప్లికేట్ ఆబ్జెక్ట్ మీద చేసిన మార్పులు అసలు ఆబ్జెక్ట్ ను ప్రభావితం చేయవు. |
02:32 | రంగు ను ఆకు పచ్చకు మార్చడం ఇంకా సైజు ను తగ్గించటం చేత దానిని చెక్ చేద్దాం. |
02:40 | మూడవ పద్దతిని Cloning అంటారు. |
02:44 | ఒక clone ను సృష్టించడానికి ellipse పై క్లిక్ చేయండి ఇంకా Alt + D నొక్కండి. |
02:49 | ముందువలె, ఒక క్లోన్డ్ ఆబ్జెక్ట్ కూడా అసలు దాని పైనే సృష్టించబడింది. |
02:55 | దానిని మనకు కనిపించేలా చేయటానికి, పక్కకి కదిలిద్దాం. |
02:58 | క్లోన్డ్ ఆబ్జెక్ట్ ఎల్లపుడు అసలైన ఆబ్జెక్ట్ తో జోడించబడి ఉంటుందని దయచేసి గమనించండి. |
03:04 | అసలు ఆబ్జెక్ట్ ను దాని మూలము అని కూడా అంటారు. |
03:08 | అసలు ఆబ్జెక్ట్ పై పరిమాణంలో, రంగు మొదలైనవాటిలో ఏ విధమైన మార్పులు చేసినా అవి దాని క్లోన్ ను ప్రభావితం చేస్తాయి. |
03:16 | అసలు ఆబ్జెక్ట్ యొక్క రంగును గులాబీకి మార్చడం, రొటేట్ చేయడం మరియు దాని యొక్క పరిమాణాన్ని తగ్గించడం చేత దానిని చెక్ చేద్దాం. |
03:30 | క్లోన్డ్ ఆబ్జెక్ట్ లోఖచ్చితమైన అవే మార్పులు స్వయంచాలకంగా ప్రతిబింబిస్తాయి, గమనించండి. |
03:36 | అసలు ఆబ్జెక్ట్ నుండి క్లోన్ లింక్ ను తొలగించటానికి, ముందు clone ను ఎంచుకుని తరువాత Shift + Alt + D ను నొక్కండి. |
03:44 | ఇప్పుడు, అసలు ఆబ్జెక్ట్ ను మళ్ళీ ఎంచుకోండి మరియు దాని యొక్క పరిమాణాన్ని మార్పు చేయండి. |
03:50 | క్లోన్డ్ ఆబ్జెక్ట్ ప్రభావితం కాలేదు, గమనించండి. |
03:54 | ఈ ప్రక్రియల కొరకు షార్ట్ -కట్ ఐకాన్స్ command bar లో చూపినవిధంగా ఉన్నాయి. |
04:01 | బహుళ ఆబ్జెక్ట్ లను ఎంచుకోవడానికి, Shift కీ ని నొక్కి ఉంచండి మరియు మీరు ఎంచుకోవాలి అనుకున్న ఆబ్జెక్ట్ లపై క్లిక్ చేయండి |
04:08 | నేను ముందుగా ఒక దీర్ఘవృత్తాన్నిఎంచుకుంటాను. తరువాత నేను Shift కీ ని నొక్కి పట్టుకొని, వేరొక దీర్ఘవృత్తాన్ని ఎంచుకుంటాను. |
04:15 | ఇప్పుడు రెండు ఆబ్జెక్ట్లు ఎంచుకోబడ్డాయి గమనించండి. |
04:19 | Ctrl + G కీలను కలిపినొక్కడం ద్వారా వాటిని మనము సమూహం చెయ్యవచ్చు. |
04:24 | ఇప్పుడు ఈ దీర్ఘవృత్తాలు ఒకే ఆబ్జెక్ట్ గా సమూహం చేయబడ్డాయి గమనించండి. |
04:28 | మీరు వాటిని చుట్టూ కదిలించవచ్చుమరియు రెండు ఆబ్జెక్ట్ లు కలిసి ఒకే ఆబ్జెక్ట్ గా కదులుతున్నాయని గమనిస్తారు. |
04:35 | సమూహాన్నిపునఃపరిమాణం చేయటానికి ప్రయత్నించండి, రెండు ఆబ్జెక్ట్ లు పరస్పరానుగుణంగా పరిమాణంలో మార్పును పొందాయని గమనిస్తారు. |
04:43 | రంగును నీలం కు మార్చండి మరియు రెండు ఆబ్జెక్ట్స్ అదే రంగుకు మారాయి గమనించండి. |
04:53 | ఒకవేళ మనం సమూహం లోని ఒక ఆబ్జెక్ట్ యొక్క లక్షణాలను మాత్రమే మార్పుచేయాలి అనుకుంటే ఏమి చేయాలి? |
05:01 | సమూహంలోని ఒక్క ఆబ్జెక్ట్ ను మాత్రమే ఎంచుకోవడానికి, Ctrl బటన్ ను నొక్కి పెట్టి, ఆ ఆబ్జెక్ట్ పై క్లిక్ చేయండి. |
05:08 | ఈ చర్య వల్ల, మనం గ్రూప్ లోపలకి వెళ్ళవచ్చు మరియు నిర్దిష్ట ఆబ్జెక్ట్స్ ను ఎంచుకోవచ్చు. |
05:13 | సమూహాన్ని నిష్క్రమించటానికి.కేన్వాస్ పైన ఖాళీ స్థలంపై ఎక్కడైనా క్లిక్ చేయండి. |
05:18 | సమూహాన్ని విడదీయటానికి, ముందుగా సమూహాన్ని ఎంచుకోండి మరియు Ctrl + Shift + G కీస్ లేదా Ctrl + U కీస్ లలో ఏవయినా నొక్కండి. |
05:28 | ఇప్పుడు దీర్ఘవృత్తాల సమూహం విడిపోయింది. |
05:31 | ఈ ఆపరేషన్ కొరకు షార్ట్ -కట్ చిహ్నాలు ప్రస్తుతం కమాండ్ బార్ లో చూపిన విధంగా ఉన్నాయి. |
05:36 | కేన్వాస్ పైన ఉన్నఅన్నిఆబ్జెక్ట్ లను ఎంచుకోవడానికి, Ctrl + A కీ లను నొక్కండి. |
05:42 | ఆబ్జెక్ట్ లను వదిలి పెట్టటానికి, కేన్వాస్ పైన ఖాళీ స్థలంపై ఎక్కడైనా క్లిక్ చేయండి. |
05:48 | ఒకవేళ మనం నిర్దిష్టమైన ఒక దాన్ని మినహాయించి మిగిలిన అన్నిఆబ్జెక్ట్ లను ఎంచుకోవాలి అనుకుంటే, Invert Selection ఎంపికను ఉపయోగించవచ్చు. |
05:55 | మనం బాణం తప్ప మిగితా అన్ని ఆబ్జెక్ట్ లను ఎంచుకోవాలి అనుకుంటే, |
05:59 | ముందు బాణం పై క్లిక్ చేయండి.ఇప్పుడు Edit మెనూ కి వెళ్ళి Invert selection పై క్లిక్ చేయండి. |
06:08 | ఇప్పుడు బాణం తప్ప canvas పై ఉన్నఅన్ని ఆబ్జెక్ట్ లు ఎంచుకోబడ్డాయి గమనించండి. |
06:16 | ఇప్పుడు, ఆబ్జెక్ట్ లను ఎలా వరుసలో పెట్టాలో నేర్చుకుందాం. |
06:20 | చిన్న పంచభుజిని, పెద్ద పంచభుజి పైభాగానికి కదిలించండి. |
06:25 | ఇప్పుడు, ఒక నక్షత్రాన్ని గీద్దాం ఇంకా దాన్ని చిన్నపంచభుజి పైన పెడదాం. |
06:36 | చిన్న పంచభుజిని ఎంచుకోండి.ఇంకా Object మెనూ కి వెళ్ళి Raise పై క్లిక్ చేయండి. |
06:42 | ఇపుడు చిన్న పంచభుజి పైకి ఎత్త బడింది మరియు అది నక్షత్రం పైన ఉంది గమనించండి. |
06:47 | ఇప్పుడు, నక్షత్రం పై క్లిక్ చేయండి.Object మెనూ కి వెళ్ళి Lower పై క్లిక్ చేయండి. |
06:53 | ఇప్పుడు, నక్షత్రం కిందికి తరలించబడింది లేదా కిందికి దించబడింది మరియు పెద్ద పెంటగాన్ ఇప్పుడు దాని పైన కనిపిస్తుంది. |
07:00 | ఇప్పుడు, పెద్ద పంచభుజిపై క్లిక్ చేస్తాను.Object మెనూ కి వెళ్ళి Raise to top పై క్లిక్ చేయండి.ఇప్పుడు పెద్ద పంచభుజి అన్నిటికన్న పైన కనిపిస్తుంది |
07:11 | ఇపుడు మళ్ళీ Object మెనూ కి వెళ్ళండి.Lower to bottom పై క్లిక్ చేయండి.పెద్ద పంచభుజి ఇప్పుడు కిందికి కదులుతుంది గమనించండి. |
07:20 | మనం ఈ ఎంపికలను Tool controls bar లోకూడా చూస్తాము. |
07:25 | తరువాత, Clipping ఎలా చేయాలో నేర్చుకుందాం. |
07:28 | క్లిప్పింగ్ మీ క్లిష్టమైన ఆబ్జెక్ట్లనూ, |
07:31 | మీ డిజైన్ యొక్క వేరొక మూలకం లేదా ఆకారానికి అనుగుణంగా, |
07:35 | దాని యొక్క మొత్తం ఆకారాన్ని తొందరగా మరియు సులభంగా మార్పుచేయటం చేత తయారు చేయగలదు. |
07:39 | నేను ఈ ప్రదర్శన కోసం ఒక ఇమేజ్ ను ఉపయోగిస్తాను.ఇక్కడ నేను ఒక కొత్త ఇన్క్ స్కేప్ ఫైల్ లో ఒక చిత్రాన్ని కలిగియున్నాను. |
07:45 | ఈ చిత్రం పైన, నేను ఒక దీర్ఘవృత్తం ఆకారాన్ని గీస్తాను. |
07:49 | ఇప్పుడు, చిత్రాన్ని మరియు దీర్ఘవృత్తాన్ని ఎంచుకోండి. |
07:53 | Object మెనూ కి వెళ్ళండి.Clip పై క్లిక్ చేసి తరువాత Set పై క్లిక్ చేయండి. |
07:59 | ఇప్పుడు చిత్రం దీర్ఘవృత్తం యొక్క ఆకారానికి క్లిప్ చేయబడింది గమనించండి. |
08:04 | క్లిప్పింగ్ లో, క్లిప్ గా ఉపయోగించబడిన ఆబ్జెక్ట్ యొక్క ఆకారం అది కనిపిస్తున్న ప్రాంతంలో నిర్వచించబడుతుంది. |
08:09 | మనం Object మెనూ కి తిరిగి వెళ్ళి క్లిప్ ను తొలగించవచ్చు.Clip పై క్లిక్ చేసి తరువాత Release పై క్లిక్ చేయండి. |
08:17 | ఇప్పుడు clip వదలబడుతుంది. |
08:19 | తరువాత,Masking చేయడం నేర్చుకుందాం. |
08:22 | Masking చాలా వరకు Clipping ను పోలి ఉంటుంది. |
08:25 | Masking లో, ఒక ఆబ్జెక్ట్ యొక్క transparency లేదా lightness, రెండవ ఆబ్జెక్ట్ యొక్క opacity ని నిర్దారిస్తుంది. |
08:32 | Masking ను ప్రదర్శించడానికి, నేను ముందుగా గ్రేడియంట్ టూల్ ని ఉపయోగించి దీర్ఘవృత్తాన్ని సెమీ -ట్రాన్స్పరెంట్ గా చేస్తాను. |
08:38 | ఇప్పుడు, దీర్ఘవృత్తాన్ని ఎంచుకోండి. |
08:40 | Object మెనూ కి వెళ్ళి Fill and stroke పై క్లిక్ చేయండి. |
08:44 | Radial gradient పై క్లిక్ చేసి తరువాత Edit పై క్లిక్ చేయండి. |
08:50 | రంగును తెలుపుగా మార్చటానికి RGB స్లయిడర్స్ ను కుడి వైపు చివరికొన వరకు కదిలించండి. |
09:00 | Stop డ్రాప్ -డౌన్ యారో పై క్లిక్ చేసి వేరొక స్టాప్ ను ఎంచుకోండి. |
09:05 | రంగును నలుపుకి మార్చడానికి RGB స్లయిడర్స్ ను ఎడమ చివరికొన వైపు కదిలించండి తర్వాత alpha విలువను 255 కు మార్చండి |
09:15 | మధ్యలో ఎక్కువ రంగును చేర్చటానికి Add stop పై క్లిక్ చేయండి. |
09:20 | Node tool పై క్లిక్ చేయండి మరియు డైమండ్ హేండిల్ ను పైభాగం వైపు కదిలించండి. |
09:27 | ఇప్పుడు, చిత్రాన్ని మరియు దీర్ఘవృత్తాన్ని ఎంచుకోండి. |
09:30 | Object మెనూ కి వెళ్ళండి. |
09:32 | Mask పై క్లిక్ చేసి తరువాత Set పై క్లిక్ చేయండి. |
09:36 | చిత్రం పైన ఏర్పడిన mask ను గమనించండి. |
09:40 | masking ఆబ్జెక్ట్ అయిన దీర్ఘవృత్తం యొక్క ట్రాన్స్పరెన్సీ లక్షణాలను చిత్రం తీసుకుంది గమనించండి. |
09:47 | మాస్క్ ను తొలగించటానికి, Objectమెనూ కి తిరిగి వెళ్ళండి. |
09:51 | Mask పై క్లిక్ చేసి తరువాత Release పై క్లిక్ చేయండి. |
09:54 | mask ఇప్పుడు తొలగించబడింది. |
09:56 | సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి: ఆబ్జెక్ట్స్ ను కాపీ మరియు పేస్ట్ చేయటం. |
10:02 | డూప్లికేట్ మరియు clone ఆబ్జెక్ట్స్. |
10:05 | వివిధ ఆబ్జెక్ట్స్ లను గ్రూప్ మరియు ఆర్డర్ చేయుట. |
10:08 | మల్టిపుల్ సెలక్షన్ మరియు ఇన్వెర్ట్ సెలక్షన్ (బహుళ ఎంపిక మరియు ఎంపికను తిరగవేయటం). |
10:10 | క్లిప్పింగ్ మరియు మాస్కింగ్. |
10:12 | ఇక్కడ మీకోసం రెండు అసైన్మెంట్లు - |
10:15 | బూడిద రంగు లో ఒక నిలువు దీర్ఘ వృత్తము మరియు నలుపు రంగు లో ఒక వృత్తాన్ని సృష్టించండి. |
10:20 | దీర్ఘ వృత్తము పైన మధ్యలో వృత్తాన్ని ఉంచండి. |
10:23 | ఇది ఒక కన్ను ఆకారం లాగా ఉండాలి. |
10:25 | ఇప్పుడు వాటిని సమూహం చేయండి. |
10:27 | ఇంకొక కన్ను తయారు చేయటానికి ఒక clone ను సృష్టించండి. |
10:31 | రెండు కళ్ళు కనిపించటానికి దాన్ని ఒక పక్కకి కదిలించండి. |
10:35 | నీలం రంగులో ఒక వృత్తాన్ని మరియు ఎరుపు రంగులో ఒక చతురస్రాన్ని సృష్టించండి. |
10:40 | చతురస్రం డూప్లికేట్ చేయండి మరియు రెండు చతురస్రాలను వికర్ణంగా వ్యతిరేక దిశలలో ఉంచండి. |
10:45 | రెండు చతురస్రాలు ఎంచుకోండి మరియు వాటిని ఒకే ఆబ్జెక్ట్ గా సమూహం చేయండి. |
10:50 | చతురస్రాల సమూహం పైభాగంలో వృత్తాన్ని మధ్యలో ఉంచండి. |
10:54 | రెండిటిని ఎంచుకోండి మరియు ఒక clip సృష్టించండి.అది చూడటానికి ఒక విల్లులాగా ఉండాలి. |
11:00 | మీరు పూర్తిచేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి. |
11:03 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చుడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
11:12 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
11:21 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి. |
11:23 | దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
11:31 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
11:35 | మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
11:38 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |