GChemPaint/C2/Editing-molecules/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | అందరికి నమస్కారం. |
00:02 | జికెంపెయింట్ లో ఎడిటింగ్ మాలెకుల్స్ (Editing Molecules) ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది- |
00:09 | ఒక పరమాణువుకు అన్బౌండ్ (unbound) ఎలక్ట్రాన్లు జోడించడం. |
00:12 | కార్బోనిక్ ఆమ్లం మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లంల (Acid) నిర్మాణాలు గీయడం. |
00:16 | పరమాణువుల సమూహం కు ఒక స్థానిక ఛార్జ్ జోడించడం మరియు సవరించడం. |
00:21 | ఇంకా మనం నేర్చుకునేది, |
00:23 | ఒక పరమాణువుకు ఒక స్థానిక ఛార్జ్ జోడించడం మరియు సవరించడం, |
00:26 | చక్రీయ అణువులు జోడించడం, |
00:29 | మొనోసైక్లిక్ అణువులను బై-సైక్లిక్ అణువులుగా మార్చడం, |
00:34 | ఇక్కడ నేను, |
00:35 | ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04, |
00:39 | GchemPaint(జికెంపెయింట్) వర్షన్ 0.12.10 వాడుతున్నాను. |
00:46 | ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి, |
00:50 | జికెంపెయింట్ (GchemPaint) రసాయన నిర్మాణ ఎడిటర్. |
00:53 | తెలియనట్లైతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:58 | నేను ఒక కొత్త జికెంపెయింట్ (GchemPaint) అప్లికేషన్ తెరిచాను. |
01:02 | మొదటిగా అమ్మోనియా (Ammonia)నిర్మాణం గీద్దాం. |
01:06 | కరెంటు ఎలిమెంట్ (Current element) డ్రాప్ డౌన్ బాణం బటన్ పై క్లిక్ చేయండి. |
01:09 | టేబుల్ నుండి ఎన్(N) ఎంచుకోండి. |
01:11 | టూల్ బాక్స్ లో ఎన్(N) గమనించండి. |
01:15 | యాడ్ ఆర్ మాడిఫై అన్ ఆటమ్ (Add or modify an atom)టూల్ పై క్లిక్ చేయండి. |
01:18 | తర్వాత డిస్ప్లే ఏరియా (Display area) పై క్లిక్ చేయండి. |
01:21 | డిస్ప్లే ఏరియా(Display area)లో NH3 NH3 కనిపిస్తుంది. |
01:24 | కాపిటల్ H ప్రెస్ చేయండి. H తో ప్రారంభమయ్యె అంశాల జాబితా తో ఒక సబ్ మెనూ (Sub-menu)కనిపిస్తుంది. |
01:30 | జాబితా నుండి H ఎంచుకోండి. |
01:33 | యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది మల్టిప్లిసిటి అఫ్ ది ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of the existing one) టూల్ పై క్లిక్ చేయండి. |
01:38 | నత్రజని (Nitrogen) పరమాణువు కు మూడు బంధాలు (bonds) గీయడానికి, |
01:41 | నత్రజని(Nitrogen) పరమాణువులోని బాండ్లను మూడుసార్లు క్లిక్ చేసి లాగండి. |
01:46 | పిరమిడ్ (pyramid)నిర్మాణం ఏర్పాటు చేయడానికి బాండ్లు ఓరియంట్ చేయండి. |
01:51 | నత్రజని(Nitrogen) పరమాణువు మీద ఒక జత అన్ బౌండ్ ఎలక్ట్రాన్లు చేర్చుదాం. |
01:56 | యాడ్ ఏన్ ఎలక్ట్రాన్ పెయిర్ టు ఏన్ ఆటం (Add an electron pair to an atom)టూల్ పై క్లిక్ చేయండి. |
02:01 | తర్వాత అమ్మోనియా యొక్క నత్రజని (Nitrogen) పరమాణువు మీద క్లిక్ చేయండి. |
02:05 | మార్పులు గమనించండి. |
02:07 | అమ్మోనియా యొక్క నైట్రోజన్ (Nitrogen) ఒక జత ఎలక్ట్రాన్లను కలిగి ఉండడం గమనించండి. |
02:12 | ఈజంట బంధంలో పాల్గొనడం లేదు. |
02:16 | ఈ జంట ఎలక్ట్రాన్ల ను ఒంటరి జంట ఎలక్ట్రాన్లు అందుము (lone pair). |
02:20 | ఒక అసైన్మెంట్ గా, |
02:21 | ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ (Phosphorus trichloride) నిర్మాణం గీయండి. |
02:24 | మరియు ఫాస్ఫరస్ (Phosphorus)పరమాణువుకు ఒక జత అన్ బౌండ్ ఎలక్ట్రాన్లు జోడించండి. |
02:29 | ఇప్పుడు కార్బోనిక్ ఆమ్లం (H2CO3) మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం (H2SO4)నిర్మాణాలు గీద్దాం. |
02:34 | ఇక్కడ కార్బోనిక్ ఆమ్లం (Carbonic acid)మరియు సల్ఫ్యూరిక్్ ఆమ్లం(Sulphuric acid) నిర్మాణాలకు ఒక స్లయిడ్ ఉంది. |
02:40 | మొదట అమ్మోనియా నిర్మాణంను పక్కకు తరలిద్దాం. |
02:44 | అలా చేయుటకు, సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ (Select one or more objects) టూల్ పై క్లిక్ చేయండి. |
02:48 | అమ్మోనియా (Ammonia) నిర్మాణం పై క్లిక్ చేసి దానిని ఒక వైపుకు లాగండి. |
02:53 | ఇప్పుడు కార్బోనిక్ ఆమ్లం (Carbonic acid)నిర్మాణం గీద్దాం. |
02:56 | కరెంటు ఎలిమెంట్ (Current element) డ్రాప్-డౌన్ బాణం బటన్ పై క్లిక్ చేయండి. |
03:00 | టేబుల్ నుండి సి (C) ఎంచుకోండి. |
03:02 | యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది మల్టిప్లిసిటి అఫ్ ది ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of the existing one) టూల్ పై క్లిక్ చేయండి. |
03:07 | డిస్ప్లే ఏరియా (Display area) పై క్లిక్ చేయండి. |
03:09 | తిరబడిన Y వలె రూపొందే విధంగా మూడు బంధాలను ఓరియంట్ చేయండి. |
03:15 | ఏదో ఒక బంధంకు ద్విబంధం గా ఒక నాల్గవ బంధం గీయండి. |
03:21 | కరెంటు ఎలిమెంట్ డ్రాప్ డౌన్ బాణం బటన్ పై క్లిక్చేయండి. |
03:25 | ఓ (O) ను ఎంచుకోండి. |
03:26 | యాడ్ ఆర్ మాడిఫై ఏ న్ ఆటం (Add or modify an atom)టూల్ పై క్లిక్ చేయండి. |
03:30 | బాండ్ల సమీపంలో కర్సర్ ను ఉంచండి. |
03:33 | మూడు బాండ్ స్థానాల పై క్లిక్ చేయండి. |
03:37 | కార్బోనిక్ ఆసిడ్ (H2CO3) నిర్మాణం గీయబడుతుంది. |
03:40 | ఇప్పుడు సల్ఫ్యూరిక్ ఆమ్లం (Sulphuric acid)నిర్మాణం గీయండి. |
03:44 | కరెంటు ఎలిమెంట్ (Current element) డ్రాప్ డౌన్ బాణం బటన్ పై క్లిక్ చేయండి. |
03:47 | ఎస్ (S) ను ఎంచుకోండి. |
03:48 | యాడ్ ఆర్ మాడిఫై ఏన్ ఆటం (Add or modify an atom)టూల్ పై క్లిక్ చేయండి. |
03:52 | డిస్ప్లే ఏరియా (Display area) లో క్లిక్ చేయండి. |
03:55 | H2S ను గమనించండి. |
03:57 | ఇప్పుడు డిస్ప్లే ఏరియా(Display area) లో ఎక్కడైనా కాపిటల్ O ప్రెస్ చేయండి. |
04:01 | O మరియు Os లతో ఒక సబ్ మెనూ తెరుచుకొంటుంది. |
04:06 | O ను ఎంచుకోండి. |
04:08 | యాడ్ ఆర్ మాడిఫై ఏ న్ ఆటమ్ (Add or modify an atom) టూల్ పై క్లిక్ చేయండి. |
04:11 | తర్వాత యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది మల్టిప్లిసిటి అఫ్ ది ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of the existing one) టూల్ మీద పై క్లిక్ చేయండి. |
04:17 | ప్రాపర్టీ (Property) మెనులో, బాండ్ పొడవు (Bond length) 200 లేదా ఆ పైకి పెంచండి. |
04:23 | OH నుండి Sకు మూడు బాండ్లు గీయడానికి H <సబ్> 2 </ సబ్> Sమీద క్లిక్ చేయండి. |
04:29 | S సమీపంలో ఒక ధనాత్మక చార్జ్ గమనించండి. |
04:32 | సల్ఫర్ (Sulphur) 6 వలెన్సి(valency) సంతృప్తి చేయాలి కనుక ఇది కనిపిస్తుంది. |
04:39 | నాలుగో బంధం కోసం, మొదట S పై క్లిక్ చేయండి. |
04:43 | మౌస్ వదలకుండా ఒకవైపు బాండ్ లాగండి. |
04:47 | వ్యతిరేక బాండ్ల ను ద్విబంధాలు (double bonds) గా మార్చుదాం. |
04:52 | యాడ్ ఎ బాండ్ ఆర్ చేంజ్ ది మల్టిప్లిసిటి అఫ్ ది ఎక్సిస్టింగ్ వన్ (Add a bond or change the multiplicity of the existing one) టూల్ పై క్లిక్ చేయండి. |
04:58 | నిర్మాణం కు వ్యతిరేకం గా ఉన్న బాండ్ల పై క్లిక్ చేయండి. |
05:03 | ధనాత్మక ఆవేశం ఇకపై కనిపించకపోవడం గమనించండి. |
05:08 | సల్ఫ్యూరిక్ ఆమ్లం (Sulphuric acid) నిర్మాణం పూర్తయింది. |
05:12 | తదుపరి కార్బోనిక్ ఆమ్లం (Carbonic acid)మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం (Sulphuric acid)నిర్మాణాలకు ఒక స్థానిక ఆవేశం జోడిద్దాం. |
05:18 | స్థానిక ఆవేశం చూపించడానికి డిక్రేమేంట్ ది ఛార్జ్ అఫ్ అన్ ఆటమ్ (Decrement the charge of an atom) టూల్ పై క్లిక్ చేయండి. |
05:24 | కార్బోనిక్ ఆమ్లం నిర్మాణం లోని రెండు O-H సమూహాల పై క్లిక్ చేయండి. |
05:30 | కార్బోనేట్ అయాన్ CO 32- ఏర్పడడం గమనించండి. |
05:36 | సల్ఫ్యూరిక్ ఆమ్లం (Sulphuric acid)నిర్మాణంపై స్థానిక ఛార్జ్ చూపించడానికి. |
05:41 | డిక్రిమెంట్ ది ఛార్జ్ అఫ్ అన్ ఆటం (Decrement the charge of an atom)టూల్ పై క్లిక్ చేయండి. |
05:44 | సల్ఫ్యూరిక్ ఆమ్లం (Sulphuric acid)యొక్క రెండు వ్యతిరేక O-H సమూహాల పై క్లిక్ చేయండి. |
05:49 | సల్ఫేట్ అయాన్ SO 42- ఏర్పడడం గమనించండి. |
05:56 | ఒక అసైన్మెంట్, |
05:57 | నైట్రిక్ ఆమ్లం (HNO 3) నిర్మాణం గీయండి. |
05:59 | నైట్రేట్ అయాన్(NO3-)పై స్థానిక ఛార్జ్ చూపించండి. |
06:02 | పూర్తి చేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి. |
06:07 | ఒక పరమాణువుకు స్థానిక ఛార్జ్ ఎలా జోడించాలో చూపిస్తాను. |
06:12 | డిస్ప్లే ఏరియా(Display area)లో ఎక్కడైనా క్లిక్ చేసి, కాపిటల్ N నొక్కండి. |
06:16 | తెరవబడిన సబ్-మెనూ (sub-menu) లో Na ఎంచుకుంటాను. |
06:21 | యాడ్ ఆర్ మాడిఫై ఏ న్ ఆటం (Add or modify an atom) టూల్ పై క్లిక్ చేయండి. |
06:24 | డిస్ప్లే ఏరియా (Display area) పై క్లిక్ చేయండి. |
06:27 | సోడియం పరమాణువు డిస్ప్లే ఏరియా(Display area) లో కనిపిస్తుంది. |
06:30 | ఇంక్రిమెంట్ ది ఛార్జ్ అఫ్ ఏన్ ఆటం (Increment the charge of an atom)టూల్ పై క్లిక్ చేయండి. |
06:35 | తర్వాత Na పై క్లిక్ చేయండి. |
06:37 | సోడియం (Sodium) పరమాణువుపై ధనాత్మక చార్జ్ గమనించండి. |
06:41 | ఇదే విధంగా, ఒక పరమాణువు కు ఒక ఋణావేశంను (నెగటివ్ ఛార్జ్) జోడించవచ్చు. |
06:46 | ఇది డిక్రిమెంట్ ది ఛార్జ్ అఫ్ ఏన్ ఆటం(Decrement the charge of an atom) టూల్ ఎంచుకోవడం ద్వారా చేయవచ్చు. |
06:51 | ఇప్పుడు సైక్లిక్ (Cyclic)అణువులు గీయడం నేర్చుకుందాం. |
06:54 | ఇందుకోసం, ఒక కొత్త GChemPaint విండో తెరుద్దాం. |
06:59 | టూల్బార్ నందు క్రియేట్ ఎ న్యూ ఫైల్(Create a new file)చిహ్నం పై క్లిక్ చేయండి. |
07:03 | C అనగా కార్బన్, ఒక మూలకం గా ఎంపిక కావడం గమనించండి. |
07:09 | అలాగే, ఆ బాండ్ పొడవు (Bond length)200 లేదా ఆ పై ఉంది. |
07:14 | టూల్ బాక్స్ లోని నాలుగో టూల్బార్ సైకిల్ టూల్. |
07:19 | మనము ఇక్కడ వున్న వివిధ టూల్స్ వాడవచ్చు. |
07:22 | ఉదా- |
07:24 | యాడ్ ఎ త్రీ మేమ్బెరేడ్ సైకిల్ (Add a three membered cycle). |
07:26 | యాడ్ ఎ ఫోర్(4) మెంబర్డ్ సైకిల్ (Add a four membered cycle). |
07:29 | మరియు మరి కొన్ని సైకిల్ (cycle)టూల్స్. |
07:32 | మరియు తర్వాత యాడ్ ఎ సైకిల్ (Add a cycle) టూల్. |
07:35 | మనము ఇప్పుడు యాడ్ ఎ ఫోర్ మెంబర్డ్ సైకిల్(Add a four membered cycle)టూల్ వాడుదాం. |
07:40 | కాబట్టి, ఆ టూల్ పై క్లిక్ చేయండి. |
07:42 | డిస్ప్లే ఏరియా (Display area)పై క్లిక్ చేయండి. |
07:44 | మూలలలో ఉన్న సైకిల్ కు పరమాణువు లు జోడిద్దాం. |
07:49 | మూలలలో దేని పైన అయినా రైట్ క్లిక్ చేయండి. |
07:52 | ఒక సబ్ మెను (sub-menu) తెరుచుకుంటుంది. ఆటమ్ (Atom) ఎంచుకొని ఆపై డిస్ప్లే సింబల్ (Display symbol)మీద పై క్లిక్ చేయండి. |
07:58 | అదేవిధంగా, అన్ని మూలల్లో పరమాణువులు జోడిద్దాం. |
08:03 | వచ్చిన నిర్మాణం సైక్లోబ్యూటేన్ (Cyclobutane ). |
08:07 | ఇప్పుడు ఏక-చక్రీయ సమ్మేళనంను ద్విచక్రీయ సమ్మేళనంకు మారుద్దాం. |
08:12 | యాడ్ ఎ సిక్స్ మెంబర్డ్ సైకిల్ (Add a six membered cycle) టూల్ పై క్లిక్ చేయండి. |
08:16 | తర్వాత డిస్ప్లే ఏరియా (Display area) పై క్లిక్ చేయండి. |
08:19 | చక్రం యొక్క బాండ్ పై కర్సర్‌ను వుంచి మళ్ళీ క్లిక్ చేయండి. |
08:24 | బై -సైక్లిక్ కాంపౌండ్ (Bi-cyclic compound) ను గమనించండి. |
08:27 | ఫైలు సేవ్ చెయ్యడానికి,టూల్బార్ లో సేవ్ ది కరెంట్ ఫైల్(Save the current file) చిహ్నం పై క్లిక్ చేయండి. |
08:32 | సేవ్ యాస్ (Save as) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
08:35 | ఎడిటింగ్ మాలేక్యులాస్ (Editing Molecules) గా ఫైల్ కు పేరు ఇవ్వండి. |
08:38 | సేవ్ (Save) బటన్ పై క్లిక్ చేయండి. |
08:41 | సంగ్రహముగా, |
08:43 | ఈ ట్యుటోరియల్ లో, నేర్చుకున్నవి, |
08:45 | ఒక పరమాణువుకు అన్ బౌండ్ ఎలక్ట్రాన్లు జోడించండం. |
08:48 | కార్బోనిక్ ఆమ్లం మరియు సల్ఫ్యూరిక్్ ఆమ్లం నిర్మాణాలు గీయడం, |
08:53 | పరమాణువుల సమూహంకు ఒక స్థానిక ఆవేశం జోడించడం మరియు సవరించడం. |
08:58 | ఇంకా మనం నేర్చుకున్నవి, |
09:00 | ఒక పరమాణువుకు ఒక స్థానిక ఆవేశం జోడించడం మరియు సవరించడం, |
09:04 | చక్రీయ అణువులు జోడించడం, |
09:06 | మొనోసైక్లిక్ అణువులను బైసైక్లిక్ అణువులగా మార్చడం. |
09:11 | ఒక అసైన్మెంట్ గా, |
09:13 | డిస్ప్లే ఏరియా కు ఒక సెవెన్ మేమ్బెరేడ్ సైకిల్ జోడించండి. |
09:16 | దానిని ట్రైసైక్లిక్ కాంపౌండ్ కు మార్చండి. |
09:20 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో చూడండి. |
09:24 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
09:27 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:32 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
09:36 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. |
09:40 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి. |
09:46 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
09:50 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
09:57 | ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
10:03 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి, ధన్యవాదాలు. |