Advanced-Cpp/C2/Constructor-And-Destructor/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 16:07, 20 April 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration | |
00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు కన్స్ట్రక్టర్స్ మరియు డిస్ట్రక్టర్స్ ఇన్ c++ కు స్వాగతం | |
00:07 | ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది. | |
00:09 | కన్స్ట్రక్టర్స్ , కన్స్ట్రక్టర్స్ రకాలు | |
00:12 | డిస్ట్రక్టర్స్ . దీనిని మనము కొన్ని ఉదాహారణలతో చేద్దాం. | |
00:17 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది, | |
00:20 | ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 | |
00:23 | g++కంపైలర్ వర్షన్ 4.6.1 | |
00:28 | మనము కన్స్ట్రక్టర్స్ పరిచయముతో మొదలు పెడదాం. | |
00:31 | కన్స్ట్రక్టర్అనునది ఒక మెంబర్ ఫంక్షన్ | |
00:33 | అది క్లాస్ పేరు ను తన పేరుగా కలిగి ఉంటుంది. | |
00:37 | కన్స్ట్రక్టర్స్ ఎటువంటి విలువను రిటర్న్ చేయవు. | |
00:40 | ఆబ్జక్ట్ సృష్టించబడినప్పుడు ఇది స్వయంచాలకంగా పిలువబడుతుంది. | |
00:44 | కన్స్ట్రక్టర్స్ రకాలు | |
00:46 | పరమైట్రైస్డ్ కన్స్ట్రక్టర్స్ | |
00:49 | కాపీ కన్స్ట్రక్టర్స్ మరియు | |
00:50 | డీఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ | |
00:53 | మనము డిస్ట్రక్టర్స్ గురించి చూద్దాం | |
00:56 | డిస్ట్రక్టర్స్ అనేవి మెమొరీ కేటాయింపును రద్దుచేయుటకు ఉపయోగిస్తాము. | |
00:59 | ఇవి ఆబ్జక్ట్ నాశనం అగునప్పుడు పిలువబడుతుంది. | |
01:02 | డిస్ట్రక్టర్ ఎటువంటి పెరామీటర్లు తిసుకోదు మరియు ఎటువంటి రిటర్న్-టైప్ కలిగిఉండదు. | |
01:07 | కన్స్ట్రక్టర్స్ మరియు డిస్ట్రక్టర్స్ లను ఒక ఉదాహరణ చూద్దాం. | |
01:11 | నేను ఇప్పటికే ఒక ఎడిటర్ నందు టైప్ చేసి ఉంచిన నా కోడ్ ను తెరుచుతున్నాను. | |
01:15 | మన ఫైల్ పేరు cons hyphen dest dot cpp అని గమనించండి. | |
01:20 | ఈ ప్రోగ్రాం నందు మనం కన్స్ట్రక్టర్స్ ను ఉపయోగించి రెండు సంఖ్యల కూడికను నిర్వహిస్తాము. | |
01:25 | ఇప్పుడు ముందుగా కోడ్-ను వివరిస్తాను. | |
01:27 | iostream అనేది మన headerfile | |
01:30 | ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాం. | |
01:33 | తరువాత మనకు a ,b అను integer వేరియబుల్స్ తో Addition అను పేరుగల క్లాస్ యొక్క డిక్లరేషన్ కలదు. | |
01:38 | ఇవి Addition అను క్లాస్ యొక్క ప్రైవేట్ మెంబర్స్ . | |
01:42 | ఇక్కడ మనకు పబ్లిక్ specifier ఉన్నది. | |
01:44 | తరువాత మనకు Addition అను కన్స్ట్రక్టర్ ఉంది. | |
01:47 | కన్స్ట్రక్టర్ యొక్క పేరు క్లాస్ పేరు వలెనే ఉంటుంది. | |
01:52 | మనము ఇక్కడ రెండు పేర్లు విలువలను పంపుతున్నాము. | |
01:54 | ఇప్పుడు మనము ఒక డిస్ట్రక్టర్ నిర్వచించియున్నాము. | |
01:57 | దీని కోసం మనము ఒక టిల్డ్ గుర్తు తరువాత డిస్ట్రక్టర్ పేరు వ్రాస్తాము. | |
02:02 | add, ఇది ఒక పబ్లిక్ ఫంక్షన్ | |
02:05 | అది a మరియు b ల మొత్తంను రిటర్న్ చేస్తుంది. | |
02:08 | ఇక్కడ మనము కన్స్ట్రక్టర్ ను స్కోప్ రెసొల్యూషన్ ఆపరేటర్ ను ఉపయోగించి పొందుతున్నాము. | |
02:12 | a మరియు b లు ప్రైవేట్ మెంబర్స్ | |
02:15 | ప్రైవేట్ మెంబర్స్ ను పొందుటకు మనము x మరియు y లను ఉపయోగించుదుము. | |
02:19 | తరువాత మనం డిస్ట్రక్టర్ ను access చేయుదుము. | |
02:21 | ఇందులో మనం Memory Deallocation అని ప్రింట్ చేయుదుము. | |
02:25 | ఇది మన main ఫంక్షన్ | |
02:28 | ఇక్కడ మనం Addition క్లాస్ కు ఒక ఆబ్జక్ట్ obj ను సృష్టిద్దాం. | |
02:32 | తరువాత మనం 3 మరియు 4 అను రెండు ఆర్గుమెంట్స్ పంపుతాము. | |
02:36 | 3, x నందు మరియు 4, y నందు స్టోర్ (నిల్వ) చేయబడును. | |
02:40 | అనగా a యొక్క విలువ 3 మరియు b యొక్క విలువ 4 అవుతుంది. | |
02:45 | ఆర్గుమెంట్స్ కలిగినటువంటి కన్స్ట్రక్టర్ ను parameterized constructor అని అందురు. | |
02:50 | కాబట్టి ఇది parameterized కన్స్ట్రక్టర్. | |
02:53 | ఇక్కడ మనం add ఫంక్షన్ ను obj ను ఉపయోగించి పిలుస్తున్నాము. | |
02:58 | మరియు మనం వాటి మొత్తం ను ప్రింట్ చేస్తున్నాం. | |
03:00 | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్ | |
03:02 | ఇప్పుడు ప్రోగ్రాంను అమలు చేద్దాం. | |
03:05 | Ctrl , Alt మరియు T లు కలిపి ఒకేసారి నొక్కి టెర్మినల్ విండో తెరుద్దాం. | |
03:12 | కంపైల్ చేయుటకు g++ space cons hyphen dest dot cpp space hyphen o space cons అని టైప్ చెయ్యండి. | |
03:21 | ఎంటర్ ను నొక్కండి. | |
03:23 | dot slash cons అని టైప్ చెయ్యండి. | |
03:25 | ఎంటర్ ను నొక్కండి. | |
03:27 | అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. | |
03:29 | Sum is 7 మరియు Memory Deallocation | |
03:33 | ఇప్పుడు Default constructors ను ఒక ఉదాహరణ తో చూద్దాం. | |
03:37 | తిరిగి ప్రోగ్రాం కు వద్దాం. | |
03:39 | నేను ఇప్పటికే కోడ్ ను టైప్ చేసి ఉంచాను. | |
03:41 | మన ఫైల్ పేరు default dot cpp అని గమనించండి. | |
03:45 | ఒకవేళ క్లాస్ నందు కన్స్ట్రక్టర్ తెలియచేసి ఉండకపోతే , | |
03:48 | అప్పుడు కంపైలర్ డిఫాల్ట్ కంస్ట్రక్టర్ ను తీసుకొంటుంది. | |
03:53 | ముందుగా కోడ్-ను వివరిస్తాను. | |
03:55 | iostream అనేది మన headerfile | |
03:58 | ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాం. | |
04:02 | తరువాత Subtraction అను పేరుగల క్లాస్ యొక్క డిక్లరేషన్ కలదు. | |
04:04 | తరువాత మనకు public గా డిక్లేర్ చేయబడ్డ a ,b అను వేరియబుల్స్ కలవు. | |
04:08 | ఇక్కడ మనకు sub అను ఫంక్షన్ కలదు. | |
04:10 | తరువాత మనం int a మరియు int b అను రెండు ఆర్గుమెంట్స్ పంపాము. | |
04:15 | ఇది a ,b లమధ్య వ్యత్యాసము ను రిటర్న్ చేస్తుంది. | |
04:19 | ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ | |
04:22 | ఇక్కడ మనము కన్స్ట్రక్టర్ ను స్కోప్ రెసొల్యూషన్ ఆపరేటర్ ను ఉపయోగించి పొందుతున్నాము. | |
04:27 | ఇది మన main ఫంక్షన్ | |
04:29 | దీనియందు x అను వేరియబుల్ ను define చేసాము. | |
04:34 | ఇక్కడ మనం Subtraction క్లాస్ కు s అనే ఆబ్జక్ట్ ను సృష్టించాం. | |
04:39 | ఇక్కడ మనం sub ఫంక్షన్ ను s object ను ఉపయోగించి పిలుస్తున్నాము. | |
04:42 | మరియు 8 మరియు 4 అను రెండు ఆర్గుమెంట్స్ ను పంపండి. | |
04:47 | వచ్చిన సమాధానం x నందు నిల్వ చేయబడును. | |
04:51 | మరియు ఇక్కడ డిఫరెన్స్ విలువ ను ప్రింట్ చేద్దాం. | |
04:54 | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. | |
04:56 | ఇప్పుడు ప్రోగ్రాంను అమలు చేద్దాం. | |
04:58 | తిరిగి టెర్మినల్ కు వెళ్దాం. | |
05:01 | కంపైల్ చేయుటకు g++ space default dot cpp space hyphen o space def అని టైప్ చెయ్యండి. | |
05:09 | ఎంటర్ ను నొక్కండి. | |
05:10 | dot slash defఅని టైప్ చెయ్యండి. | |
05:12 | ఎంటర్ ను నొక్కండి. | |
05:14 | అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. | |
05:16 | Difference is 4 | |
05:18 | తిరిగి ప్రోగ్రాం కు వద్దాం. | |
05:20 | ఇక్కడ మనం ఒక ఫంక్షన్ కు పంపిన ఆర్గుమెంట్ లను చూడవచ్చు. | |
05:25 | మరియు మన గత ఉదాహరణలో మనం object కు ఆర్గుమెంట్స్ పంపించాము. | |
05:30 | మరియు ఇక్కడ object ను ఉపయోగించి ఆర్గుమెంట్స్ పంపించాము. | |
05:34 | ఇప్పుడు మన స్లైడ్ కు తిరిగి వెళ్దాం. | |
05:38 | ఇప్పటి వరకు మనం నేర్చుకొన్నవి సంగ్రహంగా, | |
05:41 | కన్స్ట్రక్టర్ ఉదా Addition. | |
05:43 | పరమైట్రైస్డ్ కన్స్ట్రక్టర్స్ ఉదా Addition obj(3,4); | |
05:48 | డిస్ట్రక్టర్ ఉదా ~Addition | |
05:52 | డీఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ ఉదా Subtraction | |
05:55 | అసైన్మెంట్ గా Division పేరుతో ఒక క్లాస్ ను సృష్టించండి. | |
05:59 | ఆ క్లాస్ కు కన్స్ట్రక్టర్ ను సృష్టించండి. | |
06:01 | మరియు రెండు సంఖ్యల మధ్య భాగహారం కొరకు divide ఫంక్షన్ ను సృష్టించండి. | |
06:06 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి. | |
06:09 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది . | |
06:11 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | |
06:16 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం - స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. | |
06:21 | ఆన్ లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. | |
06:25 | మరిన్ని వివరాలకు , దయచేసి | |
06:27 | contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి. | |
06:31 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. | |
06:36 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | |
06:42 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది. | |
06:47 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. |