LibreOffice-Suite-Calc/C3/Formulas-and-Functions/Telugu
From Script | Spoken-Tutorial
Time | వివరణ |
00:00 | లిబ్రే ఆఫీస్ Calc లో Formulas and Functions పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము. |
00:07 | • ఈ ట్యుటోరియల్ లో మనము ఈ క్రింది వాటి గురించి నేర్చుకుంటాము:
• కండీషనల్ ఆపరేటర్ • If..or స్టేట్మెంట్ • బేసిక్ స్టాటిస్టిక్ ఫంక్షన్లు • సంఖ్యలను రౌండ్ ఆఫ్ చేయుట |
00:19 | ఇక్కడ మనము Ubuntu Linux version 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము. |
00:30 | డేటా పై కూడిక, తీసివేత మరియు సగటు వంటి ప్రాధమిక గణిత ఆపారేటర్లను ఎలా అప్లై చేయాలో మనము ఇదివరకే నేర్చుకున్నాము. |
00:39 | ఇప్పుడు, మరికొన్ని ఉపయోగకరమైన ఆపరేటర్ల గురించి నేర్చుకుందాము. |
00:43 | అతి సాధారణముగా ఉపయోగించబడే ఆపరేటర్లలో కండీషనల్ ఆపరేటర్ ఒకటి |
00:51 | కండీషనల్ ఆపరేటర్లు,
యూజర్ చే డేటా పై అప్లై చేయబడిన కండీషన్ కోసం చెక్ చేయండి. |
00:56 | మరియు బూలియన్ లో ఫలితములను చూపండి - ఒప్పు లేక తప్పు. |
1:01 | మనము "Personal-Finance-Tracker.ods" ను ఓపెన్ చేద్దాము. |
1:05 | ఇక్కడ, "Cost" అనే హెడ్డింగ్ క్రింద, మనము అనేక వస్తువుల ధరలను జాబితా చేసాము. |
1:11 | వాటి పై కండీషనల్ ఆపరేటర్లను అప్లై చేద్దాము మరియు ఫలితములను విశ్లేషిద్దాము. |
1:17 | "B10" అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై మరియు దానిలో ఉన్న "Condition Result" పై క్లిక్ చేద్దాము. |
1:24 | ఇప్పుడు, "C10" అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేద్దాము. |
1:28 | కండీషన్ యొక్క ఫలితము అప్లై చేయబడుతుంది మరియు ఈ సెల్ లో డిస్ప్లే అవుతుంది. |
1:33 | "House Rent" ఖర్చు 6,000 రూపాయలు అని గమనించండి. |
1:38 | "Electricity Bill" ఖర్చు 800 రూపాయలు. |
1:43 | “House Rent” ఖర్చు “Electricity Bill” ఖర్చు కంటే ఎక్కువగా ఉంది. |
1:48 | వీటిపై మనము వేరువేరు కండీషన్స్ అప్లై చేయవచ్చు మరియు ఫలితములను చెక్ చేయవచ్చు. |
1:54 | "C10" అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి. |
1:57 | ఈ సెల్ లో, మొదటి కండీషన్ ను "is equal to C3 greater than C4 ” అని టైప్ చేయండి మరియు "Enter" కీ ప్రెస్ చేయండి. |
2:09 | C3 సెల్ లో ఉన్న విలువ C4 సెల్ లో ఉన్న విలువ కంటే ఎక్కువ కాబట్టి, మనకు వచ్చే ఫలితము "TRUE" |
2:18 | ఇప్పుడు ఈ కండీషనల్ స్టేట్మెంట్ ను “is equal to C3 less than C4” అని మార్చి |
2:26 | "Enter" ప్రెస్ చేద్దాము. |
2:28 | మనకు వచ్చే ఫలితము "FALSE" |
2:32 | ఇదే విధంగా, మీరు ఇతర కండీషనల్ స్టేట్మెంట్స్ అప్లై చేయవచ్చు మరియు ఫలితములను చూడవచ్చు. |
2:38 | ఎక్కువ మొత్తములో డేటా ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్లు చాలా ఉపయోగకరముగా ఉంటాయి. |
2:44 | మీరు డేటా పై "If and Or" కండీషన్ కూడా ఉపయోగించవచ్చు. |
2:49 | కండీషన్ ప్రకారము
TRUE అని వర్తించే. ఫలితములను ప్రింట్ చేయుటకు |
2:55 | "C10" అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి మరియు టైప్ చేయండి, |
2:59 | “ is equal to IF” మరియు బ్రాకెట్లలో, “C3 greater than C4” కామా, డబల్ కోట్స్ లో “Positive” కామా మరియు తిరిగి డబల్ కోట్స్ లో “Negative”. |
3:16 | అంటే, C3 సెల్ లో ఉన్న విలువ కంటే, C4 సెల్ లో ఉన్న విలువ ఎక్కువైతే, "Positive" అని డిస్ప్లే అవుతుంది. |
3:25 | లేదా "Negative" అని డిస్ప్లే అవుతుంది. |
3:28 | ఇప్పుడు "Enter" ప్రెస్ చేయండి. |
3:31 | 800రూపాయలు కంటే 6000 రూపాయలు ఎక్కువ కాబట్టి, ఫలితము "Positive" అని గమనించండి. |
3:39 | ఇప్పుడు, కండీషన్ స్టేట్మెంట్ లో మనము “greater than” ను “less than” గా మార్చి "Enter" కీ ప్రెస్ చేద్దాము. |
3:47 | C3 సెల్ లో విలువ C4 సెల్ కంటే ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఫలితము "Negative" అని గమనించండి. |
3:57 | ఒకవేళ మనము C3 మరియు C4 సెల్స్ లో డేటా ను మార్చినా కూడా మనము ఫలితములో మార్పును చూడవచ్చు. |
4:04 | ఇప్పుడు డిస్ప్లే అయ్యే ఫలితము "Negative" |
4:09 | ఇప్పుడు, C4 సెల్ లోని విలువను "7000" కు పెంచుదాము మరియు "Enter" కీ ప్రెస్ చేద్దాము. |
4:17 | ఫలితము ఆటోమాటిక్ గా "Positive" కు మారుతుంది. |
4:22 | తిరిగి, C4 సెల్ లోని విలువను "800" కు తగ్గిద్దాము. |
4:26 | మరియు "Enter" కీ ప్రెస్ చేద్దాము. |
4:29 | ఫలితము తిరిగి ఆటోమాటిక్ గా "Negative" కు మారుతుంది. |
4:34 | ఇప్పుడు, చేసిన మార్పులను తొలగిద్దాము.. |
4:38 | తరువాత, మనము కొన్ని గణిత మరియు స్టాటిస్టిక్ ఫంక్షన్ల గురించి నేర్చుకుందాము. |
4:43 | ప్రాధమిక గణిత ఫంక్షన్లు ఉన్నవి |
4:57 | Sum, Product మరియు Quotient ఫంక్షన్లు ఎలా పనిచేస్తాయో చెక్ చేయుటకు కొన్ని ఆపరేషన్లు చేద్దాము. |
5:05 | ముందుగా మనము "Sheet 3 సెలెక్ట్ చేసుకుందాము. |
5:08 | “50”,”100” మరియు ”150” సంఖ్యలను "B1" “B2” మరియు “B3” అని రిఫరెన్స్ చేయబడిన సెల్స్ లో వరుసగా ఎంటర్ చేయండి. |
5:19 | "A4" సెల్ పై క్లిక్ చేయండి మరియు "SUM" అని టైప్ చేయండి. |
5:23 | "B4" సెల్ పై క్లిక్ చేయండి. |
5:26 | ఈ సెల్ లో మనము ఫలితాన్ని లెక్కిద్దాము. |
5:30 | “is equal to “SUM” అని మరియు బ్రాకెట్లలో B1 కమా B2 కామా B3 టైప్ చేయండి. |
5:37 | "Enter" ప్రెస్ చేయండి |
5:39 | ఫలితము "300" అని చూపుతుందని గమనించండి. |
5:43 | మీరు ఈ విధంగా సెల్స్ యొక్క రేంజ్ ని కూడా ఎంటర్ చేయవచ్చు. |
5:47 | "B4" పై తిరిగి క్లిక్ చేయండి. |
5:49 | ఇప్పుడు, బ్రాకెట్లలో, B1 కామా B2 కామా B3 కి బదులుగా, B1 కోలన్ B3 అని టైప్ చేయండి. |
5:58 | Enter ప్రెస్ చేయండి. |
6:00 | మరొకసారి, ఫలితము "300" అని చూపుతుంది. |
6:03 | ఇప్పుడు మనము "A5" సెల్ పై క్లిక్ చేద్దాము మరియు "PRODUCT" అని టైప్ చేద్దాము. |
6:08 | "B5" సెల్ పై క్లిక్ చేయండి. |
6:10 | ఇక్కడ "is equal to “PRODUCT”, అని మరియు బ్రాకెట్లలో B1 కోలన్ B3 అని టైప్ చేయండి. |
6:18 | Enter ప్రెస్ చేయండి. |
6:20 | ఫలితము "7,50,000" అని చూపుతుందని గమనించండి. |
6:26 | ఇప్పుడు, Quotient ఎలా పనిచేస్తుందో చూద్దాము. |
6:29 | "A6" అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి మరియు "QUOTIENT" అని టైప్ చేయండి. |
6:34 | ఇప్పుడు "B6" సెల్ పై క్లిక్ చేయండి. |
6:37 | ఫలితమును లెక్కించుటకు మనము ఈ సెల్ ను ఉపయోగిద్దాము. |
6:40 | మరియు “is equal to QUOTIENT”, మరియు బ్రాకెట్లలో B2 కామా B1 అని టైప్ చేయండి. |
6:47 | Enter ప్రెస్ చేయండి. |
6:49 | మీకు ఫలితము "2" అని వస్తుంది. ఎందుకంటే, "100" ను "50" తో భాగిస్తే, ఫలితము 2. |
6:59 | ఇలాగే, మనము Calc లో వివిధ గణిత ఆపరేషన్లు నిర్వహించవచ్చు. |
7:05 | ఇప్పుడు, స్టాటిస్టిక్ ఫంక్షన్లు ఎలా అమలు చేయాలో నేర్చుకుందాము. |
7:09 | • స్టాటిస్టికల్ ఫంక్షన్లు ఈ క్రింది వాటి కొరకు ఉపయోగపడతాయి
• స్ప్రెడ్ షీట్లలో డేటా విశ్లేషణ కోసం • ఉదాహరణకు, • COUNT, MIN, MAX, MEDIAN, MODE వంటి ఫంక్షన్లు • మరియు ఇవి చాలా స్టాటిస్టికల్ స్వభావము కలిగి ఉంటాయి. |
7:27 | ముందుగా, షీట్ 1 పై క్లిక్ చేద్దాము. |
7:30 | స్టాటిస్టికల్ ఫంక్షన్స్ ఉపయోగించి మినిమం, మాక్సిమం మరియు మీడియన్ కాస్ట్స్ ఎలా కనుక్కోవాలో చూద్దాము. |
7:37 | "C10" అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేద్దాము. ఇక్కడ మనం ఫలితమును డిస్ప్లే చేస్తాము. |
7:44 | "Cost" అనే హెడ్డింగ్ క్రింద, చాలా కొన్ని ఎంట్రీలు మాత్రమే ఉన్నాయి. |
7:48 | మినిమం కాస్ట్ 300 రూపాయలు |
7:51 | మాక్సిమం కాస్ట్ 6000 రూపాయలు |
7:55 | ఇవి మనము వాటి ఫంక్షన్లు ఉపయోగించినప్పుడు, డిస్ప్లే కావలసిన ఫలితములు. |
8:00 | "C10" సెల్ లో “is equal to MAX” అని మరియు బ్రాకెట్లలో "C3" కోలన్ "C7" అని టైప్ చేయండి. |
8:10 | ఇప్పుడు "Enter" కీ ప్రెస్ చేయండి. |
8:13 | ఫలితము "6000" అని గమనించండి. ఇది ఆ కాలం లో మాక్సిమం విలువ. |
8:20 | ఇప్పుడు, స్టేట్మెంట్ లోని "MAX" పదము స్థానములో "MIN" అని ఉంచుదాము. |
8:25 | "Enter" కీ ప్రెస్ చేద్దాము. |
8:28 | ఫలితము "300" అని గమనించండి. ఇది Cost కాలం లో మినిమం మొత్తము. |
8:34 | మీడియన్ విలువ కనుగొనుటకు, "MIN" అనే పదము స్థానములో "MEDIAN" అని ఉంచండి. |
8:40 | "Enter" కీ ప్రెస్ చేయండి. |
8:43 | ఫలితము "800" అని చూపుతుంది. ఇది ఆ కాలం లో మీడియన్ కాస్ట్. |
8:50 | ఇలాగే, మీరు డేటా పై ఇతర స్టాటిస్టికల్ ఫంక్షన్లను ఉపయోగించవచ్చు మరియు తగిన విధముగా విశ్లేషించవచ్చు. |
8:58 | మనము ఈ సెల్ లోని మార్పులను తొలగించుదాము. |
9:02 | ఇప్పుడు, సంఖ్యలను ఎలా రౌండ్ ఆఫ్ చేయాలో నేర్చుకుందాము. |
9:05 | "Cost" అనే హెడ్డింగ్ క్రింద మనము కొన్ని మార్పులు చేద్దాము. |
9:09 | మనము
“6000” ను “6000.34” కు “600” ను “600.4” కు ”300” ను “300.3” కు మారుద్దాము. |
9:23 | ఇప్పుడు "B11" అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి మరియు "ROUNDING OFF" అనే హెడ్డింగ్ టైప్ చేయండి. |
9:31 | "C11" అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి. ఇక్కడ "Cost" అనే హెడ్డింగ్ క్రింద ఉన్న ఐటెంస్ మొత్తము ఉంటుంది. |
9:39 | C11 సెల్ లో “is equal to SUM” అని మరియు బ్రాకెట్లలో "C3" కోలన్ "C7" అని టైప్ చేద్దాము. |
9:49 | ఇప్పుడు "Enter" కీ ప్రెస్ చేయండి. |
9:53 | మొత్తము "9701.04" అని గమనించండి. |
9:59 | ఒకవేళ మన ఫలితములో డెసిమల్ స్థానములు ఉండకూడదని మనము అనుకుంటే, |
10:04 | దీనికి ఉత్తమమైన పరిష్కారము ఏమిటంటే, ఆ ఫలితాన్ని సమీప పూర్ణ సంఖ్యకు రౌండ్ ఆఫ్ చేయడము. |
10:09 | "9701.04" అనే మొత్తము ఉన్న సెల్ పై మనము క్లిక్ చేద్దాము. |
10:15 | “is equal to ROUND” అని టైప్ చేయండి మరియు బ్రేస్ ఓపెన్ చేయండి "SUM" అని మరియు తిరిగి బ్రాకెట్లలో "C"3 కోలన్ "C7" అని టైప్ చేయండి. |
10:25 | బ్రేస్ క్లోస్ చేయండి. Enter కీ ప్రెస్ చేయండి. |
10:29 | ఫలితము ఇప్పుడు "9701" గా మనము చూడవచ్చు. ఇది "9701.04" సమీప పూర్ణ సంఖ్యకు రౌండ్ ఆఫ్ అయింది. |
10:44 | రౌండింగ్ ఆఫ్ అనేది సమీప చిన్న పూర్ణ సంఖ్యకు లేదా పెద్ద సంఖ్యకు చేయబడవచ్చు. |
10:52 | ఫలితము ఉన్న సెల్ పై క్లిక్ చేద్దాము మరియు "ROUND" అనే పదమును "ROUNDUP" గా మారుద్దాము. |
10:59 | ఇప్పుడు "Enter" కీ ప్రెస్ చేయండి. |
11:02 | ఇప్పుడు ఫలితము "9702" అని చూపబడుతుందని మీరు చూస్తారు. ఇది పెద్ద పూర్ణ సంఖ్య. |
11:10 | చిన్న పూర్ణ సంఖ్యకు రౌండ్ ఆఫ్ చేయుటకు, "ROUNDUP" అనే పదాన్ని, "ROUNDDOUWN" అని మార్చండి. |
11:17 | ఇప్పుడు "Enter" కీ ప్రెస్ చేయండి. |
11:19 | ఇప్పుడు ఫలితము "9701" అని చూపబడుతుందని మీరు చూస్తారు. ఇది చిన్న పూర్ణ సంఖ్య. |
11:28 | మన "Personal-Finance-Tracker.ods" ను తిరిగి యధా స్థితిలోనికి తెచ్చుటకు మనము ఈ మార్పులను అన్ డూ చేద్దాము. |
11:37 | దీనితో మనము లిబ్రే ఆఫీస్ Calc పై స్పోకెన్ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
11:43 | • మనము నేర్చుకున్న దాని సారాంశము:
• కండీషనల్ ఆపరేటర్ • ఇఫ్..ఆర్ స్టేట్మెంట్ • బేసిక్ స్టాటిస్టిక్ ఫంక్షన్లు • సంఖ్యలను రౌండ్ ఆఫ్ చేయుట |
11:55 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి |
11:58 | అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును అందిస్తుంది. |
12:01 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకుంటే, మీరు దానిని డౌన్ లోడ్ చేసుకొని చూడవచ్చు |
12:06 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం |
12:08 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
12:11 | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్స్ ఇస్తుంది |
12:15 | మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
12:21 | స్పొకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము |
12:26 | దీనికి ఐసీటీ, యం హెచ్ ఆర్ డీ, భారత ప్రభుత్వము వారిచే నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారము అందిస్తోంది |
12:34 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము |
12:37 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro వద్ద అందుబాటులో ఉంది. |
12:45 | ఈ ట్యుటోరియల్ దేశీ క్రూ సొల్యూషన్స్ ప్రై. లి. వారిచే అందించబడింది. పాల్గొన్నందుకు ధన్యవాదములు |
ఈ స్క్రిప్ట్ ను అనువదించినవారు భరద్వాజ్ మరియు నిఖిల |