LibreOffice-Suite-Impress/C3/Slide-Creation/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 15:21, 7 April 2017 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration | ||
00.00 | LibreOffice Impress లో Slide Creation అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. | ||
00.06 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి,
Slide Show లు Slide Transition లు Automatic Show లు. | ||
00.16 | మీరు, ప్రేక్షకుల కు స్లయిడ్లను ప్రదర్శించటానికి Slide Show ను ఉపయోగిస్తారు. | ||
00.21 | స్లయిడ్ -షోస్ desktop లు లేదా projector ల మీద ప్రదర్శించవచ్చు. | 00.25 | స్లయిడ్ –షోస్, computer screen మొత్తాన్ని ఆక్రమించుకుంటాయి. |
00.30 | స్లయిడ్ -షో విధానంలో Presentation లు ఎడిట్ చేయలేము | ||
00.34 | స్లయిడ్ -షోస్, ప్రదర్శన కొరకు మాత్రమే. | ||
00.38 | Sample-Impress.odp ప్రదర్శనను తెరవండి. | ||
00.43 | ఈ ప్రదర్శనను ఒక స్లయిడ్ -షో గా చూద్దాం. | ||
00.47 | మెయిన్ మెనూ నుండి, Slide Show పై క్లిక్ చేసి తరువాత Slide Show పై క్లిక్ చేయండి. | ||
00.53 | ప్రత్యామ్నాయంగా, స్లయిడ్ -షో ప్రారంభించటానికి మీరు ఫంక్షన్ కీ F5 ను ఉపయోగించవచ్చు. | ||
01.00 | ప్రెజెంటేషన్, స్లయిడ్ -షో గా ప్రదర్శించబడుతుంది. | ||
01.04 | మీరు మీ కీబోర్డు మీద ఉన్నబాణం బటన్లను ఉపయోగించి స్లయిడ్ల మధ్య నావిగేట్ చేయవచ్చు. | ||
01.10 | ప్రత్యామ్నాయంగా, కాంటెక్స్ట్ మెనూ కొరకు mouse పై రైట్ -క్లిక్ చేసి, Next ను ఎంచుకోండి. | ||
01.16 | ఇది మిమ్మల్ని తరువాతి స్లయిడ్ కు తీసుకువెళ్తుంది. | ||
01.20 | స్లయిడ్ షో నుండి నిష్క్రమించటానికి, కాంటెక్స్ట్ మెనూ కొరకు mouse పై రైట్ -క్లిక్ చేసి, ఇక్కడ, End Show ను ఎంచుకోండి. | ||
01.28 | నిష్క్రమించటానికి Escape బటన్ నొక్కటం ఇంకొక మార్గం. | ||
01.33 | Mouse pointer as a pen ఎంపిక ఉపయోగించి మీ ప్రేక్షకులతో కూడా ప్రతిస్పందించవచ్చు. | ||
01.40 | ఈ ఎంపికను ఎనేబుల్ చేద్దాం, ఇంకా ఇది ఎలా పని చేస్తుందో చూద్దాం. | ||
01.45 | Main మెనూ నుండి, Slide Show మరియు Slide Show Settings క్లిక్ చేయండి. | ||
01.51 | Slide Show డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది. | ||
01.54 | Options కింద, Mouse Pointer visible మరియు Mouse Pointer as Pen బాక్సులు చెక్ చేయండి. | ||
02.02 | డైలాగ్ -బాక్స్ ను మూసివేయటానికి OK క్లిక్ చేయండి. | ||
02.06 | మళ్ళీ, Main మెనూ నుండి, Slide Show క్లిక్ చేసి తరువాత Slide Show పై క్లిక్ చేయండి. | ||
02.13 | కర్సర్ ఇప్పుడు ఒక పెన్ గా మారిపోయింది అని గమనించండి. | ||
02.17 | ఇది స్లయిడ్ -షో విధానంలో ఉన్నపుడు ఈ ఎంపిక మీకు ప్రెజెంటేషన్ పైన రాయటానికి లేదా గీయటానికి అనుమతిస్తుంది. | ||
02.24 | మీరు ఎడమ mouse బటన్ నొక్కినప్పుడు, మీరు పెన్ తో స్కెచ్ చేయవచ్చు. | ||
02.29 | మొదటి పోయింట్ కు అవతలివైపు ఒక టిక్ మార్క్ ను గీద్దాం. | ||
02.34 | ట్యుటోరియల్ ను విరామంలో ఉంచి ఈ అసైన్మెంట్ చేయండి. | ||
02.38 | Impress స్లయిడ్ పై ఒక చిన్న రేఖాచిత్రాన్ని గీయటానికి స్కెచ్ పెన్ ను ఉపయోగించండి. | ||
02.47 | ఇప్పుడు, ఎడమ mouse బటన్ క్లిక్ చేయండి. తదుపరి స్లయిడ్ ప్రదర్శించబడుతుంది. | ||
02.52 | మీరు Space bar ను నొక్కినప్పుడు, తరువాతి స్లయిడ్ ను కూడా మీరు ముందుకు తీసుకురావొచ్చు.
మీరు Space bar ను నొక్కి కూడా తరువాతి స్లయిడ్ కు వేళ్ళవచ్చు | ||
02.57 | స్లయిడ్ షో నుండి నిష్క్రమిద్దాం. కాంటెక్స్ట్ మెనూ కొరకు mouse రైట్ క్లిక్ చేసి, End Show క్లిక్ చేయండి. | ||
03.05 | తరువాత, Slide Transitions గురించి నేర్చుకుందాం. | ||
03.09 | Slide Transition ఏమేమి? | ||
03.12 | Transition లు అనేవి ఒక ప్రెజెంటేషన్ లో, మనము ఒక స్లయిడ్ తరువాత ఇంకొక స్లయిడ్ కు కదలటం లేదా ట్రాన్సిషన్ చేసినపుడు ఆచరించబడే ప్రభావాలు. | ||
03.22 | Main పేన్ నుండి, Slide Sorter ట్యాబ్ పై క్లిక్ చేయండి. | ||
03.26 | presentation లోని అన్ని స్లయిడ్ లు ఇక్కడ ప్రదర్శించబడతాయి. | ||
03.31 | ఒక ప్రెజెంటేషన్ లోని, ఈ వ్యూ లో, మీరు స్లయిడ్ ల యొక్క క్రమాన్ని సులభంగా మార్చవచ్చు. | ||
03.37 | slide 1ను ఎంచుకుందాం. | ||
03.40 | ఎడమ mouse button ను నొక్కండి. స్లయిడ్ ను మూడు మరియు నాలుగు స్లయిడ్ ల మధ్యలోకి లాగి వదలండి. | ||
03.48 | స్లయిడ్లు తిరిగి అమర్చబడతాయి. | ||
03.52 | ఈ చర్యని undo చేయటానికి Ctrl+Z కీలు నొక్కండి. | ||
03.57 | ఒకే సరి, మీరు ప్రతి స్లయిడ్ కు వివిధ transition లు జోడించవచ్చు, | ||
04.02 | Slide Sorter వ్యూ నుండి, మొదటి స్లయిడ్ ను ఎంచుకోండి. | ||
04.06 | ఇప్పుడు, Tasks పేన్ నుండి, Slide Transition పై క్లిక్ చేయండి. | ||
04.13 | Apply to selected slides కింద, స్క్రోల్ చేసి, Wipe Up ను ఎంచుకోండి. | ||
04.19 | ట్రాన్సిషన్ ఎఫెక్ట్ Main పేన్ లో ప్రదర్శించబడుతుంది గమనించండి. | ||
04.24 | Speed డ్రాప్ -డౌన్ మెనూ నుండి ఎంపికలను ఎంచుకుని, మీరు ట్రాన్సిషన్ వేగాన్ని నియంత్రించవచ్చు. | ||
04.31 | Modify Transitions కింద, డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, ఆపై Medium క్లిక్ చేయండి. | ||
04.39 | ఇప్పుడు, ట్రాన్సిషన్ కు ఒక శబ్దాన్ని ఏర్పాటు చేద్దాం. | ||
04.43 | Modify Transitions కింద, Sound డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి. Beam ను ఎంచుకోండి. | ||
04.52 | అదేవిధంగా, రెండవ స్లయిడ్ ని ఎంచుకోండి. | ||
04.56 | Tasks పేన్ లో, Slide Transition పై క్లిక్ చేయండి. | ||
05.00 | Apply to selected slides కింద, Wheel Clockwise, 4 spokes ఎంచుకోండి. | ||
05.08 | ఇప్పుడు, Speed డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, Medium ఎంచుకోండి. | ||
05.13 | తరువాత,Sound డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, applause ఎంచుకోండి. | ||
05.21 | ఇప్పుడు, మనం చేసిన ట్రాన్సిషన్ ఎఫెక్ట్ preview చేద్దాం. | ||
05.25 | Play క్లిక్ చేయండి. | ||
05.28 | ఇప్పుడు మనం ఒక స్లయిడ్ ట్రాన్సిషన్ కు యానిమేట్ ఎలా చేయాలో మరియు ఒక సౌండ్ -ఎఫెక్ట్ ను ఎలా జోడించాలో నేర్చుకున్నాం. | ||
05.35 | ఇప్పుడు ఒక ప్రెజెంటేషన్ దాని అంతట అదే ముందుకు వెళ్ళాలోఎలా సృష్టించాలో నేర్చుకుందాం. | ||
05.42 | Tasks పేన్ నుండి, Slide Transition క్లిక్ చేయండి. | ||
05.46 | Transition శ్రేణి లో, Checkerboard Down ఎంచుకోండి. | ||
05.50 | Speed డ్రాప్ -డౌన్ లో, Medium ఎంచుకోండి. | ||
05.55 | Sound డ్రాప్ -డౌన్ నుండి, gong ఎంచుకోండి. | ||
06.00 | Loop until next sound చెక్ చేయండి. | ||
06.04 | Automatically after రేడియో బటన్ క్లిక్ చేయండి. | ||
06.09 | టైమ్1 secగా ఎంచుకోండి. | ||
06.14 | Apply to All Slides పై క్లిక్ చేయండి. | ||
06.18 | Apply to All Slides బటన్ పై క్లిక్ చేస్తే అది అన్ని స్లయిడ్లకు ఒకేలాంటి ట్రాన్సిషన్ వర్తింపజేస్తుందని గమనించండి. | ||
06.25 | ఈ విధంగా మనం ప్రతీ స్లయిడ్ కు విడివిడిగా ట్రాన్సిషన్స్ జోడించవలసిన అవసరం లేదు. | ||
06.31 | Main మెనూ నుండి, Slide Show పై క్లిక్ చేసి తరువాత Slide Show పై క్లిక్ చేయండి. | ||
06.38 | స్లయిడ్లు వాటంతట అవే ముందుకు వెళ్తున్నాయి గమనించండి. | ||
06.49 | presentation నుండి నిష్క్రమించటానికి Escape కీ ను నొక్కుదాం. | ||
06.54 | ఇప్పుడు ఒక ప్రెజెంటేషన్ దానంతట అదే ముందుకు వెళ్ళాలి కానీ ప్రతీ స్లయిడ్ కు వేరువేరు ప్రదర్శనా సమయాలు ఉండేలా ఎలా సృష్టించాలో నేర్చుకుందాం. | ||
07.03 | ప్రెజెంటేషన్ లో ఎప్పుడైనా కొన్ని స్లయిడ్ల యొక్క విషయం పెద్దగా లేదా ఎక్కువ క్లిష్టంగా ఉన్నపుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. | ||
07.13 | Main పేన్ నుండి, Slide Sorter టాబ్ పై క్లిక్ చేయండి. | ||
07.18 | రెండవ స్లయిడ్ ఎంచుకోండి. | ||
07.21 | Tasks పేన్ కి వెళ్ళండి. | ||
07.24 | Slide Transition కింద, Advance slide ఎంపిక కు వెళ్ళండి. | ||
07.29 | Automatically after ఫీల్డ్ లో, టైమ్ 2 seconds ప్రవేశ పెట్టండి. | ||
07.37 | Main పేన్ నుండి,మూడవ స్లయిడ్ ఎంచుకోండి. | ||
07.42 | Tasks పేన్ కి వెళ్ళండి. | ||
7.44 | Slide Transitions కింద, Advance slide ఎంపికకు వెళ్ళండి. | ||
07.49 | Automatically after ఫీల్డ్ లో, టైమ్ 3 seconds ప్రవేశ పెట్టండి. | ||
07.57 | నాలుగవ స్లయిడ్ ను ఎంచుకోండి మరియు ముందు స్లయిడ్లకు చేసిన విధంగా అవే దశలను అనుసరించండి,ఇంకా టైమ్ ను 4 సెకండ్స్ కు మార్చండి. | ||
08.08 | Main మెనూ నుండి, Slide Show పై క్లిక్ చేసి తరువాత Slide Show పై క్లిక్ చేయండి. | ||
08.13 | ప్రతీ స్లయిడ్ వేరువేరు సమయ పరిధిలో ప్రదర్శించబడ్డాయి గమనించండి. | ||
08.19 | ప్రెజెంటేషన్ నుండి నిష్క్రమించటానికి Escape కీ ను నొక్కండి. | ||
08.24 | ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. ఈ ట్యుటోరియల్ లో, మనం స్లయిడ్ షోస్, స్లయిడ్ ట్రాన్సిషన్స్, ఆటోమేటిక్ షో గురించి నేర్చుకున్నాము. | ||
08.37 | ఇక్కడ మీ కోసం ఒక assignment. | ||
08.40 | ఒక కొత్త ప్రెజెంటేషన్ ను సృష్టించండి. | ||
08.42 | రెండవ మరియు మూడవ స్లయిడ్ల కొరకు, | ||
08.46 | ఒక A wheel clockwise, 2 spoke transition, medium స్పీడ్ వద్ద మరియు ఒక gong శబ్దం జోడించండి. | ||
08.54 | ఒక ఆటోమేటిక్ స్లయిడ్ షో సృష్టించండి. | ||
08.58 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. | ||
09.04 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. | ||
09.09 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. | ||
09.18 | మరిన్ని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. | ||
09.25 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | ||
09.37 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:
spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. | ||
09.48 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, సాయికుమార్, మాతో చేరినందుకు ధన్యవాదములు. |