PHP-and-MySQL/C4/File-Upload-Part-2/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
0:00 | తిరిగి స్వాగతము. ఈ ట్యుటోరియల్ యొక్క మొదటి భాగములో, ఇక్కడ ఈ ఫార్మ్ ఉపయోగించి అప్లోడ్ చేయబడిన మన ఫైల్ యొక్క ప్రత్యేక ప్రాపర్టీస్లను ఎలా వెలికితీయాలో నేను మీకు చూపాను. |
0:10 | ఇప్పుడు, ఈ ఫైల్ను ఎలా అప్లోడ్ చేయాలో మరియు దానిని ఇక్కడ ప్రస్తుతము ఖాళీగా ఉన్న అప్లోడ్ చేయబడిన ఫోల్డరులోనికి ఎలా బదిలీచేయాలో చూపిస్తాను. |
0:18 | మీరు జ్ఞాపకం చేసుకుంటే, మనము మన వెబ్ సర్వర్పై స్టోర్ చేయబడిన ఒక తాత్కాలిక ప్రదేశము గురించి ప్రస్తావిస్తున్నాము. |
0:25 | అది ఇప్పుడు అంత ఉపయోగకరమైనది కాదు. |
0:29 | ఇక్కడ మనకు అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, కాబట్టి, uploaded ఫైల్ యొక్క ప్రాపర్టీస్ అని నేను చెబుతాను కాబట్టి మనము ఏమి చేస్తున్నామో మనకు తెలుసు. |
0:34 | ఇక్కడ మన ప్రత్యేక ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి. |
0:38 | నేను వాటి అన్నింటికీ సులభంగా గుర్తుంచుకోగలిగే వేరియబుల్ పేర్లు ఇచ్చాను కాబట్టి వీటి గురించి విడివిడిగా చెప్పనవసరము లేదు. |
0:46 | మనము చేసే మొదటి పని ఏవైనా ఎర్రర్స్ ఉన్నాయా అని చెక్ చేయుటకు ఒక if స్టేట్మెంట్ క్రియేట్ చేయడము. |
0:53 | ఇక్కడ if ఎర్రర్ కోడ్ సున్నా కంటే పెద్దది అయితే, అది ఒక ఎర్రర్ కోడ్ చేత ఇవ్వబడింది అని అర్థము. తరువాత నేను 'die' అని అంటాను. |
1:03 | మరియు నేను "File couldn't.... అనే ఒక ఎర్రర్ మెసేజ్ ఇస్తాను. |
1:11 | లేక "Error uploading file, code error' అని మెసేజ్ ఇస్తాను. |
1:20 | ఇది యూజరుకు ఒక ఎర్రర్ కోడ్ ఇస్తుంది. |
1:23 | ఇప్పుడు 'else' భాగము. |
1:25 | దానిని సామాన్యంగా మరియు ఒక సింగిల్ లైన్లో ఉంచుటకు నేను ఈ కర్లీ బ్రాకెట్లను ఉపయోగిస్తాను. |
1:29 | కాబట్టి 'else' గా నేను 'move_uploaded_file' అనే ఒక ఫంక్షన్ ఉపయోగిస్తాను. |
1:39 | తరువాత మనము ఒక తాత్కాలిక పేరు 'temp' ను తీసుకుంటాము. ఇది ఈ ఫంక్షన్ యొక్క మొదటి పారామీటర్ మరియు 'uploaded folder' అనే గమ్యస్థానము రెండవ పారామీటరు. |
1:51 | కాబట్టి, నేను 'uploaded' అని మరియు ఒక ఫార్వర్డ్ స్లాష్ టైప్ చేస్తాను. |
1:59 | మరియు దాని చివరిలో మనము అప్లోడ్ చేసిన ఫైల్ యొక్క పేరును కంకాటినేట్ చేస్తాము. |
2:07 | ఇక్కడ అది కేవలము 'name' అని ఉంటుంది. |
2:10 | ఇది యూజర్కు ఇక్కడ ఇంటర్ వేరియబుల్స్ చేర్చడము చూపుతుంది. |
2:15 | లేకపోతే, మనము వీటిని టైప్ చేయాలి, ఉదాహరణకు - temp పేరు |
2:19 | తరువాత ఇక్కడికి వెళ్ళండి మరియు దానిని ఈ విధంగా ఉంచండి. |
2:22 | అది చాలా గజిబిజి అయిపోతుంది మరియు చదువుటకు కష్టము అవుతుంది. |
2:25 | కాబట్టి ఈ వేరీబుల్స్ను ఇక్కడ ఉంచడము సులభమైన పని. |
2:33 | ఇప్పుడు నేను వీటిని తొలగిస్తాను లేక ఉంచుతాను. |
2:37 | చివరిగా, 'Upload complete' అనే ఒక మెసేజ్ను echo చేయండి. |
2:41 | మనము దీనిని ప్రయత్నిద్దాము. |
2:47 | నేను మన పేజ్లోనికి లాగ్ ఆన్ అవుతాను మరియు మన 'intro to avi' అనే ఫైల్ను తీసుకుంటాను. |
2:51 | నేను అప్లోడ్పై క్లిక్ చేస్తాను మరియు అప్లోడ్ పూర్తి అయ్యిందని మనము చూడవచ్చు. |
2:55 | మనము my file చెక్ చేద్దాము. |
2:57 | ఫోల్డరును అప్లోడ్ చేయండి మరియు అప్లోడ్ చేయబడిన సబ్ డైరెక్టరీ పై క్లిక్ చేయండి. ఫైల్ ఇక్కడ ఉందని మీరు చూడవచ్చు. కాని ఇంతకు ముందు అది నా వెబ్ సర్వర్పై తాత్కాలిక డైరెక్టరీలో స్టోర్ చేయబడింది. |
3:08 | కాబట్టి, మనము విజయవంతముగా మన ఫైల్ను ఇక్కడికి అప్లోడ్ చేసాము. |
3:13 | ఇంకా మనము చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. |
3:15 | మరొక if స్టేట్మెంట్ను Undo చేయండి లేక ఈ if స్టేట్మెంట్ను Undo చేయండి. |
3:20 | మనము అప్లోడ్ చేయాలని అనుకోని కొన్ని ప్రత్యేకమైన ఫైల్ రకముల కొరకు చెక్ చేద్దాము. |
3:24 | ఉదాహరణకు నేను avi ఫైల్స్ అప్లోడ్ చేయాలని అనుకోవడము లేదు. |
3:30 | నేను ఇక్కడ ఏమి చేయగలను అంటే, if error is bigger than zero, don't upload files అని చెప్పగలను. |
3:37 | లేకపోతే, నేను else లోపల కొత్త if స్టేట్మెంట్ మొదలుపెడతాను. |
3:41 | మరియు ఇక్కడ నేను ఒక బ్లాక్ క్రియేట్ చేస్తాను. |
3:47 | మరియు ఇవి ఫైల్ కొరకు కండీషన్లు. |
3:51 | నేను ఇలా అంటాను - if the type of file, అంటే మన టైప్ వేరియబుల్ t-y-p-e, 2 equal to signs, video dot avi కు సమానము |
4:09 | మరియు నేను దానిని echo చేసినప్పుడు, అది వీడియో dot avi కు సమానముగా ఉండడము, దీని మొదటి భాగములో మీరు చూసారు |
4:19 | మరియు మనము ఇలా చెబుతున్నాము, if it is equal to video dot avi then upload the file. |
4:28 | నేను ఇక్కడ దీనిని క్రిందికి కదిలిస్తాను మరియు దానిని 'else' బ్లాక్లో వేస్తాను. |
4:32 | కాబట్టి ఇప్పుడు నా వద్ద ఉన్నది - if the video is equal to avi then die మరియు మెసేజ్ ఇలా ఉంటుంది 'That format is not allowed". |
4:44 | ఇప్పుడు నేను దీనిని మన అప్లోడ్ చేయబడిన డైరెక్టరీ నుండి డిలీట్ చేస్తాను మరియు నేను ప్రారంభములో అప్లోడ్ చేసిన ఫైల్ వద్దకు వెనక్కు వస్తాను. |
4:54 | నేను intro dot avi ఎంచుకుంటాను మరియు అప్లోడ్ అని క్లిక్ చేసినప్పుడు, అది 'format is not allowed' అని చెబుతుంది. |
5:01 | మరియు మీరు my uploaded directory కి వెళ్తే, ఫోల్డర్ ఖళీగా ఉందని చూడవచ్చు. |
5:06 | ఏదీ అప్లోడ్ కాలేదు. |
5:08 | ఇప్పుడు avi కి బదులుగా, "images with png" extension ను బ్యాన్ చేయాలని అంటాను. |
5:15 | నేను దానిని ఇక్కడ మారుస్తాను మరియు my file ను తిరిగి అప్లోడ్ చేస్తాను. |
5:23 | అది ఒక ఆమోదించబడిన ఫైల్ ఫార్మాట్ కాబట్టి, మనకు 'Upload complete' అనే సందేశము వస్తుంది మరియు అది my uploaded folder కు బదిలీ చేయబడుతుంది. |
5:33 | దానిని మళ్ళీ డిలీట్ చేద్దాము. ఓ! నేను క్యాన్సిల్ చేసాను. దానిని తిరిగి డిలీట్ చేద్దాము. |
5:42 | సరే. ఒక ప్రత్యేకమైన రకమును ఎలా నిర్దేశించాలి అని ఇక్కడ చూసాము. |
5:47 | ఇంకా మనము ఒక ప్రత్యేకమైన ఫైల్ సైజును కూడా నిర్దేశించగలము. |
5:51 | నేను 'or' అని అంటాను మరియు ఈ 'or' ఆపరేటర్ను ఉపయోగించి 'or' the size is bigger than half a megabyte అని అంటాను. |
6:04 | ఇది మెగాబైట్లో సగము. అంటే అయిదు వందల వేల బిట్స్ కాదు బైట్స్. నేను ఒక తప్పు చేసానని అనుకుంటున్నాను, బైట్స్కు బదులు నేను బిట్స్ అని అన్నాను. |
6:14 | అది అయిదు వందల వేల బైట్స్. అది 0 పాయింట్ 4 మెగాబైట్లకు సమానము. ఇప్పటికి నేను హాఫ్ మెగాబైట్ అని అంటాను. |
6:29 | ఇది సైజ్ను అంచానా వేస్తుంది మరియు హాఫ్ మెగాబైట్ కంటే పెద్దదిగా ఉందని చెబుతుంది. |
6:38 | తరువాత అది this format is not allowed అని చెబుతుంది. |
6:43 | కాబట్టి నేను ఈ మెసేజ్ను మార్చి 'Format not allowed or file size too big' అని ఉంచుతాను. |
6:56 | కాబట్టి మీరు మీ టైప్ను మరియు మీ సైజ్ను అంచనా వేయుటకు if స్టేట్మెంట్ క్రియేట్ చేయవచ్చు. |
7:03 | మీరు ఈ కండీషన్ తీసుకొని మరియు దానిని మరొక if స్టేట్మెంట్లో వేయాలి. |
7:09 | కాబట్టి, నేను వెనక్కు వెళ్తాను మరియు నేను తిరిగి my file ఎంచుకుంటాను. |
7:12 | కేవలము అది అక్కడ ఉందని నిర్ధారించుట కొరకు అలా చేస్తాను. |
7:14 | అప్లోడ్ అని క్లిక్ చేయండి మరియు అది 'Format not allowed' అని అంటుంది |
7:19 | ఇప్పుడు మీరు మన కోడ్ వద్దకు వెనక్కు వెళ్తే, అది png ఫార్మాట్లో లేదు కాని సైజ్ పరిమితి దాటుతుంది. |
7:25 | దీనిని మనము 2 మిలియన్కు మార్చుదాము అంటే 2 మెగాబైట్స్. |
7:31 | రిఫ్రెష్ చేయండి మరియు దానిని సెండ్ చేయండి. |
7:33 | మన అప్లోడ్ పూర్తి అయ్యిందని మీరు చూడవచ్చు. ఎందుకంటే ఇది ఒక మెగాబైట్ పరిమాణములో ఉంది. |
7:39 | ఇప్పటికి File Upload గురించి ఇంతే. |
7:44 | ప్రత్యేక ఫైల్ రకములు మరియు మీ వెబ్ సర్వర్కు పెద్దవైన ఫైల్ సైజులను తప్పించడానికి ఇది ఉపయోగించాలని మీరు తెలుసుకోవాలి. |
7:54 | మీ వెబ్ సర్వర్పై పెద్ద ఫైల్స్ వద్దని మీరు అనుకుంటే దానిని నియంత్రించుటకు ఇది మంచి పద్ధతి. |
7:58 | మీరు చూసినట్టుగా క్రియేట్ చేయడము చాలా సులభము. |
8:01 | దీనిని అభ్యాసము చేయండి మరియు ఇది ఎంత ఉపయోగకరమైనదో మీరు తెలుసుకుంటారు. |
8:05 | మీరు ఏవైనా ప్రశ్నలు అడగాలని అనుకుంటే, సందేహించకండి. |
8:08 | ఏవైనా అప్డేట్ చేయబడిన వీడియోల గురించి లేక కొత్త వీడియోల గురించి మీకు తెలుపబడాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. |
8:15 | చూసినందుకు ధన్యవాదములు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెప్పినవారు స్వాతి |