PHP-and-MySQL/C4/User-Registration-Part-1/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 14:51, 29 March 2013 by Udaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search


Time Narration
0:00 ఒక యూజర్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఎలా క్రియేట్ చేయాలి మరియు ఒక యూజర్ను mysql డేటాబేస్లోనికి ఎలా రిజిస్టర్ చేయాలి అనే విషయములపై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
0:09 ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టేముందు ఒక సూచన ఏమిటంటే, ముందుగా మీరు నా "User Login" ట్యుటోరియల్స్ చూడండి. నేను దానికి ఒక లింక్ పోస్ట్ చేసాను.
0:19 ఈ ట్యుటోరియల్ ను చూసే ముందు ఆ పని చేయమని నేను మీకు సూచిస్తున్నాను. "User Registration" కంటే ముందు నేను "User Login" క్రియేట్ చేసాను. ఎందుకంటే, "Registration" ప్రాసెస్ చేయడము కంటే ముందు "User Login" ప్రాసెస్ చేయడము నాకు చాలా సులభము అనిపించింది.
0:34 ఒకసారి మీరు "login" ప్రాసెస్ సరిగ్గా చేసి డేటాబేస్లో ఫీల్డ్స్ కలిగి ఉంటే, మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలుపెట్టవచ్చు.
0:43 ఈ విధంగా చేయడము నాకు చాలా సులభంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీ డేటాబేస్లోనికి మీరు ఏమి రిజిస్టర్ చేస్తున్నారో మీకు తెలుస్తుంది.
0:49 మొదలు పెట్టుటకు, మొదటి భాగములో, మనము మన ఫార్మ్ క్రియేట్ చేద్దాము మరియు నా లాగిన్ సమాచారము యొక్క ఉనికిని చెక్ చేద్దాము.
0:56 ప్రస్తుతము ఉన్న నా ట్యుటోరియల్స్ నుండి నేను నా "Login session" ఫోల్డర్ ఉపయోగిస్తున్నాను.
1:03 ఇది నా లాగిన్ సెషన్ మరియు ఫీల్డ్స్, కాని ఇక్కడ నేను ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాను.
1:12 ముందుగా కొన్ని టాగ్స్ చేర్చండి.
1:15 దీనిని నేను "index dot php" అనే మెయిన్ పేజ్తో నా లాగిన్ సెషన్ ఫోల్డర్లో క్రియేట్ చేస్తాను. అది మీరు చూసిన మెయిన్ పేజ్.
1:22 లాగ్ ఇన్, లాగ్ అవుట్ మరియు యూజర్లు లాగ్ ఇన్ అయి ఉంటే మెంబర్ పేజ్ మరియు నేను దీనిని "register dot php" అని సేవ్ చేస్తాను
1:32 నేను ఒక యూజర్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ క్రియేట్ చేస్తున్నాను. దీని వలన యూజర్ లాగిన్ కావాలని నిర్ణయించుకునే ముందు రిజిస్టర్ కావచ్చు.
1:40 నేను నా "register dot php" క్రియేట్ చేసాను మరియు నేను నా index ఫైల్ కూడా ఓపెన్ చేస్తాను. నేను ఫార్మ్ క్రింది భాగములో ఒక లింక్ క్రియేట్ చేస్తాను.
1:48 ఇది ఆ రిజిస్టర్ పేజ్కు ఒక లింక్ లాగా ఉంటుంది మరియు ఇక్కడ నేను "Register" అని టైప్ చేస్తాను.
2:02 కాబట్టి, ఇక్కడ మనకు "Register" అనే ఒక లింక్ లభిస్తుంది. ఇది ఈ సమయములో ఏమీ లేని మన పేజ్కు వెళ్తుంది.
2:09 లాగిన్ అవ్వగలిగే గత ట్యుటొరియల్ నుండి,మీరు ఇది చేసేముందు మీరు రిజిస్టర్ చేసుకోగలిగే ఒక పేజ్కు

లింక్ను నేను ఇస్తాను.

2:20 ఇంతకు మునుపు మనము మన డేటాబేస్లో డేటాను టైప్ చేసేవాళ్ళము. నేను ఒక కొత్త విండో ఓపెన్ చేస్తే, నేను "php my admin" లోకి వెళ్తాను.
2:29 మరియు ఇది "php login" అనబడే మనము ఉపయోగించే డేటాబేస్ మరియు ఇది నా "users" టేబిల్.
2:38 మీరు చూస్తున్నట్టుగా నేను అదనంగా "name" అనే ఒక ఫీల్డ్ చేర్చాను మరియు నేను "date" అనే మరొక ఫీల్డ్ కూడా చేరుస్తాను.
2:47 టేబిల్ చివరిలో అది "date" అని పిలువబడుతుంది మరియు అది డేట్ ఫార్మాట్లో ఉంటుంది. కాబట్టి అది ఎక్కడ? .... ఇక్కడ ఉంది.
3:04 డేట్ అంటే ఏమిటి అని మీరు కన్ఫ్యూస్ అయ్యే ముందే మీకు చెబుతాను. అది యూజర్లు రిజిస్టర్ చేసుకున్న ప్రస్తుత డేట్ మరియు మనము అక్కడికి వెళ్తాము మరియు దానిని సేవ్ చేస్తాము.
3:15 "User Login" పై గత ట్యుటోరియల్ నుండి మనకు ఒక id, username మరియు ఒక పాస్వర్డ్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక పేరు చేర్చాను. కాబట్టి అది username అవుతుంది మరియు మనము డేట్ కూడా చేర్చాము. అది యూజర్ రిజిస్టర్ అయిన తేదీ.
3:29 ఇక్కడ బ్రౌజ్ చేయండి. ఇక్కడ ఇదివరకే రెండు విలువలు ఉన్నాయి.
3:35 నేను వీటిని డిలీట్ చేస్తాను. ఎందుకంటే నేను నా కొత్త యూజర్లను రిజిస్టర్ చేసుకుంటున్నాను. కాబట్టి నేను ఒక శుభ్రమైన డేటాబేస్తో మొదలుపెడతాను.
3:40 నా వద్ద యూజర్లు ఏవరూ లేరని మరియు ఇక్కడ రిజిస్టర్ పేజ్కు లింక్ ఉంది అనుకుంటాను, ఇది నా రిజిస్టర్ పేజ్.
3:49 ఇప్పుడు, నేను ఈ html కోడ్ గురించి సంక్షిప్తముగా చెప్తాను. ఇది ఈ పేజ్ను ఎలా క్రియేట్ చేయాలో చెబుతుంది మరియు ముందుగా మనము ఒక ఫారంను క్రియేట్ చేద్దాము.
3:59 ఇది స్వయంగా సబ్మిట్ చేసుకోగలిగిన ఒక ఫార్మ్. ఇది తిరిగి "register dot php" కు సబ్మిట్ చేస్తుంది.
4:07 మనము ఒక టేబిల్ క్రియేట్ చేస్తాము మరియు దీనిలో ఇక్కడ మనకు ఒక row ఉంటుంది.
4:13 తరువాత మనము రెండు కాలంస్ వేస్తాము. కాబట్టి ఇక్కడ రెండు id బ్లాక్స్ ఉంటాయి. మొదటి దానిలో మీ "fullname" ఉంటుంది.
4:31 నేను మీకే వదిలివేస్తున్నాను. కేవలము వేగవంతము చేయుటకు నేను ఇలా చేస్తాను.
4:29 ఇక్కడ మన రెండవ కాలంలో, నేను నా ఇన్పుట్ రకమును text గా వేస్తాను మరియు నా పేరు "fullname" కు సమానము అవుతుంది.
4:38 ఈ సమయములో మీరు చూడవచ్చు. నేను నా అసలైన పేజ్కు వెనక్కు వెళ్తాను మరియు register పై క్లిక్ చేస్తాను.
4:47 మీరు చూస్తున్నట్టుగా, ఇది ఇక్కడ స్ప్లిట్ అయిన ఒక కాలం. ఇది ఇన్పుట్ బాక్స్తో ఉన్న మరొక కాలం.
5:36 మరియు నేను ఇక్కడికి వెళ్తాను మరియు php కోడ్లోపల నేను ఒక హెడ్డర్ను echo చేస్తాను. నేను ఇలా ఎందుకు చేసానని మీకు కొద్దిసేపటి తరువాత వివరిస్తాను.
5:07 కాబట్టి మనకు అది వచ్చింది. ఈ సమయములో మన వద్ద ఇది ఉంది. వేగంగా చేయుటకు నేను కాపీ చేసి పేస్ట్ చేస్తాను.
5:15 మీరు "t r" till "end t r" నుండి ఎంచుకున్నారని నిర్ధారించుకోండి.
5:22 నేను దానిని పేస్ట్ చేస్తాను మరియు "Choose a username" అని అంటాను. మరియు నేను దీనిని "username" గా మారుస్తాను.
5:32 నేను దానిని తిరిగి పేస్ట్ చేస్తాను మరియు "Choose a password" అని అంటాను. ఈ టెక్స్ట్ కేవలము భద్రత కల్పించుటకు మాత్రమే. మన యూజర్ల భుజాల మీదుగా ఎవరైనా చూడవచ్చు లేక ఈ కంప్యూటరులోనికి చొరబడేందుకు స్క్రీన్ క్యాప్చ్యూర్ సాఫ్వేర్ ఏదైనా ఉపయోగించబడవచ్చు.
5:47 తరువాత "Repeat your password" అని చెప్పుటకు నేను కాపీ చేస్తాను మరియు ఇక్కడ పేస్ట్ చేస్తాను.
05:58 తిరిగి ఇక్కడ "password"
6:07 మనము మళ్ళీ "password" అని అనలేము కాబట్టి నేను దీనిని "repeat password" అని అంటాను.
6:10 దీనిని మనము పాస్వర్డ్లు సబ్మిట్ చేయబడిన తరువాత పోల్చుటకు ఉపయోగిస్తాము. యూజర్ ఏవైనా తప్పులు చేయకుండా ఇది ఒక భద్రతా చర్యగా ఉపయోగించబడుతుంది.
6:20 మరియు మనకు మరే ఇతర ఫీల్డ్లు అవసరము లేదు. ఇది చివరిది.
6:24 మనకు అవసరము అయ్యేది "date". కాని నేను దానిని ఫార్మ్ సబ్మిట్ చేసే సమయములో చేస్తాను.
6.31 సరే ఇది క్రియేట్ చేయబడిన మన ఫార్మ్. మనము వెనక్కు వెళ్దాము మరియు రిఫ్రెష్ చేద్దాము.
6:37 ఇది చాలా సమంగా అమర్చబడి ఉందని మీరు చూడవచ్చు. దీని కొరకే మనము టేబిల్ ఉపయోగించాము.
6:42 మనకు ఒక సబ్మిట్ బటన్ కూడా కావాలి.
6:45 మన టేబిల్ క్రింద, నేను ఒక పారాగ్రాఫ్ బ్రేక్ క్రియేట్ చేస్తాను.
6:48 మరియు ఇక్కడ నా ఇన్పుట్ రకము "submit", మరియు నా పేరే "submit" అవుతుంది.
6:54 మరియు మనము ఉనికిని చెక్ చేయాలి మరియు "register" అనేది విలువ అవుతుంది.
6:57 రిఫ్రెష్ చేద్దాము. పాస్వర్డ్ ఫీల్డ్స్ అన్నీ ఖాళీ కావడము మీరు చూడవచ్చు.
7:05 మరియు యూజర్లు వారి విలువలను టైప్ చేయుటకు మన వద్ద fullname మరియు username ఉన్నాయి.
7:12 సరే. నేను ఇక్కడ ఈ ట్యుటోరియల్ను నిలుపుతాను.
7:16 మీరు దీనిని అంచెలంచెలుగా అనుసరిస్తే, మీ యొక్క ఫార్మ్ వ్రాయబడి ఉంటుంది మరియు మీరు కావాలని అనుకుంటే మీరు మరొక డిజైన్ ప్రయత్నించండి
7:25 ఆ పని చేయుటకు మరింత సమయము ఉంటే బాగుండేది అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ముందుకు సాగండి మరియు మీకు కావలసిన విధంగా మీ ఫారంను క్రియేట్ చేసుకోండి.
7:30 దానిని మీకు కావలసిన విధంగా చేసుకోండి. ఈ లేబిల్స్ మార్చండి.
7:33 మీ బాక్సులు మరియు రిజిస్టర్ మీకు లభించిందని నిర్ధారించుకోండి.
7:35 తరువాతి భాగములో, ఈ ఫీల్డ్స్ అన్నింటిలో యూజర్ టైప్ చేసాడా అని చెక్ చేయడము గురించి మాట్లాడదాము.
7:44 పాస్వర్డ్లను పోల్చి అవి మ్యాచ్ అవుతాయా లేదా అని చూద్దాము. అంటే నేను, రెండు పాస్వర్డ్లు ఉన్నాయి మరియు అవి క్యారెక్టర్, లెంత్, మొదలైన విషయాలలో విభేదిస్తున్నాయి అని అంటే, యూజర్ తప్పు చేసాడు కాబట్టి రిజిస్టర్ కాలేడు.
7:59 దీనిని చూస్తున్న మీలో చాలామంది ఏదో ఒక సందర్భములో రిజిస్టర్ అయి ఉండవచ్చు మరియు మీ పాస్వర్డ్ను తిరిగి టైప్ చేసి ఉంటారు.
8:07 మనము మన పాస్వర్డ్లను ఎన్క్రిప్ట్ చేస్తాము మరియు ఈ ఫారంస్ నుండి ఏవైనా ప్రమాదకరమైన లేక ప్రమాదకరము అనిపించే html టాగ్స్ను తొలగించుదాము. దీని వలన మన రిజిస్ట్రేషన్ ఫారంకు కొంత భద్రత ఉంటుంది.
8:17 తరువాతి భాగములో కలుద్దాము. చూసినందుకు ధన్యవాదములు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెప్పినవారు స్వాతి.

Contributors and Content Editors

PoojaMoolya, Udaya