LibreOffice-Suite-Calc/C3/Linking-Calc-Data/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | లిబ్రే ఆఫీస్ Calc లో లింకింగ్ ఇన్ కాల్క్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మీరు ఈ క్రింది వాటి గురించి నేర్చుకుంటారు: |
00:10 | Calc లో ఇతర షీట్లను ఎలా రిఫరెన్స్ చేయాలి |
00:13 | Calc లో హైపర్ లింక్స్ ఎలా ఉపయోగించాలి |
00:17 | ఇక్కడ మనము Ubuntu Linux version 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము. |
00:29 | లిబ్రే ఆఫీస్ Calc మిమ్మలిని |
00:33 | మరొక షీట్ లో ఉన్న సెల్ నుండి ప్రస్తుతము ఉన్న సెల్ కు |
00:37 | ఒకవేళ మీరు రెండు స్ప్రెడ్ షీట్లను సేవ్ చేసి ఉంటే, మరొక స్ప్రెడ్ షీట్ నుండి సెల్ రిఫరెన్స్ కొరకు అనుమతిస్తుంది. |
00:44 | మనము "Personal-Finance-Tracker.ods" ను ఓపెన్ చేద్దాము. |
00:49 | మన ఫైల్ యొక్క షీట్ 1 లో "Personal-Finance-Tracker.ods" కొరకు స్ప్రెడ్ షీట్ ఉంటుంది. |
00:55 | నేను "Spent" మరియు "Received" వరుసలో కొంత మొత్తమును చేర్చాను. |
01:04 | ఇప్పుడు, మనము వరుసగా "Cost" మరియు "Spent" వరుసలలో ఉన్న మొత్తాన్ని కనుగొందాము. |
01:11 | C9 అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి మరియు "is equal to SUM" అనే సూత్రాన్ని మరియు బ్రేసెస్ లో "C3 colon C7" అని ఎంటర్ చేయండి. |
01:24 | తరువాత ఎంటర్ కీ ప్రెస్ చేయండి. |
01:27 | D9 అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి మరియు అదే సూత్రాన్ని ఉపయోగిస్తూ మొత్తాన్ని కనుగొనండి. |
01:36 | ఇప్పుడు, సెల్ రిఫరెన్సింగ్ ఉపయోగించి వేరొక షీట్ పై "Cost" మరియు "Spent" క్రింద మొత్తము బ్యాలెన్స్ చూపిద్దాము. |
01:45 | "Sheet 2" ట్యాబ్ పై క్లిక్ చేద్దాము. |
01:48 | ఇది కొత్త షీట్ ను ఓపెన్ చేస్తుంది. |
01:51 | ఇప్పుడు A1 అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి మరియు "COMPONENT" అనే హెడ్డింగ్ ను దాని లోపల టైప్ చేయండి. |
02:00 | B1 అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి మరియు "BALANCE" అనే హెడ్డింగ్ ను దాని లోపల టైప్ చేయండి. |
02:07 | ఇప్పుడు, హెడ్డింగ్ క్రింద కాంపొనెంట్స్ పేర్లను ఎంటర్ చేద్దాము. |
02:12 | A3 అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి మరియు "COSTS" అని టైప్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. |
02:19 | "COSTS" క్రింద, మనము తరువాతి కాంపొనెంట్ ను "SPENT" అని A4 గా రిఫరెన్స్ చేయబడిన సెల్ లో ఎంటర్ చేద్దాము. |
02:27 | ఇప్పుడు, ఖాళీ సెల్ B3 పై క్లిక్ చేయండి. |
02:31 | B3 మరియు B4 సెల్స్ "COST" మరియు "SPENT" అనే హెడ్డింగ్ ల క్రింద మొత్తము బ్యాలెన్స్ కలిగి ఉంటాయి. |
02:38 | దీనిని మనము "Sheet 1" లో లెక్కించాము. |
02:41 | ఇది రిఫరెన్సింగ్ ద్వారా చేయబడుతుంది. |
02:44 | B3 సెల్ లో సెల్ రిఫరెన్స్ చేయుటకు, "Input Line" పక్కన ఉన్న "equal to" చిహ్నము పై క్లిక్ చేయండి. |
02:53 | ఇప్పుడు, షీట్ ట్యాబ్ పై "Sheet 1" పై క్లిక్ చేయండి. |
02:59 | ఈ షీట్ లో, మనము C9 సెల్ పై క్లిక్ చేస్తాము. ఇది "Costs" అనే వరుస క్రింద మొత్తమును కలిగి ఉంటుంది. |
03:07 | "Input line" లో "Sheet 1 dot C9" స్టేట్మెంట్ ప్రదర్శించబడుతుందని గమనించండి. |
03:15 | "Sheet 1 ట్యాబ్ లో "Costs" క్రింద గ్రాండ్ టోటల్ "Sheet 2" ట్యాబ్ లో B3 అని రిఫరెన్స్ చేయబడిన సెల్ లోనికి ఆటోమాటిక్ గా ఎంటర్ అవుతుందని గమనించండి. |
03:20 | అలాగే, రిఫరెన్సింగ్ ద్వారా మనము ఇతర కాంపొనెంట్స్ యొక్క గ్రాండ్ టోటల్స్ ను ఎంటర్ చేయగలము. |
03:34 | ఒకవేళ ఎక్కువ డేటా కంటెంట్ తో చాలా షీట్లు ఉంటే, వాటి సారాంశమును తీయుటకు రిఫరెన్సింగ్ ఉపయోగకరముగా ఉంటుంది. |
03:41 | ఇప్పుడు, Calc షీట్లలో హైపర్ లింక్స్ ఎలా సృష్టించాలో నేర్చుకుందాము. |
03:49 | ఈ షీట్ లో, మనము C9 సెల్ పై క్లిక్ చేస్తాము. ఇది "Costs" అనే వరుస క్రింద మొత్తమును కలిగి ఉంటుంది. |
03:55 | మీరు
ఒక స్ప్రెడ్ షీట్ లో వేరొక స్థానమునకు వేరువేరు ఫైల్స్ లోకి లేదా వెబ్ సైట్లలోనికి కూడా. జంప్ చేయుటకు హైపర్ లింక్స్ ఉపయోగించవచ్చు |
04:06 | "Personal-Finance-Tracker.ods" లో,
పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్ "Sheet 1" లో ఉంది మరియు మిగిలిన కంటెంట్ "Sheet 2" లో ఉంది. |
04:17 | మనము Sheet 1 నుండి Sheet 2 కు జంప్ చేయవలసి ఉంటే |
04:22 | ముందుగా, "Sheet 1" ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
04:25 | ఇక్కడ, B14 అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేద్దాము మరియు "Sheet2 అని ఎంటర్ చేద్దాము. |
04:33 | "Input line" పై "Sheet 2" అనే పేరు కనిపించడము మీరు చూడవచ్చు. |
04:38 | ఇప్పుడు, Input line లో "Sheet 2" అనే టెక్స్ట్ ఎంచుకోండి. |
04:44 | టెక్స్ట్ ను ఎంచుకున్న తరువాత, టూల్ బార్ లో ఉన్న "Hyperlink" ఐకాన్ పై క్లిక్ చేయండి. |
04:51 | Hyperlink డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
04:55 | ఎడమవైపు, మనము "Document" ఐఛ్చికమును ఎంచుకుందాము. |
04:59 | డైలాగ్ బాక్స్ లో "Target in document" ఐకాన్ పై క్లిక్ చేయండి. |
05:04 | ఒక కొత్త "Target in document" డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
05:08 | ఇప్పుడు, "Sheet " ఆప్షన్ పక్కన ఉన్న "plus sign" పై క్లిక్ చేయండి. |
05:13 | కనిపించే డైలాగ్ బాక్స్ లో, "Sheet 2" ఆప్షన్ పై క్లిక్ చేయండి. |
05:18 | ఇప్పుడు, "Apply" బటన్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత "Close" బటన్ పై క్లిక్ చేయండి. |
05:24 | ఇప్పుడు, హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ నుండి, "Apply" పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత "Close" పై క్లిక్ చేయండి. |
05:32 | సెల్ లో "Sheet 2" హై లైట్ అయిన టెక్స్ట్ తో "Sheet 1" ట్యాబ్ ముందుగా కనిపిస్తుంది |
05:40 | ఇప్పుడు, మనము "Sheet 2" పై క్లిక్ చేసినప్పుడు, కాస్ట్స్ కొరకు బ్యాలెన్స్ ను ఎంటర్ చేసిన షీట్ కు అది మనలను నేరుగా తీసుకెళ్తుంది. |
05:51 | మనము ఒక హైపర్ లింక్ సృష్టించాము! |
05:55 | హైపర్ లింక్ ను తొలగించుటకు, ముందుగా హైపర్ లింక్ చేయబడిన టెక్స్ట్ "Sheet 2" ను ఎంచుకోండి. |
06:01 | ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి మరియు కాంటెక్స్ట్ మెనూ నుండి, "Default Formatting" ఆప్షన్ పై క్లిక్ చేయండి. |
06:09 | టెక్స్ట్ ఇకపై హైపర్ లింక్ కలిగి ఉండదు. |
06:12 | ఇది డాక్యుమెంట్ లో మిగతా సాధారణ టెక్స్ట్ వంటిదే. |
06:16 | మనము మార్పులను అండూ చేద్దాము. |
06:20 | దీనితో మనము లిబ్రే ఆఫీస్ కాల్క్ పై స్పోకెన్ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
06:25 | సారాంశము తెలుసుకొనుటకు, మనము ఈ క్రింది విషయమును నేర్చుకున్నాము:
Calc లో ఇతర షీట్లకు రిఫరెన్స్ |
06:31 | Calc లో హైపర్ లింక్స్ ఉపయోగించడము. |
06:36 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
06:40 | అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును అందిస్తుంది. |
06:43 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకుంటే, మీరు దానిని డౌన్ లోడ్ చేసుకొని చూడవచ్చు. |
06:47 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
06:52 | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్స్ ఇస్తుంది. |
06:56 | మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
07:03 | స్పొకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
07:07 | దీనికి ఐసీటీ, యం హెచ్ ఆర్ డీ, భారత ప్రభుత్వము వారిచే నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారము అందిస్తోంది |
07:15 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము
spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro వద్ద అందుబాటులో ఉంది. |
07:25 | ఈ ట్యుటోరియల్ దేశీ క్రూ సొల్యూషన్స్ ప్రై. లి. వారిచే అందించబడింది. పాల్గొన్నందుకు ధన్యవాదములు |
ఈ స్క్రిప్ట్ ను అనువదించినవారు భరద్వాజ్ మరియు నిఖిల. |