LibreOffice-Suite-Impress/C3/Custom-Animation/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 17:07, 3 April 2017 by Simhadriudaya (Talk | contribs)
Time | Narration |
00.00 | LibreOffice Impress లో Custom Animation ట్యుటోరియల్ కు స్వాగతం. |
00.07 | ఈ ట్యుటోరియల్ లో మనం, Impress లో Custom Animation గురించి నేర్చుకుంటాం. |
00.12 | ఇక్కడ, మనము ఉపయోగిస్తున్నది
Ubuntu Linux 10.04 మరియు LibreOffice Suite వెర్షన్ 3.3.4. |
00.21 | ముందుగా, Sample-Impress.odp ప్రెజెంటేషన్ ను తెరవండి. |
00.26 | Slides పేన్ నుండి పొటన్షియల్ ఆల్టర్నేటివ్స్ thumbnail పై క్లిక్ చేయండి. |
00.32 | ఇప్పుడు ఈ స్లయిడ్ Main పేన్ పై ప్రదర్శించబడుతుంది. |
00.36 | మన presentation ను మరింత ఆకర్షణీయంగా చేయటానికి custom animation ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. |
00.43 | స్లయిడ్ లో ఎడమవైపు మొదటి టెక్స్ట్- బాక్స్నిఎంచుకోండి. |
00.47 | ఇది చేయటానికి, text పై క్లిక్ చేసి, ఆపై కనిపించే బోర్డర్ పై క్లిక్ చేయండి. |
00.54 | Impress విండో కుడి వైపు నుండి, Tasks పేన్ లో, Custom Animation పై క్లిక్ చేయండి. |
01.01 | Add పై క్లిక్ చేయండి. |
01.03 | Custom Animation డైలాగ్- బాక్స్ కనిపిస్తుంది. |
01.07 | Entrance టాబ్ తెరచిఉందని గమనించండి. |
01.10 | Entrance టాబ్, స్క్రీన్ పై ఉన్న అంశం కనిపించే విధానాన్ని నియంత్రిస్తుంది. |
01.15 | మనం ఈ సిరీస్ లో తర్వాత వచ్చే ట్యుటోరియల్స్ లో ఇతర tab ల గూర్చి నేర్చుకుంటాం. |
01.21 | Basic కింద, Diagonal Squares ను ఎంచుకోండి. |
01.25 | మీరు మీ యానిమేషన్ కనిపించే వేగాన్ని కూడా నియంత్రించవచ్చు. |
01.30 | Speed ఫీల్డ్ లో, డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి, Slow ను ఎంచుకుని OK క్లిక్ చేయండి. |
01.37 | Effect ఫీల్డ్ మీకు యానిమేషన్స్ ఎంపికలను అమర్చటానికి అనుమతిస్తుంది. |
01.43 | Effect ఫీల్డ్ కు దిగువన ఉన్న బాక్స్, ప్రెజెంటేషన్ కు జోడించిన యానిమేషన్స్ ను ప్రదర్శిస్తుంది. |
01.51 | మొదటి యానిమేషన్,యానిమేషన్ జాబితాలో చేర్చబడింది అని గమనించండి. |
01.56 | స్క్రోల్ చేసి Play పై క్లిక్ చేయండి |
02.00 | మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ ల preview, ఇప్పుడు మెయిన్ పేన్ పై ప్లే అవుతాయి. <<Pause>> |
02.08 | ఇప్పుడు, స్లయిడ్ లో రెండవ టెక్స్ట్ బాక్స్ ఎంచుకోండి. Custom Animation కింద Add క్లిక్ చేయండి. |
02.18 | కనిపిస్తున్నCustom Animation డైలాగ్ -బాక్స్ లో, Basic Animation కింద Wedge ను ఎంచుకోండి. |
02.25 | వేగాన్ని Medium వద్ద సెట్ చేసి OK క్లిక్ చేయండి. |
02.31 | ఈ యానిమేషన్, box కు జతచేయబడింది అని గమనించండి. |
02.36 | జాబితా లోని యానిమేషన్ లు మీరు ఏర్పాటు చేసిన క్రమంలో ఉన్నాయని గమనించండి. |
02.42 | రెండవ యానిమేషన్ ను ఎంచుకోండి. Play బటన్ పై క్లిక్ చేయండి. <<pause>> |
02.47 | మీరు preview కొరకు ఒకటి కంటే ఎక్కువ యానిమేషన్లను కూడా ఎంచుకోవచ్చు. |
02.51 | ఇది చేయటానికి, యానిమేషన్ ను ఎంచుకునే సమయంలో Shift కీ ని నొక్కి ఉంచండి. |
02.57 | Play క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న అన్ని యానిమేషన్ల ప్రివ్యూ చూపబడింది.<<pause>> |
03.05 | ఇప్పుడు మూడవ టెక్స్ట్- బాక్స్ ఎంచుకోండి. Layouts లో Add క్లిక్ చేయండి. |
03.10 | Entrance టాబ్ లో, Basic కింద, Diamond ఎంచుకోండి. |
03.17 | వేగాన్నిSlow వద్ద సెట్ చేసి. OK క్లిక్ చేయండి. |
03.22 | ప్రతీ యానిమేషన్ కొన్ని డీఫాల్ట్ లక్షణాలతో వస్తుంది |
03.26 | మీరు Change Order బటన్లను ఉపయోగించి యానిమేషన్ క్రమాన్ని మార్చవచ్చు. |
03.32 | ప్రతీ యానిమేషన్ కు ఉన్న డిఫాల్ట్ లక్షణాలు చూద్దాం మరియు వాటిని ఎలా సవరించాలో నేర్చుకుందాం. |
03.40 | జాబితాలో మొదటి యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. ఇది Diagonal Squares ఎంపిక. |
03.46 | Effects Options డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది. |
03.50 | అప్రమేయంగా, Effect టాబ్ ప్రదర్శించబడుతుంది. |
03.54 | Settings కింద, Direction డ్రాప్ -డౌన్ క్లిక్ చేయండి మరియు From right to top ను ఎంచుకోండి. |
04.01 | దీనిలో, యానిమేషన్ కుడి నుండి ప్రారంభమవటం మరియు కొనసాగేకొద్దీ పైకి కదలటం వంటి ఎఫెక్ట్ లను కలిగిఉంది. |
04.08 | డైలాగ్ -బాక్స్ ను మూసివేయటానికి OK క్లిక్ చేయండి. |
04.12 | మీరు జత చేసిన యానిమేషన్ ను చూచుటకు Play బటన్ పై క్లిక్ చేయండి. |
04.17 | మళ్ళీ ఈ యానిమేషన్ పై డబల్ క్లిక్ చేయండి. Effect Options డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది. |
04.24 | Timing టాబ్ క్లిక్ చేయండి. |
04.26 | Delay ఫీల్డ్ లో, ఆలస్యాన్ని 1.0 sec కు పెంచండి. ఇది యానిమేషన్ ప్రారంభం ఒక క్షణం తర్వాత జరిగేలా ప్రభావం చూపుతుంది. OK క్లిక్ చేయండి. |
04.39 | ఇప్పుడు, మొదటి యానిమేషన్ ఎంచుకోండి. |
04.43 | Play బటన్ క్లిక్ చేయండి. |
04.45 | మీరు యానిమేషన్ లో చేసిన మార్పు ప్రభావం మీరు పరిశీలించగలరు. |
04.50 | జాబితాలో రెండవ యానిమేషన్ పై డబుల్ క్లిక్ చేయండి. ఇది మనం సర్దుబాటు చేసిన Wedges ఎంపిక. |
04.54 | Effects Options డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
05.02 | Text Animation టాబ్ క్లిక్ చేయండి. |
05.05 | టెక్స్ట్ ను యానిమేట్ చేయడానికి Text Animation టాబ్ వివిధ రకాల ఎంపికలు అందిస్తుంది. |
05.12 | Group text ఫీల్డ్ లో, By1st level paragraphs ఎంచుకోండి. |
05.16 | ఈ ఎంపిక ప్రతి bullet point ను విడిగా ప్రదర్శిస్తుంది. |
05.20 | తరువాతి దానికి వెళ్ళే ముందు, మీరు ఒక అంశాన్ని పూర్తిగా చర్చించాలి అనుకుంటే మీరు ఈ ఎంపికను ఉపయోగించవచ్చు. |
05.28 | OK క్లిక్ చేయండి. |
05.29 | Play క్లిక్ చేయండి. |
05.32 | ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి, ఈ assignment ను చేయండి. |
05.36 | వివిధ యానిమేషన్లు సృష్టించండి, మరియు ప్రతి యానిమేషన్ కోసం Effect options ను చెక్ చేయండి. |
05.43 | ఇప్పుడు మనం చేసిన యానిమేషన్ ఎఫెక్ట్స్ ను చూడటం ఎలాగో నేర్చుకుందాం. |
05.48 | Slide Show బటన్ పై క్లిక్ చేయండి. తరువాత యానిమేషన్ ను చూడటానికి స్క్రీన్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి. |
05.59 | ప్రదర్శన లోని మార్పును విచ్చిన్నం చేయటానికి యానిమేషన్ ఒక మంచి మార్గం, మరియు ఉదహరించడానికి కష్టమైన కొన్ని విషయాలను వర్ణించటానికి సహాయం చేస్తుంది. |
06.09 | అయితే, జాగ్రత్తగా ఉండండి ఇది అతిగా చేయవద్దు! |
06.13 | అతిగా చేసే యానిమేషన్ వల్ల అది ప్రేక్షకుల దృష్టిని చర్చిస్తున్న విషయం నుండి దూరంగా తీసుకెళ్తుంది. |
06.20 | ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
06.23 | ఈ ట్యుటోరియల్ లో, మనం Custom animation, Effect options గురించి నేర్చుకున్నాం. |
06.30 | ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్. |
06.33 | మూడు bullet point ల తో ఒక టెక్స్ట్- బాక్స్ ను సృష్టించండి. |
06.36 | టెక్స్ట్ ను యానిమేట్ చేయండి, ఆలా చేయటం వలన టెక్స్ట్ లైన్ తర్వాత లైన్ గా కనిపిస్తుంది. |
06.41 | ఈ యానిమేషన్ని Play చేయండి. |
06.44 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. |
06.51 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
06.55 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:
స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
07.04 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:
contact at spoken hyphen tutorial dot org. |
07.11 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
07.22 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:
spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
07.33 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి |
07.38 | మాతో చేరినందుకు ధన్యవాదములు. |