KTurtle/C2/Introduction-to-KTurtle/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | అందరికి నమస్కారం, ఈ కే టర్టల్ ఇంట్రడక్షన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో, నేను కే టర్టల్ ప్రాధమిక అంశాలను పరిచయం చేస్తాను. |
00:14 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
00:17 | కే టర్టల్ విండో |
00:19 | ఎడిటర్ |
00:20 | కేన్వాస్ |
00:21 | మెనూ బార్ |
00:22 | టూల్ బార్. |
00:24 | అలాగే మనం, |
00:26 | టర్టల్ను తరలించటం. |
00:28 | రేఖలు గీయటం మరియు దిశలు మార్చటం. |
00:32 | ఒక త్రిభుజం గీయటం నేర్చుకుంటాం. |
00:34 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను,
ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04. కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా. |
00:47 | కే టర్టల్ అంటే ఏమిటి? |
00:49 | కే టర్టల్ అనేది ప్రాథమిక ప్రోగ్రామింగ్ నేర్చుకోవటానికి ఒక ఉచిత సాధనం. |
00:53 | ఇది కంప్యూటర్ సహాయంతో ఇంటరాక్టివ్ అభ్యాసం కోసం ఉపయోగపడుతుంది. |
00:59 | కే టర్టల్ ఈ లింక్ వద్ద డౌన్లోడ్ కోసం అందుబాటులో ఉంది, http://edu.kde.org/kturtle/ |
01:12 | 'కే టర్టల్'- ప్రోగ్రామింగ్ ని సులువు మరియు అందుబాటులో ఉండేటట్లు చేస్తుంది. |
01:18 | పిల్లలకు గణితం లో బేసిక్స్ బోధించడానికి సహాయం చేస్తుంది. |
01:22 | కమాండ్ లను ప్రోగ్రామర్ యొక్క మాట్లాడే భాష కు అనువదిస్తుంది. |
01:27 | కమాండ్ లను విజువల్స్ గా మార్చుతుంది. |
01.31 | మనము కే టర్టల్ ను సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ఉపయోగించి ఇన్స్టాల్ చేయవచ్చు. |
01:36 | సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ పై మరింత సమాచారం కోసం, |
01:40 | మా వెబ్ సైట్ లో ఉబుంటు లైనక్స్ ట్యుటోరియల్స్ ను సందర్శించండి http://spoken-tutorial.org |
01:46 | కే టర్టల్ యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం. |
01:50 | డాష్ హోమ్ పై క్లిక్ చేయండి. |
01:52 | సెర్చ్ బార్ లో కే టర్టల్ అని టైప్ చేసి, |
01:55 | కే టర్టల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. |
01:59 | ఒక విలక్షణ కే టర్టల్ విండో ఇలా కనిపిస్తుంది. |
02:02 | ఇది మెనూ బార్. |
02:04 | మెను బార్ లో, పైన, |
02:06 | మీరు మెనూ ఐటమ్స్ చూస్తారు- |
02:08 | అందులో ఫైల్, ఎడిట్, కేన్వాస్, రన్, టూల్స్, సెట్టింగ్స్ మరియు హెల్ప్ ఎంపికలు. |
02:17 | చాలావరకు ఉపయోగించే చర్యలను మీరు టూల్ బార్ లో కనుగొంటారు. |
02:23 | ఎడిటర్ ఎడమ వైపు ఉంది, దాని లో మీరు టర్టల్ స్క్రిప్ట్ కమాండ్స్ ని టైపు చేయవచ్చు. |
02:30 | ఎడిటర్ యొక్క ఫంక్షన్స్ లో చాలా వరకు ఫైల్ మరియు ఎడిట్ మెనూస్ లో ఉంటాయి. |
02:37 | ఎడిటర్ లో కోడ్ ను ఎంటర్ చేయటానికి చాల మార్గాలు ఉన్నాయి. |
02:42 | ఎగ్జామ్పుల్ ను ఉపయోగించటం సులభమైన మార్గం. |
02:46 | ఫైల్ మెనూ కి వెళ్లి > ఎగ్జామ్పుల్స్ ని ఎంచుకోండి. |
02:50 | ఇక్కడ, నేను ఫ్లవర్ ని ఎంచుకుంటున్నాను. |
02:53 | ఎంచుకోబడిన ఫ్లవర్ యొక్క కోడ్ ఎడిటర్ లో తెరుచుకుంటుంది. |
02:58 | కోడ్ ని రన్ చేయటానికి మెనూ బార్ లేదా టూల్ బార్ నుండి , రన్ బటన్ పై క్లిక్ చేయండి. |
03:04 | నేరుగా ఎడిటర్ లో మీ స్వంత కోడ్ టైప్ చేయడం మరొక మార్గం. |
03:10 | లేదా ఏదయినా కోడ్ ని ఎడిటర్ లో కాపీ /పేస్ట్ చేయండి. |
03:13 | ఉదాహరణకు ఇతర కే టర్టల్ ఫైల్స్ నుండి |
03:18 | క్యాన్వాస్ కుడి వైపు ఉంది, అక్కడే టర్టల్ మీ డ్రాయింగ్స్ వేస్తుంది. |
03:24 | టర్టల్ ఎడిటర్ నుండి అందిన కమాండ్స్ కు అనుగుణంగా కేన్వాస్ పైన డ్రా చేస్తుంది. |
03:32 | ఎడిటర్ లోని కమాండ్స్ ను టూల్ బార్ పైనరన్ ఎంపిక అమలుపరచడం ప్రారంభిస్తుంది. |
03:39 | ఇది ఎగ్జిక్యూషన్ వేగాల జాబితా ను అందిస్తుంది. |
03:43 | ఫుల్ స్పీడ్ (నో హైలైటింగ్ అండ్ ఇన్స్పెక్టర్), |
03:46 | ఫుల్ స్పీడ్, |
03:48 | స్లో, |
03:49 | స్లొవర్, |
03:51 | స్లోవెస్ట్ ఇంకా |
03:52 | స్టెప్ -బై -స్టెప్. |
03:55 | అబార్ట్ మరియు పాజ్ ఎంపిక లతో మీరు అమలును ఆపవచ్చు లేదా విరామం లో ఉంచవచ్చు. |
04:03 | ఇప్పుడు ఈ కోడ్ ని రన్ చేద్దాం. |
04:06 | కేన్వాస్ పైన టర్టల్ ఒక ఫ్లవర్ ని గీస్తుంది. |
04:11 | మీరు ఒక కొత్త కే టర్టల్ అప్లికేషన్ ను తెరిచినప్పుడు, |
04:15 | టర్టల్, డిఫాల్ట్ ద్వారా కేన్వాస్ మధ్యలో ఉంటుంది. |
04:19 | ఇప్పుడు టర్టల్ను కదిలిద్దాం. |
04:22 | టర్టల్ మూడు రకాల కదలికలను చేస్తుంది, |
04:25 | ఇది ముందుకు కదులుతుంది, ఇది వెనుకకు కదులుతుంది. |
04:29 | ఇది ఎడమ తిరగగలదు లేదా కుడి. |
04:32 | ఇది స్క్రీన్ పైన ఒక పోజిషన్ కు నేరుగా గెంత గలదు. |
04:38 | ప్రోగ్రాం టెక్స్ట్ లోకి నేను జూమ్ చేస్తున్నా, బహుశా అది కొద్దిగా అస్పష్టంగా ఉండవచ్చు. |
04:44 | ఒక సాధారణ ఉదాహరణను తెలుసుకుందాం. |
04:48 | మీ ఎడిటర్ లో, కింది కమాండ్స్ టైప్ చేయండి, |
04:52 | రిసెట్ |
04:55 | ఫార్వర్డ్ 100 |
04:58 | టర్న్ రైట్ 120 |
05:02 | ఫార్వర్డ్ 100 |
05:07 | టర్న్ రైట్ 120 |
05:11 | ఫార్వర్డ్ 100 |
05:15 | టర్న్ రైట్ 120 |
05:18 | మనం టైపు చేస్తున్న కొద్దీ కోడ్ యొక్క రంగు మారుతుందని గమనించండి. |
05:23 | ఈ ఫీచర్ ని హైలైటింగ్ అని పిలుస్తారు. |
05:26 | వివిధ రకాల కమాండ్స్ వివిధ రకాలుగా హైలైట్ చేయబడతాయి |
05:31 | దీని వలన బ్లాక్ యొక్క కోడ్ ని చదవటం సులభం చేస్తుంది. |
05:36 | ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను. |
05:38 | రిసెట్ కమాండ్ టర్టల్ ను డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది. |
05:42 | ఫార్వర్డ్ 100 టర్టల్ ను 100 పిక్సల్స్ ముందుకు వెళ్ళటానికి కమాండ్ చేస్తుంది. |
05:49 | టర్న్ రైట్ 120 టర్టల్ ను 120 డిగ్రీ లు అపసవ్య దిశలో తిరగమని కమాండ్ చేస్తుంది. |
05:56 | ఈ రెండు కమాండ్ లు, ఒక త్రిభుజం గీయడానికి మూడుసార్లు రిపీట్ చేయబడినవని గమనించండి. |
06:03 | ఇప్పుడు కోడ్ ని అమలు చేద్దాం. |
06:06 | నేను స్లో స్టెప్ ను ఎంచుకుంటున్నాను అలా చేయటం వల్ల ఎలాంటి కమాండ్స్ అమలు అవుతున్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు. |
06:16 | ఇక్కడ త్రిభుజం గీయబడింది. |
06:19 | ఇంకొక ఉదాహరణ చూద్దాం. అలాగే మీ కేన్వాస్ ని ఎలా అందంగా చెయ్యవచ్చో కూడా నేర్చుకుందాం. |
06:26 | రిపీట్ కమాండ్ ని ఉపయోగించి ఒక త్రిభుజాన్ని గీద్దాం. |
06:30 | నేను ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను. |
06:33 | క్లియర్ వ్యూ పొందటానికి ప్రోగ్రామ్ టెక్స్ట్ లోకి జూమ్ చేస్తాను. |
06:38 | క్రింద కమాండ్స్ ను మీ ఎడిటర్ లో టైప్ చేయండి, |
06:41 | రిసెట్ |
06:44 | కేన్వాస్ సైజ్ స్పేస్ 200, 200 |
06:51 | కేన్వాస్ కలర్ స్పేస్ 0, 255, 0 |
07:00 | పెన్ కలర్ స్పేస్ 0, 0, 255 |
07:08 | పెన్ విడ్త్ స్పేస్ 2 |
07:12 | రిపీట్ స్పేస్ 3 వితిన్ కర్లీ కర్లీ బ్రెసెస్ { |
07:19 | ఫార్వర్డ్ 100 |
07:23 | టర్న్ లెఫ్ట్ 120
} |
07:27 | ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను. |
07:30 | రిసెట్ కమాండ్ టర్టల్నుడిఫాల్ట్ పోజిషన్ కు సరి చేస్తుంది. |
07:34 | కేన్వాస్ సైజ్ 200, 200 కేన్వాస్ వెడల్పు మరియు ఎత్తు లను 200 పిక్సల్స్ కు సెట్ చేస్తుంది. |
07:42 | కేన్వాస్ కలర్ 0, 255, 0 కేన్వాస్ ను ఆకుపచ్చ గా చేస్తుంది. |
07:48 | 0, 255 ,0 ఒక RGB కాంబినేషన్ అక్కడ ఆకుపచ్చ విలువ మాత్రమే 255గా ఇంకా మిగిలినవన్నీ 0 గా సెట్ చేయబడతాయి. |
08:03 | ఇది కేన్వాస్ ని ఆకుపచ్చ రంగు లోకి మార్చుతుంది. |
08:07 | పెన్ కలర్ 0, 0, 255 పెన్ కలర్ ను నీలం గా సెట్ చేస్తుంది. |
08:14 | RGB కాంబినేషన్ వద్ద బ్లూ విలువ 255గా సెట్ చేయబడుతుంది. |
08:20 | పెన్ విడ్త్ 2 పెన్ యొక్క విడ్త్ ను 2 పిక్సల్స్ కు సెట్ చేస్తుంది. |
08:27 | రిపీట్ కమాండ్ని ఒక నంబర్ మరియు కర్లీ బ్రాకెట్స్ లో ఒక కమాండ్స్ జాబితా అనుసరిస్తుంది. |
08:33 | ఇది కర్లీ బ్రాకెట్స్ లోపలి కమాండ్స్ లను ఇచ్చిన సంఖ్య ప్రకారం రిపీట్ చేస్తుంది. |
08:39 | ఇక్కడ, కర్లీ బ్రాకెట్స్ లో ఉన్న కమాండ్స్ఫార్వర్డ్ 100 ఇంకా టర్న్ లెఫ్ట్ 120. |
08:47- | రిపీట్ కమాండ్ తర్వాత నంబర్ 3 వస్తుంది ఎందుకంటే ఒక త్రిభజం 3 సైడ్స్ కలిగి ఉంటుంది కనుక. |
08:54 | ఈ కమాండ్స్ అన్ని లూప్ లో 3 సార్లు రన్ అవుతాయి. |
08:59 | త్రిభజం 3 సైడ్స్ డ్రా చేయబడ్డాయి. |
09:02 | ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం. |
09:05 | నేను ప్రోగ్రామ్ ను అమలుచేయడానికి స్లో ఆప్షన్ ని ఎంచుకుంటున్నాను. |
09:09 | కేన్వాస్ కలర్ గ్రీన్ గా మారుతుంది ఇంకా టర్టల్ త్రిభుజాన్ని గీస్తుంది. |
09:20 | ఇప్పుడు ఫైల్ నుసేవ్ చేద్దాం. |
09:23 | ఫైల్ మెనూ నుండి >> సేవ్ యాజ్ ను ఎంచుకోండి. |
09:27 | సేవ్ యాజ్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది. |
09:30 | నేను ఫైల్ సేవ్ చేయటానికి డాక్యుమెంట్ ఫోల్డర్ ను ఎంచుకుంటున్నాను. |
09:34 | నేను ఫైల్ పేరు ను ట్రయాంగిల్ గా టైప్ చేసి సేవ్ బటన్ పై క్లిక్ చేస్తున్నాను. |
09:41 | టాప్ ప్యానెల్ లో ఫైల్ పేరు కనిపిస్తుంది. ఇంకా అన్ని టర్టల్ ఫైల్స్ లాగానే ఇది కూడా డాట్ టర్టల్ ఫైల్ గా సేవ్ చేయబడింది గమనించండి. |
09:53 | ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
09:57 | సారాంశం చూద్దాం. |
09:59 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి. |
10:02 | కే టర్టల్ యొక్క ఎడిటర్, కేన్వాస్, మెనూ బార్ మరియు టూల్ బార్ . |
10:07 | టర్టల్ను తరలించటం. |
10:09 | రేఖలు గీయటం మరియు దిశలు మార్చటం. |
10:13 | ఒక త్రిభుజం గీయటం |
10:15 | ఒక అసైన్మెంట్ గా, మీరు ఈ కమాండ్స్ - ఫార్వర్డ్, బ్యాక్ వార్డ్ , టర్న్ లెఫ్ట్ , టర్న్ రైట్ మరియు రిపీట్ లను ఉపయోగించి |
10:21 | ఒక చతురస్రాన్ని గీయండి. |
10:26 | బ్యాక్ గ్రౌండ్ కలర్, పెన్ విడ్త్ మరియు పెన్ కలర్ మీకు నచ్చినవి సెట్ చేసుకోండి. |
10:32 | RGB కాంబినేషన్ విలువలను మార్చండి. |
10:37 | ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి: |
10:40 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. |
10:44 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
10:48 | స్పోకెన్ ట్యుటోరియల్ టీం, |
10:50 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
10:53 | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
10:56 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి,
contact@spoken-tutorial.org |
11:03 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
11:08 | దీనికి, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. |
11:15 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: |
11:20 | స్క్రిప్ట్ IT for Change, Bangaluru ద్వారా అందించబడింది. |
11:24 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి, మాతో చేరినందుకు ధన్యవాదములు. |