Linux/C2/The-Linux-Environment/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 18:10, 27 March 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:00 | లైనక్స్ పర్యావరణం మరియు దానిని మార్పు చేసే విధానాల పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్లో చూపించిన ఉదాహరణలు ప్రయత్నించడానికి ఒక పనిచేస్తున్న లైనక్స్ సిస్టమ్, ప్రధానంగా ఉబంటు అవసరమౌతుంది. |
00:13 | లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రారంభించడం మీకు తెలుసని మరియు కమాండ్స్, ఫైల్ సిస్టమ్స్ మరియు షెల్ గురించి ప్రాధమిక అవగాహన కలిగి ఉన్నారని మేము భావిస్తున్నాము. |
00:22 | మీకు ఆసక్తి ఉంటే, లేదా ఈ విషయాలను మెరుగు పెట్టవలసిన అవసరం ఉంటే, మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్న మరొక స్పోకెన్ ట్యుటోరియల్ ఉపయోగించటానికి సంశయించకండి. |
00:32 | ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేయడానికి ఉబంటు 10.10 ఉపయోగించబడిందని గమనించండి. |
00:36 | లైనక్స్ కేస్ సెన్సిటివ్ మరియు ప్రత్యేకంగా తెలియచేయబడితే తప్ప ఈ ట్యుటోరియల్లో ఉపయోగించిన అన్ని కమాండ్లు లోయర్ కేసులో ఉన్నాయని కూడా గమనించండి. |
00:46 | ఆపరేటింగ్ సిస్టమ్ మీతో ఎలా ప్రవర్తిస్తుంది, మీ కమాండ్లకు ఎలా ప్రతిస్పందిస్తుంది, మీ చర్యలను ఎలా వ్యాఖ్యానిస్తుంది మొదలైనవాటిని లైనక్స్ పర్యావరణం నిర్ధారిస్తుంది. |
00:55 | షెల్ యొక్క సెట్టింగ్స్ మార్చడం ద్వారా లైనక్స్ను అత్యంత అనుగుణంగా మార్చుకోవచ్చు. |
00:58 | దీన్నంతా ఎలా చేయవచ్చో మనం అర్ధం చేసుకుందాం.సాధారణంగా షెల్ యొక్క ప్రవర్తన షెల్ వేరియబుల్స్ ద్వారా నిర్ధారించబడుతుంది. |
01:04 | షెల్ వేరియబుల్స్ ప్రధానంగా రెండు రకాలు. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మరియు లోకల్ వేరియబుల్స్ |
01:12 | పూర్తిగా యూజర్ యొక్క ఎన్విరాన్మెంట్లో లభ్యంకావడం వలన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కు ఆ పేరు పెట్టబడింది. |
01:19 | షెల్ రచనలను పనిచేయించే వాటివలే అవి షెల్చే ఉత్పత్తి చేయబడిన సబ్ షెల్స్లో కూడా ఇవి లభ్యమౌతాయి. |
01:24 | పేరు సూచిస్తున్నట్లుగా, లోకల్ వేరియబుల్స్ మరింత నియం త్రిత లేదా పరిమిత లభ్యతను కలిగి ఉన్నాయి. |
01:31 | అవి షెల్చే ఉత్పత్తి చేయబడిన సబ్ షెల్స్లో లభ్యం కావు. |
01:36 | అయితే ఈ ట్యుటోరియల్లో, మనం ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ గురించి మాట్లాడుకుంటాం, ముందుగా మనం ఈ షెల్ వేరియబుల్స్ యొక్క విలువను ఎలా చూడవచ్చో చూద్దాం. |
01:48 | ప్రస్తుత షెల్లో అందుబాటులో ఉన్న అన్ని వేరియబుల్స్ను చూడటానికి, మనం set కమాండ్ రన్ చేద్దాం. |
01:53 | టెర్మినల్ వద్ద set space vertical-bar more అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
02:00 | మనం ప్రస్తుత షెల్ వేరియబుల్స్ అన్నిటిని చూడవచ్చు, |
02:04 | ఉదాహరణకు: HOME ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ను చూసి దానికి ఇవ్వబడిన విలువను కూడా గమనించండి. |
02:15 | జాబితా మొత్తాన్ని చూడటానికి ఎంటర్ నొక్కండి మరియు బయటకు రావడానికి q నొక్కండి. |
02:21 | వేరియబుల్ జాబితా యొక్క మరింత సిస్టమేటిక్ మల్టీపేజ్ అవుట్పు ట్ కొరకు ఇక్కడ set నుండి అవుట్పుట్ పైప్లైన్ చేయబడింది. |
02:38 | కేవలం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ను చూడటానికి కమాండ్ env రన్ చేయండి. |
02:45 | టెర్మినల్ వద్ద env space vertical-bar more అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
02:52 | ఉదాహరణకు, slash bin slash bash విలువను కలిగిన SHELL వేరియబుల్ను గమనించండి. |
03:00 | మరలా, జాబితా నుండి బయటకు రావడానికి మీరు q నొక్కవచ్చు. |
03:07 | ఇప్పుడు మనం లైనక్స్లో మరింత ముఖ్యమైన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో కొన్నిటిని చర్చిద్దాం. |
03:11 | ఇక్కడ అన్ని ప్రదర్శనల కొరకు బాష్ షెల్ ఉపయోగించబోతున్నాం. |
03:15 | విభిన్న్ షెల్స్ కొద్దిగా భిన్నమైన మార్గాలలో మార్పుచేయబడ్డాయి. |
03:19 | వాస్తవంగా ఒక వేరియబుల్ దేనిని ఎలా భద్రపరుస్తుందో చూడటానికి మనం ఆ వేరియబుల్ యొక్క పేరుకు ముందు డాలర్ చిహ్నాన్ని ఉంచి ఇంకా దానితో పాటుగా echo కమాండ్ను ఉపయోగంచాలి. |
03:30 | ముందుగా చూడబోయే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ SHELL వేరియబుల్. |
03:35 | అది ప్రస్తుత షెల్ యొక్క పేరును భద్రపరుస్తుంది. |
03:37 | SHELL వేరియబుల్ యొక్క విలువను చూడటానికి, టెర్మినల్ వద్ద echo space dollar S-H-E-L-L ను క్యాపిటల్స్ లో టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:55 | ఇక్కడ slash bin slash bash అనేది మనం ప్రస్తుతం పనిచేస్తున్న షెల్. |
04:02 | తరువాతి వేరియబుల్ HOME. |
04:05 | మనం లైనక్స్లోకి ప్రవేశించినపుడు, అది సాధారణంగా మనల్ని యూజర్ పేరు మీద ఉన్న డైరక్టరీలో ఉంచుతుంది. |
04:11 | ఈ డైరక్టరీ హోమ్ డైరక్టరీగా పిలువబడుతుంది ఇదే ఖచ్చితంగా HOME వేరియబుల్లో కూడా లభ్యమవుతుంది. |
04:17 | దీని విలువను చూడటానికి, టెర్మినల్ వద్ద, echo space dollar H-O-M-E అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
04:29 | దాని తరువాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్ PATH. |
04:32 | ఏదైనా అమలు చేయదగిన కమాండ్ ను గుర్తించటానికి షెల్ వెతకాల్సిన డైరెక్టరీల యొక్క అబ్సల్యూట్ పాత్ను PATH వేరియబుల్ కలిగి ఉంటుంది. |
04:40 | పాత్ వేరియబుల్ యొక్క విలువను చూద్దాం. |
04:43 | మరలా, టెర్మినల్ వద్ద echo space dollar P-A-T-H అని కాపిటల్స్లో టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:51 | నాకంప్యూటర్లో అది slash user slash local slash sbin slash user slash local slash bin slash user slash sbin slash user slash bin మొదలైన డైరక్టరీలను చూపుతుంది. |
05:04 | ఇది ఒక సిస్టమ్ నుండి మరొకదానికి కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు. |
05:07 | నిజానికి ఇది ఒక అమలు చేయదగిన కమాండ్ను కనుగొనడానికి షెల్ వెతికే : (కొలన్) డీలిమిటర్చే వేరుచేయబడిన డైరక్టరీల జాబితా. |
05:18 | మనం మన స్వంత డైరక్టరీని జాబితాకు జతచేయడం ద్వారా షెల్లో మన డైరెక్టరీని శోధించవచ్చు. |
05:25 | మనం మన స్వంత డైరక్టరీని టెర్మినల్ వద్ద కలపడానికి. |
05:29 | కాపిటల్ లో P-A-T-H ఈక్వల్-టు డాలర్ మరియు కాపిటల్లో P-A-T-H కోలన్ స్లాష్ హోమ్ స్లాష్ మీ స్వంత డైరక్టరీ పేరు టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:54 | ఇప్పుడు మనం PATH విలువను echo చేసినట్లయితే, |
06:04 | మనకు కలిపిన డైరక్టరీ కూడా PATH వేరియబుల్లో భాగంగా ఉంటుంది. |
06:10 | ఇప్పుడు డైరెక్టరీ ఇక్కడ ఉంది చూడండి. |
06:16 | మరొక ఆసక్తికరమైన వేరియబుల్ LOGNAME. |
06:20 | అది ప్రస్తుత క్రియాత్మక యూజర్ యొక్క యూజర్ పేరును భద్రపరుస్తుంది. |
06:24 | విలువను చూడటానికి echo space dollar LOGNAME అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:35 | మనం టెర్మినల్ను తెరచినపుడు డాలర్ గుర్తు కనిపిస్తుంది, ఇదే మనం అన్ని కమాండ్లను ఎంటర్ చేసే ప్రాంప్ట్. |
06:42 | ఇది ఎన్విరాన్మెంట్ వేరియబుల్ PS1 ప్రాతినిధ్యం వహించే ప్రాధమిక ప్రాంప్ట్ వరుస. |
06:47 | ఇక్కడ ద్వితీయ ప్రాంప్ట్ వరుస కూడా ఉంది. |
06:50 | మన కమాండ్ పొడవుగా ఉండి ఒక వరుస కంటే ఎక్కువ విస్తరిస్తే, రెండవ వరుస నుండి ప్రాంప్ట్ వద్ద మనం గ్రేటర్ దాన్ > గుర్తు చూడవచ్చు. |
07:00 | ఇది ఎన్విరాన్మెంట్ వేరియబుల్ PS2 ప్రాతినిధ్యం వహించే ద్వితీయ ప్రాంప్ట్ వరుస. |
07:05 | ద్వితీయ కమాండ్ ప్రాంప్ట్ విలువను చూడటానికి, టెర్మినల్ వద్ద, echo స్పేస్ డాలర్ PS2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
07:20 | ప్రాంప్ట్ వద్ద at the rate <@> చూపటానికి మన ప్రాధమిక ప్రాంప్ట్ వరుసను మార్చుకోవచ్చు. |
07:28 | దీని కొరకు PS1 equal-to కోట్స్ లోపల at the rate@ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
07:41 | ఇప్పుడు ప్రాంప్ట్ వద్ద మనం డాలర్ గుర్తుకు బదులుగా ఎట్ ద రేట్ గుర్తును చూడవచ్చు. |
07:50 | మనం మరింత ఆసక్తికరమైన పనిని చేయవచ్చు. ప్రాంప్ట్ వద్ద మన యూజర్ పేరును ప్రదర్శించుకోవచ్చు. |
07:56 | PS1క్యాపిటల్ లెటర్స్ లో equal-to కోట్స్ లోపల dollar LOGNAME టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
08:12 | ఇప్పుడు నా యూజర్నేమ్ నా ప్రాంప్ట్ ఒకటే. |
08:16 | వెనుకకు వెళ్లడానికి PS1 equal-to dollar కోట్స్ లోపల టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
08:28 | చాలా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కు మనం విలువలను కేటాయించాం. |
08:32 | అయితే, ఈ మార్పులన్నీ ప్రస్తుత సెషన్ వరకే విస్తారీస్తయని గుర్తుంచుకోండి. |
08:37 | ఉదాహరణకు మనం ఇప్పుడే మన డైరక్టరీని PATH వేరియబుల్కి జోడించాము. |
08:40 | మనం టెర్మినల్ను మూసివేసి మరలా తెరిచి లేదా పూర్తిగా కొత్త టెర్మినల్ను తెరిచి మరియు పాత్ వేరియబుల్ను దాని విలువను echo చేయడం ద్వారా పరిశీలిస్తే, |
09:00 | మన మార్పులు ఇప్పుడు ఉనికిలో లేవని చూసి మనం ఆశ్చర్యపోతాం. |
09:05 | మనం ఈ మార్పలను శాశ్వతం చేసే మార్గం ముందు రాబోయే ట్యుటోరియల్స్లో నేర్చుకుందాం. |
09:13 | మనం ఇటీవల కాలంలో అమలుపరచిన కమాండ్లను తిరిగి అమలుపరచాలని తరచుగా అనుకోవచ్చు. మనమేం చేస్తాం? మనం మొత్తం కమాండ్ను తిరిగి టైప్ చేయాలా? |
09:22 | అవసరం లేదు, దానికి అనేక పరిష్కారాలు ఉన్నాయి. |
09:26 | ముందు, సాధారణంగా మీరు మీ కీబోర్డ్ లోని అప్ కీని నొక్కితే అది మీరు టైప్ చేసిన చివరి కమాండ్ను చూపుతుంది. |
09:33 | నొక్కి పట్టి ఉంచితే అది ఇదివరకు వాడిన అన్నికమాండ్లను స్క్రోల్ చేస్తుంది. |
09:37 | వెనుకుకు వెళ్లడానికి డౌన్ కీ నొక్కండి. |
09:42 | అయితే మీరు చాలా కమాండ్లను చూడాలంటే ఇది కొంచెం అస్తవ్యస్తంగా మరియు విసుగ్గా ఉంటుంది.
హిస్టరీ కమాండ్ను ఉపయోగించడం మెరుగైన మార్గం. |
09:52 | ప్రాంప్ట్ వద్ద history అని టైప్ చేయండి. |
09:58 | ఎంటర్ నొక్కండి, గతంలో అమలుపరచిన కమాండ్ల జాబితాను చూడండి. |
10:04 | మీరు చూడదలచుకున్న పెద్ద జాబితాకు బదులుగా కేవలం చివరి పది మాత్రమే ఉంటాయి. |
10:08 | history space 10 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
10:20 | ఈ జాబితాలో, గతంలో అమలుపరచిన ప్రతి కమాండ్కు ఒక సంఖ్య కేటాయించబడిందని గమనించండి. |
10:27 | ఒక ప్రత్యేక కమాండ్ను తిరిగి ఇవ్వాలంటే. |
10:32 | ఆశ్చర్యార్ధకాన్ని, ఆ తరువాత కమాండ్ యొక్క సంఖ్యను టైప్ చేయండి, ఉదాహరణకి నా విషయంలో 442, echo space dollar pathను అమలుపరుస్తుంది. |
10:51 | మీరు మరలా చివరి కమాండ్ను అమలుచేయాలంటే, ఆశ్చర్యార్ధకాన్ని రెండుసార్లు టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
11:03 | మనం చూడబోయే తరువాతి విషయం టిల్డ సబ్స్టిట్యూషన్ గా పిలువబడుతుంది. tilda(~) హోమ్ డైరక్టరీకి షార్ట్హాండ్ |
11:12 | మీకు మీ స్వంత హోమ్ డైరక్టరీలో testtree అనే పేరుతో డైరక్టరీ ఉందనుకోండి. cd space 'tilde' slash testtree అని టైప్ చేయడం ద్వారా దానిని మీరు తరలించవచ్చు. |
11:25 | cd tilde minus లేదా కేవలం cd minus కమాండ్ ఇవ్వడం ద్వారా ప్రస్తుతం పనిచేస్తున్న డైరక్టరీ మరియు చివరగా ఉపయోగించిన డైరక్టరీల మధ్య మారుతూ పనిచేయవచ్చు. |
11:35 | ప్రస్తుతం మనం testtree డైరక్టరీలో ఉన్నాం, మనం చివరగా చూసిన డైరక్టరీ హోమ్ డైరక్టరీ. |
11:41 | అంటే ఇప్పుడు మనంcd space minus అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే హోమ్ డైరక్టరీకి వెళతాం. |
11:47 | దానిని మరలా రన్ చేయండి మరియు అది మనల్నితిరిగి testtree డైరక్టరీకి తీసుకు వెళుతుంది. |
11:55 | మనం చూడబోయే చివరి మరియు అతి ముఖ్యమైన కమాండ్ alias కమాండ్. |
11:59 | అనేకసార్లు రన్ చేయాల్సిన అవసరం ఉన్న ఒక పెద్ద కమాండ్ మీ వద్ద ఉండవచ్చు. |
12:04 | ఇలాంటి సందర్భంలో మనం దానికి ఒక చిన్న మారుపేరు పేరుని ఇవ్వవచ్చు మరియు దానిని invoke చేయటానికి అసలు పేరు బదులుగా మారుపేరు ఉపయోగించవచ్చును. |
12:11 | మీరు మ్యూజిక్ కోసం తరచు చూసే ఒక పెద్ద డైరక్టరీ మీకు ఉందనుకొందాం, మీరు ఈ విధంగా దానికి alias సృష్టించవచ్చు. |
12:20 | alias space cdMusic equal-to డబల్ కోట్స్ లో cd space slash home slash arc slash files slash entertainment slash music అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
12:47 | మీరు ఈ డైరక్టరీకి వెళ్లాలనుకున్న ప్రతిసారీ cdMusic అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే సరిపోతుంది. |
12:55 | చూడండి,ఇప్పుడు మనం మ్యూజిక్ డైరక్టరీలో ఉన్నాం. |
12:58 | ఇప్పుడు మీరు ప్రాంప్ట్ వద్ద cd space minus అని టైప్ చేసి ముందు పనిచేస్తున్న డైరక్టరీకి వెళ్లవచ్చు. |
13:08 | aliasను unset చేయటానికి unalias space cdMusic అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
13:20 | ఇప్పుడు మరలా మీరు టెర్మినల్ నుండి cdMusic ను తొలగిస్తే , కమాండ్ కనిపించలేదనే ఎర్రర్ వస్తుంది. |
13:30 | మనం ప్రస్తుతం పనిచేస్తున్న డైరక్టరీలో టెస్ట్ 1 మరియు టెస్ట్2 అనే రెండు ఫైల్స్ ఉన్నాయని అనుకుందాం. |
13:38 | మరియు ఒకవేళ మనం rm test1ను తొలగిస్తే, టెస్ట్ 1 నిశ్శబ్దంగా తొలగించబడుతుంది. |
13:45 | Rm కమాండ్ యొక్క hyphen i ఎంపిక తొలగింపు ప్రక్రియను పరస్పర ప్రభావశీలంగా చేస్తుందని మీకు తెలుసు. |
13:52 | కనుక మనం alias rm equal-to, డబల్ కోట్స్ లో rm space hyphen iవంటి aliasను సెట్ చేయవచ్చు. |
14:03 | ఇప్పుడు మనం rmను రన్ చేస్తే, వాస్తవానికి rm hyphen i రన్ అవుతుంది. |
14:13 | టెస్ట్ 1 నిశ్శబ్దంగా తొలగించబడగా, టెస్ట్ 2ను తొలగించే ముందు సిస్టమ్ అడగటాన్ని మనం చూసాం. |
14:20 | ఈ ట్యుటోరియల్లో, మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, history మరియు aliasing గురించి నేర్చుకున్నారు. |
14:25 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
14:28 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
14:36 | దీనిపై మరింత సమాచారం మా వెబ్సైట్ నుండి లభిస్తుంది. |
14:39 | ఈ ట్యుటోరియల్ ను తెలుగులో కి అనువదించింది శ్రీహర్ష. |
14:42 | నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు . |