Linux/C2/Basic-Commands/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 16:24, 27 March 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
---|---|
0:00 | ప్రియమైన మిత్రులారా, Linux Operating Systemపై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
0:05 | ఈ ట్యుటోరియల్‌లో, మనం కొన్ని బేసిక్ కమాండ్స్ అధ్యయనం చేస్తాం. |
0:10 | నేను ఉబంటు 10.04 ఉపయోగిస్తున్నాను. |
0:12 | మీకు Linux operating system ప్రారంభించడం తెలిసి ఉంటుందని మేము భావిస్తున్నాము. |
0:17 | మీకు ఆసక్తి ఉంటే, దానిని http://spoken-tutorial.org.లోగల మరొక స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా పొందవచ్చు. |
0:26 | ఈ ట్యుటోరియల్‌లో, కమాండ్స్ మరియు కమాండ్ ఇంటర్ప్రెటర్ అంటే ఏమిటో మనం తెలుసుకుంటాం. |
0:33 | ఆ తరువాత మనం man commandను ఉపయోగించి Linuxలో ఏ విధంగా సహాయం పొందాలో తెలుసుకుంటాం. |
0:39 | ఇప్పుడు మన మొదటి ప్రశ్న,కమాండ్స్ అంటే ఏమిటి?. |
0:43 | సరళమైన మాటలలో Linux commandsను టైప్ చేసినపుడు కొన్ని చర్యలు జరగడానికి కారణమయ్యే పదములుగా చెప్పవచ్చు. |
0:52 | Linux కమాండ్స్ అరుదుగా మాత్రమే నాలుగు అక్షరాల కంటే ఎక్కువ నిడివి కలిగి ఉంటాయి. ఉదా. ls, who, ps మొదలైనవి. |
0:59 | ఈ కమాండ్స్ lower caseలో మరియు case sensitiveగా ఉంటాయి. మనం ఒక ఉదాహరణను చూద్దాం. |
1:05 | అప్లికేషన్స్ మెనూకి వెళ్లండి. |
1:08 | యాక్ససరీస్ని సెలక్ట్ చేసి లభ్యమైన ఆప్షన్స్ నుండి టెర్మినల్‌పై క్లిక్ చేయండి |
1:14 | లేదా ఒక టెర్మినల్ విండో తెరవడానికి మీ కీబోర్డ్‌పై ctrl alt t నొక్కండి. |
1:20 | ఇప్పుడు మనం ఒక prompt ($) మరియు దాని ప్రక్కన కర్సర్ బ్లింక్ కావడాన్ని గమనించవచ్చు. ఇక్కడే మనం కమాండ్ టైప్ చేయాలి. |
1:29 | who అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
1:34 | లాగ్ఇన్ అయి ఉన్న యూజర్ల పేర్లను మనం చూడవచ్చు. వాస్తవానికి, మనం సిస్టమ్‌లోకి లాగ్ఇన్ అయిన వారిని చూపే who కమాండ్‌ను ఎగ్జిక్యూట్ చేశాం. |
1:47 | కొన్ని అక్షరాలను మాత్రమే కలిగి ఉన్న ఈ కమాండ్లను చర్యలుగా మారుస్తున్నది ఏది? |
1:54 | ఈ పని చేస్తున్నది Command Interpreter, దీనిని షెల్ అని కూడా పిలుస్తారు. |
1:59 | మనకు మరియు Linux systemకు మధ్య interfaceగా మనము shellను నిర్వచించవచ్చు. |
2:08 | ఇది యూజర్‌కి operating system ఎగ్జిక్యూట్ చేయడానికి కమాండ్లను ఇవ్వడానికి అనుమతిస్తుంది. |
2:13 | Linuxపై అనేక shells ఇన్స్టాల్ చేయడానికి సాధ్యత ఉండి, విభిన్న యూజర్లు తాము ఇష్టపడేదానిని తీసుకోవడం సాధ్యమవుతుంది. |
2:22 | Linuxపై, ఎప్పుడూ ఇన్స్టాల్ చేయబడే ప్రామాణిక shell /bin/sh bashగా పిలువబడే GNU suite of tools నుండి తీసుకున్న GNU Bourne-Again Shell. |
2:35 | ఈ ట్యుటోరియల్‌లో మనం తెలుసుకోబోయే కమాండ్స్ ఒకే తరగతికి చెందినవి మరియు కొద్దిపాటి తేడాలతో అధికభాగం Linux shellsపై run అవుతాయి. |
2:44 | మనం ఈ ట్యుటోరియల్‌లో వివరణ కొరకు shellగా bashను ఉపయోగించనున్నాము. |
2:51 | Bash అత్యంత ప్రసిద్ధి చెందిన shell మరియు దాదాపు అన్ని UNIXలకు పోర్టబుల్‌గా ఉండటం దీనికి కారణం. |
2:58 | ఇతర shellsలో ప్రారంభ Unix shellఅయిన Bourne shell, C Shell మరియు Korn shell ఉన్నాయి. |
3:08 | మనం ఏ shell ఉపయోగిస్తున్నామో చూడటానికి |
3:11 | terminal కు వెళ్లి కమాండ్ echo space dollar capital SHELL ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
3:27 | సాధారణంగా output /bin/bash గా ఉండి మనకు bash shellను ఇస్తుంది. |
3:34 | మనం విభిన్నమైన shellsను అనేక మార్గాల ద్వారా activate చేయవచ్చు. వాటిని మనం అడ్వాన్స్డ్ ట్యుటోరియల్‌లో తెలుసుకుందాం. |
3:42 | వాస్తవానికి కమాండ్స్ అనేవి ప్రోగ్రాములను కలిగియున్న ఫైళ్ళు, ఇవి ఎక్కువగా Cలో రాయబడి ఉంటాయి. |
3:47 | ఈ ఫైళ్ళు directoriesలో ఉంటాయి. కమాండ్ ఎక్కడ స్టోర్ చేయబడిందో తెలుసుకోవడానికి, మనం type కమాండ్‌ను ఉపయోగించవచ్చు. |
3:55 | కమాండ్ prompt వద్ద type అని వ్రాసి space ఇచ్చి ps అని వ్రాసి ఎంటర్ నొక్కండి. |
4:03 | నిజానికి ps అనేది /bin directoryలో స్టోర్ చేయబడిన ఒక ఫైల్‌గా ఇది చూపుతుంది. |
4:09 | కమాండ్ promptలో మనం ఒక కమాండ్‌ను ఇచ్చినపుడు, shell, డైరక్టరీల జాబితాలో ఆ కమాండ్ పేరుకు సరిపోయే ఫైల్ కొరకు వెదకుతుంది. |
4:18 | అది దొరికితే, ఆ ఫైల్‌కి సంబంధించిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేనట్లయితే, command not found అనే ఎర్రర్ కనిపిస్తుంది. |
4:27 | వెదకిన డైరక్టరీల జాబితా PATH variable ద్వారా చూపబడుతుంది, మనం దీనిని తరువాత చూద్దాం. |
4:34 | ప్రస్తుతం, మనం ఈ జాబితాను చూడాలనుకుంటే, కమాండ్ echo space dollar PATH అని |
4:44 | capitalలో టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
4:52 | కమాండ్ల గురించి మాట్లాడుతున్నపుడు, మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. |
4:57 | Linux కమాండ్లు రెండు రకాలు: ఎక్స్టర్నల్ కమాండ్లు మరియు ఇంటర్నల్ కమాండ్లు. |
5:02 | ఎక్స్టర్నల్ కమాండ్లు ప్రత్యేకమైన files/programs గా ఉనికిలో ఉంటాయి. |
5:07 | Linuxలో అధికభాగం కమాండ్లు ఈ తరహాకు చెందినవి. కానీ కొన్నికమాండ్ల అమలు shell లోపలే రాయబడి ఉంటుంది మరియు ఇవి ప్రత్యేక ఫైళ్లుగా ఉనికిలో ఉండవు. |
5:18 | ఇవి ఇంటర్నల్ కమాండ్లు. |
5:20 | తరువాత మనం చూడబోయే echo command, నిజానికి ఒక ఇంటర్నల్ కమాండ్. |
5:25 | టెర్మినల్‌కు వెళ్లి కమాండ్ వద్ద టైప్ చేయండి, |
5:33 | (కమాండ్ prompt వద్ద) type అని వ్రాసి space ఇచ్చి echo అని వ్రాసి ఎంటర్ నొక్కండి. |
5:40 | Outputలో echo ఒక shell bulletinగా చూపబడుతుంది. |
5:43 | ఒక ఫైల్ పేరు ఇవ్వడానికి బదులుగా అది echo command యొక్క అమలు shellకు ఇంటర్నల్ అని చూపుతుంది. అందువలన అది ఇంటర్నల్ కమాండ్ అని పిలువబడుతుంది. |
5:56 | మనం అర్ధం చేసుకోవలసిన మరొక ముఖ్యవిషయం కమాండ్ల యొక్క నిర్మాణం. |
6:01 | కమాండ్లు ఒక పదం లేదా అనేక పదాలను కలిగి, ఖాళీ ప్రదేశాలచే వేరుచేయబడతాయి. |
6:08 | రెండవ సందర్భంలో మొదటి పదం కమాండ్ యొక్క అసలైన పేరుగా ఉండగా ఇతర పదాలు ఆర్గ్యుమెంట్స్(సంగ్రహాలు)గా ఉంటాయి. |
6:16 | ఆర్గ్యుమెంట్స్ అనేవి ఆప్షన్లు లేదా ఎక్స్ప్రెషన్లు లేదా ఫైళ్ల పేర్లుగా ఉండవచ్చు. |
6:20 | ఇచ్చిన ఆప్షన్‌పై ఆధారపడి ఒక కమాండ్ విభిన్న కార్యకలాపాలు నెరవేర్చగలదు. |
6:26 | సాధారణంగా వాటికి ముందుగా ఒకటి లేదా రెండు మైనస్ గుర్తులు (-) ఉండి, షార్ట్ మరియు లాంగ్ ఆప్షన్లుగా క్రమంలో పిలువబడతాయి. |
6:35 | టెర్మినల్ విండోకు వెళ్లి కమాండ్లను టైప్ చేసి వాటి అవుట్‌పుట్‌లను చూడండి. |
6:40 | టెర్మినల్ విండోను క్లియర్ చేయడానికి clear అని టైప్ చేయండి. |
6:44 | ls అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
6:49 | మరలా clear అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
6:55 | ls space minus a టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
7:04 | టెర్మినల్ విండోను క్లియర్ చేయడానికి clear అని టైప్ చేయండి. |
7:11 | ఇప్పుడు ls space minus minus all అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
7:19 | టర్మినల్‌ను క్లియర్ చేయడానికి clear అని టైప్ చేయండి. |
7:23 | ఇప్పుడు ls space minus d అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
7:32 | ఈ సమయంలో ఆప్షన్లు మారడం వలన కమాండ్ల ప్రవర్తనలో మార్పును తెలుసుకుంటే సరిపోతుంది. |
7:40 | Linuxలో మనకు పెద్ద సంఖ్యలో కమాండ్లు ఉన్నాయి, |
7:45 | వీటిలో ప్రతి ఒక్కటీ విభిన్నమైన ఆప్షన్లను కలిగి ఉంది. |
7:48 | కమాండ్లను ఏ విధంగా జతపరచవచ్చో మనం తరువాత చూస్తాం. ఇదంతా మనం ఎలా గర్తుపెట్టుకోగలం? |
7:55 | నిజానికి మనం ఆ విధంగా చేయనక్కరలేదు. Linuxలో లభ్యమవుతున్న అద్భుతమైన ఆన్లైన్ హెల్ప్ సౌకర్యం దీనికి కారణం. |
8:01 | Man కమాండ్ సిస్టంలో అందుబాటులో ఉన్న దాదాపు ప్రతి కమాండ్ గురించిdocumentationను అందిస్తుంది. |
8:08 | ఉదాహరణకు, ls కమాండ్ గరించి తెలుసుకోవడానికి, మీరు చేయవలసింది, టెర్మినల్‌కు వెళ్లి |
8:16 | ls ఆర్గ్యుమెంట్‌తో man కమాండ్‌ను వ్రాయడం అంటే man అని వ్రాసి space ఇచ్చి ls అని వ్రాసి చేసి ఎంటర్ నొక్కడం |
8:30 | q నొక్కి బయటకు రండి. |
8:35 | Man అనేది సిస్టమ్ యొక్క మాన్యువల్ పేజర్. సాధారణంగా manకు ఇచ్చే ప్రతి ఆర్గ్యుమెంట్ ఒక ప్రోగ్రాం, యుటిలిటీ లేదా ఫంక్షన్ యొక్క పేరుగా ఉంటుంది. |
8:43 | అప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్‌కి సంబంధించిన ప్రతి మాన్యువల్ పేజ్ కనుగొనబడి, ప్రదర్శించబడుతుంది. |
8:49 | ఒక సెక్షన్, ఉన్నట్లయితే, అది manను మాన్యువల్ యొక్క ఆ విభాగానికి నిర్దేశిస్తుంది. |
8:55 | డిఫాల్ట్లో ఇది ముందుగా నిర్వచించబడిన క్రమాన్ని అనుసరిస్తూ, కనుగొన్న మొదటి పేజీని ప్రదర్శించడానికి అందుబాటులోని, పేజి అనేక విభాగాలలో ఉన్నప్పటికీ, అన్ని విభాగాలను వెతుకుతుంది. |
9:07 | Man కమాండ్ గురించి మరింత తెలుసుకోనడానికి మీరు మరలా Man కమాండ్‌నే ఉపయోగించవచ్చు. |
9:14 | టెర్మినల్‌కు వెళ్లి man space man అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
9:23 | దాని నుండి బయటకు రావడానికి q నొక్కండి. |
9:26 | man కమాండ్‌కు అనేక ఆప్షన్స్ ఉన్నాయి. |
9:30 | ఎక్కువగా ఉపయోగపడే వాటిని నేను మీకు తెలుపుతాను. కొన్ని సందర్భాలలో మనం ఏమి చేయాలనుకుంటున్నామో మనకు తెలుసు కానీ ఖచ్చితమైన కమాండ్ తెలియదు. అప్పుడు మనమేం చేయగలము? |
9:41 | man –k ఆప్షన్ ను అందిస్తుంది, ఇది ఒక ముఖ్యమైన పదాన్ని తీసుకొని దానికి బదులుగా కమాండ్ల జాబితాను మరియు వాటి సంక్షిప్త ప్రయోజనాన్ని అందిస్తుంది. |
9:50 | ఉదాహరణకు, ఒక డైరక్టరీని సృష్టించడానికి, మీకు ఖచ్చితమైన కమాండ్ తెలియకపోవచ్చు, |
9:56 | అందువలన మనం command promptకు వెళ్లి man అని వ్రాసి space ఇచ్చి minus k అని వ్రాసి space ఇచ్చి directories అని వ్రాసి ఎంటర్ నొక్కుతాం. |
10:12 | మనకు వాస్తవంగా ఏది అవసరమో తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఈ కమాండ్లలో ప్రతి దానినీ వెదకవచ్చు. |
10:17 | ఇదే ఫలితాన్ని apropos కమాండ్‌ను ఉపయోగించి కూడా పొందవచ్చు. |
10:21 | command prompt వద్ద apropos space directories అని టైప్ చేసి అవుట్‌పుట్ చూడటానికి ఎంటర్ నొక్కండి. |
10:36 | కొన్ని సార్లు మనకు మరీ ఎక్కువ వివరాల అవసరం ఉండదు. ఒక కమాండ్ ఏమి చేయగలదో తెలుసుకుంటే సరిపోతుంది. |
10:40 | అటువంటి సందర్భంలో మనం whatis కమాండ్ లోదా man –f ఉపయోగిండవచ్చు. ఇవి రెండూ ఒక లైనులో కమాండ్‌ను గురించి వివరిస్తాయి. |
10:52 | టెర్మినల్ విండోను క్లియర్ చేయడానికి టెర్మినల్‌కు వెళ్లి clear అని టైప్ చేయండి |
10:58 | ఇప్పుడు whatis space ls అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
11:06 | కొన్ని కమాండ్లకు అనేక ఆప్షన్లు ఉంటాయి. ఒక కమాండ్‌కు ఉండే విభిన్న ఆప్షన్ల జాబితాను పొందాలని మనం కోరుకోవచ్చు. |
11:13 | అప్పుడు మనం minus help ఆప్షన్ ఉపయోగిస్తాం. |
11:18 | command promptకు వెళ్లి ls space minus minus help అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి |
11:29 | మీరు మాన్యువల్ పేజిలోని అన్ని ఆప్షన్లను చూడటానికి వీలుగా నేను దీనిని చుట్టివేస్తాను. |
11:45 | ఇది లైనక్స్ స్పోకెన్ ట్యుటోరియల్‌లో భాగం. స్పోకెన్ ట్యుటోరియల్స్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
11:56 | దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో లభ్యమవుతుంది. |
12:00 | ఈ రచనకు సహాయపడింది-పి.వి.శైలజ ధన్యవాదములు మరియు శుభం. |