Digital-Divide/D0/First-Aid-on-Fever/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 14:06, 27 March 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
00:05 | మీనా అనే ఒక ఊరి బాలిక బడి నుంచి చలితో వణుకుతూ నీరసంగా ఇంటికి తిరిగి వచ్చింది. |
00:13 | బాలిక తలనొప్పి మరియు ఒంటి నొప్పులు కూడా ఉన్నవని ఫిర్యాదు చేసింది. |
00:18 | బాలిక వద్దకు ఆందోళనతో వచ్చిన తల్లి, ఉష్ణోగ్రత ఎక్కువగా వుండడం గమనించింది. |
00:25 | డిజిటల్ డివైడ్కు వారధి కట్టే స్పోకెన్ ట్యుటోరియల్కి స్వాగతం. |
00:30 | ఇక్కడ మనం జ్వరం యొక్క లక్షణాలు, ముందు జాగ్రత్తలు మరియు వైద్యుడిని సంప్రదించే విషయాల గురించి చర్చిద్దాం. |
00:37 | ఏవ్యక్తిదైన ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత, అనగా 96.8-100.4ºF కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే దానిని జ్వరంగా పరిగణించవచ్చు. |
00:51 | ఇప్పుడు జ్వరం యొక్క లక్షణాలను చూద్దాం: |
00:54 | ఉష్ణోగ్రతలో పెరుగుదల |
00:57 | నొప్పులు మరియు బాధలు |
00:59 | వణుకుట మరియు చలి |
01:02 | తీవ్రమైన తలనొప్పి మరియు |
01:04 | గొంతునొప్పి. |
01:06 | బాలిక వణుకుట గమనించిన తల్లి, వెచ్చగా ఉంచడానికి బిడ్డను దుప్పటితో తో చుట్టినది. |
01:14 | ఒకవేళ జ్వరం వచ్చినట్లయితే ఏమి చేయాలో మరియు ఏమి మానాలో తనిఖీ చేద్దాం. |
01:20 | రోగిని గోరు వెచ్చని నీటితో తుడవండి. |
01:24 | రోగికి చాల ఎక్కువగా నీళ్ళు తాగించాలి. |
01:28 | ఆ వ్యక్తిని దుప్పటితో లేదా మందపాటి బట్ట తో కాని చుట్టవద్దు. |
01:33 | మీ సొంత మందులు ఇవ్వద్దు. |
01:36 | యెల్లప్పుడు వైదున్ని సంప్రదించిన తర్వాతనే మందులు ఇవ్వాలి. |
01:41 | చల్లనిగాలి అడ్డగించవద్దు. |
01:43 | వాస్తవానికి చల్లని గాలి జ్వరం తగ్గించడానికి సహకరిస్తుంది. |
01:48 | ఒకవేళ రోగి కింద పేర్కొన్న లక్షణాలను కనపరుస్తే వెంటనే వైద్య సహాయం కోసం ప్రయత్నించండి. |
01:55 | క్రమరహిత ఊపిరితీయటం. |
01:58 | కుత్తిక పట్టుకొనుట |
02:00 | నిరంతర గొంతునొప్పి |
02:03 | దద్దుర్లు. వాంతిచేయుట |
02:06 | నొప్పిగా ఉన్న మూత్ర విసర్జన మరియు అతిసారము. |
02:11 | మనం ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
02:16 | క్రింద వున్న లింక్ లో లభించే వీడియో చుడండి. |
02:20 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును. |
02:23 | ఒక వేళా మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోయినట్టయితే డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
02:28 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం స్పోకెన్ ట్యుటోరియల్స్ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది. |
02:35 | ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణు లైన వారికీ యోగ్యతాపత్రములను ఇస్తుంది. |
02:40 | మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.orgకు వ్రాయండి. |
02:49 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము |
02:54 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
03:02 | ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది. |
03:15 | స్క్రిప్ట్ లో తోడ్పడిన వారు అశ్విని పాటిల్, అనిమేషన్ చేసిన వారు ఆర్తి. |
03:22 | చిత్రలేఖనము చేసినది శౌరభ్ గాడ్గిల్. |
03:25 | ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది చైతన్య. |
03:29 | సహకరించినందుకు ధన్యవాదములు. |