PHP-and-MySQL/C4/Cookies-Part-1/Telugu
From Script | Spoken-Tutorial
Revision as of 12:06, 27 March 2017 by Yogananda.india (Talk | contribs)
Time | Narration |
---|---|
0:00 | php కుకీస్ మీద ఈ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
0:04 | ఒక యూజర్ గురించి సమాచారం తీసుకొనే సందర్భములో స్పెషల్ వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు కుకీస్ అనేవి చాలా ముఖ్యమైన భాగము. |
0:11 | కుకీ యొక్క నిర్వచనం ఏమిటంటే అది మీ కంప్యూటర్ మీద లేదా వెబ్ సర్వర్ చేత యూజర్ యొక్క కంప్యూటర్ మీద స్టోర్ అయి ఉన్న సెట్ ఆఫ్ డాటా. |
0:18 | దీని అర్థం ఏమిటంటే, మనం వెబ్‌సైట్‌కు వెళ్ళినపుడు, మన డిటైల్స్ స్టోర్ అయ్యి ఉంటాయి, వాటిని మనం మరల విజిట్ చేసినపుడు ఉపయోగించడం జరుగుతుంది, అయితే మనం Remember me అనే వైకల్పం సెలెక్ట్ చేసుకుని ఉండాలి. |
0:30 | కనుక మీరు లాగ్ ఇన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. |
0:32 | కానీ ఒకవేళ మీరు remember me అనే బటన్ చెక్ చేయకపోతే, యూజర్ బ్రౌజర్ క్లోజ్ చేయగానే, క్లోజ్ అయిపోయే బ్రౌజర్‌తో డీల్ చేస్తూ ఉండి ఉంటారు. |
0:42 | కనుక సెషన్స్ వెంటనే నేరుగా కిల్ అయిపోతాయి కానీ కుకీస్ తరువాతి ఉపయోగం కోసం స్టోర్ అయ్యి ఉంటాయి. |
0:50 | కనుక మనం వెంటనే మొదలుపెట్టి ఒక కుకీని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. |
0:53 | మీరు దీనిని setcookie ఫంక్షన్ ఉపయోగించి చేస్తారు. |
0:55 | ఈ ఫంక్షన్ 5 పారామీటర్స్ ఉపయోగిస్తుంది కానీ నేను కేవలం 3 మాత్రం ఉపయోగిస్తాను. |
1:00 | నేను ఉపయోగించే మొదటి ముఖ్యమైనది name of the cookie దానిని నేను name అని సెట్ చేస్తాను. |
1:05 | రెండవది కుకీ లోపల స్టోర్ అవ్వాల్సిన డాటా ఇక్కడ నేను Alex అని టైప్ చేస్తాను. |
1:12 | ఇప్పుడు తర్వాతది కొంత చమత్కారయుతముగా ఉంటుంది. |
1:15 | అది ఎంత సమయములో ఎక్స్పైర్ అవుతుందో తెలిపే టైమ్. |
1:18 | ఇప్పుడు దీనిని సెకండ్స్లో సెట్ చేయాల్సిన అవసరం ఉంది. |
1:21 | దీనికి ప్రాతినిధ్యం వహించేందుకు నేను ఎక్స్పైర్ కొరకు exp అనే వేరియబుల్ క్రియేట్ చేస్తాను ఇది టైమ్‌కు సమానముగా ఉంటుంది. |
1:28 | ఇక్కడ నన్ను కొంత వాల్యూ ఆడ్ చేయనివ్వండి. |
1:31 | ఈ సమయములో నేను జీరో ఆడ్ చేస్తున్నాను. |
1:33 | కనుక నేను దీనిని ఎఖో చేస్తే ఇక ఈ కుకీ ఫంక్షన్ నుండి ఇప్పటికి బయటపడతాను. |
1:39 | మీకు అది ఏమి చేస్తుందో చూపడానికి నేను టైమ్ నుండి ఎఖొ ఔట్ అవుతున్నాను. |
1:43 | కనుక మనము రిఫ్రెష్ చేద్దాము. కనుక మీరు ఇక్కడ చాలా డిజిట్స్ చూడగలరు. |
1:47 | ఇప్పుడు ఇది విలక్షణమైన టైమ్-స్టాంప్. |
1:50 | ఇక విలక్షణమైన టైమ్-స్టాంప్ అనేది జనవరి Ist 1970 ముందు నంబర్ ఆఫ్ సెకండ్స్. |
1:56 | కనుక Ist జనవరి 12 am ...... 1970 సంవత్సరములో. |
2:02 | కనుక మీరిక్కడ చూడగలరు - ఇక్కడ number of seconds అనేది భవిష్యత్తులో dateతో ఈక్వేట్ అవుతుంది. |
2:10 | కనుక ఉదాహరణకు, ఈ సమయములో మీరు 88 చూడగలరు, ఇప్పుడు 89 ఇక నేను రిఫ్రెష్ చేస్తున్న కొద్దీ, ఇది ఒక్కో సెకండ్‌గా పెరుగుతూ ఉంటుంది. |
2:20 | కనుక, ఒక నిర్దిష్టమైన వాల్యూ ఆడ్ చేయడానికి ఇది చాలా ఉపయోగకరమైన పధ్ధతి. |
2:28 | ఇప్పుడు మనం దినము యొక్క సెకండ్స్లో టైమ్ కనుగొనాలి ఎందుకంటే నేను ఈ కుకీ ఒక రోజులో ఎక్స్పైర్ అవ్వాలి అనుకుంటున్నాను. |
2:34 | కనుక రోజులో నిమిషముల యొక్క సంఖ్య పొందడానికి నేను 24ను 60తో గుణిస్తాను. |
2:39 | ఆ తర్వాత రోజులో సెకండ్స్ యొక్క సంఖ్య పొందడానికి వచ్చిన జవాబును 60తో గుణిస్తాను, అది 86,400. |
2:47 | కనుక నేను జీరోను 86400తో రిప్లేస్ చేస్తే, మనకు ఒక రోజుతో భవిష్యత్తులో టైమ్ హోల్డ్ చేయగలిగే వేరియబుల్ ఎక్స్పైర్ వస్తుంది. |
2:56 | టైమ్ సేవ్ చేసుకోవడం కోసం, నేను దీనిని కాపీ చేసి నా ఎక్స్పైర్ వేరియబుల్ ఇక్కడ ఆడ్ చేస్తాను. |
3:02 | కనుక ఈ ఫంక్షన్ name అనే మన కుకీ, Alex అనే వాల్యూతో సెట్ చేస్తుంది ఇక అది ఒక్క రోజులో ఎక్స్పైర్ అవుతుంది - టైమ్ ఫంక్షన్ ఉపయోగించి ఇక్కడ సెకండ్స్లో రీడ్ చేయండి. |
3:13 | కనుక మనం ఈ పేజీని రిఫ్రెష్ చేద్దాము. hey! ఇక్కడ ఏ ఎర్రర్స్ లేవు దాని అర్థం అది పని చేసింది. |
3:19 | ఇప్పుడు నేను ఏమి చేస్తానంటే వీటన్నింటి నుండి కమెంట్ ఔట్ అవ్వడం కోసం బ్లాక్ కమెంటింగ్ ఉపయోగిస్తాను. |
3:23 | దీని క్రింద నేను ఈ కుకీ ఎఖో ఔట్ చేస్తాను. |
3:26 | కానీ నేను దీనిని కమెంట్ చేసిన కారణం ఏమిటంటే యూజర్ పేజ్‌లోకి వచ్చిన ప్రతి సారీ మీరు కుకీ సెట్ చేయాల్సిన అవసరం లేదు. |
3:33 | ఒకవేళ మీరు లాగిన్ స్క్రిప్ట్ ఉపయోగిస్తూ ఇంకా యూజర్ మీ వెబ్సైట్లో లాగిన్ చేయడానికి అనుమతిస్తున్నట్లయితే, మీరు దీనిని ఒకే సారి ఇష్యూ చేయవలసి ఉంది దాంతో కుకీ స్టోర్ అవుతుంది. |
3:41 | ఇక మీరు దానిని మనము ఇక్కడ సెట్ చేసిన టైమ్ లోగా ఉపయోగించవచ్చు. |
3:46 | కనుక నేను చేసేది ఏమిటంటే నేను ఎఖో సెట్ చేసి డాలర్ సైన్, సారీ, అండర్స్కోర్ కుకీ ఉపయోగిస్తాను. |
3:52 | ఇక్కడ లోపల కుకీ యొక్క నేమ్ ఉన్నది, కనుక నేను name అని టైప్ చేస్తాను. రిఫ్రెష్ చేయండి మీరు Álex చూడగలరు. |
3:59 | మీరు దీనిని చెక్ చేసుకోగలరు. నేను నా బ్రౌజర్‌ను క్లోజ్ చేసినా, కంప్యూటర్ రిస్టార్ట్ చేసి ఈ పేజ్‌లోకి తిరిగి వచ్చినా, అది అప్పటికీ Alex అని రీడ్ చేస్తుంది ఎందుకంటే అది కంప్యూటర్లోకి స్టోర్ అయి ఉంది. |
4:11 | సరే ఇప్పుడు నేను మరొక కుకీ సెట్ చేయాల్సి వస్తే, ఉదాహరణకు, నేను ఇక్కడ మరొక కుకీ సెట్ చేస్తాను అది age అవుతుంది ఇక నా వయస్సు 19. |
4:24 | ఇక నా ఎక్స్‌పైరి టైమ్ నేను ఇలాగే ఉంచుతాను. |
4:29 | కనుక మనం దీనిని ఇక్కడ ఇలా ఉంచుదాము. |
4:31 | దానిని నీట్‌గా ఉంచడానికి మనం లైన్-కామెంట్‌తో బ్లాక్ కామెంటింగ్ రిప్లేస్ చేయగలము. |
4:36 | కనుక మన ఎక్స్‌పైరి టైమ్ కోసం నేను మరొక కుకీ ఇక్కడ సెట్ చేస్తాను. |
4:41 | ఇక అది అదే ఎక్స్‌పైరి టైమ్ కలిగి ఉంటుంది. నేను దానిని సరిగ్గా పొందగలనో లేదో చూద్దాము. |
4:46 | సరే, కనుక మనం దీని నుండి బయట పడదాము. |
4:48 | మనం అదే ఎక్స్‌పైరి టైమ్‌తో మరొక కుకీ సెట్ చేసాము. |
4:51 | మనం రిఫ్రెష్ అవుదాము. సరే అది సెట్ కాబడింది. |
4:55 | కనుక నేను చేసేది ఏమిటంటే నేను దీనిని కామెంట్ ఔట్ చేస్తాను ఇక ఇక్కడ నేను ఎఖో ఔట్ చేస్తాను. |
5:01 | కనుక మీరు చూడండి ఒక పేజీలో ఒకటి కన్నా ఎక్కువ కుకీలను సెట్ చేయగలము. మనం దానిని రిఫ్రెష్ చేద్దాము, దాంతో మనకు 19 లభించగలదు. |
5:07 | ఇప్పుడు మనం ఒక సింగిల్ సెంటెన్స్‌లో కూడా కుకీ సెట్ చేయగలము. |
5:11 | దాని కోసం నేను ఎఖో అండర్స్కోర్ కుకీ, నేమ్ అని టైప్ చేసి తర్వాత కన్సాటినేట్ "is" ఆ తర్వాత నా ఏజ్ కన్సాటినేట్ చేస్తాను. |
5:27 | కనుక మనకు కేవలం మనం స్టోర్ చేసిన కుకీస్ నుండి Alex is 19 అనే సెంటెన్స్ వస్తుంది. |
5:34 | ఇక మరల నేను నా బ్రౌజర్ క్లోజ్ చేసినట్లయితే లేదా కంప్యూటర్ రిస్టార్ట్ చేసినట్లయితే లేదా రెండు గంటల తర్వాత వెనక్కి వచ్చినట్లయితే, ఈ సమాచారం ఈ పేజ్ చేత ఉపయోగించడానికి సిధ్ధంగా ఈ కంప్యూటర్ మీద ఇంకా స్టోర్ అయి ఉంటుంది. |
5:44 | కనుక అవి ఉపయోగించడానికి నిజంగా ఉపయోగకరమైనవి, క్రియేట్ చేయడానికి సుళువైనవి, యూజర్‌ను ఎఖో ఔట్ చేయడానికి సులభమైనవి అని మీరు చూడగలరు. |
5:53 | ఇప్పుడు print r లేదా print underscore r అనే మనం ఉపయోగించగలిగే ఫంక్షన్ ఉంది. |
5:58 | ఇక మనం ఇక్కడ dollar underscore cookieని ఇక్కడ ఎఖో ఔట్ చేయగలము. మనము కాసేపటి తర్వాత అలైన్ చేయగలము... |
6:05 | దీనిని రిఫ్రెష్ చేస్తే మీరు మనకు ఇక్కడ ఒక ఆర్రే లభించింది ఇంకా మనకు ఒక భిన్నమైన వాల్యూ కూడా లభించింది. |
6:12 | మనం నేమ్ పొందాము, అది Alexతో సమానం , మనకు ఏజ్ లభించింది, అది 19తో సమానం. |
6:22 | కనుక ఇవి కుకీస్. అవి సెట్ చేయబడి ఉన్నాయి. ఇవి కుకీస్ యొక్క వాల్యూస్. |
6:27 | ఒకవేళ మీరు దీనిని మీ అంతట మీరే ఎఖో ఔట్ చేసుకోదలిస్తే ఇది చాలా ఉపయోగకరము. |
6:31 | సరే ఇప్పుడు మరొక ఫంక్షన్ ఉంది. దానిని నేను ఈ ట్యుటోరియల్ యొక్క రెండవ భాగములో కవర్ చేస్తాను. నేను if స్టేట్మెంట్ను ఒక కుకీ సెట్ అయి ఉందా లేదా అన్న విషయం కనిపెట్టడానికి ఉపయోగిస్తాను. |
6:41 | ఇక నేను ఒక కుకీని ఎలా అన్సెట్ చేయాలో కూడా చూపుతాను. |
6:45 | కనుక నన్ను 2వ భాగములో జాయిన్ అవ్వండి. చూసినందుకు ధన్యవాదములు. ఇక్కడ ఉన్న స్పోకెన్ ట్యుటోరియల్ కొరకు డబ్బింగ్ చెపుతున్నది నిఖిల. సెలవు. |